English | Telugu

శ్ర‌ద్ధ విష‌యంలో ర‌ణ్‌బీర్‌కి ఆలియా కండిష‌న్స్ పెట్టారా?

శ్ర‌ద్ధాక‌పూర్ విష‌యంలో ర‌ణ్‌బీర్‌కి ఆలియా ష‌ర‌తులు విధించారా? అదే నిజ‌మైతే, ఏమ‌ని అన్నారు? ఏయే విష‌యాల్లో కండిష‌న్స్ పెట్టారు? ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదో హాట్ టాపిక్‌. గ‌తేడాది బ్ర‌హ్మాస్త్ర షూటింగ్ పూర్తికాగానే పెళ్లి చేసుకున్నారు ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా. ఆ వెంట‌నే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. వారికి రహా కూడా పుట్టింది. ఇప్పుడు హ్యాపీ పేరెంట్స్ గా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట‌. ఆలియా పోస్ట్ ప్రెగ్నెన్సీ ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు. నార్మ‌ల్ ఫిజిక్‌కి రావ‌డం కోసం ఎక్స‌ర్‌సైజులు కూడా చేస్తున్నారు. ఇటీవ‌లే కశ్మీర్‌కి షూటింగ్ కోసం వెళ్లారు. ర‌ణ్‌బీర్ కూడా షూటింగ్ ప‌నులు చేసుకుంటున్నారు. తూ జూటీ మే మ‌క్క‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ బిజీగా పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో న‌టించారు శ్ర‌ద్ధాక‌పూర్‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఉన్న ర‌ణ్‌బీర్ క‌పూర్‌కి విలేక‌రుల నుంచి ఎదురైన ప్ర‌శ్న అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది.

``శ్ర‌ద్ధ‌తో అంత క్లోజ్‌గా ఉండ‌వ‌ద్ద‌ని మీకు ఆలియా చెబుతున్నార‌ట క‌దా``అని క్వ‌శ్చ‌న్ అడిగారు రిపోర్ట‌ర్‌. అందుకు ర‌ణ్‌బీర్ స‌ర‌దాగా స్పందించారు.. ``ఆమె అలా ఎందుకు అంటారు? మీరే అలాంటివి ఊహించుకుంటున్నారు. ఆమె అస‌లు అలా అన‌దు. మీరు కాంట్ర‌వ‌ర్శీ క్రియేట్ చేస్తున్నారు. నా లైఫ్‌లో ఇప్పుడు కాంట్ర‌వ‌ర్శీ అస‌లు లేదు`` అని అన్నారు న‌వ్వుతూ. హోలీ సంద‌ర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఇంకా ఆలియా చూడ‌లేద‌ట‌. ఈ చిత్రం విడుద‌ల‌య్యే స‌మ‌యానికి ఆలియా కశ్మీర్‌లో ఉంటార‌ట‌. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టిస్తున్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీ షూటింగ్ అక్క‌డ జ‌రుగుతోంది. ఆలియా ఆ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 9న ముంబైకి వ‌చ్చేస్తారు. అప్పుడు క‌చ్చితంగా చూస్తారు. ఆమె ఎప్పుడూ నా చీర్ లేడీ. నా షంషేరాను కూడా ఆమె చూశారు`` అని అన్నారు. తూ జూటీ మే మ‌క్క‌ర్ సినిమాను ల‌వ్ రంజ‌న్ డైర‌క్ట్ చేశారు. మార్చి 8న విడుద‌ల కానుందీ సినిమా.