English | Telugu

16 నెల‌లు.. 4 చిత్రాలు.. ఇదీ ర‌ణ్ బీర్ ప్లాన్!

బాలీవుడ్ యూత్ ఐకాన్ ర‌ణ్ బీర్ క‌పూర్.. వ‌‌రుస చిత్రాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. `సంజు` (2018) త‌రువాత మ‌రో సినిమాతో ప‌ల‌క‌రించ‌ని ర‌ణ్ బీర్.. కేవ‌లం 16 నెల‌ల కాలంలో 4 చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుండ‌డం హిందీనాట వార్త‌ల్లో నిలుస్తోంది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. సంజ‌య్ ద‌త్, వాణీ క‌పూర్ తో ర‌ణ్ బీర్ క‌పూర్ క‌లిసి న‌టిస్తున్న `షంషేరా` చిత్రం ఈ ఏడాది జూన్ 25న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. అలాగే ల‌వ్ రంజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శ్ర‌ద్ధా క‌పూర్, బోనీ క‌పూర్, డింపుల్ క‌పాడియాతో క‌లిసి చే‌స్తున్న పేరు నిర్ణ‌యించ‌ని సినిమా 2022 హోలీ స్పెష‌ల్ గా మార్చి నెల‌లో రిలీజ్ కానుంది.

ఇక `అర్జున్ రెడ్డి`, `క‌బీర్ సింగ్` చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ వంగా డైరెక్ష‌న్ లో ర‌ణ్ బీర్ చేస్తున్న `యానిమ‌ల్` 2022 ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. ఇందులో ర‌ణ్ బీర్ క‌పూర్ కి జోడీగా ప‌రిణీతి చోప్రా న‌టిస్తుండ‌గా.. ర‌ణ్ బీర్ తండ్రి పాత్ర‌లో అనిల్ క‌పూర్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. ఇక చాలా కాలంగా వార్త‌ల్లో నిలుస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ `బ్ర‌హ్మాస్త్ర‌` కూడా ఈ ఏడాది చివ‌ర‌లో గానీ వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో గానీ తెర‌పైకి రానుంది. ఇందులో ర‌ణ్ బీర్ కి జంట‌గా అలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా.. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, కింగ్ నాగార్జున ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

మొత్త‌మ్మీద‌.. 16 నెల‌ల కాలంలో ర‌ణ్ బీర్ నుంచి 4 సినిమాలు రానుండ‌డం స‌మ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. మ‌రి.. ఈ చిత్రాల‌తో ర‌ణ్ బీర్ ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటాడో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.