Read more!

తవా పనీర్ బ్రెడ్ పిజ్జా

 

తవా పనీర్ బ్రెడ్ పిజ్జా

చలికాలంలో వేడివేడిగా తినాలని అనిపించడం సహజమైనదే ముఖ్యంగా పిల్లలు పెద్దలు సాయంకాలం పూట వేడివేడి స్నాక్స్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు మంచి స్నాక్స్ చేయాలని అనుకుంటున్నారా అయితే వెరైటీ స్టాక్ తో మీ ముందుకు వచ్చేసాం ఈ స్నాక్స్ మీరు పిల్లలు పెద్దలు అందరూ కలిసి తినొచ్చు. పిజ్జా తినేందుకు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అయితే బయట బేకరీలో లభించే పిజ్జా ధర చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఇంట్లోనే సులభంగా పిజ్జా తయారు చేయాలి అనుకుంటే…తవా బ్రెడ్ పనీర్ పిజ్జా ఓ చక్కటి ఛాయిస్ అని చెప్పవచ్చు.. దీని తయారీ విధానం ఏంటో ఇఫ్పుడు తెలుసుకుందాం.

తవా పనీర్ బ్రెడ్ పిజ్జా కావాల్సిన పదార్థాలు..

బ్రెడ్ ముక్కలు -2 పనీర్ - 1 కప్పు

క్యాప్సికం ముక్కలు -1/2కప్పు

టొమాటో ముక్కలు- 1/4 కప్పు

స్వీట్ కార్న్ - 2 టేబుల్ స్పూన్లు

పిజ్జా సాస్ - 1/2 కప్పు

మొజారెల్లా చీజ్ చిల్లీ ఫ్లాక్స్

ఉప్పు తగినంత

వెన్న లేదా నూనె

తయారీ విధానం:

- పనీర్‌ను చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకోండి. వాటిని మసాలా దినుసులు (ఎర్ర మిరప పొడి, గరం మసాలా, చిటికెడు ఉప్పు వంటివి) నిమ్మరసంలో మెరినేట్ చేయండి. పక్కన పెట్టండి.

-మీడియం వేడి మీద తవా మీద కొద్దిగా వెన్న లేదా నూనె వేడి చేయండి.క్యాప్సికం ముక్కలు, టొమాటోలు స్వీట్ కార్న్ గింజలు కొద్దిగా మెత్తబడే వరకు వేయించాలి.

-తవాపై బ్రెడ్ స్లైస్ వేయండి. స్లైస్‌పై పూత పూయడానికి ఒక చెంచా పిజ్జా సాస్‌ను సమానంగా పూయండి. కూరగాయలపై మ్యారినేట్ చేసిన పనీర్ క్యూబ్స్ ఉంచండి.

- పనీర్, వెజిటేబుల్స్ మీద మోజారెల్లా చీజ్ తురుము వేయండి.

- ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ , చిటికెడు ఉప్పును చీజ్ మీద చల్లుకోండి.

- పాన్‌ను మూతతో కప్పి చీస్ కరిగే వరకు ఉడికించాలి. అయితే బ్రెడ్ దిగువ భాగం బంగారు గోధుమ రంగులోకి క్రిస్పీగా మారుతుంది.

ఇప్పుడు వేడి వేడి తవా బ్రెడ్ పిజా రెడీ అవుతుంది..