English | Telugu

ఆ తప్పుతో ఆరు నెలలు నా ముఖం అద్దంలో చూసుకోలేదు  

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ 'విద్యాబాలన్ '2011 లో విడుదలైన 'డర్టీ పిక్చర్' తో భారతీయ సినీ ప్రేక్షకులని ఉర్రుతలూగించిన విషయం తెలిసిందే. 'సిల్క్ స్మిత' జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో టైటిల్ రోల్ లో విద్యా బాలన్ ప్రదర్శించిన పెర్ ఫార్మెన్స్ కి, డర్టీ పిక్చర్ ని ఒకటికి పదిసార్లు కూడా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని బట్టి విద్యాబాలన్ సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు.

రీసెంట్ గా విద్యాబాలన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడుతు ఒక నిర్మాత నేరుగా నా దగ్గరకు వచ్చి నన్ను అసభ్యంగా పిలుస్తు చాలా దారుణంగా ప్రవర్తించాడు. అలా అవమానించిన తర్వాత అద్దంలో ఆరు నెలలు నా ముఖం చూసుకోలేదు. దాంతో ఆ నిర్మాత లాంటి మరికొంత మంది మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయి. ఒక సినిమా కోసం నేను బరువు పెరుగుతున్న సమయంలోను బాడీ షేమింగ్ చేసేవారు. మలయాళం‌లో కూడా అవకాశం వచ్చింది. కానీ, ఆ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో నన్ను దురదృష్టవంతురాలు అంటూ ప్రచారం చేశారు. ఇలా చెప్పుకుంటు పోతే నా కెరీర్ లో ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

2003 లో బెంగాలీ సినిమా 'భలో థేకో' తో తన సినీ కెరీర్ ని ప్రారంభించిన విద్యాబాలన్ హిందీలో ఇప్పటి వరకు సుమారు ముప్పై ఐదు చిత్రాలకి పైగానే చేసింది. గత సంవత్సరం భూల్ భూలయ్య 3 లో కూడా కనిపించి ప్రేక్షకులని మెప్పించింది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.