కె.వి.రెడ్డి శిష్యుడిగా మొదలై లెజెండరీ డైరెక్టర్‌గా.. సింగీతం సినీ ప్రస్థానం.!
తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగం అనే మాట వినిపించిన ప్రతిసారీ గుర్తొచ్చే పేర్లలో సింగీతం శ్రీనివాసరావు పేరు ముందుంటుంది. 1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో జన్మించిన ఆయన.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే కళలు, సాహిత్యం, సినిమాలపై ఆసక్తి పెంచుకున్న సింగీతం.. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గర అసోసియేట్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘పాతాళ భైరవి’, ‘మాయాబజార్’ వంటి అద్భుతాలను తెరకెక్కించిన కె.వి.రెడ్డి వద్ద పనిచేయడం ఆయన ఆలోచనా విధానంపై ఎంతో ప్రభావం చూపింది. అనంతరం కన్నడలో ‘సంస్కార’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. చివరకు 1970లో ‘నీతి నిజాయితీ’తో దర్శకుడిగా తన తొలి అడుగు వేశారు. దర్శకుడిగా మారిన తర్వాత సింగీతం ఒకే తరహా కథలకు పరిమితం కాలేదు. ‘అమెరికా అమ్మాయి’, ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘పంతులమ్మ’, ‘తరం మారింది’, ‘మయూరి’ వంటి చిత్రాలతో తనలోని విభిన్న కోణాలను చూపించారు. ముఖ్యంగా 1987లో వచ్చిన ‘పుష్పక విమానం’ ఆయన కెరీర్లోనే కాదు.. భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దాదాపు డైలాగులు లేకుండా కేవలం విజువల్స్, నటన, సంగీతం, సౌండ్‌తో కథను చెప్పిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కమల్ హాసన్, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక సింగీతం కెరీర్లో మరో మైలురాయి ‘ఆదిత్య 369’. 1991లో వచ్చిన ఈ సినిమా టైమ్ ట్రావెల్, చరిత్ర, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి తెలుగు ప్రేక్షకులకు అప్పట్లోనే ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఆ తర్వాత ‘భైరవ ద్వీపం’తో జానపద ఫాంటసీని మరో స్థాయిలో చూపించారు. ‘మయూరి’ వంటి బయోపిక్ తరహా కథను తెరకెక్కించడంతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేశారు. ‘దిక్కత్ర పార్వతి’ చిత్రానికి జాతీయ అవార్డు అందుకోగా.. ‘పుష్పక విమానం’కు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. ‘మయూరి’కి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడి అవార్డు, ‘పుష్పక విమానం’కు కన్నడ విభాగంలో ఫిల్మ్‌ఫేర్ అవార్డు సహా పలు పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. వ్యక్తిగత జీవితానికి వస్తే.. సింగీతం శ్రీనివాసరావు భార్య లక్ష్మీ కల్యాణి. అయితే ఆమె ఇప్పటికే కన్నుమూశారు. సింగీతం వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా ప్రచారంలోకి తీసుకురాకుండా ఎక్కువగా సినిమాలకే తన సమయాన్ని కేటాయించారు. వయసు 90 దాటిన తర్వాత కూడా ఆయనలో సినిమా మీద ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. 2026లో 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. దశాబ్దం విరామం తర్వాత మళ్లీ సినిమా చేయడం సినిమా పట్ల ఆయనకు ఉన్న తపనకు నిదర్శనంగా నిలిచింది. దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, కామెడీ, బయోపిక్, ప్రయోగాత్మక చిత్రాలు.. ఇలా ఎన్నో జానర్లను టచ్ చేసిన సింగీతం.. తెలుగు సినిమా ప్రయోగాలకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన దర్శకుడిగా నిలిచిపోయారు. [Singeetam Srinivasa Rao Biography, Singeetam Srinivasa Rao Life Story, Singeetam Srinivasa Rao Movies, Singeetam Srinivasa Rao Career, Singeetam Srinivasa Rao Family, Singeetam Srinivasa Rao Awards, Pushpaka Vimanam Director, Aditya 369 Director, Bairava Dweepam Director, Legendary Telugu Directors]
Oct 3, 2026 11:38PMసింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ.. తెలుగు సినిమాకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన ఈ లెజెండరీ దర్శకుడు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 3న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు మాత్రమే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. సింగీతం అంటేనే ప్రయోగాలకు మరో పేరు.. సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే చిత్రాల్లో ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘మయూరి’, ‘సొమ్మొకడిది సోకొకడిది’ వంటి సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి డైలాగులు లేకుండా తెరకెక్కించిన ‘పుష్పక విమానం’, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ‘ఆదిత్య 369’ ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడతాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. కథను కొత్తగా చెప్పడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. ఇక సింగీతం శ్రీనివాసరావు కెరీర్లో ఎన్నో అవార్డులు, గౌరవాలు కూడా ఉన్నాయి. ‘పుష్పక విమానం’ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగా.. ‘మయూరి’కి పలు నంది అవార్డులు దక్కాయి. ‘భైరవ ద్వీపం’కు ఆయనకు నంది ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. వయసు 94 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా సినిమా మీద తన ఆసక్తిని మాత్రం ఆయన వదులుకోలేదు. 2026లోనే దాదాపు పదేళ్ల విరామం తర్వాత మరో సినిమాకు దర్శకత్వం వహించేందుకు మెగాఫోన్ పట్టారు. ఈ వయసులోనూ సినిమా తీయడానికి సిద్ధపడటం అప్పట్లో సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. సినిమాను కేవలం వినోదంగా కాకుండా ఒక ప్రయోగశాలగా భావించి.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన తీసిన ఎన్నో సినిమాలు విడుదలైన సమయంలోనే కాకుండా.. సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా క్లాసిక్స్‌గా నిలిచాయి. అలాంటి అరుదైన దర్శకుడు ఇక లేరనే వార్తతో సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఆయన మృతి తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయానికి ముగింపు పలికినట్టుగా భావిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Oct 3, 2026 11:25PM
ఈ తెలుగు సినిమా చూడండి: ఫ్రీగా మేఘాలయ ట్రిప్ కొట్టేసే బంపర్ ఆఫర్!
ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ ఈ వర్డ్ ని ఇష్టపడని వారంటూ ఈ భూమ్మీద ఉండరు. జూలో జంతువులు సైతం ప్లీజ్.. ఎక్కడ.. ఫ్రీ, మీకు పుణ్యం ఉంటుంది చెప్తారా అని కాళ్లవేళా పడే పరిస్థితి. ఫ్రీ అనే వర్డ్ అంత సమ్మోహతని దాచుకుంది. మరి ఇప్పుడు ఒక సినిమా నన్ను చూసి మేఘాలయ ట్రిప్ ఫ్రీ గా వెళ్లండని అంటుంది. అదేంటో చూద్దాం అగ్ర దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రీసెంట్ గా కొత్త తరం క్రైమ్ కామెడీ చిత్రం 'బా బా బ్లాక్ షీప్' ట్రైలర్ ఘనంగా విడుదలయ్యింది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొణెపూడి నిర్మాణంలో గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌తోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నే మేకర్స్ ఏకంగా ఉచిత మేఘాలయ ట్రిప్ ఆఫర్‌ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆఫర్ ప్రకారం, 'బా బా బ్లాక్ షీప్' సినిమాకు సంబంధించి నిర్వహించే ఒక కాంటెస్ట్‌లో పాల్గొని గెలుపొందిన మొత్తం 10 మంది అదృష్టవంతులకు ఉచితంగా మేఘాలయ పర్యటనకు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నిర్మాత వేణు దొణెపూడి అధికారికంగా వెల్లడించారు. మేఘాలయలోని అద్భుతమైన లొకేషన్లలో పూర్తి స్థాయిలో చిత్రీకరించిన ఈ సినిమా చూడటంతో పాటు, ప్రేక్షకులకు స్వయంగా ఆ అందాలను వీక్షించే అవకాశం దక్కడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇది కూడా చదవండి: ఫ్యాన్ వార్స్: ఎవరి కోసం..స్నేహం వర్సెస్ సోషల్ మీడియా వేధింపులు మరి మేఘాలయ అందాలు చూడాలంటే అక్టోబర్ 9న మీ అభిమాన థియేటర్ లో బా బా బ్లాక్ షీప్ చూసేయండి. [Baa Baa Black Sheep Movie Offer, Baa Baa Black Sheep Trailer, Nag Ashwin Release Baa Baa Black Sheep, Meghalaya Trip Offer, Chitralayam Studios, Baa Baa Black Sheep Movie, Upendra Limaye, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 7:11PM
ఫ్యాన్ వార్స్: ఎవరి కోసం..స్నేహం వర్సెస్ సోషల్ మీడియా వేధింపులు
అభిమానులు.. వీరాభిమానులు..కామన్ ఆడియెన్స్ కి ఆ రెండు కేటగిరిలు థియేటర్ లో మస్తు మాజాని ఇస్తారు. హీరోకి మాత్రం దేవదూతలు అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కాదనే సాహసం ఎవరు చెయ్యలేరు. కానీ ఒక విషయంలో ఆ రెండు జోనర్స్ ని నింపుకున్న వాళ్లపై డౌట్ కొడుతూ ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో హీరోల నడుమ ఉండే అనుబంధానికి, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అభిమానుల వివాదాలకి నడుమ తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ హీరోలందరూ వ్యక్తిగతంగా ఎంతో ఆప్యాయంగా, క్లోజ్ ఫ్రెండ్స్‌గా మెలుగుతుంటారు. పండగలు, వేడుకలు, పార్టీలు లేదా సినిమా ప్రమోషన్లలో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పరస్పర గౌరవంతో నవ్వుతూ కరచాలనం చేసుకోవడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ, ఇంటర్నెట్ వేదికలపై మాత్రం వారి అభిమానుల మధ్య జరుగుతున్న సైబర్ యుద్దాలు రోజురోజుకూ సరిహద్దులు దాటుతున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ అసోసియేషన్ల నడుమ పెరిగిపోతున్న ఈ వికృత సంస్కృతిపై పలువురు సినీ విశ్లేషకులు, స్వయంగా అగ్ర కథానాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆన్లైన్ సైబర్ పోరులో అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే... ఎడిటింగ్ యాప్‌లు, ఏఐ టెక్నాలజీ (AI tools) ద్వారా ప్రత్యర్థి హీరోల ముఖాలను మార్ఫింగ్ చేయడం. ఒక హీరో కుటుంబాన్ని లేదా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా వికృతమైన మీమ్స్ తయారు చేయడం, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు రుద్దడం రోజువారీ పరిపాటిగా మారింది. తమ అభిమాన నటుడి సినిమా కలెక్షన్లను పెంచి చూపిస్తూ, వేరే హీరో సినిమా రికార్డులను తక్కువ చేసి చూపే క్రమంలో ఈ నెగెటివిటీ వందల శాతం ముదిరిపోతోంది. ఒకప్పుడు కేవలం థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు, పోస్టర్ల గొడవలతో ముగిసే ఫ్యాన్ వార్స్, నేడు సోషల్ మీడియా వేదికగా బూతులు, మార్ఫింగ్ మార్ఫింగ్ ఫోటోలతో హద్దులు మీరుతుండటం టాలీవుడ్ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. ఇది కూడా చదవండి: ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ కల్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్: ఏ సినిమాకి షాక్! ఈ పరిణామాలపై టాలీవుడ్ ప్రముఖులు సైతం ఘాటుగానే స్పందిస్తున్నారు. ఆన్లైన్ ట్రోలింగ్, ఆక్రోశం వల్ల ఏ ఒక్కరికీ ప్రయోజనం లేదని, అభిమానం అనేది సేవా కార్యక్రమాలు మరియు క్రమశిక్షణలో కనిపించాలే తప్ప పక్కవారిపై విషం చిమ్మడంలో కాదని హీరోలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం ఏంటంటే మనం మన హీరోని అభిమానించనట్టే అవతలి వాళ్ళు కూడా తమ హీరోని అభిమానిస్తుంటారు. అది సినీసృష్టిలో దాగి ఉన్న రహస్యం. అందరు ఉంది సినిమాని బతికించడానికి, ఎదిగేలా చెయ్యడానికి. [Tollywood Fan Wars Social Media Morphing, Tollywood Fan Wars, Social Media Morphing Telugu Cinema, Toxic Fandom Tollywood, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 6:49PM
ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ కల్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్: ఏ సినిమాకి షాక్!
ఈ సారి మాత్రం పక్కా బాక్స్ ఆఫీస్ బద్దలే.. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదబ్బా అంటూ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'కల్ట్' ని ముస్తాబు చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, కథ మరియు స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో అభిమానులు, సినీ ప్రియులు, సినీ సర్కిల్స్ లో మోస్ట్ అవేటెడ్ ప్రొజెక్ట్ గా మారింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఇప్పటివరకు రాని ఒక సరికొత్త తరహా 'స్లాషర్ థ్రిల్లర్' (Slasher Thriller) జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగంగా జరుపుకుంటోంది. తారక్ సినిమాస్ మరియు వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై సందీప్ కాకరాల, కరాటే రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వైవిధ్యమైన చిత్రాన్ని రాబోయే అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ప్రకటన నాటి నుంచే ఫిలిం నగర్ వర్గాల్లోనూ, విశ్వక్ అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రత్యేక రిలీజ్ డేట్ ప్రోమో మరియు 45 నిమిషాల గ్లింప్స్ మేకర్స్ సృష్టించిన డార్క్ వరల్డ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించాయి. రక్తంతో తడిసిన గొడ్డలి చేతపట్టుకుని తీవ్రమైన ఆవేశంతో ఉన్న విశ్వక్ సేన్ రౌద్ర రూపం ప్రేక్షకుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తన కెరీర్లో మొదటిసారిగా విశ్వక్ సేన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపిస్తుండటం ఈ చిత్రానికి అతిపెద్ద విశేషం. గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి మరో పవర్ ఫుల్ ప్లస్ పాయింట్ ఏమిటంటే, క్లోజ్ ఫ్రెండ్ మరియు ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి సంభాషణలు అందించగా, కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ గూస్బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సంగీతాన్ని సమకూర్చారు. కెమెరామెన్ అరవింద్ విశ్వనాథన్ తన మార్క్ ఛాయాగ్రహణంతో విజువల్స్ అందించగా, ఎడిటర్ రవి తేజా గిరిజాలా, ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ ములే ఎంతో శ్రమించి అద్భుతమైన డార్క్ సెట్స్ నిర్మించారు. ఇది కూడా చదవండి: చరణ్, సుకుమార్ RC17 షాకింగ్ డెడ్‌లైన్! దేశంలోనే మొదటి గ్లోబల్ స్లాషర్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ చిత్రాన్ని 'ఆర్-రేటెడ్' (R-Rated) కంటెంట్‌తో విడుదల చేస్తున్నారు. కేవలం తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్, జాపనీస్, స్పానిష్‌లతో సహా మొత్తం 5 విభిన్న భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. కల్ట్ మూవీ ఇండియన్ సినిమాలో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తుందని, యాక్షన్ ప్రియులకు అక్టోబర్ 30న థియేటర్లలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అల్టిమేట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుందని చిత్ర బృందం ధీమాలో ఉంది. [Vishwak Sen Cult release date, Cult Telugu movie shooting update, Vishwak Sen R rated slasher thriller, Cult movie October 30 release, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 6:25PM
చరణ్ సుకుమార్ RC17 షాకింగ్ డెడ్‌లైన్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ ల మూవీ దసరా రోజు స్టార్ట్ కాబోతుందనే న్యూస్ అయితే సినీ సర్కిల్స్ లో ఒక రేంజ్ లోనే చక్కరకొడుతుంది.సినీ క్లైమెట్ కూడా అందుకు తగ్గట్టే ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని విషయాల కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజా న్యూస్ ఒకటి వైరల్ హోదాలో జోష్ ని తీసుకొచ్చింది. సాధారణంగా సుకుమార్ మూవీ అనగానే ఎంతో నిడివి, సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్స్ గుర్తుకొస్తాయి. ఆయన గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూస్తే.. 2017 ఏప్రిల్‌లో ప్రారంభమైన 'రంగస్థలం' షూటింగ్ దాదాపు ఏడాదికి పైగా సమయం తీసుకుంది. ఇక 'పుష్ప 1' ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందడంతో కోవిడ్ మరియు ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. ఆ తర్వాత వచ్చిన 'పుష్ప 2' షూటింగ్ అయితే 2022లో ప్రారంభమై, సుదీర్ఘంగా సాగి 2024 నవంబర్ వరకు దాదాపు 2 సంవత్సరాల పైనే సమయాన్ని తీసుకుంది. స్క్రిప్ట్ విషయంలో, అలాగే ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దడంలో సుకుమార్ ఎంత సమయమైనా కేటాయిస్తారు. కానీ 'RC17' విషయంలో మాత్రం ఒక అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్లో ఎంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక కఠినమైన డెడ్‌లైన్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను రాబోయే డిసెంబర్ నాటికి పట్టాలెక్కించి, కేవలం 12 నెలల వ్యవధిలోనే.. అంటే సరిగ్గా 2027 డిసెంబర్ నాటికి షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటినీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. ఇది కూడా చదవండి: రెండు వారాల గ్యాప్‌లో: రెండు పాన్ ఇండియా సినిమాలు.. ప్లస్సా? నిర్మాతలకి రిస్కా! ఇలాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కేవలం 12 నెలల పక్కా టైమ్‌ఫ్రేమ్‌లో పూర్తి చేయాలని భావించడం సుకుమార్ స్టైల్‌కి పూర్తి భిన్నమైనదని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రతి పాత్ర, విజువల్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే ఆయన, ఈ 12 నెలల డెడ్‌లైన్‌ను అందుకోగలరా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.ఏది ఏమైనా సబ్జెక్ట్ గా పక్కాగా ఉండి మైండ్ లో టార్గెట్ ఫిక్స్ అయితే పెద్ద కష్టమేమి కాదు. [Rc17 Update, Rc17 Shooting Deadline Target, Ram Charan, Sukumar, RC17 shooting deadline, RC17 movie update]
Oct 3, 2026 5:53PM
రెండు వారాల గ్యాప్‌లో: రెండు పాన్ ఇండియా సినిమాలు.. ప్లస్సా? నిర్మాతలకి రిస్కా!
హీరోయిన్స్ కి గౌరవం తెచ్చిన నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. హీరోయిన్ కట్ అవుట్ చూసి కూడా థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తారని నిరూపించిన ఈ నాచురల్ సుందరాంగి రాబోయే కొన్ని నెలల వ్యవధిలోనే వరుసగా పెద్ద ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం సినీ ప్రియులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రణబీర్ కపూర్, నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణ'లో సీతాదేవిగా నవంబర్ 6 న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు తమిళంలో ధనుష్‌తో చేసిన భారీ యాక్షన్ డ్రామా 'ఓం' (OM Chapter-1 Udhiram: The Blood Wood) సరికొత్త రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. నవంబర్ 20, 2026న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. అంటే కేవలం 2 వారాల (14 రోజుల) వ్యవధిలోనే సాయిపల్లవి నటించిన రెండు అతిపెద్ద పాన్-ఇండియా చిత్రాలు 'రామాయణ', 'ఓం' బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. ఇలాంటి అరుదైన అవకాశం ఏ హీరోయిన్ కి త్వరగా లభించదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 100 శాతానికి పైగా డెడికేషన్‌తో ప్రాజెక్టులను ఎంచుకునే సాయిపల్లవి, తన కరియర్లో ఈ 2026-2027 కాలంలో వరుసగా 4 ప్రధాన చిత్రాలతో దాదాపు 1500 కోట్ల వ్యాపార మార్కెట్‌పై ప్రభావం చూపబోతోంది. ఇది కూడా చదవండి: 'చుట్టమల్లే’ఏఐ మార్ఫింగ్ వీడియో చేసింది వీళ్ళే! గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, కేవలం తన అభినయం, డాన్స్ నైపుణ్యాలతోనే కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ, బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో గ్లోబల్ లెవెల్లో ఎలాంటి మేజిక్ క్రియేట్ చేస్తుందో అని సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. [Sai Pallavi Back To Back Movies Release, Sai Pallavi upcoming movies, Ramayana movie release date, Sai Pallavi Dhanush Om,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 5:36PM
'చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్ వీడియో చేసింది వీళ్ళే!
ఎన్టీఆర్ యాక్టింగ్ కి, డాన్స్ లకి ఉన్న కెపాసిటీ తెలిసిందే. సాంగ్స్ కూడా దాదాపు అన్ని హిట్. ఆ కోవలోనే ప్రీవియస్ మూవీ 'దేవర తో పాటు అందులోని 'చుట్టమల్లే' పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ప్రేక్షకులను అలరించిన ఈ చార్ట్‌బస్టర్ సాంగ్ ఆధారంగా కొందరు ఆకతాయిలు అత్యంత అసభ్యకరమైన రీతిలో ఏఐ మార్ఫింగ్ వీడియో సృష్టించారు. నెట్టింట తీవ్రంగా సర్క్యులేట్ అవుతున్న ఈ వికృత కంటెంట్‌పై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నిందితులకు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా స్పందించిన ఎన్టీఆర్, ఈ చర్యను అత్యంత రోత పుట్టించే, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. "స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే పవిత్రమైన భారతావని మనది. 'మాతృదేవోభవ' అనేది కేవలం మాట మాత్రమే కాదు, అది తరతరాలుగా మన రక్తంలో ప్రవహిస్తున్న సంస్కృతిలో ఒక భాగం. అలాంటి సాంప్రదాయం ఉన్న గడ్డపై, సాంకేతికతను వాడుకొని ఒక మహిళ ఆత్మగౌరవాన్ని బజారుకీడ్చేలా ఇంత నీచానికి దిగజారడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు. ఈ మార్ఫింగ్ వీడియోని తయారుచేసిన కీచకులని, దానిని రకరకాల ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ చేస్తూ వైరల్ చేస్తున్న ప్రతి ఒక్కరినీ చట్టపరంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతీ ఒక్కరిపై కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ' తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ స్పెషల్ ఇదే! దీంతో ఇప్పుడు ఆ అసభ్యకరమైన ఏఐ వీడియోని ఎవరు రెడీ చేసారనే చర్చ అభిమానులతో పాటు సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏది ఏమైనా అణువణువున పైత్యం ఎక్కువ నిండిన వాళ్లే చేసుంటారనేది మాత్రం నిజం. [Ntr Warning Ai Morphed Chuttamalle Video,Jr NTR, Chuttamalle Morphed Video, AI Deepfake Controversy, Jr NTR Warning Legal Action,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 5:13PM
'హనుమాన్ అంశ్' తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ స్పెషల్ ఇదే!
సినిమా అంటే ఆకట్టుకొనే కథ, కథనం, మాటలు, పాటలు, క్యారెక్టర్స్ అనే సినీ సత్యాన్ని మరో సారి నిరూపించిన చిత్రం 'హనుమాన్ అంశ్'. అందుకే బడ్జెట్, భారీ లొకేషన్స్, గ్రాఫిక్స్ లేకుండా 2 కోట్ల రూపాయిల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి స్టిల్ 400 కోట్ల క్లబ్ ని క్రాస్ చేసింది. ఈ కలెక్షన్ల సునామీతో పాటు హిందీ మరియు ఇతర భాషల్లో వచ్చిన అపూర్వ స్పందనను చూసి, ఈ కథను తెలుగు ప్రేక్షకులకు అందిస్తే ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిర్మాతలు భావించారు. దీంతో సెప్టెంబర్ 18న తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేసేందుకు బాధ్యతలు తీసుకున్నారు. అయితే సాంకేతిక కారణాలు మరియు విడుదల ప్రణాళికల మార్పుల వల్ల ఆ సమయంలో సినిమా విడుదల కాలేదు. దసరా పండుగ కానుకగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్లో తీసుకురావాలని ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ (Hombale Films) రంగంలోకి దిగింది. ఇది కూడా చదవండి: నేను కూడా వాళ్ల సంగతి తెలుస్తా: వైరల్ గా నిలిచిన రామ్ చరణ్ ఈ మేరకు అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా 'హనుమాన్ అంశ్' తెలుగు వెర్షన్‌ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. [Hanuman Ansh, Neem Karoli Baba Biopic, Hanuman Ansh Telugu Release, Hombale Films, Hanuman Ansh Box Office Collection, Vishal Chaturvedi, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 4:40PM
నేను కూడా వాళ్ల సంగతి తెలుస్తా: వైరల్ గా నిలిచిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే, ఆ న్యూస్ సృష్టించబోయే రికార్డు తాలూకు వ్యూస్ ని గుర్తు చేస్తూ 'ఆరా' అనేది ముందుగానే మనకి హింట్ ఇస్తూనే ఉంటుంది. సేమ్ ఇప్పడు కూడా అదే పరిస్థితి. పెద్ది సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లు మరియు డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్ సాధించిన పెద్ది, ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.శాటిలైట్ హక్కులని ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ సంస్థ పెద్ది వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 11న సాయంత్రం 5:30 గంటలకు ‘ప్రసారం కానున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇది కూడా చదవండి: Drishyam 3: దృశ్యం 3 ఫస్ట్ డే కలెక్షన్స్ తుఫాన్: వీకెండ్ కి పెను తుఫాను తప్పదా! దీంతో థియేటర్లలో, ఓటీటీలో వీక్షించిన ప్రేక్షకులు మరోసారి టీవీలో చూసే అవకాశం లభించనుంది. అదే టైంలో పెద్ది టెలివిజన్ కి సంబంధించి టిఆర్ పి రేటింగ్స్ లో తన హవా ఏ మేర చాటుతాడో చూడాలి. [Ram Charan Latest News, Peddi World Television Premiere, Ram Charan Peddi TV Premiere Date, Peddi Telecast Channel Sony MAX, Peddi ZEE Telugu Telecast, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 4:14PM
సల్మాన్ ఖాన్ కి వేణుస్వామి ఏం చెప్పాడంటే: జాతకం అంటే ఇదేనా!
ఇండియన్ సినిమా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. వివాదాస్పద జ్యోతిష్యుడుగా పిలవబడుతున్న వేణుస్వామి.. ఈ ఇద్దరి పేర్లు పక్కన, పక్కన ప్రచురించాల్సి వస్తుందని ఏ సినీ సైటు అనుకోని ఉండదు. కానీ చాలా గట్టిగానే ప్రచురించాల్సి వచ్చింది. వేణుస్వామి సల్మాన్ ఖాన్ తమ్ముడికి ఫోన్ చేసి, సెప్టెంబర్ తర్వాతి కాలంలో సల్మాన్ కి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయని, శరీరంపై రాచపుండు లేదా దారుణమైన రుగ్మతలు వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరించాడు. దీంతో సల్మాన్ తమ్ముడు వెనుస్వామితో ఐ విల్ టేక్ కేర్ అన్నాడు. ఈ విషయాన్ని వేణుస్వామినే ఒక మీడియా సమావేశంలో చెప్పాడు. ఇది కూడా చదవండి: ఇరుముడిపై పరుచూరి బ్రదర్స్ వ్యాఖ్యలు వైరల్: గురుస్వామి రోల్ ముగింపు అలా! దీంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు వేణు స్వామి చెప్పింది నిజామా, కాదా అనే ఆలోచనలో పడ్డారు. సల్మాన్ మాత్రం 'మాతృభూమి', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలతో పాటు బిగ్ బాస్ సీజన్ 20 తో బిజీగా ఉన్నాడు. [Venu Swamy About Salman Khan Health, venu swamy About Salman, Salman Khan health update, Venu Swamy astrology, Venu Swamy Salman Khan predictions,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 3:25PM
ఇరుముడిపై పరుచూరి బ్రదర్స్ వ్యాఖ్యలు వైరల్: గురుస్వామి రోల్ ముగింపు అలా!
మాటలకి రిపీట్ ఆడియెన్స్ వస్తారని, వీరాభిమానులు సైతం పుట్టుకొస్తారని నిరూపించిన మాటల శిఖరం 'పరుచూరి బ్రదర్స్' లో ఒకరు పరుచూరి గోపాల కృష్ణ. సెల్యులాయిడ్ పై మాటలు పరుచూరి బ్రదర్స్ అని పడగానే విజిల్స్ కూడా మోగుతాయంటే క్రేజ్ తాలూకు రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.పరుచూరి పలుకులు పేరుతో ఎప్పట్నుంచో సినీ విశ్లేషణలు చేస్తూ ఎంతో మంది సినీ ఆ శా కిరణాలకి సినీ రచనా భీష్మాచార్యుడుగా ఉన్నారు. రీసెంట్ గా ఇరుముడిపై మాట్లాడుతు 'సినిమా అంటే 'ఇరుముడి'లాగే ఉండాలి. రవితేజ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.తండ్రీకూతుళ్ల గాఢమైన బంధం తన డ్రీమ్ ప్రాజెక్ట్, కెరీర్ క్లాసిక్ 'సర్పయాగం' సినిమా జ్ఞాపకాలని గుర్తుచేసింది. గురుస్వామి క్యారక్టర్ ముగింపుని మరింత ప్రభావంతంగా మలచి ఉంటే బాగుండేది. ఎందుకంటే సాయికుమార్ పోషించిన గురుస్వామి రోల్ భక్తి, ప్రవృత్తికి ప్రతీక కాబట్టి ఆ చేతుల మీదుగా జరిగే పాపాన్ని మరింత నాటకీయంగా ఆత్మహత్య వంటి ముగింపుతో చూపిస్తే ఔచిత్యం దక్కుండేది. అలాగే అజయ్ ఘోష్ క్యారక్టర్ లో వచ్చిన మార్పు ఇంకాస్త బలంగా చూపించడంతో పాటు చట్టపరంగా జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు చూపిస్తే న్యాయం మరింత స్పష్టంగా కనిపించేది .అలాగే క్లైమాక్స్ సన్నివేశాలలో హీరోకి కనిపించే మణెమ్మ రూపం సీన్‌ని కేవలం ఒక భావోద్వేగ భ్రమలా మాత్రమే చూపిస్తే కథనం ప్రేక్షకులకి ఇంకా బలంగా హత్తుకునేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గంజాయి ముఠాలు, పాఠశాల విద్యార్థులను వేధించే ఆకతాయిల చుట్టూ కథను తిప్పుతూ, తెరవెనుక అసలైన విలన్‌ను చివరి నిమిషం వరకూ దాచిపెట్టిన స్క్రీన్‌ప్లే నేర్పుని దాసరి నారాయణరావు వంటి దర్శక దిగ్గజాలు చేసారు. ఇది కూడా చదవండి: మాళవిక మోహన్ ఆసక్తికర ట్వీట్: అతను ఎంతో ప్రత్యేకం చిత్ర పరిశ్రమలో సినిమా నిర్మాణం అనేది కేవలం ఒక వ్యాపార ప్రయోగం మాత్రమే కాదని, ఎంతోమంది కష్టంతో కూడుకున్న భారీ ఆర్థిక వ్యవహారమని పరుచూరి చెప్పుకొచ్చారు. [Paruchuri Gopala Krishna About Irumudi, Paruchuri Gopala Krishna, Ravi Teja Irumudi, Irumudi Box Office Collections, Shiva Nirvana Irumudi, Paruchuri Palukulu,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 2:56PM
మాళవిక మోహన్ ఆసక్తికర ట్వీట్: అతను ఎంతో ప్రత్యేకం
సినీ ప్రేమికుల హార్ట్ బీట్ లో ఒకరిగా మారింది మాళవిక మోహనన్. రాజాసాబ్ తో ఆకట్టుకున్న ఈ భామ రీసెంట్ గా 'సర్దార్ 2 'లో ప్రాధాన్యత గల క్యారక్టర్ తో మెప్పించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ‘పాకెట్ నోవెల్’ చేసి ఫలితం కోసం ఎదురుచూస్తూ ఉంది. మాళవిక మోహనన్ రీసెంట్ గా 'ఎక్స్' వేదికగా' విజయ్ సేతుపతితో పనిచేయడం నా జీవితంలో అత్యంత మరపురాని, అందమైన అనుభవం. సెట్స్‌లో ఆయన చూపించిన ఆప్యాయత, తోటి నటీనటులకి ఇచ్చే గౌరవం, ప్రతీ సన్నివేశంలో అందించే ప్రోత్సాహం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా "ఆయన అత్యంత శ్రద్ధ కలిగిన, ఉదార మనస్కుడు. ఆయన కాకుండా ఈ ప్రయాణాన్ని మరొకరితో ఊహించుకోలేను. ఇది కూడా చదవండి: ప్రకాష్ రాజ్ సంచలన పిలుపు షూటింగ్ అనేది కేవలం కెమెరా ముందు నటించడం మాత్రమే కాదు. ఒక బృందంతో కలిసి నెలల తరబడి ప్రయాణించడం, వారితో ఎన్నో అనుభవాలని పంచుకోవడం కూడా అందులో భాగమే. కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో ఆ చిత్ర బృందమే ఒక ప్రత్యేకమైన ప్రపంచంలా మారిపోతుంది. పాకెట్ నోవెల్ కూడా నాకు అలాంటి అనుభూతినే ఇచ్చిందని చెప్పింది. [Malavika Mohanan Comments On Vijay Sethupathi, Malavika Mohanan Latest Tweet, Vijay Sethupathi, Pocket Novel, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
Oct 3, 2026 2:27PM‘కాంతార’కు నాలుగేళ్లు.. రిషబ్‌శెట్టి, నిర్మాతల పోస్టులతో కొత్త సందేహాలు.!
కన్నడ చిత్రసీమలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తయ్యాయి. 2022 సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రిషబ్ శెట్టి కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. నాలుగో వార్షికోత్సవం సందర్భంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు పెట్టారు. అయితే ఆ పోస్టులో హోంబలే ఫిల్మ్స్ పేరును ప్రస్తావించకపోవడం, అదే సమయంలో నిర్మాణ సంస్థ కూడా తన పోస్టులో రిషబ్ శెట్టి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ‘కాంతార’ విజయానికి రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ భాగస్వామ్యం కీలకంగా ఉంది. విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ సినిమాకు రిషబ్ శెట్టి కథ, దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. సినిమా విడుదల తర్వాత దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు పలు సినీ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించగా, ‘కాంతార’కు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. అయితే ఇప్పుడు నాలుగేళ్ల వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన పోస్టుల్లో ఒకరి పేరును మరొకరు ప్రస్తావించకపోవడంతో రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయా? అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. రిషబ్ శెట్టి తన పోస్టులో ‘కాంతార’తో తనకున్న అనుబంధాన్ని, ప్రేక్షకులు అందించిన ప్రేమను గుర్తుచేసుకుంటూ.. ఈ సినిమా తనకు కేవలం ఒక చిత్రం కాదని, తాను జీవించిన ప్రపంచమని పేర్కొన్నారు. తనతో కలిసి పనిచేసిన నటీనటులు, సాంకేతిక సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అయితే హోంబలే ఫిల్మ్స్ ప్రస్తావన మాత్రం కనిపించలేదు. ఇక హోంబలే ఫిల్మ్స్ కూడా ‘కాంతార’ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే ఆ పోస్టులోనూ రిషబ్ శెట్టి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం గమనార్హంగా మారింది. దీంతో గతంలో ఈ సినిమా కోసం కలిసి పనిచేసిన టీమ్‌లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందన్న దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ మధ్య విభేదాలు ఉన్నాయని అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కేవలం వార్షికోత్సవ పోస్టుల్లో ఒకరి పేరును మరొకరు ప్రస్తావించకపోవడం ఆధారంగా సోషల్ మీడియాలో ఈ చర్చ మొదలైంది. [Kantara Movie Anniversary, Rishab Shetty Kantara, Hombale Films Kantara, Rishab Shetty Hombale Films, Kantara 4th Anniversary, Kantara Movie News, Rishab Shetty Latest News, Hombale Films Latest News, Kantara Controversy, Kantara Anniversary Post, Rishab Shetty Social Media Post]
Oct 3, 2026 2:13PMనంది అవార్డుల పునరుద్ధరణపై స్పందించిన నిర్మాతల మండలి.!
2017 నుంచి 2024 వరకు నిలిచిపోయిన నంది ఫిల్మ్ అవార్డులను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ స్టేట్ ఫిల్మ్, టీవీ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పి. భరత్ భూషణ్, మేనేజింగ్ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్‌లకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల 2026 సెప్టెంబర్ 24న ఏపీ ఎఫ్డీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన లేఖలోని అభ్యర్థనలను పరిశీలించి.. గోల్డెన్ నంది, సిల్వర్ నంది, బ్రాంజ్ నంది అనే మూడు విభాగాల్లో అవార్డులను తిరిగి నిర్వహించేందుకు అంగీకరించినట్లు నిర్మాతల మండలి తెలిపింది. అలాగే 2017-2024 సంవత్సరాలకు సంబంధించిన ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును కూడా పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఈ అవార్డుల ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గుర్తించి సత్కరించే అవకాశం ఉంటుందని పేర్కొంది. 1964లో ప్రారంభమైన నంది ఫిల్మ్ అవార్డులకు తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల సంస్కృతితోనూ ప్రత్యేక అనుబంధం ఉందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేర్కొంది. ఇన్నేళ్లుగా సినీ రంగంలోని కళాకారులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారికి అవార్డులు అందించడం ద్వారా పరిశ్రమను ప్రోత్సహించే సంప్రదాయం కొనసాగిందని తెలిపింది. నంది అవార్డుల పునరుద్ధరణతో తెలుగు సినీ రంగానికి చెందిన ప్రతిభావంతులను మరోసారి అధికారికంగా సత్కరించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను నంది అవార్డుల ద్వారా గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి పార్టీలను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోరింది. నంది అవార్డుల పునరుద్ధరణకు సంబంధించిన నిర్ణయాన్ని సినీ పరిశ్రమకు సంబంధించిన వర్గాలు స్వాగతిస్తున్నాయని తెలిపింది. [Nandi Film Awards, Nandi Awards 2017-2024, Nandi Awards Revival, Telugu Film Producers Council, Andhra Pradesh Nandi Awards, Golden Nandi Award, Silver Nandi Award, Bronze Nandi Award, NTR National Film Award, Nandi Awards Latest News, Telugu Cinema Awards, AP Film Awards]
Oct 3, 2026 1:55PM‘చట్టపరంగా ఎవరినీ వదిలి పెట్టను’.. ‘చుట్టమల్లే’ ఎఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.!
ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళలను అవమానించేలా మార్ఫింగ్ వీడియోలు రూపొందించడంపై యంగ్ హీరో ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. మహిళలను తల్లులు, దేవతలుగా గౌరవించే సంస్కృతి మనదని, అలాంటి సమాజంలో ఏఐని ఉపయోగించి ఒక మహిళను అత్యంత దారుణంగా అవమానించేలా కంటెంట్ తయారు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇలాంటి దుష్ట చర్యలకు పాల్పడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తన స్పందనను వెల్లడించారు. తన పాటకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను రూపొందించిన వారితో పాటు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టను. వీడియోను తయారు చేసిన వారితో పాటు దాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రతి ఒక్కరిపై సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’’ అంటూ హెచ్చరించారు. అదే సమయంలో ఇలాంటి వీడియోలను ఎవరూ చూడొద్దని, షేర్ చేయొద్దని, వాటితో ఎలాంటి విధంగానూ ఎంగేజ్ కావొద్దని అభిమానులు, నెటిజన్లను కోరారు. ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం వల్ల దాని బారిన పడేది ఎవరైనా కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మరొక మహిళకు సంబంధించిన వీడియో కావచ్చు.. రేపు అది మన తల్లి, సోదరి, భార్య లేదా కుమార్తెకు సంబంధించినదై ఉండొచ్చని అన్నారు. అందుకే ఏఐ దుర్వినియోగంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్ వైరల్ కావడానికి నెటిజన్లు కూడా కారణం కాకూడదని, వాటిని షేర్ చేయకుండా రిపోర్ట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్, మార్ఫింగ్ కంటెంట్‌కు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ కోరారు. ఇలాంటి ఘటనలను అడ్డుకునేలా కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. [Jr NTR, NTR AI Morphed Video, Chuttamalle AI Video, Chuttamalle Morphed Video, Jr NTR Latest News, NTR Social Media Post, AI Misuse, AI Deepfake Video, NTR Chuttamalle Song, NTR Reaction, AI Morphed Video Controversy]
Oct 3, 2026 1:50PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




.webp)






