English | Telugu
జాన్వీని మెచ్చుకున్న 'జవాన్' కెప్టెన్
Updated : Jul 22, 2023
'జవాన్' మూవీతో నార్త్ ఎంట్రీ ఇస్తున్నారు డైరక్టర్ అట్లీ. తన అభిమాన నటుడు షారుఖ్‌ని డైరక్ట్ చేస్తున్న మంచి ఫీల్‌లో ఉన్నారు అట్లీ. ఆయనిప్పుడు నార్త్ లో జరిగే మంచీ చెడుల మీద గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే జాన్వీ కపూర్ నటించిన 'బవాల్' సినిమాను మెచ్చుకున్నారు. "బవాల్ ఫీల్ గుడ్ వాచ్. నావలిస్ట్ వేలో సాగుతుంది. చూస్తున్నంత సేపు ఓ మంచి నవలను విజువలైజ్ చేసుకుంటూ చదువుతున్నంత ఆనందంగా అనిపించింది. వరుణ్ ధావన్, జాన్వీకపూర్ నటన వేరే లెవల్లో ఉంది. తప్పకుండా యువతను మెప్పిస్తుంది"అంటూ కితాబిచ్చారు.
త్వరలోనే అట్లీని కలవనున్నట్టు వరుణ్ ధావన్ తెలిపారు. దీన్ని బట్టి ఆల్రెడీ ప్రచారంలో ఉన్న వార్తలకు బలం చేకూరింది. వరుణ్ ధావన్ నెక్స్ట్ సినిమాకు అట్లీ డైరక్షన్ చేస్తారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమా లోనే హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పుడు అట్లీ.. వరుణ్ మూవీని మెచ్చుకోవడంతో ప్రాజెక్ట్ పక్కా అంటున్నారు నార్త్ జనాలు.
విజయ్ నటించిన 'తెరి' సినిమాకు హిందీలో వరుణ్ ధావన్‌తో తెరకెక్కించాలన్నది అట్లీ ప్లాన్. 'తెరి' సినిమాకు వరుణ్ ధావన్ చాలా పెద్ద ఫ్యాన్ అట. అందుకే అదే కథను తెరకెక్కించమని అడుగుతున్నారట. అట్లీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన 'జవాన్' మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 7న విడుదల కానుంది 'జవాన్'. ఈ సినిమాతోనే నయనతారను నార్త్ లో పరిచయం చేస్తున్నారు.
'జవాన్' ప్రివ్యూకి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది షారుఖ్ కెరీర్‌లో ఇంకో హిట్ గ్యారంటీ అంటున్నారు ఉత్తరాది జనాలు. వరుణ్‌ధావన్, జాన్వీ కపూర్ నటించిన సినిమా 'బవాల్'. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అంశాలతోసాగుతుంది. ఈ సినిమాను జపనీస్ భాషలోకి అనువదించమని అడుగుతున్నారు అక్కడి ప్రజలు.