Bread Cutlet

 

 

 

బ్రెడ్ కట్‌లెట్

 

 

 

 

కావలసినవి :
బ్రెడ్ - సగం ప్యాకెట్
ఆలూ - అర కేజీ
టమోటా సాస్ - కొద్దిగా.
ఎండు బఠానీలు - అర కేజీ
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూన్
కారం - ఒక స్పూన్
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
టమోటాలు - నాలుగు
గరంమసాలా - ఒక స్పూన్
సన్న కారపూస - కొద్దిగా
ఉల్లిపాయలు - మూడు

 

తయారీ :
ముందురోజు రాత్రి బఠానీలను నానబెట్టుకోవాలి. ఆలూను ఉడకబెట్టుకోవాలి. తరువాత బ్రెడ్‌ను నీళ్లలో ముంచి ఆ నీళ్లుపోయే వరకు ఉడకబెట్టిన బంగాళదుంపల్లో వేసి కొంచెం పసుపు, కారం వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల మాదిరిగా చేసుకుని పెనం మీద నెయ్యి లేక నూనె వేసి దోరగా కాల్చుకోవాలి. తరువాత నానబెట్టిన బఠానీలను కుక్కర్‌లో ఉడికించుకోవాలి. ఆ నీళ్లలోనే టమోటాలు, ఉల్లిపాయలు వేసి మిక్సీలో పట్టుకోవాలి. ఆ మిశ్రమంలో గరంమసాలా, మిరపపొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా కాల్చిపెట్టుకున్న కట్‌లెట్‌లపై ఈ కుర్మావేసి ఉల్లిపాయలు, టమోటా సాస్, సన్న కారపూసతో గార్నిష్ చేసుకోవాలి.