Anapakaya Gucci Pulusu
ఆనపకాయ గుచ్చి పులుసు
కావాల్సిన పదార్ధాలు:-
ఆనపకాయ ముక్కలు - ౩౦౦ గ్రాములు
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
అల్లం వెల్లులి పస్తు - ఒక స్పూను
గసగసాలు - ఒక స్పూను
దాల్చిన చెక్క పొడి - పావు స్పూను
కొబ్బరి పొడి - ఒక స్పూను
గరం మసాలా పొడి - అర స్పూను
చింతపండు రసం - అర కప్పు
ఉప్పు - తగినంత
తయారు చేయు విధానం:-
* లేత అనపకాయను, తీసుకుని, దాన్ని పొట్టు ఉండ గానే కత్తి తో గాట్లు కానీ, చిల్లులు కానీ పెట్టుకోవాలి.
* ఆ తరువాత పొట్టు తీసేసి, పెద్ద ముక్కలు తరగాలి. ఈ ముక్కలను, ఉప్పు వేసి కలిపి ఆవిరి మీద ఉడికించాలి. ముక్క లు ఉడకగానే , చింత పండు రసం లో తగినంత నీళ్లు కలిపి ఈ రసం ముక్కల్లో వేసి ఉడికించాలి.
* ఈ పులుసు ఉడుకుతూఉండగా ఉల్లిపాయ ముక్కలు, గసగసాలు పొడి చేసుకుని, ఈ పొడి తో బాటు , దాలిచిన పొడి, కొబ్బరి పొడి , గరంమసాలా, అల్లం * వెల్లుల్లి పేస్టు కూడా వేసి బాగా కలిపి అయిదు నిమిషాలు ఉడికించి స్టవ్ పై నుంచి దింపాలి.
* ఈ పులుసు లో, కొత్తిమీర, కరివేపాకు వెయ్యాలి.
* ఒక చిన్న మూకుడులో, రెండు చెంచాలు నూనె వేసి, నూనె కాగగానే ఆవాలు, జీలకర్ర వేసి, పోపు వేగంగానే, పులుసులో వేసి కలపాలి.
* ఆనపకాయ గుచ్చి పులుసు తయ్యార్.
* ఇది, అన్నం తో గానీ, చపాతీ తో కానీ సర్వ్ చేస్తే బావుంటుంది.
-Bhavana