English | Telugu
'డ్రీమ్ గర్ల్ 2' లుక్ ఔట్... ఆయుష్మాన్ అదుర్స్
Updated : Jul 22, 2023
ఆయుష్మాన్ ఖురానా నటించిన సినిమా డ్రీమ్ గర్ల్ 2. ఈ సినిమాలో ఆయుష్మాన్ పూజా అనే కేరక్టర్‌లో నటిస్తున్నారు. ఈ కేరక్టర్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. చూసిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. గతంలో పూజా పలువురు సూపర్‌స్టార్స్ తో మాట్లాడుతున్నట్టు పలు వీడియోలు విడుదల చేశారు. పఠాన్‌తో మాట్లాడుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు రాకీ అలియాస్ రణ్‌వీర్ సింగ్‌తో మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతోంది. లేటెస్ట్ ప్రోమోలో పూజతో మాట్లాడే అవకాశాన్ని రాకీ కొట్టేసినట్టు చూపించారు. వైబ్రంట్ కర్టన్ వెనుక ఉన్న ఆయుష్మాన్ లుక్ ఆకట్టుకుంటోంది. పూజా కేరక్టర్ కోసం ఆయుష్మాన్ అంతలా ఎలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారని అందరూ మాట్లాడుకుంటున్నారు. నాజూగ్గా, ఫెమినైన్ లుక్స్ తో కనిపిస్తున్నారు ఆయుష్మాన్. ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిన డ్రీమ్ గర్ల్ కి ఇది సీక్వెల్. ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీదకు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.
ఇప్పుడు సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. మేకర్స్ కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని అనుకుంటున్నారట. డైరక్టర్ రాజ్ శాండిల్య, నిర్మాత ఏక్తా కపూర్ ఈ సినిమాకు సంబంధించి రీషూట్‌ల గురించి గట్టిగానే డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ నెల మొదట్లోనే 12 రోజుల పాటు ఓ షెడ్యూల్ చేశారు. రీషూట్‌లో మిగిలిన కాస్త ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నరు. ఆగస్టు 25న విడుదల కానుంది ఈ సినిమా.