Oats Soup

 

 

 

 ఓట్స్  సూప్

 

 

 

 

కావలసినవి :
ఓట్స్ : పావుకప్పు
క్యారెట్ ముక్కలు : కప్పు
ఉల్లి ముక్కలు : పావు కప్పు
ఉప్పు : తగినంత
మిరియాల పొడి : చిటికెడు
కొత్తిమీర : కొద్దిగా
వెన్న : టీ స్పూన్

 

తయారుచేయు విధానం:
ముందుగా ఒకగిన్నేలో ఉల్లిముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి మిక్సిలో వేసి గ్రైండ్ చేసి వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి  వెన్నవేసి వేడి చేసి ఓట్స్ దోరగా వేయించి, వేగాక వీటిలో కప్పు నీళ్ళు పోసి రెండు నిముషాలు ఉడికించుకోవాలి. తరువాత  ఓట్స్ ఉడికాక గ్రైండ్ చేసుకున్న క్యారెట్ మిశ్రమం, మిరియాలపొడి, ఉప్పు వేసి చిక్కబడేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో గార్నిష్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి...