English | Telugu
‘ఫైటర్’ మూడో షెడ్యూల్ పూర్తి
Updated : Mar 6, 2023
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, సక్సెస్‌ఫుల్ ఛార్మింగ్ హీరోయిన్ దీపిక పదుకోన్ జంటగా నటిస్తున్న సినిమా ఫైటర్. వీరిద్దరూ తొలిసారి సిల్వర్ స్క్రీన్ మీద జోడీ కడుతున్న సినిమా ఫైటర్. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మూడో షెడ్యూల్ కూడా పూర్తయింది. ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఫైటర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు స్పై థ్రిల్లర్స్ ని ఆస్వాదించే ప్రేక్షకులు. ఫైటర్ సినిమా థర్డ్ షెడ్యూల్ కోసం ఇటీవల చిత్ర యూనిట్ హైదరాబాద్‌కి వచ్చింది. ఇప్పుడు షెడ్యూల్ పూర్తి కావడంతో మళ్లీ ముంబైకి బయలుదేరారు యూనిట్ మెంబర్స్. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్ జంటగా నటించిన సినిమా పఠాన్‌ను తెరకెక్కించిన డైరక్టరే సిద్ధార్థ్ ఆనంద్. ప్యాట్రియాటిక్ యాక్షన్ డ్రామాగా ఫైటర్‌ని రూపొందిస్తున్నారు.
2014లోబ్యాంగ్ బ్యాంగ్, 2019 వార్ తర్వాత సిద్ధార్థ్, హృతిక్ కలిసి చేస్తున్న సినిమా ఫైటర్. ఈ సినిమాలో హృతిక్‌కి ఎంత వెయిటేజ్ ఉంటుందో, దీపిక పదుకోన్‌కి కూడా అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, రియల్ ఫైటర్ ఆమెనే అని ఇటీవల పఠాన్ ప్రెస్‌మీట్‌లో షారుఖ్ కూడా చెప్పారు. హృతిక్‌కి రీసెంట్ హిట్ విక్రమ్ వేద. తమిళంలో పెద్ద హిట్ అయిన విక్రమ్ వేద కాన్సెప్ట్‌తోనే హిందీలోనూ తెరకెక్కింది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ కూడా కీ రోల్ చేశారు. దీపిక ఇప్పుడు ఫైటర్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు ప్రాజెక్ట్ కెలోనూ నటిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ కీ రోల్స్ లో నటిస్తున్న ప్రాజెక్ట్ కెలో దీపిక కేరక్టర్ నిడివి ఎక్కువని ఆ మధ్య డైరక్టర్ కూడా చెప్పారు. ఈ సినిమాతో పాటు ఇంటర్న్ లోనూ నటిస్తున్నారు దీపిక. షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న జవాన్‌లోనూ దీపిక గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారని టాక్. దీంతో పాటు బ్రహ్మాస్త్రలోనూ రణ్‌బీర్ కపూర్ తల్లిగా అమృత పాత్రలో నటించనున్నారు దీపిక. ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్ కూడా కీ రోల్ చేయనున్నట్టు సమాచారం.