Paneer Bread Rolls
చిటికెలో అయిపోయే పన్నీర్ బ్రెడ్ రోల్స్
పన్నీర్ తో ఎన్నో రకాల రెసిపీస్ తయారుచేసుకోవచ్చు కదా, కాని ఈ స్ప్రింగ్ రోల్స్ కాస్త వెరైటిగా తినటానికి బాగుంటాయి. చెయ్యటానికి కూడా చాలా తక్కువ సమయం పడుతుంది.
కావలసిన పదార్థాలు :
పన్నీర్ తురుము : 1 కప్పు
బ్రెడ్ స్లైసెస్ : 4
ఉల్లిపాయ ముక్కలు : 1/4 కప్పు
కారం : 1 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
టమాటో ప్యూరీ : 1 స్పూన్
కొత్తిమీర తురుము : 1 స్పూన్
ఉప్పు, నూనె : తగినంత
తయారుచేసే పద్ధతి :
బ్రెడ్ స్లైసెస్ చివర్లు కట్ చేసి, చపాతీ కర్రతో ఒత్తాలి. పన్నీర్ తురుములో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరి, కొత్తిమీర తురుము,ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లిసేస్ మీద పెట్టి, రోల్స్ లాగా చుట్టి, తడి చేతితో చివర్లు మూసేయాలి. వీటిని నూనెలో గోధుమ వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి. వేడివేడిగా టమాటో సాస్ తో తింటే!ఆహా ఆ రుచే వేరబ్బా.
... కళ్యాణి