English | Telugu

వంద మంది ఆసుపత్రి పాలు.. ఆగిపోయిన మూవీ షూటింగ్!

వందల మందితో ముడిపడిన సినిమా షూటింగ్ లలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగి ఒకరిద్దరు ఆసుపత్రి పాలవ్వడం చూస్తుంటాం. అయితే ఒకేసారి వంద మంది ఆసుపత్రి పాలైన ఘటన తాజాగా చోటు చేసుకుంది. దాంతో మూవీ షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ధురంధర్'(Dhurandhar). జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లో ప్రొడక్షన్ ఫుడ్ తిని వంద మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు.

'ధురంధర్' షూటింగ్ లో మొత్తం 600 మంది పాల్గొనగా.. ఫుడ్ తిని 120 మంది తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే వారిని హాస్పిటల్ కి తరలించగా.. ఫుడ్ పాయిజనింగే కారణమని వైద్యులు తెలిపారు. మరో 200 మంది దాకా స్వల్ప అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ కి పంపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

కాగా, 'ఉరి' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న 'ధురంధర్'లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.