English | Telugu

Latest News

Bollywood News

ర‌వితేజ అయినా హిట్టిచ్చేనా!?

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన `మ‌జ్ను` చిత్రంతో తెలుగు తెర‌కు నాయిక‌గా ప‌రిచ‌య‌మైంది అను ఇమ్మాన్యుయేల్. తొలి సినిమాతోనే టాలీవుడ్ లో హిట్ కొట్టిన ఈ సుంద‌రి.. ఆపై `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`, `ఆక్సిజ‌న్`, `అజ్ఞాత‌వాసి`, `నా పేరు సూర్య‌`, `శైల‌జా రెడ్డి అల్లుడు`, `అల్లుడు అదుర్స్`, `మ‌హా స‌ముద్రం` వంటి చిత్రాల్లో సంద‌డి చేసింది. అయితే, వీటిలో ఏ ఒక్క‌టీ కూడా హిట్ లిస్ట్ లో చేర‌లేక‌పోయింది...

అమెజాన్ ప్రైమ్ లో 'ఏకమ్' సినిమా సంచలనం.. టాప్-10లో స్థానం!

ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై వరుణ్ వంశీని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం 'ఏకమ్'. 'ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్' అన్నది ఉప శీర్షిక. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం..

అద్దాలు తుడిచి క‌డుపు నింపుకున్న క‌మెడియ‌న్‌

సినీ ప‌రిశ్ర‌మ ఓ రంగుల ప్ర‌పంచం. ఇందులో కల‌ర్ ఫుల్ జీవితాలే కాదు.. కారు చీక‌ట్లో దుర్భ‌ర జీవితాన్ని అనుభవించి ఆ త‌రువాత అదృష్టం, కాలం, క‌ష్టం క‌లిసిరావ‌డంతో మంచి స్థాయికి వెళ్లిన వాళ్లు ఇండ‌స్ట్రీలో చాలా మంది వున్నారు. కోటి ఆశ‌ల‌తో సినీ రంగంలోకి ప్ర‌వేశించాల‌ని ఇళ్లు వ‌దిలి, పుట్టిన ఊరు విడిచి భాగ్య‌న‌గరానికి వ‌చ్చిన ఎంతో మంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొని ఆ త‌రువాత కృషితో పైకొచ్చిన పేరు తెచ్చుకున్న వారే. అలాంటి వ్య‌క్తుల్లో నేనూ ఒక‌డిని అంటున్నారు క‌మెడియ‌న్ స‌త్య‌.  

రుద్రాణి చెంప ప‌గ‌ల‌గొట్టిన సౌంద‌ర్య‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని నెల‌లుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్న ఈ సీరియ‌ల్ చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో సాగుతోంది. డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క ఇళ్లు వ‌దిలి, ఊరు వ‌దిలి తాడికొండ గ్రామం చేరిన విష‌యం తెలిసిందే. అక్క‌డ ఈ జంట‌కు రుద్రాణి రూపంలో క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. అయితే అలాంటి రుద్రాణికి ఈ మంగ‌ళ‌వారం ఎపిసోడ్ లో అదిరిపోయే షాక్ అగిలింది. ఏంట‌ది.. సౌంద‌ర్య ఎలా ఎంట‌రైంది? అన్న‌ది ఒక సారి చూద్దాం.

మెగాస్టార్ ఏప్రిల్ హిట్స్ లో `ఆచార్య‌` చేరుతుందా!?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా `ఆచార్య‌`. విజ‌నరీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందించిన ఈ సోష‌ల్ డ్రామాలో త‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరు. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 1న థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

`ఆచార్య‌`తో చ‌ర‌ణ్ స‌మ్మ‌ర్ హ్యాట్రిక్ కొట్టేనా!?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వెండితెర‌పై వినోదాలు పంచి మూడేళ్ళు దాటింది.  2019 సంక్రాంతికి విడుద‌లైన `విన‌య విధేయ రామ‌`తో చివ‌రిసారిగా సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎంటర్టైన్ చేశారీ కొణిదెల స్టార్. కాగా, ఈ ఏడాది `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు చ‌ర‌ణ్. వీటిలో `ఆచార్య‌` స‌మ్మ‌ర్ స్పెష‌ల్ గా ఏప్రిల్ 1న థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

'మానాడు' రీమేక్ లో రానా తమ్ముడు!

కోలీవుడ్ స్టార్ శింబు, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మానాడు'. టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 25న విడుదలై.. సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రెగ్నెంట్ గా స‌మంత‌!?

క‌థ‌ న‌చ్చాలే కానీ త‌ల్లి పాత్ర‌ల్లోనూ న‌టించేందుకు వెనుకాడ‌ని ఈత‌రం కథానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. ఆమ‌ధ్య `మ‌నం` (2014)లో అమ్మ‌గా మురిపించిన సామ్.. ఆపై త‌మిళ చిత్రం `తెరి` (తెలుగులో `పోలీస్`) (2016)లోనూ కాసేపు త‌ల్లిగా క‌నిపించింది. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో మరోమారు స‌మంత మ‌ద‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంద‌ట‌.

ఉగాదికి ప‌ట్టాలెక్క‌నున్న తార‌క్ కొత్త చిత్రం!

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ వెండితెర‌పై సంద‌డి చేసి మూడేళ్ళు దాటింది. 2018 ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`తో చివ‌రి సారిగా సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎంట‌ర్టైన్ చేశారు తార‌క్. ఆయ‌న కొత్త చిత్రం `ఆర్ ఆర్ ఆర్` అనివార్య కార‌ణాల వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతోంది. అన్నీ అనుకూలంగా ఉంటే.. ఈ సంక్రాంతికి `ఆర్ ఆర్ ఆర్` థియేట‌ర్స్ లో సంద‌డి చేసి ఉండేది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మ‌రోమారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా ప‌డింది. బ‌హుశా.. ఈ ఏడాది వేస‌విలో `ఆర్ ఆర్ ఆర్` విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముండొచ్చు.

సీనియ‌ర్ న‌టి కూడా 'ఊ' అంటావా.. అంటోంది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `పుష్ప ది రైజ్‌`. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ వర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా హిందీ వెర్ష‌న్ ఉత్త‌రాదిలో వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము దులిపేస్తోంది. ఊహించ‌ని స్థాయిలో ఆక్క‌డి ప్రేక్ష‌కులు `పుష్ప‌`కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక ఇందులో క్రేజీ స్టార్ స‌మంత చేసిన `ఊ అంటావా మావ ఊహూ అంటావా...` ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఇప్పుడు ఈ పాట‌కు చిన్నాపెద్దా అంతా చిందులేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. టీవీ ఆర్టిస్ట్ ల‌తో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు కూడా ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ వైర‌ల్ అవుతున్నారు.

అన‌సూయ‌తో హైప‌ర్ ఆది ప‌దివేల పూజ.. ఏంట‌ది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తోంది. ఇందులో వెయ్యి రూపాయ‌ల పూజ అంటూ హీరో, అత‌ని అసిస్టెంట్ చేసే హంగామా న‌వ్వులు పూయించింది. ఇదే స్క్రిట్ ని జ‌బ‌ర్ద‌స్త్ షో లో చేస్తే... ఇదే అద‌నుగా భావించి హైప‌ర్ ఆది అన‌సూయ‌పై పంచ్ లేస్తే... ఎలా వుంటుందో జ‌బ‌ర్ద‌స్త్ షో చూడాల్సిందే. ఇందులో హైప‌ర్ ఆది.. ఆనసూయ‌తో చేసే ప‌దివేల పూజ ఏంట‌న్న‌ది స‌స్పెన్స్...

ఈ స‌మాజం రేపిస్టుల‌ని ప్రేమిస్తోంది

వివాదాస్ప‌ద అంశాల‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా గ‌ళం విప్పే వాళ్లు చాలా త‌క్కువ మందే వుంటున్నారు. వాళ్ల‌లో ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు చిన్మ‌యి శ్రీ‌పాద‌. సింగ‌ర్ గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపుల‌ర్ అయిన సింగ‌ర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటోంది.

అక్క‌డ స‌మంత.. ఇక్క‌డ విష్ణు ప్రియ‌..

బుల్లితెర‌పై హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ`. గ‌త కొంత కాలంగా ఈ షో విభిన్న‌మైన కామెడీ స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటూ రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ కామెడీ షో ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ల‌కు ప్రసారం అవుతోంది.

బెడిసికొట్టిన లాస్య ప్లాన్‌! ప్రేమ్‌-శ్రుతి శోభ‌నం!!

న‌టి క‌స్తూరి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సీరియ‌ల్ `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి`. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్ రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోంది. ఈ శనివారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ప్రేమ్ - శృతిల‌ని బుక్ చేసి ఇంట్లో గొడ‌వ‌లు సృష్టించాల‌ని, తుల‌సికి మ‌నశ్శాంతి లేకుండా చేయాల‌ని లాస్య ప్లాన్ చేస్తుంది.. అయితే ఆ ప్లాన్ బెడికొట్టి ప్రేమ్ - శృతిల‌కు శోభ‌నం జ‌రిగేలా చేస్తుంది. 

సంక్రాంతి సినిమాల‌తో మూడుసార్లు ఉత్త‌మ న‌టుడిగా నిలిచిన వెంకీమామ‌!

తెలుగునాట అత్య‌ధిక `నంది` పుర‌స్కారాలు అందుకున్న క‌థానాయ‌కుడిగా ప్ర‌త్యేక గుర్తింపు పొందారు విక్ట‌రీ వెంక‌టేశ్. `క‌లియుగ పాండ‌వులు` (1986), `స్వ‌ర్ణ‌క‌మ‌లం` (1988), `ప్రేమ‌` (1989), `ధ‌ర్మ చ‌క్రం` (1996), `గ‌ణేశ్` (1998), `క‌లిసుందాం..రా!` (2000), `ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే` (2007) చిత్రాల‌కు గానూ ఏడుసార్లు `నంది` అవార్డులు సొంతం చేసుకున్నారు వెంకీ. 

జ‌న‌వ‌రి 14 స్పెష‌ల్.. ఒకే ఏడాదిలో ఒకేరోజున‌ బాల‌య్య‌, ప్ర‌భాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్!

ప్ర‌తీ సంక్రాంతి సీజ‌న్ లోనూ రెండు అంత‌కుమించి సినిమాలు విడుద‌ల‌వ‌డం స‌ర్వ సాధార‌ణ‌మే. అయితే, ఒకేరోజు విడుద‌లైన రెండు సంక్రాంతి చిత్రాలు ఆ యేటి మేటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా నిల‌వ‌డం అరుద‌నే చెప్పాలి. అలాంటి అరుదైన అంశానికి వేదిక‌గా నిలిచింది 2004 జ‌న‌వ‌రి 14. ఆ రోజు విడుద‌లైన రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ ముంగిట సెన్సేష‌న్స్ క్రియేట్ చేశాయి. ఆ చిత్రాలే.. `లక్ష్మీ న‌ర‌సింహా`, `వ‌ర్షం`.

జ‌న‌వ‌రి 15.. మ‌హేశ్ లాగే అశోక్‌కీ ప్ల‌స్స‌వుతుందా!

ఈ సంక్రాంతికి సంద‌డి చేస్తున్న తెలుగు సినిమాల్లో `హీరో` ఒక‌టి. `శ‌మంత‌క‌మ‌ణి`, `దేవ‌దాస్` చిత్రాల ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య రూపొందించిన‌ ఈ సినిమాతో గ‌ల్లా అశోక్ క‌థానాయ‌కుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు మేన‌ల్లుడు అనే ట్యాగ్స్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ యంగ్ హీరో.. జ‌న‌వ‌రి 15న త‌న మొద‌టి సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. 

ఆది కోసం కొట్టుకున్న రోజా, ఆమ‌ని.. ఏంటిది?

జ‌బ‌ర్ద‌స్త్ షో బుల్లితెర హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ వేదిక‌పై క‌మెడియ‌న్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. స‌మ‌యం చిక్కితే స్టార్ పై కూడా అదిరిపోయే పంచ్ లు వేస్తూ అద‌ర‌గొట్టేస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో పండ‌గ స్పెష‌ల్ ప్రోగ్ర‌మ్స్ అంటూ కొత్త కొత్త కాన్సెప్ట్ ల‌తో స‌రికొత్త ఎపిసోడ్ ల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. 

ఈద్ స్పెష‌ల్ః ఇక్క‌డ `ఎఫ్ 3`.. అక్క‌డ `హీరోపంతి 2`!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ ఏడాది సీక్వెల్ మూవీస్ సంద‌డి కాస్త ఎక్కువ‌గానే క‌నిపించ‌బోతోంది. తెలుగు, క‌న్న‌డ‌, హిందీ.. ఇలా ప‌లు భాష‌ల్లో ఈ త‌ర‌హా చిత్రాలు వెండితెర‌పై వినోదాలు పంచ‌నున్నాయి. అయితే, ఒకే తేదిన తెలుగులో ఓ సీక్వెల్, హిందీలో ఓ సీక్వెల్ రాబోతోంది. అది కూడా.. ఈద్ స్పెష‌ల్ గా ఈ మూవీస్ ఎంట‌ర్టైన్ చేయ‌నున్నాయి....

'జై భీమ్'కు అరుదైన గౌరవం

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధానపాత్రలో నటించిన సినిమా 'జై భీమ్'. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా 'జై భీమ్' సినిమా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.

'అల వైకుంఠ‌పుర‌ములో' హిందీ వెర్ష‌న్ ఫ‌స్ట్ లుక్ ఇదే!

2020 సంక్రాంతికి విడుద‌లై అప్ప‌టికి అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' చిత్రం. త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. బ‌న్నీ-పూజా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వండ‌ర్స్ క్రియేట్ చేసింది. వారిపై చిత్రీక‌రించిన పాట‌ల‌న్నీ చార్ట్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా "బుట్ట‌బొమ్మ‌", "సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌", "రాములో రాములా" పాట‌లు అంద‌రి పెదాల‌పై ఇప్ప‌టికీ నాట్యం చేస్తూనే ఉన్నాయి.

ఫ‌రియా ఫెస్టివ‌ల్ హ్యాట్రిక్ !

`జాతిరత్నాలు`లో చిట్టిగా త‌న క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసింది తెలుగమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. మొద‌టి సినిమాతోనే మెమ‌ర‌బుల్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంది. ఆపై వెంట‌నే మ‌రే చిత్రంలోనూ నాయిక‌గా క‌నిపించ‌ని ఫరియా.. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో మాత్రం స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇచ్చింది. ఆ సినిమాలే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`, `బంగార్రాజు`....  

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. 'గబ్బర్ సింగ్' తర్వాత ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'. ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఎన్టీఆర్ న‌టించగా రూ. 4.5 ల‌క్ష‌ల‌తో త‌యారైన‌ టాలీవుడ్‌ ఫ‌స్ట్ స‌స్పెన్స్ ఫిల్మ్ ఇదే!

న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీ రామారావు తన న‌ట జీవితంలో వైవిధ్య‌భ‌రిత‌మైన ఎన్నో ర‌కాల పాత్ర‌లు పోషించారు. భిన్న త‌ర‌హా సినిమాలెన్నో చేశారు. అలాంటి వాటిలో 1963లో వ‌చ్చిన 'ల‌క్షాధికారి' సినిమా ఒక‌టి. ఇది ఎన్టీఆర్ చేసిన తొలి స‌స్పెన్స్ ఫిల్మ్ కావ‌డం విశేషం. ఈ సినిమాతోటే త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆయ‌న నేటి త‌రానికి తెలిసిన ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ తండ్రి. ర‌వీంద్ర ఆర్ట్ పిక్చ‌ర్స్ అంటే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. 

విష్ణు, వరుణ్ త‌రువాత మ‌హేశ్ తో..!?

గ‌త ఏడాది ఆగ‌స్టు 11తో 60 క్ల‌బ్ లోకి చేరిన బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి.. ఈ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 11తో న‌టుడిగా 30 వ‌సంతాలు పూర్తిచేసుకోబోతున్నారు. ఈ ప్ర‌యాణంలో కేవ‌లం హిందీ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, మ‌రాఠీ, ఆంగ్ల భాషా చిత్రాల‌తో పాటు తెలుగులోనూ సంద‌డి చేశారు సునీల్ శెట్టి.

క్రేజీ కాంబో.. తారక్ సరసన రష్మిక!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మ‌హేశ్‌కి సిస్ట‌ర్ గా సాయిప‌ల్ల‌వి?

`ల‌వ్ స్టోరి`, `శ్యామ్ సింగ రాయ్` చిత్రాల‌తో గ‌త ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వి. త్వ‌ర‌లో ఆమె క‌థానాయిక‌గా న‌టించిన `విరాట ప‌ర్వం` విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

తగ్గేదేలే.. హిందీలో మరో సినిమాతో బన్నీ సందడి!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'. డిసెంబర్ 17 న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా హిందీలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ తో సత్తా చాటింది.

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టికి కరోనా

సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, కీర్తి సురేష్, త్రిష, మీనా ఇలా ఎందరో కరోనా బారిన పడగా.. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

జ‌గ‌ప‌తిబాబుని తిట్టిన స్టార్ హీరో

ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి శోభ‌న్ బాబు త‌రువాత ఆ స్థాయి హీరోగా ఆరాధ్య న‌టుడిగా పేరు తెచ్చుకున్న‌హీరో జ‌గ‌ప‌తిబాబు. `శుభ‌ల‌గ్నం`, మావిడాకులు వంటి చిత్రాల‌కు మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు చేరువైన జ‌గ‌ప‌తిబాబు `లెజెండ్‌` సినిమాతో విల‌న్ గా మారిన విష‌యం తెలిసిందే.

'బంగార్రాజు' దూకుడు.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన సినిమా 'బంగార్రాజు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైన బంగార్రాజు సినిమా మొదటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ష‌న్ను - దీప్తి బ్రేక‌ప్‌పై సిరి షాకింగ్ కామెంట్స్‌

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 5 ముగిసి దాదాపు నెల రోజుల కావ‌స్తోంది. అయినా దీని ప్ర‌కంపన‌లు ఇంకా వినిపిస్తూనే వున్నాయి. వీజే స‌న్నీ ఈ సీజ‌న్ విజేత‌గా నిలిస్తే, ర‌న్న‌ర‌ప్ గా ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్ నిలిచారు. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ లో ష‌న్ను - సిరిలు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.. హ‌గ్గులు, కిస్సుల‌తో వెగ‌టు పుట్టించే వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేశారు. వీక్ష‌కుల‌తో పాటు వారి పేరెంట్స్ కు కూడా వీరి చేష్ట‌లు చిరాకు తెప్పించాయి. దీంతో వీరి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది.

నువ్వు చీపురు ప‌ట్టుకుంటే, చీపురుకే అందం వ‌స్త‌ది!

బుల్లితెర‌పై కొత్త కొత్త జంట‌లు పాపుల‌ర్ అయిపోతున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ తో ర‌ష్మీ, సుడిగాలి సుధీర్ పాపుల‌ర్ అయిపోతే `కామెడీ స్టార్స్` తో ఎక్స్‌ప్రెస్ హ‌రి - అషురెడ్డి క్రేజీ జంట‌గా పేరు తెచ్చుకున్నారు. ఓంకార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ కామెడీ షోలో వీరిద్ద‌రు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఓ స్కిట్ లో ఏకంగా చెస్ట్ పై అషురెడ్డి పేరుని టాటూగా వేసుకుని షాకిచ్చాడు హ‌రి. త‌ను చేసిన ప‌నికి అషురెడ్డి కూడా ఒక్క‌సారిగా షాక్ కు గురైంది.

రష్మీ ఊ.. అంటే ఊహూ.. అంటారా?

ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ర‌ష్మీ గౌత‌మ్ ఏ స్థాయిలో పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఆ స్టేజ్ పై ఆమె మెరుపులు మెరిపిస్తున్నారు. త‌నదైన మార్కు యాంక‌రింగ్ తో మెస్మ‌రైజ్ చేస్తున్నారు. ర‌ష్మీకి తోడు సుడిగాలి సుధీర్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే గ‌త కొన్ని రోజులుగా సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్ ల కార‌ణంగా ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లో క‌నిపించ‌డం లేదు. అయినా ర‌ష్మీ జోరు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.  

దీప్తి-ష‌న్ను రిలేష‌న్‌షిప్‌పై గుడ్ న్యూస్ చెప్పిన ష‌ణ్ముఖ్ ఫాద‌ర్‌!

బిగ్‌ బాస్ సీజ‌న్ 5 ముగిసింది కానీ దాని వ‌ల్ల కొంత మంది జీవితాల్లో ఏర్ప‌డిన క‌ల‌త‌లు ఇంకా తీర‌డం లేదు. మ‌రీ ప్ర‌ధానంగా ఈ షో వ‌ల్ల పొందిన దానికంటే న‌ష్ట‌పోయింది షన్ను, దీప్తి. దీప్తికి నేరుగా షోతో సంబంధం లేకపోయినా ష‌న్ను కార‌ణంగా వార్త‌ల్లో నిలిచింది. ఈ ఇద్ద‌రూ గ‌త ఐదేళ్లుగా ప్రేమ‌లో మునిగితేలారు. అయితే ఇటీవ‌ల బిగ్‌బాస్ షో కార‌ణంగా వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింది. అది చివ‌రికి  బ్రేక‌ప్ చెప్పుకునేంత వ‌ర‌కు వెళ్లింది.  

'రావ‌ణాసుర‌'కు క్లాప్ కొట్టిన చిరు!

మాస్ మ‌హారాజా ర‌వితేజ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'రావ‌ణాసుర' మూవీ షూటింగ్ శుక్ర‌వారం అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ర‌వితేజ‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కెమెరా స్విచ్చాన్ చేయ‌గా, డైరెక్ట‌ర్లు గోపీచంద్ మ‌లినేని, కె.ఎస్‌. ర‌వీంద్ర సంయుక్తంగా గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం అందించారు. 

Short Films

Movie Reviews

Latest News

Video-Gossips


Gallery

ఆదిత్య రావ‌డం దేవి గ‌మ‌నించిందా?

 గ‌త ఎపిసోడ్ లో మాధ‌వ వెళ్ల‌గానే ఇంటికి వ‌చ్చిన ఆదిత్యతో రాధ మీరు ఎవ‌రు అస‌లు? దేవిపై మీకున్న హ‌క్కు ఏంటీ? అని నిల‌దీయ‌డంతో పాటు దేవితో కూడా `మీరు నా కోసం రావ‌ద్దు సారు` అని చెప్పించి షాకిస్తుంది. దాంతో ఆదిత్య గుండెలు ప‌గిలేలా ఏడుస్తాడు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ఈ రోజు 44వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో.. ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం.

విడాకులు సంగీత్ తో సెలెబ్రేట్ చేసుకోవాలి

సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. విషయం ఏదైనా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా సెలెబ్రిటీల విడాకుల పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌మాదంలో జాన‌కి.. ఏం జ‌రగ‌బోతోంది?

`స్టార్ మా`లో ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `జాన‌కి క‌ల‌గ‌న‌లేదు`. న‌టి రాశి తొలిసారి బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చిన సీరియ‌ల్ ఇది కావ‌డం, ఇందులో ఆమె అత్త‌గా న‌టిస్తుండ‌టంతో ఈ సీరియ‌ల్ పై మ‌హిళా ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. గ‌త కొన్ని వారాలుగా ఆక‌ట్టుకుంటున్న ఈ సీరియ‌ల్‌ ఈ మంగ‌ళ‌వారం స‌రికొత్త మ‌లుపు తిర‌గ‌బోతోంది. ఈ రోజు 218వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ సంద‌ర్‌భంగా ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోనున్నాయి? .. ఎలాంటి మ‌లుపులు తిర‌గ‌బోతోంది అన్న‌ది ఒక‌సారి చూద్దాం.  

ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య మ‌ధ్య‌ ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో తెలుసా?

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్‌, ఆయ‌న భార్య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ త‌మ 18 సంవ‌త్స‌రాల వైవాహిక బంధానికి స్వ‌స్తిచెప్పి ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో పాటు వారి అభిమానుల‌నంద‌ర్నీ షాక్‌కు గురిచేశారు. ఐశ్వ‌ర్య‌తో విడిపోతున్న‌ట్లు త‌న సోష‌ల్‌మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన ఓ నోట్‌తో ధ‌నుష్ వెల్ల‌డించాడు. వారిది ప్రేమ వివాహం. 2004లో ఏడ‌డుగులు న‌డిచిన ఆ ఇద్ద‌రూ ఇప్ప‌టివ‌ర‌కూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తున్న‌ట్లు క‌నిపించారు. 

 `బంగార్రాజు`.. హ్యాట్రిక్స్ ఎన్నో!

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన విలేజ్ డ్రామా `బంగార్రాజు` పొంగ‌ల్ విన్న‌ర్ గా నిలిచింది. ఫ‌స్ట్ వీకెండ్ లో ఓపెనింగ్స్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. అన్నీ అనుకూలిస్తే అటు కింగ్ నాగార్జున‌, ఇటు యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య కి కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ కావ‌చ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

షాకింగ్.. హీరో ధనుష్‌, ఐశ్వర్య విడాకులు

సినీ సెలబ్రిటీలు నాగ చైతన్య, సమంత విడాకుల ప్రకటన వార్త పూర్తిగా మరవకముందే మరో సినీ జంట విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ ధనుష్, అతని భార్య ఐశ్వర్య  తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించారు. 

సిక్స్ కొట్ట‌బోతున్న పూజా హెగ్డే!

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే వెండితెర‌పై మెరిసి ఈ ఏడాది ఆగ‌స్టు 31కి ప‌దేళ్ళు. ఇంత‌చేసి ఇప్ప‌టివ‌ర‌కు పూజ నాయిక‌గా సంద‌డి చేసిన సినిమాల సంఖ్య‌.. కేవ‌లం డ‌జ‌ను మాత్ర‌మే. అయితే, ఈ ఏడాది మాత్రం మిస్ హెగ్డేకి ఎంతో ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. అన్నీ అనుకూలిస్తే ఈ ఒక్క క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లోనే ఏకంగా సిక్స్ కొట్టేందుకు సిద్ధమైంది ఈ `డీజే` బ్యూటీ.

`బీస్ట్` రిలీజ్ డేట్.. ఆమిర్, య‌శ్ తో విజ‌య్ క్లాష్!?

`మాస్ట‌ర్` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత కోలీవుడ్ స్టార్ విజ‌య్ నుంచి రాబోతున్న సినిమా `బీస్ట్`. `డాక్ట‌ర్` ఫేమ్ నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే క‌థానాయిక‌. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది.

'వారియర్'గా మారిన ఉస్తాద్ రామ్!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొంతకాలంగా మాస్ సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మాస్ కి దగ్గరైన రామ్ అప్పటినుంచి తన రూట్ మార్చాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అభిమానిని భోజ‌నానికి ఇంటికి ఆహ్వానించిన ర‌వి!

యాంక‌ర్ ర‌వి బిగ్‌బాస్ సీజ‌న్ 5 లో టాప్ 5లో వుంటాడ‌ని అంతా ఊహించారు కానీ అనూహ్యంగా ఎలిమినేట్ కావడం చాలా మందిని షాక్ కు గురిచేసింది. ర‌వి ఏంటీ ఎలిమినేట్ కావ‌డం ఏంటీ? దీని వెన‌క పెద్ద కుట్ర జ‌రిగింద‌ని అత‌ని అభిమానులు పెద్ద ర‌చ్చ చేశారు. ఇక ఇదే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌ని, త‌న ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్ లు చేసిన వారిపై ర‌వి పోలిస్ కంప్లైంట్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

'బిల్డప్ బాబాయ్'లా మారిపోయిన 'జాతిరత్నం'

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి.. 'జాతి రత్నాలు' సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. నవీన్ కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు నవీన్.

కామెడీ స్టార్స్ ధ‌మాకా.. త‌గ్గేదేలే: నాగ‌బాబు

జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్  గ‌త కొన్నేళ్లుగా హాస్య ప్రియుల్ని న‌వ్విస్తూ అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ కాస్త `ఎక్స్ ట్రా జ‌బ‌ర్వ‌స్త్‌`గా మారిపోయింది. ఎంట‌ర్‌టైన్ మ‌రింత డోస్ పెంచేసింది. అంతే కాకుండా `శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ` కూడా కామెడీ స్కిట్ ల‌తో ఆక‌ట్టుకుంటోంది.

'ఆచార్య' కొత్త విడుదల తేదీ.. మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది.

'హీరో'తోనైనా సాలిడ్ హిట్ కొడ‌తాడా!

విభిన్న ప్ర‌య‌త్నాల‌తో ముందుకు సాగుతున్న యువ ద‌ర్శ‌కుల్లో శ్రీ‌రామ్ ఆదిత్య ఒక‌రు. 2015 క్రిస్మ‌స్ స్పెష‌ల్ గా విడుద‌లైన `భ‌లే మంచి రోజు`(సుధీర్ బాబు క‌థానాయ‌కుడు)తో ద‌ర్శ‌కుడైన శ్రీ‌రామ్.. ఆపై `శ‌మంత‌క‌మ‌ణి` (2017), `దేవ‌దాస్` (2018) చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు. అయితే, వీటిలో ఓ ఒక్క‌టీ కూడా హిట్ స్టేట‌స్ కి చేరుకోలేక‌పోయింది. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిష‌న్, ఆది సాయికుమార్ కాంబినేష‌న్ లో రూపొందిన‌ `శ‌మంత‌క‌మ‌ణి` ఫ‌ర్లేద‌నిపించ‌గా.. 

రుద్రాణికి వంట‌ల‌క్క స్ట్రాంగ్ వార్నింగ్‌

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `కార్తీక దీపం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా సాగుతున్న ఈ సీరియ‌ల్ రేటింగ్ ప‌రంగానూ టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ శుక్ర‌వారం 1249వ ఎపిసోడ్ లోకి ఎంట‌ర్ కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో చూద్దాం. త‌న‌ పిల్ల‌ల జోలికి రావ‌ద్దంటూ రుద్రాణికి వంట‌ల‌క్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.