వెజ్ బ్రెడ్ భుర్జీ రెసిపీ
వెజ్ బ్రెడ్ భుర్జీ రెసిపీ
కావాల్సిన పదార్థాలు:
బ్రెడ్ ముక్కలు -5-6
పెరుగు - 1/2 కప్పు
నిమ్మరసం -1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ- 1
టమోటా- ముక్కలుగా కట్ చేసి
పచ్చిమిర్చి- సన్నగా తరిగినవి
పసుపు - 1 స్పూన్
ఆవాలు - 1 స్పూన్
ఉప్పు - రుచి ప్రకారం
కొత్తిమీర లేదా కరివేపాకు
క్యాప్సికమ్, క్యారెట్, మొక్కజొన్న1/2 కప్పు
తయారీవిధానం:
ఒక గిన్నెలో పెరుగు వేసి అందులో 2 స్పూన్ల నీరు, మసాలా దినుసులు వేయాలి. అందులో పసుపు, ఉప్పు వేయండి.బ్రెడ్ స్లైసులను క్యూబ్స్‌గా కట్ చేసి పెరుగులో వేయండి. మెత్తగా కలపండి. బ్రెడ్ విరిగిపోకుండా చూసుకోండి. వేడి బాణలిలో నూనె పోసి ఆవాలు, కరివేపాకు వేయాలి. ఆవాలు చిట్లడం ప్రారంభించినప్పుడు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు, తరిగిన కూరగాయలను వేయండి. లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ఆపై బ్రెడ్ మిశ్రమాన్ని జోడించండి. బ్రెడ్ లేత బంగారు గోధుమ రంగులో కనిపించినప్పుడు, గ్యాస్ ఆఫ్ చేయండి. తాజాగా తరిగిన కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండాలి.