Tomato Soup
టమాటో సూప్
కావలసిన పదార్ధాలు:
టమాటోలు - 250 గ్రాములు
బంగాళాదుంప - 1 చిన్నది
క్యారెట్ - 1 చిన్నది
బ్రెడ్ - 4 స్లైసులు
క్రీమ్ - 1/4 కప్పు
పంచదార - 2 స్పూన్స్
మిరియాలపొడి - 1/2 స్పూన్
వెన్న (బట్టర్) - 50 గ్రాములు
ఉప్పు - రుచికి తగినంత
నీరు - 300 ml
తయారుచేయు విధానం:
టమాటోలను శుభ్రంగా కడిగి క్రాస్ గా నాలుగు గాట్లు పెట్టి మరుగుతున్న నీటిలో వేసి 2 - 3 నిముషాలు ఉడికించాలి.
ఉడికిన టమాటో మీద తొక్క తీసి మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేయాలి.
బ్రెడ్ స్లైసులను సన్నని పీసెస్ గా కట్ చేసి బట్టర్ లో కర కరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
టమాటో గుజ్జు, బంగాళాదుంపల ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు, నీళ్ళు అన్నీ కలిపి సన్నని సెగమీద 10 నిముషాలు ఉడకనివ్వాలి.
నీటిని వార్చి పంచదార, మిరియాలపొడి వేసి 2 - 3 నిముషాలు మరగనివ్వాలి.
మరిగిన సూప్ని దించి సూప్ బౌల్ లోకి తీసుకొని 1 స్పూన్ క్రీమ్ వేసి, వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.