English | Telugu

సల్మాన్ ఖాన్,రష్మిక డాన్స్ అదుర్స్ 

సల్మాన్ ఖాన్,రష్మిక డాన్స్ అదుర్స్ 

భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న గ్రేటెస్ట్ యాక్టర్స్ లో సల్మాన్ ఖాన్(Salman Khan)కూడా ఒకడు.మూడున్నర దశాబ్దాల నుంచి అన్ని జోనర్స్ కి సంబంధించిన చిత్రాల్లో నటిస్తు తన అభిమానులని అలరిస్తు వస్తున్నాడు.ఈ కోవలోనే 'రంజాన్'(Ramzan)పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 31 న 'సికందర్'(sikandar)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్ సరసన స్టార్ హీరోయిన్ రష్మిక జోడీ కడుతుంది. 

రీసెంట్ గా సికందర్ నుంచి 'జోహ్రా జబన్' అనే సాంగ్ విడుదలైంది. ప్రీతమ్ చక్రవర్తి  మ్యూజిక్ లో  సల్మాన్, రష్మిక మీద చిత్రీకరించిన ఈ సాంగ్ లో తన ప్రేయసిని గౌరవిస్తు,ఆమె అంటే ఎంత ఇష్టమో సల్మాన్ చెప్తున్నాడు.సల్మాన్,రష్మిక ఇద్దరు కూడా ఒకే కలర్ డ్రెస్ లో ఉండటంతో పాటు,ఇద్దరి డాన్స్ కూడా చాలా బాగుంది.రేపు థియేటర్ లో సల్మాన్ ఫ్యాన్స్ ఈ సాంగ్ కి స్క్రీన్ ముందు డాన్స్ చెయ్యడం ఖాయమన్నట్టుగా సాంగ్ సాగింది.

గజని, స్టాలిన్ చిత్రాల దర్శకుడు మురుగుదాస్(Ar murugudas)దర్వకత్వంలో తెరకెక్కుతున్న సికందర్ యాక్షన్ థ్రిలర్ గా సుమారు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటుంది.సల్మాన్ గత  చిత్రాలు ఆయన రేంజ్ కి తగ్గట్టుగా లేకవడంతో,సల్మాన్ అభిమానులు 'సికందర్' పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.సాజిద్ నడియావాలా(Sajid Nadiadwala)నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతుండగా కాజల్ అగర్వాల్,సత్యరాజ్,షర్మాన్ జోషి,కిషోర్ ముఖ్యమైన క్యారక్టర్ లలో కనిపిస్తున్నారు. ప్రచార చిత్రాలతో పాటు ఇటీవల రిలీజైన టీజర్ మూవీ మీద అంచనాలని పెంచేసిందని కూడా చెప్పుకోవచ్చు.

 


 

సల్మాన్ ఖాన్,రష్మిక డాన్స్ అదుర్స్