
ఫిజికల్ అవుదాం అంటే రెడీ.. త్రిగుణ్ మీద పడ్డ అమన్!
బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం టోటల్ డామినేష్ అని ముందే హింట్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక్కో డ్యాగర్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ వారం పూర్తయ్యేలోపు.. ప్రతీ ఒక్కరూ రెండు లేదా అంత కంటే ఎక్కువ డ్యాగర్స్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం నాటి ఎపిసోడ్లో రథ నిర్మాణం టాస్కులో రెడ్ టీమ్ టోటల్ డామినేషన్ చూపించింది. అందుకే బ్లూ టీమ్ అంతా కూడా నామినేషన్లోకి వచ్చారు. ఇక బ్లూ టీమ్ అంతా కలిసి ఓ ఇద్దరినీ ఎంచుకుని వారికే నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చింది. అలా త్రిగుణ్ , నరేష్ రెడ్ టీమ్ లోని మెంబర్లను నామినేట్ చేశారు. అలా నామినేషన్ ప్రాసెస్ అయితే పూర్తయింది. ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఈ డ్యాగర్స్ని సంపాదించుకోండని బిగ్ బాస్ హింట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కువ ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారుతుందని బిగ్ బాస్ అంటాడు. డ్యాగర్స్ అన్నింటినీ కెప్టెన్ రూంలో పెట్టుకుని.. అందులోకి రావొద్దు అంటూ.. గేమ్ ముందుకు ఎలా వెళ్తుంది.. ఒక్క సారి ఆలోచించు అని అపూర్వకి మర్యాదగా చెప్తుంది షాలినీ. మీరు ఫిజికల్ అయితే.. నేను అది పర్సనల్‌గా తీసుకుంటా.. ఫిజికల్ అవుదామంటే చెప్పండి మేం రెడీ అని రోహిత్ అంటాడు.త్రిగుణ్ అయితే ఓ డ్యాగర్ని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఝాన్సీ వస్తుంటే.. షాలినీ గట్టిగా అడ్డుపడుతుంది. మరోవైపు త్రిగుణ్‌ని కింద పడేసి అమన్ ఫిజికల్ అవుతాడు. ముఖేష్‌ని రోహిత్ తన చేతులతో బంధిస్తాడు. నరేష్‌కి ఏమైందని దేబ్జానీ అడుగుతుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి.. ఈ వేలు నొప్పి వస్తోందని చెప్తే.. ఇలా స్ప్రే కొట్టి పంపించాడట అని రామ్ ప్రసాద్ కామెడీ చేస్తాడు. దేబ్జానీ, వర్షిణి నవ్వేస్తారు. నన్ను రెచ్చగొట్టింది ముఖేష్.. ముఖేషు.. అని కామెడీ చేస్తాడు నరేష్. డ్యాగర్స్ వేటలో రెడ్ టీమ్ ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. ఇక కెప్టెన్సీ కోసం జరుగుతున్న ఈ టాస్క్ లో ఎవరు కెప్టెన్ గా నిలుస్తారో చూడాలి మరి.
Oct 1, 2026 6:32PM
స్నేహంలో వంద గొడవలు ఉంటాయి.. దానికి బ్రేకప్ ఏంటి: రీతూ చౌదరి!
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. బిగ్ బాస్ ఫేమ్ రీతూచౌదరి మరోసారి తన ఇన్‌స్టా స్టోరీతో వార్తల్లోకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో డీమాన్ పవన్ తో సాగిన ట్రాక్ ని అందరు లవ్ అని కనెక్ట్ అయ్యారు. అయితే మొన్న(మంగళవారం) డీమాన్ పవన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో.. ఫ్రెండ్ షిప్ బ్రేకప్ అంటు రాసాడు. అది తీసుకోని సోషల్ మీడియా మొత్తం రీతూ చౌదరితో డీమాన్ లవ్ బ్రేకప్ అంటు పోస్ట్, రీల్స్, వ్లాగ్స్ చేశారు. ఇక వీటన్నింటిని చూసిన రీతూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఫ్రెండ్షిప్ బ్రేకప్ పై వస్తున్న రూమర్స్, వీడియోలు, రివ్యూలపై రీతూ చౌదరి స్ట్రాంగ్ గా స్పందించింది. అసలు friendship లో 100 గొడవలు ఉంటే దానికి బ్రేకప్ ఏంటో.. మేము ఏమైనా లవర్సా లేకపోతే మాకు పెళ్లి అని చెప్పామా..ఇది ఎక్కడ గోలరా నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పనిపాటా లేకుండా వీడియోలు పెడుతున్న వారిపై రీతూ మండిపడింది. దానికి సోషల్ మీడియాలో పనిపాటా లేకుండా వీడియోస్ పెట్టుకోవడమేంటో.. దీనికి రివ్యూస్ ఏంటి.. ఇంత ఖాళీగా ఉన్నారారా మీరు, కొంతమంది అయితే వ్లాగ్స్ కూడా.. ఒరేయ్ మీ ఫ్రెండ్స్ తో మీకు గొడవలు అవ్వవా.. దేనికి రా నిబ్బా గాళ్లు, వాడు అదో పెట్టాడు.. మీరు ఇంత ఖాళీగా ఉన్నారు ఏంట్రా" అంటూ ఫైర్ అయ్యింది. తన స్నేహంలో గొడవలు రావడం సహజమని, దానిని బ్రేకప్ అంటూ పెద్దది చేయడం కరెక్ట్ కాదని ఆమె చెప్పకనే చెప్పింది.అయితే ఈ వివాదం వల్ల తనకు ఊహించని లాభం కూడా జరిగిందని రీతూ చెప్పింది. Anyway 1day lo 25k ppl started following me, Thank you అంటూ సెటైర్ వేస్తూనే థాంక్స్ చెప్పింది.నెగెటివ్ ప్రచారం వల్లే తన ఫాలోవర్స్ ఒక్కరోజులో 25 వేలు పెరిగారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది. తన ఫ్రెండ్షిప్ తన ఇష్టమని దానిని జడ్జ్ చేసే హక్కు ఎవరికి లేదని ఆమె దీనిద్వారా క్లారిటీ ఇచ్చింది.
Oct 1, 2026 6:26PM
ఓటింగ్ లో త్రిగుణ్ సునామీ.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు!
బిగ్ బాస్ తెలుగు 10 నాలుగో వారం ఓటింగ్ లో త్రిగుణ్ టాప్ లో ఉండగా దేబ్జానీ, అమన్ లీస్ట్ లో ఉన్నారు. హౌస్ లో అమన్, ముఖేష్, రామ్ ప్రసాద్, త్రిగుణ్, రోహిత్, షాలినీ, శ్రిష్టి మినహా ఎవరు అంత యాక్టివ్ గా లేరు. దాంతో ఓటింగ్ అంతగా పడటం లేదు. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ ఓటింగ్ సాగుతోంది. అయితే మెజారిటీ ఓటింగ్ త్రిగుణ్ కి పడుతోంది. నాలుగో వారం ఓటింగ్ ఎలా ఉందో ఓసారి చూసేద్దాం..త్రిగుణ్ 55.58 శాతంతో 1,79,053 ఓట్లతో మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. త్రిగుణ్ దాదాపు అందరి ఓట్లు కలిపినా అంత రావడం లేదు. అమన్ తో ఫిజికల్ ఫైట్ తర్వాత వచ్చిన సింపతీ, ఫ్యాన్ బేస్ రెండు కలిసి వచ్చాయి. రెండో స్థానంలో రోహిత్ 13.1 శాతంతో 42,195 ఓట్లతో ఉన్నాడు. మూడో స్థానంలో ముఖేష్ 7.52 శాతంతో 24,235 ఓట్లతో సేఫ్ గా ఉన్నాడు. నాలుగో స్థానంలో షాలిని 6.48 శాతంతో 20,861 ఓట్లతో ఉండగా, ఐదో స్థానంలో చరణ్ 5.99 శాతంతో 19,294 ఓట్లు తెచ్చుకున్నాడు. ఆరో స్థానంలో శ్రిష్టి 4.79 శాతంతో 15,431 ఓట్లతో ఉంది. ఏడో స్థానంలో నరేష్ 2.53 శాతంతో 8,158 ఓట్లతో ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో అమన్, దేబ్జానీ ఉన్నారు. అమన్ 2.03 శాతంతో 6,527 ఓట్లతో ఎనిమిదో స్థానంలో, దేబ్జానీ 1.99 శాతంతో 6,396 ఓట్లతో తొమ్మిదో స్థానంలో అట్టడుగున ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 99 శాతం ఉంది. అమన్ ఫిజికల్ అవ్వడం, దేబ్జానీ గేమ్ లో యాక్టివ్ గా లేకపోవడం వల్లే తక్కువ ఓట్లు వచ్చాయి.
Oct 1, 2026 6:24PM.webp)
డీమన్ పవన్ - రీతూ జోడికి దిష్టి కొట్టింది... ఏరా పనిపాట లేకుండా మా మీదా...
ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అండ్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రీతూ - డీమన్ పవన్ విషయం. ఇప్పుడు ఈ సబ్జెక్టు బాగా వైరల్ అవుతోంది. అసలు డీమన్ పవన్ - రీతూ మధ్య ఏమయ్యింది అనే విషయం మీద ఎవరికీ వారు జడ్జ్మెంట్స్ పాస్ చేసేస్తున్నారు. ఐతే రీసెంట్ గా రీతూ చౌదరి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో అలాంటిది ఏమీ లేదు అంటూ పోస్ట్ చేసింది. ఇంతకు రీతూ ఎం పోస్ట్ చేసిందో చూస్తే ... "అసలు ఫ్రెండ్ షిప్ లో 100 గొడవలుంటాయ్. దానికి బ్రేకప్ ఏంటో. మేమేమైనా లవర్సా , లేకపోతే మాకు పెళ్ళని చెప్పామా. ఇదెక్కడి గోలరా నాయనా. దానికి సోషల్ మీడియాలో పని పాట లేకుండా వీడియోస్ పెట్టుకోవడం ఏంటో. దీనికి రివ్యూస్ ఏంటి. ఇంత ఖాళీగా ఉన్నారురా మీరు. కొంతమందైతే వ్లాగ్స్ కూడా. ఒరేయ్ మీ ఫ్రెండ్స్ తో మీకు గొడవలు అవ్వవా ? దేనికి రా నిబ్బాగాళ్ళు. వాడేదో పెట్టాడు. మీరేంట్రా ఇంత ఖాళీగా ఉన్నారు ఏంట్రా. ఏదేమైనా ఒక్క రోజులు 25 కే మంది నన్ను ఫాలో అవుతున్నారు. " అసలు ఒకసారి ఆలోచిస్తే బిగ్ బాస్ నుంచే వీళ్ళ జోడి గురించి ఆడియన్స్ కి తెలిసింది. ఇక బిగ్ బాస్ నుంచి మొదలైన జోడీలు ఏవీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు వీళ్లది కూడా అదే రూట్ లో వెళ్తోంది. అన్ని రకాల యాడ్స్ ని కలిసి చేశారు. కానీ ఇప్పుడు సడెన్ గా బ్రేకప్ అంటే ఏంటి అర్ధం అంటూ ఆడియన్స్ అడుగుతున్నారు. కలిసి షోస్ కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరికీ వాళ్ళు వస్తున్నారు. గత బిగ్ బాస్ సీజన్స్ ని ఒకసారి చూస్తే సిరి హన్మంత్ - షణ్ముఖ్ లవ్ ట్రాక్ అలాగే ఆగిపోయింది. మధ్యలో విష్ణు ప్రియా పృద్విని విపరీతంగా ప్రేమించేసింది. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి కనిపించలేదు. ఇక ఇప్పుడు డీమన్ పవన్ - రీతూ జోడి అదే బ్రేకప్ రూట్ లో నడుస్తోంది. ఏదేమైనా బిగ్ బాస్ లో సక్సెస్ అయ్యే జోడీలకు మాత్రం గట్టిగానే దిష్టి కొడుతోంది.
Oct 1, 2026 6:21PM
బిగ్ బాస్ సీజన్ చూడలేకపోతున్నా... జిమ్ లో జాయిన్ అయ్యానోచ్....
బిగ్ బాస్ సీజన్ 10 ఇప్పుడు నడుస్తోంది. దానికి రేటింగ్ కూడా పీక్స్ లో ఉంది. అలాంటి బిగ్ బాస్ ని నార్మల్ ఆడియన్స్ కచ్చితంగా ఫాలో అవుతున్నారు. కానీ సెలబ్రిటీస్ అంటే షోస్ లో బిగ్ బాస్ లో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న వాళ్ళు చూస్తారా లేదా అన్న విషయం మాత్రం డౌటే. ఎందుకంటే రకరకాల ఈవెంట్స్ , షోస్ వంటి వాటికి ఎక్కువగా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి పూర్తి ఎపిసోడ్ ని కానీ సీజన్ ని కానీ ఎక్కువ మంది ఫాలో అవ్వరేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఆర్జే కాజల్ ఒక విషయాన్నీ చెప్పింది. "ఫిట్ నెస్ జర్నీ స్టార్ట్ చేసాక టైం అస్సలు దొరకట్లేదు. దొరికిన టైం లో చూస్తున్నాను. అన్ని ఎమోషన్స్ ట్రిగ్గర్ ఐపోతున్నాయ్. ఈ సీజన్ బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటున్నాను. కానీ నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. మీరు నమ్ముతారు నేను సీజన్ 2 కూడా స్కిప్ చేసాను " అంటూ కాజల్ ఆర్జే తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. దీనికి కారణం లేకపోలేదు " గున్న ఏనుగులా ఉన్నావ్ లావుగా ఉన్నావ్ ... వెయిట్ తగ్గితే బెటర్ అని చాలామంది కామెంట్స్ చేసేసరికి ఇప్పుడు కాజల్ రూట్ మార్చింది. ఫిట్ నెస్ జర్నీ స్టార్ట్ చేసింది. తానేంటో నిరూపించుకోవడానికి ట్రోలర్స్ కి ఆన్సర్ చేయడానికి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టింది. జిమ్ వీడియోస్ ని స్టార్ట్ చేసి దాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తోంది. అలాగే యోగ కూడా చేస్తోంది.
Oct 1, 2026 6:18PM
ఎట్టకేలకు ప్రేమ మెడలో తాళి కట్టిన ధీరజ్.. కన్యాదానం చేసిన తిరుపతి, సుక్కూ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -593 లో....వల్లి కుట్రలన్నింటినీ నర్మద ఆధారాలతో సహా ప్రేమ ముందు బయటపెట్టడంతో ప్రేమ పంతాన్ని పక్కనపెట్టి ధీరజ్ తో పెళ్లికి ఒప్పుకుంటుంది. ప్రేమను పెళ్లి కూతురిలా రెడీ చేసి నర్మద మండపానికి తీసుకురాగా రామరాజు కళ్లల్లో ఆనందం నిండిపోతుంది. అదే సమయంలో సేనాపతి, భద్రావతిలు పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ చేస్తారు. నా మేనకోడలిని మాయ చేసి తీసుకొస్తావా అని భద్రావతి అనగా తనంతట తానే వచ్చిందని రామరాజు కౌంటర్ ఇస్తాడు. రామరాజు కాలర్ సేనాపతి పట్టుకోబోతే చందు, సాగర్ ఆపుతారు. అప్పుడే ప్రేమ..నాన్నా నేను నా ఇష్టప్రకారమే వచ్చాను, మామయ్య ప్రమేయం లేదు, అనవసరంగా నోరు జారకండి అంటూ తండ్రినే వారిస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ప్రేమ అనడంతో సేనాపతి గుండె బద్దలవుతుంది. నటించకు అత్తా, నువ్వేం చేశావో నాకు అన్నీ తెలిసిపోయాయి, చిన్నప్పటి నుంచి నిన్ను అమ్మలా చూశా.. కానీ నీ నిజస్వరూపం తెలిసింది.. ఇప్పటికీ నీ పరువు తీయలేను కాబట్టి వెళ్లిపోమని భద్రావతితో ప్రేమ అంటుంది. దీంతో భద్రావతి షాక్ అవుతుంది. శాస్త్ర ప్రకారం కన్యాదానం జరగకపోతే ఈ పెళ్లికి విలువ ఉండదు, కన్యాదానం ఎవరు చేస్తారని సేనాపతి సవాల్ విసురుతాడు. అప్పుడే తిరుపతి ముందుకొచ్చి.. ప్రేమ నాకు కూడా కూతురే, నా మేనల్లుడి కాళ్లు కడిగి మేము కన్యాదానం చేస్తామని అంటాడు. ముహూర్తం మించిపోతుందని పంతులు చెప్పడంతో తిరుపతి, సుకన్య మేనల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తారు. అందరి సమక్షంలో ప్రేమ మెడలో ధీరజ్ తాళి కడతాడు. చిన్నప్పుడు గుండెల మీద తన్నితే మురిసిపోయా, ఇప్పుడు జీవితంలో కోలుకోలేనంతగా గుండెల మీద తన్నిందంటూ సేనాపతి గుండెలు పగిలేలా ఏడుస్తూ వెళ్లిపోతాడు. పెళ్లి అయ్యాక కొత్త జంటను ఇంటికి తీసుకొచ్చి అమూల్య, కామాక్షి హారతి ఇస్తారు. వల్లి కుట్రలు మామయ్య ముందు పెడతానని నర్మద వార్నింగ్ ఇవ్వడంతో వల్లి గజగజ వణికిపోతుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Oct 1, 2026 11:35AM.webp)
జ్యోత్స్న ఉద్యోగం పోయింది.. శివన్నారాయణ మిస్సింగ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -792 లో......ఎంతో కష్టపడి సంపాదించుకున్న జాబ్ పోయిందని జ్యోత్స్న కన్నీరు పెట్టుకుంటుంది. నా జాబ్ పోవడానికి మీరే కారణం, నువ్వు అన్నీ మీ అమ్మకి చెప్తావ్.. నీకు నా దగ్గర మీ అమ్మ డ్యూటీ వేసిందంటూ సూరజ్ పై ఫైర్ అవుతుంది. నేను ఏం చెప్పలేదు, ఓనర్ ని అడుగమని చెప్పినా జ్యోత్స్న నమ్మదు. నేను ఉన్న చోటుకి నువ్వు వస్తావ్.. దక్షిణామూర్తి తాత వస్తాడు.. నేను కేఫ్ లో పని చేస్తున్నా అని మీ తాత మా తాతకి చెప్పాడు.. రాత్రంతా ఇంట్లో పెద్ద గొడవ.. నాతో వాదించలేక మా వాళ్లు వదిలేశారని జ్యోత్స్న బాధపడుతుంది. తన సంపాదనతో అమ్మానాన్న కడుపు నిండా తింటారనే చిన్న ఆశ కూడా చంపేశారని జ్యోత్స్న ఏడుస్తుంది. సూరజ్ దండం పెట్టి అర్థం చేసుకోమని బ్రతిమాలినా, తన తల మీద చెయ్యి పెట్టి ఒట్టేయమని జ్యోత్స్న డిమాండ్ చేస్తుంది. మరోవైపు దీప ఆఫీస్ లో మాలినికి చుక్కలు చూపిస్తుంది. ఫైల్స్ చూస్తూ ఉండగా కార్తీక్ ఇచ్చిన ఐడియాతో ఇంగ్లీష్ ఫైల్స్ ని తెలుగులోకి మార్చే యాప్ తో చెక్ చేస్తుంది. మాలిని ఎవరు, తన పోస్ట్ ఏంటి, నేను సీఈఓని, తను ఎవరు అడగడానికి" అంటూ మాలిని పీఏను, మాలినిని దీప ప్రశ్నలతో విసిగించి పిచ్చెక్కిస్తుంది. దెబ్బకి పీఏ జాబ్ మానేస్తుంది. సూరజ్ మాలినితో.. మనకి ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా, జ్యోత్స్న రెస్టారెంట్స్ తప్ప అని అడుగుతాడు. దీంతో మాలిని కేఫ్ ఓనర్ ని గుర్తుచేసుకుని కంగారుపడుతుంది. చివర్లో జ్యోత్స్న బాధగా కూర్చుంటే కార్తీక్, దీప వచ్చి ఏమైందని అడుగుతారు. నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు బావా.. ఇంకెవరు మనల్ని నడిరోడ్డు మీదకు లాగిన మహానుభావులే, ఓనర్ ని బెదిరించి తీయించేశారని చెప్తుంది. మీ ఇంట్లో తిన్న ప్రతీ మెతుకు మా గొంతులో గుచ్చుకున్నట్లు ఉంది బావా అంటూ ఎమోషనల్ అవుతుంది. కారు లేకపోతే తిరగలేని జ్యోత్స్నలో ఇంత మార్పు ఏంటని దీప అంటే.. శివన్నారాయణ మనవరాలిగా బతుకుతుందని కార్తీక్ అంటాడు. ఇంతలో పారు బయట కంగారుగా నిల్చుని శివన్నారాయణ బయటకు వెళ్లి ఇంకా రాలేదు.. కనపడటం లేదని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Oct 1, 2026 11:32AM.webp)
దుండగుల చేతికి చిక్కిన సిరి.. సీసీటీవీతో నిజం తెలుసుకున్న రాజ్, ఇందు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1150 లో...దాగుడుమూతలు ఆడుతూ సిరి కనిపించకుండా పోవడంతో రాజ్, ఇందు తెగ కంగారుపడతారు. ఇంట్లో, గార్డెన్ లో, వీధిలో ఎంత వెతికినా సిరి దొరకదు. దీని వెనుక రేఖ హస్తం ఉందని రాజ్ అనుమానిస్తాడు. పిన్నీ సిరి ఎక్కడ, నీకే తెలుటూ రేఖను నిలదీస్తాడు. రేఖ మాత్రం నాకేం తెలీదు, కావాలంటే పోలీసులను పిలిపించమని ఎదురు సవాల్ చేస్తుంది. రాజ్ కోపంతో పోలీసులకు ఫోన్ చేయబోతుంటే ఇందు అడ్డుకుని గదిలోకి తీసుకెళ్తుంది. పోలీసులు వస్తే నీ యాక్సిడెంట్ నిజం బయటకు వస్తుంది. అందరికి ప్రాబ్లం అవుతుందని ఇందు హెచ్చరిస్తుంది. అప్పుడు ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని ఐడియా ఇస్తుంది. ఫోన్ లో ఫుటేజ్ చూస్తే సిరి పొరపాటున ఓ క్యాబ్ డిక్కీలో దాక్కోవడం..ఆ క్యాబ్ వెళ్లిపోవడం కనిపిస్తుంది. అది ఆన్ లైన్ ట్రావెల్ సర్వీస్ క్యాబ్ అని గుర్తించి, దానిపై ఉన్న నంబర్ కు ఫోన్ చేసి డ్రైవర్ డీటెయిల్స్ తెప్పించుకుంటారు రాజ్, ఇందు. మరోవైపు కారు డిక్కీలో నుంచి దిగిన సిరి సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఒంటరిగా మిగిలిపోతుంది. మా ఇంటికి తీసుకెళ్లు, నా మొగుడి దగ్గరకు తీసుకెళ్లమని డ్రైవర్ ని బతిమాలుతుంది. డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఆ డ్రైవర్ వెంటనే రేఖకు ఫోన్ చేసి.. మీరు చెప్పినట్లే ఆ అమ్మాయిని సిటీ బయట వదిలేశానని చెప్తాడు. రేఖ డబ్బులు పంపించి అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది అంటూ కుట్ర పన్నుతుంది. రోడ్డు మీద.. మొగుడా, మొగుడా అంటూ భయంతో తిరుగుతున్న సిరిని బైక్ వాళ్లు, ఆటో డ్రైవర్లు పట్టించుకోకుండా వదిలేస్తారు. తరువాయి భాగంలో ఓ ఆటో డ్రైవర్ సిరి దగ్గరకు వచ్చి.. నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి ఆటో ఎక్కించుకుంటాడు. దారిలోనే ఎవరికో ఫోన్ చేసి.. కత్తిలాంటి అమ్మాయి దొరికింది, మన ప్లేస్ కి తీసుకొస్తున్నానని అంటాడు. సిరిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ముగ్గురు కామాంధులు అత్యాచారయత్నం చేయబోతారు. అదే సమయంలో రాజ్, ఇందు క్యాబ్ డ్రైవర్ చెప్పిన లొకేషన్ కు వెళ్లి సిరి కోసం జల్లెడ పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Oct 1, 2026 11:31AM.webp)
కాలర్ పట్టుకుని నిలదీసిన గోపిక.. అందరిని కడిగిపారేసిన చక్రి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -223 లో....చక్రికి ఆల్రెడీ పెళ్లయిందనే నిజం తెలియడంతో గోపిక తట్టుకోలేకపోతుంది. చక్రి తనకు పెళ్లయిందని, బస్టాప్ లో ఉండే అమ్మాయి తన భార్య అని ఫోటోలు చూపించి చెప్పడంతో గోపిక షాక్ అవుతుంది. ఛీ నువ్వు ఇలాంటి వాడివా.. ఇంత మోసం చేస్తావా.. ఇంక మన పెళ్లి ఎక్కడ చేయాలి.. పిల్లలు అంటూ ఎన్నెన్నో ఆలోచించాను కదరా..నన్ను ఎందుకు మోసం చేశావ్.. ఫోన్ నంబర్ ఎందుకు ఇచ్చావ్.. నాలో ఆశలు ఎందుకు రేపావంటూ చక్రి కాలర్ పట్టుకుని నిలదీస్తుంది గోపిక. ఆ తర్వాత ఏడుస్తూ వెళ్లిపోతుంది. గోపిక ఆటోలో వెళ్తుంటే పెద్ది కూడా ఆటో ఎక్కి ఆమెకు తోడుగా ఇంటివరకు వెళ్తాడు. మరోవైపు ఆఫీసులో మహా మీద విక్కీ ఆశలు పెంచుకుంటాడు. అన్నయ్య అని పిలవను, రాఖీ కట్టనని మహా చెప్పిన మాటలను గుర్తు చేసుకుని గాల్లో తేలిపోతాడు. లక్కీకి కూడా తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని ఊహించుకుంటాడు. ఏదో పని వంక పెట్టుకుని మహా, దివ్య దగ్గరకు వెళ్లి ప్రాజెక్ట్ డిజైన్ ఇవ్వమంటాడు. నీ క్యాబిన్ ఇక్కడే కదా, మేం వస్తామని మహా అంటే నీ కోసమే విక్కీ ఇక్కడే ఉంటా అంటున్నాడు, నిన్ను లవ్ చేస్తున్నాడని దివ్య వెటకారంగా అంటుంది. ఇదే సమయంలో కన్నా గాడు మహాకు ఫోన్ చేసి.. కొంపలు అంటుకున్నాయి..గోపిక ఇంటికి వచ్చింది.. పెళ్లయిన విషయం తెలిసి ఏడుస్తూ వెళ్లిందని చెప్తాడు. ఇలానే కావాలి.. లేకపోతే మీ అన్న ఎంత చేశాడని మహా అంటుంది. మరోవైపు చక్రి.. గోపికకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోందని కేశవతో చెప్తూ కంగారు పడతాడు. అప్పుడే పెద్ది వచ్చి చప్పట్లు కొడుతూ.. గొప్ప పని చేశావ్.. నాన్నకి రెండు పెళ్లిళ్లు అని ఉంది కదా.. నువ్వు కూడా ఆ పేరు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నావా.. ఒక అమ్మాయిలో ఆశలు పెంచుతావా.. బస్టాండ్ కి రంగురంగుల చొక్కాలు వేసుకుని వెళ్లడం ఏంట్రా.. నీకు పెళ్లయిందన్న సంగతి గుర్తుందా అని తిడతాడు. దీంతో చక్రి అందరిని కడిగిపారేస్తాడు. ఆపు అన్నయ్యా, నాకు పెళ్లయిందా.. ఎవరు అనుకుంటున్నారు పెళ్లయిందని.. ఈ ఇంట్లో వాళ్లైనా గుర్తిస్తున్నారా.. నాక్కూడా సంతోషంగా ఉండాలని.. పెళ్లి, భార్య, పిల్లలు కావాలని ఉంటుంది. ఆ అమ్మాయికి కూడా నా పెళ్లి విషయం తెలుసనే అనుకున్నా.. పెళ్లయిందని ప్రత్యేకంగా ఎందుకు చెప్పడమనుకున్నా.. ఈమె ఏమో తన ఆఫీసులో బాస్ కి కజిన్ అని పరిచయం చేసింది. అలాంటప్పుడు నేను ఎలా అందరికి ఈ కజిన్ నా భార్య అని చెప్పగలను.. ఈమె ఎప్పుడైనా నన్ను భర్తగా చూసిందా.. ఈ పెళ్లిని పెళ్లిలా చూసిందా అని చక్రి ఎమోషనల్ గా ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Oct 1, 2026 11:26AM
ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పిన జాను..షాక్ లో సంజు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -126 లో....జానూ భోజనానికి కూర్చోగానే సంజయ్ లేచి పారు పక్కకి వెళ్లిపోతాడు. దీంతో జాను బాధపడితే.. వాడికి చిన్నప్పటి నుంచి నాతో కలిసి తినడం అలవాటు.. ఏం అనుకోవద్దని పారు సర్ది చెబుతుంది. జాను చీర మార్చుకోలేదేంటని రమణి అడిగితే బట్టలు లేవని చెప్తుంది. సంజు తీసుకెళ్లి షాపింగ్ చేయించాలి కదా అని అందరూ అనడంతో పారు.. మా అమ్మాయి చీరలు తీసుకోమని ఇస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర సంజు, జాను లవ్ స్టోరీ టాపిక్ వస్తుంది. పారు మనవడితో.. మీ ఇద్దరూ ఎలా కలిశారు, పెళ్లి వరకు ఎలా వచ్చారని అడగడంతో సంజు కంగారుపడతాడు. చెప్పలేక మౌనంగా ఉండగా జాను కవర్ చేస్తుంది. మీ మనవడు మొదటి చూపులోనే నాకు బాగా నచ్చేశాడు.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. మొదట చూడగానే నచ్చారు.. తనకి నేను నచ్చా.. ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని పెళ్లి చేసుకున్నామని అబద్ధం చెప్పడంతో సంజుకి పొలమారతుంది. బామ్మ తాతయ్య మాత్రం సంతోషపడతారు. రాత్రి జాను ఒంటరిగా బయట కూర్చుంటే సంజయ్ వచ్చి.. ఏంటి ఇక్కడ కూర్చున్నావని అడుగుతాడు. ఇక్కడ కూర్చోరాదని స్కెచ్ తీసుకుని రాయండి.. ఎక్కడ కూర్చోవాలో అగ్రిమెంట్ లో లేదు కదా అంటూ జాను కౌంటర్ ఇస్తుంది. ఇందాక తాతయ్య వాళ్లతో అన్నీ అబద్ధాలు అవసరమా అని సంజు అంటే బామ్మ తాతయ్య ఎంత సంతోషంగా ఉన్నారో చూశావా అంటుంది. నాకు అబద్ధాలు నచ్చవని సంజు అంటే అయితే బామ్మ తాతయ్య రండి, మా అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్తానని జాను అనడంతో సంజు ఆపుతాడు. ఇక ముందు లవ్ కథలు చెప్పకని సంజు వార్నింగ్ ఇస్తే.. డబ్బు సాయం చేసిన పురుషోత్తముడు అని చెప్తానని జాను అంటుంది. మరోవైపు ఇంట్లో వినాయకుడి ఆగమనం జరుగుతుంది. శివుడు, పార్వతి, కూతురు అల్లుడు అందరూ డప్పుచప్పుళ్లతో గణేషుడిని ఇంటికి తీసుకొస్తారు. జాను, సంజయ్ లను కూడా లాగి డ్యాన్స్ చేయిస్తారు. సంజు జాను పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని అందరు కోరుకుంటారు. ఇంకోవైపు మురళి కూడా వినాయకుడి విగ్రహం, పూజ సామాగ్రి తీసుకొస్తాడు. ఇంట్లో అందరూ డల్ గా ఉండటం చూసి.. జాను ఏదో చేసిందని మనం బాధపడుతూ ఉండటమేంటి.. ఈరోజు వినాయక చవితి, పండగ చేసుకుందామని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Oct 1, 2026 11:23AM
మనీష్ తో అంజలి గొడవ.. ఆ రౌడీ ఎవరు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 78 ఉత్కంఠగా సాగింది. అంజలి డల్ గా కూర్చుని ఉండగా గీత బయటకు వెళ్తూ వాటర్ వేస్ట్ అవ్వడం చూసి మోటార్ ఆఫ్ చేసి వెళ్తుంది. అయితే బ్యాగ్ మర్చిపోవడంతో అంజలి.. అమ్మగారు బ్యాగ్ అంటూ తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో గీత అంజలిపై అనుమానం పెంచుకుంటుంది. ఇలా వాటర్ వేస్ట్ అయ్యేలా చేసి బ్యాగ్ మర్చిపోతే తీసుకొచ్చి ఇవ్వడం నీ ప్లానా అంటూ తన బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటుంది. దీంతో అంజలి తీవ్రంగా బాధపడుతుంది. అసలు ఇంత పెద్ద దొంగతనం నిందను అంజలి ఎందుకు మీద వేసుకుందనేది సస్పెన్స్ గా మారింది. మా అమ్మతో గొడవ అయింది, అమ్మమ్మను చూసుకుంటూ ఇంట్లో ఉంటుంది.. ఇవన్నీ నిందలు భరిస్తూ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది.. రీనా చెప్పినట్లు బావ కోసం ఇదంతా చేస్తుందా అని భవిత అనుకుంటుంది. మరోవైపు అంజలి మాత్రం.. నేను ఇదంతా చేస్తుంది అమ్మ కోసం.. భవిత దొంగతనం చేసిందని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు.. భవితను మంచి దారిలోకి తీసుకురావాలని మనసులో అనుకుంటుంది. ఇంకోవైపు రాజారావును బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి బార్ కి వెళ్లి రాజారావు ఇచ్చిన డబ్బు అయిపోవడంతో మళ్లీ ఫోన్ చేస్తాడు. కానీ రాజారావుకి ఫోన్ కలవదు. ఫోన్ కలవకపోతే ఏంటి, ఇంటికే వెళ్తానని అతను అనుకుంటాడు. అంజలి మాత్రం.. నేను అవుట్ హౌస్ నుంచి ఇంట్లోకి వెళ్లాలంటే బావ తప్ప ఎవరూ హెల్ప్ చేయరని ఆలోచిస్తుంది. అదే సమయంలో మనీష్ ఒక కొత్త పనిమనిషిని ఇంట్లోకి తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొచ్చావ్.. నేను ఉన్నాను కదా అని అంజలి గొడవ పెట్టుకుంటుంది. నా చేతిలో ఏం లేదు, అంతా అత్తయ్య ఇష్టమని మనీష్ అంటాడు. ఆ కొత్త పనిమనిషి కాఫీ తీసుకొచ్చి గీత వాళ్లకి ఇస్తే వాళ్లు బాగుందని మెచ్చుకుంటారు. దీంతో అంజలికి కోపం మరింత పెరుగుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు.. నేను పనిమనిషిగా ఉండాలి.. తనని పంపించేయ్ అని మనీష్ కి తెగేసి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Oct 1, 2026 11:21AM.webp)
బాబుని ఎత్తుకున్నందుకు రంగాని అవమానించిన శకుంతల.. రుద్ర సీరియస్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న 'జయం' . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 387లో.. ప్రీతి బాబుని ఎత్తుకుని రంగా ఆడిస్తుండగా శకుంతల చూసి ఫైర్ అవుతుంది. ఎందుకు బాబుని ఎత్తుకున్నావ్ ఆ మురికి చేతులతో నువ్వు ఈ ఇంట్లో జీతం లేని పనిమనిషివి.. అంతలోనే ఉండు.. ఎక్కువ చొరవ తీసుకోకు.. నువ్వు ఎప్పుడూ పరాయి వాడివే అని కోప్పడుతుంది. అప్పుడే ఇషిక, వీరు వచ్చి ఏమైందని అడుగుతారు. నువ్వు బాబుని చూసుకోకుండా ఏం చేస్తున్నావని శకుంతల అనగానే ఇప్పుడు అలా వెళ్లను అత్తయ్యా అని వీరు అంటాడు. ఆ తర్వాత రంగా బయట బాధపడుతుంటే గంగ వచ్చి ఏమైందని అడుగుతుంది. మొదట చెప్పని రంగా.. నా మీద ఒట్టే అని గంగ అనడంతో జరిగింది చెప్తాడు. నిన్ను అన్ని మాటలు అనడానికి నోరు ఎలా వచ్చిందని గంగ ఫైర్ అవుతుంది. అప్పుడే రుద్ర వచ్చి వింటాడు. ఏం లేదు బావా అని రంగా దాచే ప్రయత్నం చేసినా రుద్ర వినకుండా లోపలికి వెళ్తాడు. బాబుని ఎత్తుకుని..ప్రీతి నీకు రంగా బాబుని ఎత్తుకోవడం ఇష్టం లేదా అని నిలదీస్తాడు. తనే బాబు ఏడుస్తుంటే ఎత్తుకుని హెల్ప్ చేశాడు, అలాంటిది ఎందుకు వద్దు అంటానని ప్రీతి కవర్ చేస్తుంది.అప్పుడు శకుంతల అన్న మాటలను రుద్ర బయట పెడతాడు. నేను బాబుకి ఇన్ఫెక్షన్ అవుతుందని అలా అన్నానని శకుంతల మాట మారుస్తుంది. దీంతో రుద్ర సీరియస్ అవుతాడు. రంగా ఈ ఫ్యామిలీకి ఎంత చేస్తున్నాడో తెలుసా.. నాకు ఏమైనా అయితే తన ప్రాణం అడ్డుపెడతాడని గొప్పగా చెప్తాడు. పెద్దసారు కూడా.. శకుంతల నువ్వు రంగాకి సారీ చెప్పమని అంటాడు. అయ్యో అవన్నీ ఎందుకని రంగా అందరిని పంపిస్తాడు. ఆ తర్వాత రుద్రని హగ్ చేసుకుంటాడు. మరోవైపు రెస్టారెంట్ లో వంశీ వెయిట్ చేస్తుంటే జయ వస్తుంది. వంశీని పూర్తిగా తన మాయలో పడేయాలని జయ ట్రై చేస్తుంది. ఇంకోవైపు.. మీరు చాలా మంచివారు.. మా అన్నయ్యకి సపోర్ట్ గా ఉన్నారని రుద్రతో గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Oct 1, 2026 10:57AM
రీతూ చౌదరి, డీమాన్ పవన్ లవ్ బ్రేకప్.. క్లారిటీ ఇచ్చిన ఆ పోస్ట్!
డీమాన్ పవన్, రీతూ చౌదరి గురించి అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ చాలా రోజులే సాగింది. అయితే వాళ్ళిద్దరూ మాత్రం ఫ్రెండ్స్ అని అంటుంటారు. అయితే తాజాగా డీమాన్ పవన్ తన ఇన్ స్టాగ్రామ్ లో షాకింగ్ పోస్ట్ చేశాడు. రీతూకి నాకు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది.. ఇక RiVan(Rithu Pavan )ఉండదని పెట్టాడు. తన ఇన్స్టాగ్రామ్ లో @demon_pavan అకౌంట్ లో స్టోరీ పెడుతూ "There will be No more Rivan anymore, Our Friendship got Broken Completely" అని షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "రివాన్ గురించి నాకు కంటిన్యూగా మెసేజ్ లు వస్తున్నాయి, అందుకే క్లారిటీ ఇవ్వాలనుకున్నా. నెగెటివిటీ, ఫాల్స్ రూమర్స్ తో విసిగిపోయా. నేను రీతూని వాడుకున్నా, రీతూ నన్ను వాడుకుందనే నెరేటివ్స్ లో నిజం లేదు. బిగ్ బాస్ హౌస్ లో జరిగేది వేరు, రియల్ లైఫ్ లో జరిగేది వేరు. ఎవరూ ఎవరినీ వాడుకోలేదు.. ఇది మ్యూచువల్ ఫ్రెండ్షిప్. మా ఇద్దరికీ స్ట్రెంత్స్, వీక్ నెస్ లు ఉన్నాయి" అని పవన్ వివరణ ఇచ్చాడు. "మేము గతంలో కలిసి వర్క్ చేశాం, మంచి బాండ్ షేర్ చేసుకున్నాం. కానీ ఏ ఫ్రెండ్షిప్ లో అయినట్లు మాకు కూడా చాలా నెలలుగా పర్సనల్ ఇష్యూస్, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ప్రతిసారీ నేను అర్థం చేసుకుని సార్ట్ అవుట్ చేయాలని ట్రై చేశా, కానీ విషయాలు కంట్రోల్ తప్పుతున్నాయి. గొడవలు పెద్దవి అవుతున్నాయి, అందుకే శాంతి కోసం విడివిడిగా మా ప్రాజెక్ట్స్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పాడు. బ్రేకప్ కి కారణం కూడా పవన్ చెప్పాడు. "ఆమె నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేసి స్నాప్ చాట్ లో రిమూవ్ చేసింది. నాకు అది నచ్చలేదు కాబట్టి నేను ఇన్‌స్టాలో ఆమెను రిమూవ్ చేశా, ఇప్పుడు ఆమె కూడా నన్ను ఇన్‌స్టాలో బ్లాక్ చేసింది. నేను ఎలాంటి పోస్టులు డిలీట్ చేయలేదు. దయచేసి శాంతిని మెయింటైన్ చేయండి, మీ సపోర్ట్ కి థాంక్స్" అని ఎమోషనల్ గా ముగించాడు. దీంతో RiVan ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.
Sep 30, 2026 10:21AM
Jayam Serial :పెద్దసారు హ్యాపీ డాన్స్.. రుద్ర ఎమోషనల్ సీన్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్ 386 లో పెద్దసారు తన గదిలో హ్యాపీగా డాన్స్ చేస్తుంటాడు. అప్పుడే గంగ అక్కడికి వచ్చి "ఏంటి పెద్దోరు ఇంత హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు?" అని అడుగుతుంది. దానికి పెద్దసారు "రుద్ర ఏ తప్పు చెయ్యలేదని తిరిగి తీసుకొని వచ్చారు కదా.. అందుకే హ్యాపీగా ఉన్నాను. వాడు ఎప్పుడూ నా నమ్మకాన్ని పోగొట్టలేదు" అని ఫీల్ అవుతాడు. "ఎందుకు పెద్దోరు.. సర్ అంటే అంత ఇష్టం?" అని గంగ అనగానే "వాడికి కూడా నేనంటే బాగా ఇష్టం" అని పెద్దసారు అంటాడు. ఈ హ్యాపీనెస్ లో "నాకు స్వీట్ తీసుకొని రా" అని పెద్దసారు అనగానే గంగ స్వీట్ తీసుకొని వస్తుంది. పెద్దసారు తినబోతుంటే అప్పుడే రంగా వచ్చి ఆపుతాడు. అయినా సరే పెద్దసారు నోట్లో వేసుకుంటాడు. అప్పుడే రుద్ర వస్తాడు. పెద్దసారు నోట్లో సున్నుండ వేసుకొని సైలెంట్ గా ఉంటాడు. దాంతో రుద్ర పెద్దసారు ముక్కు మూయగానే స్వీట్ నోట్లో నుంచి కింద పడేస్తాడు. గంగ, రంగా ఇద్దరూ చేస్తున్నది స్కామా అని రుద్ర ఫైర్ అవుతాడు. "పెద్దనాన్న నీ ఇంట్లో నువ్వు ఇలా భయపడి తినడం ఏంటి?" అని రుద్ర అంటాడు. "పెద్దనాన్నకి స్వీట్ ఇవ్వండి" అని రుద్ర అనగానే గంగ ఇస్తుంది. రుద్రని పెద్దసారు హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. ఈ సీన్ మొత్తాన్ని దూరం నుంచి శకుంతల చూస్తూ రగిలిపోతుంది. మరోవైపు వీరు తాను పంపిన మనుషులకి ఫోన్ చేస్తుంటే అప్పుడే రుద్ర వచ్చి ..ఆ ఫోన్ కలవదు, వాళ్ళు లిఫ్ట్ చేయరని అంటాడు. వాళ్ళు నువ్వు పంపిన మనుషులని నాకు అర్థమైందని రుద్ర అనగానే "తెలిసిపోయిందా" అని వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రీతి వాళ్ళ బాబుని రంగా ఆడిస్తుంటే శకుంతల వచ్చి కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Sep 30, 2026 10:13AM
Godhavari : నా కూతురు చచ్చిపోయింది.. జానుపై ఫైర్ అయిన శారద!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 125 లో.. జాను తన వాళ్లు ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే ఆపమని బతిమిలాడుతుంది. అసలు నువ్వు చేసింది కరెక్టేనా అమ్మా, ఇంట్లో చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నారు.. మాకు చెప్పినా ఏదో ఒకటి చేసి ఒప్పించే వాళ్లం కదా అని శివుడు జానుతో అంటాడు. దానికి జాను..ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఒప్పుకుంటుందండి.. ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుందాం అన్నాను కానీ మీ మనవడు ఒప్పుకోలేదని అంటుంది. మా మనవడి మొండితనం నాకు బాగా తెలుసు అంటూనే మీ పరిచయం ఎంతది, ఇలా పెళ్లి చేసుకోవడానికి మీ వాలకం చూస్తుంటే నువ్వు మాతో అబద్ధం చెప్తున్నావ్ అనిపిస్తుందని శివుడు అనుమానిస్తాడు. ఏ ఆడపిల్ల తన పెళ్లి దొంగతనంగా జరగాలని అనుకోదు, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మా నాన్నకు మాట ఇచ్చా, నా మీద కోపంతో మా వాళ్లు వెళ్లిపోతారు.. ఉండమని చెప్పండి అని జాను బతిమాలుతుంది. మరోవైపు శారదకు నందు కాఫీ ఇస్తే.. విషం కలిపిరా, తాగి చస్తా అని అరుస్తుంది. ఇంతలో శివుడు, పార్వతి ఇంటికి వస్తే చూసి శారద పరుగున వెళ్లి వాళ్ల మీద అరుస్తుంది. జరిగింది జరిగిపోయింది, మీరు ఇంటి నుంచి వెళ్లిపోతారని మీ కూతురు భయపడుతుంది.. ఏడుస్తుంది, అర్థం చేసుకోండి అని శివుడు, పార్వతి చెప్తారు. దీనికి శారద.. నాకు కూతురే లేదు, ఎప్పుడో చచ్చిపోయింది, అన్నీ మర్చిపోయి అల్లుడు కూతురికి పిలిచి బట్టలు పెట్టాలా.. అది నా కూతురు కాదు..మీ మనవడు నా అల్లుడు కాదు.. ఇక్కడి నుంచి వెళ్లండి అని అరుస్తుంది. మేడ మీద నుంచి తాత, అమ్మమ్మ బతిమాలడం, శారద అరవడం చూసి సంజయ్ వెంటనే కిందకి వచ్చి ఫైర్ అవుతాడు. ఏంటి ఇది ఇక్కడేం జరుగుతుంది, ఎవరి ఇంటి నుంచి ఎవర్ని వెళ్లమంటున్నారు.. బాధలో ఉంటే మూలన కూర్చుని ఏడవాలి.. ఇలా మర్యాద లేకుండా అరుస్తారా.. మా అమ్మమ్మ తాతయ్యలతో అమర్యాదగా మాట్లాడటం ఏంటి, పెళ్లి జరిగింది ఇష్టం అయితే భరించండి, కష్టం అయితే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి.. మా అమ్మమ్మ తాతయ్యల్ని ఒక్క మాట అంటే ఊరుకోనని సంజయ్ వార్నింగ్ ఇస్తాడు. నీ పెళ్లామే వెళ్లి మాట్లాడమని చెప్పిందని సంజయ్ తో శివుడు చెప్తాడు. సంజు ఒక్కడే తప్పు చేసినట్లు వాళ్లు మాట్లాడటం తప్పు అని పార్వతి అంటుంది. సంజయ్ కోపంగా జాను దగ్గరకు వెళ్లి.. మా తాతయ్య అమ్మమ్మని ఎందుకు పంపావ్.. నువ్వు ఎలా పంపిస్తావ్.. మీ అమ్మ ఎలా మాట్లాడిందో తెలుసా అని గొడవ పడతాడు. కోపంలో మాట్లాడేసి ఉంటుందని జాను అంటుంది. మీ బాధలు నాకు అవసరం లేదు, ప్రాబ్లం నీది అయితే మా వాళ్లని ఎందుకు పంపావ్.. మా వాళ్లకి నువ్వు ఎలా పని చెప్తావని సంజయ్ అంటే మీకు పని చెప్తే వింటారా అని జాను అడుగుతుంది. పెళ్లి నేను బలవంతం చేసి చేసుకోలేదు,..నువ్వు నన్ను ఇష్టపడి చేసుకోలేదు.. డబ్బు కోసం చేసుకున్నావ్.. అగ్రిమెంట్ పెళ్లి అని గుర్తుంచుకో, సొంత పెళ్లాంలా ఫీల్ అవ్వకు.. జీవితాంతం ఉండిపోవు కదా అని సంజయ్ హర్ట్ చేస్తాడు. రాత్రి అందరు భోజనానికి కూర్చుంటే సంజయ్ పక్కనే జాను కూర్చుంటే సంజయ్ లేచి పక్కకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Sep 30, 2026 10:10AM
Ye Devi Varamo Neevu: మనీష్ అసలు దింగ ఎవరో కనిపెడతాడా.. అంజలిని మళ్లీ అనుమానించిన గీత!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఏ దేవి వరమో నీవు సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 77లో.. అంజలి పొద్దున్నే లేచి పూజ చేస్తూ కనిపించింది. అది చూసి రత్నం ఆశ్చర్యంగా దగ్గరికి వచ్చి.. ఏంటే నిన్న ఏడుస్తున్నావ్, ఈ రోజు ఏంటి ఇలా ఉన్నావని అడుగుతుంది. దీనికి అంజలి.. నువ్వు చెప్పాక అర్థమైంది అమ్మమ్మ, నేను వచ్చిన పనేంటో. అమ్మ నన్ను కంటపడొద్దు అంది కానీ నేను తనని చూడొద్దు అనలేదు కదా, దూరం నుంచి అయినా అమ్మని చూసుకుంటున్నానని చెప్తుంది. అంజలి మాటలకు రత్నం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు భవిత వాళ్ల దగ్గరికి మనీష్ వెళ్లి.. అసలు నువ్వు నెక్లెస్ ఎక్కడ పెట్టావ్, అంజలి నీ రూమ్ కి ఎప్పుడు వచ్చిందని ఆరా తీస్తాడు. నేను లాకర్ లో పెట్టాను బావ అని భవిత టెన్షన్ పడుతుంది. నీకు ఏ చిన్న క్లూ దొరికినా నాకు చెప్పు, అంజలి ఈ దొంగతనం చేయలేదని నిరూపించాలని మనీష్ అనగానే అమ్మో నేను దొరికిపోతానేమోనని భవిత భయపడుతుంది. ఆ తర్వాత రాకీ తన చెంపకు చేయి అడ్డుపెట్టుకుని అంజలి కొట్టింది గుర్తుచేసుకుంటాడు. మెల్లగా ఈ రోహిత్ గాడిని నా వైపుకు మార్చుకోవాలి.. అప్పుడే నేను చెప్పింది వింటాడు. అత్తయ్య వీడి మాటలు నమ్ముతుందని రాకీ ప్లాన్ వేస్తాడు. మనీష్ వచ్చి రోహిత్ తో మాట్లాడతాడు. నువ్వు అంజలి దొంగతనం చేసిందని నమ్ముతున్నావా అని అడిగితే అమ్మ నమ్ముతుంది కదా బావ అని రోహిత్ అంటాడు. ఇంట్లో వాళ్లు ఎవరో దొంగతనం చేసి వాళ్లని కాపాడటానికి అంజలి ఇలా చేసిందని మనీష్ అనగానే అవును బావ అని రోహిత్ ఒప్పుకుంటాడు. ఏదైనా క్లూ దొరికితే చెప్పమని మనీష్ వెళ్తాడు. ఆ తర్వాత రాకీ వస్తాడు. బావ నీకు మనీష్ బావకి ఎంత తేడా ఉంది బావ.. అంజలిని కాపాడాలి అనుకుంటున్నాడు.. నువ్వు కాటేయాలి అనుకుంటున్నావని రోహిత్ అనడంతో రాకీ షాక్ అవుతాడు. మరోవైపు అంజలి బయట కూర్చుని ఉంటుంది. అప్పుడే గీత బయటకు వెళ్తుంది. తరువాయి భాగంలో వాటర్ వేస్ట్ అవుతున్నాయని గీత తన బ్యాగ్ పక్కన పెట్టి వాటర్ ఆఫ్ చేసి వెళ్తుంది. బ్యాగ్ మర్చిపోయి వెళ్తుంది. అంజలి ఆ బ్యాగ్ తీసుకుని వచ్చి ఇస్తుంది. ఏంటి ఇదంతా నీ ప్లానేనా, వాటర్ పోయేలా చేయడమని గీత అనుమానంగా తన బ్యాగ్ లో డబ్బు ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. అది చూసి అంజలి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Sep 30, 2026 10:07AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



.webp)







