Read more!

English | Telugu

బిగ్ సర్‌ప్రైజ్: దీపావ‌ళికి మోత మోగిపోవాల్సిందే!


ఈ డిసెంబ‌ర్ ఇంత‌కు మునుపులా ఉండ‌దు అని ఆ మ‌ధ్య ప్ర‌శాంత్ నీల్ భార్య పోస్ట్ చేసిన‌ప్పుడు అంద‌రూ వావ్ స‌లార్ ఎక్స్ పెక్టేష‌న్స్ మామూలుగా ఉండ‌వు అనుకున్నారు. కానీ ఇప్పుడు నార్త్ నుంచి కూడా సేమ్ డైలాగ్ వినిపిస్తోంది. కాక‌పోతే ఈ న‌వంబ‌ర్ మామూలుగా ఉండ‌దు అని అంటున్నారు నార్త్ జ‌నాలు. స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న సినిమా టైగ‌ర్ 3. ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది. ఆదిత్య చోప్రా తెర‌కెక్కించిన సినిమా ఇది. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ 2012 నుంచి స్పై సినిమాల‌ను రూపొందిస్తోంది. స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినా కైఫ్  న‌టించిన ఏక్‌థా టైగ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. దానికి సీక్వెల్‌గా టైగ‌ర్ జిందా హై 2017లో విడుద‌లైంది. ఈ జ‌ర్నీ 2019 వార్‌తోనూ, ఈ ఏడాది ప‌ఠాన్‌తోనూ కంటిన్యూ అయింది.

ఇప్ప‌టిదాకా విడుద‌లైన స్పై సినిమాల్లో ప‌ఠాన్ క‌లెక్ష‌న్లు వేరే లెవ‌ల్‌లో ఉన్నాయి. ఇప్పుడు టైగ‌ర్‌3 క‌లెక్ష‌న్ల‌ను అంత‌కు మించి రాబ‌ట్టాల‌ని భావిస్తోంది చిత్ర యూనిట్‌. అందుకే ఈ సినిమా యాక్ష‌న్ ప్యాక్డ్ సినిమాగా రూపొందిస్తోంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అంత‌కు మించి తెలిసిన విష‌యం ఏంటంటే ఇందులో హృతిక్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇస్తున్నారు. వార్ సినిమాలోని క‌బీర్‌, ఇప్పుడు టైగ‌ర్ 3లో క‌నిపిస్తారు.

ఎన్నాళ్లుగానో త‌మ స్టార్‌ని చూసుకోవాల‌నుకుంటున్న హృతిక్ రోష‌న్ ఫ్యాన్స్ కి  ఈ సినిమా ఐ ఫీస్ట్ కానుంది. టైగ‌ర్‌నీ, జోయాని మాత్ర‌మే కాదు, ప‌ఠాన్‌నీ, క‌బీర్‌ని కూడా న‌వంబ‌ర్ 12న థియేట‌ర్ల‌లో క‌ల‌వ‌చ్చ‌న్న‌ది నార్త్ మూవీ ల‌వ‌ర్స్ ని ఊరిస్తున్న విష‌యం.

టైగ‌ర్ 3 విడుద‌లైన కొన్నాళ్ల‌కు అయాన్ ముఖ‌ర్జీ వార్‌2 వార్త‌లు ఊపందుకుంటాయి. ఇందులో హృతిక్ రోష‌న్ క‌బీర్‌గా పూర్తి స్థాయి రోల్‌లో క‌నిపిస్తారు. సౌత్ నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కీ రోల్ చేస్తారు. కియారా అద్వానీ నాయిక‌గా ఎంపిక‌య్యారు. టైగ‌ర్ 3 అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం నుంచి మొద‌ల‌వుతాయి.