పెరుగు బెండకాయ మసాలా కర్రీ

 

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

కావాల్సిన పదార్ధాలు:

బెండకాయలు -అరకిలో

ఉల్లిపాయలు-2సన్నగా తరగాలి.

టమెటాలు -2 సన్నగా తరగాలి.

అల్లం తురుము -హాఫ్ టీస్పూన్

వెల్లుల్లి పేస్టు- హాఫ్ టీస్పూన్

ఉప్పు-1టీస్పూన్

ఆవాలు -1/2 టీ స్పూన్,

పసుపు - 1/2 టీ స్పూన్,

కొబ్బరి తురుము- 1/2 టీ స్పూన్.

గరం మసాలా - 1 టేబుల్ స్పూన్,

కరివేపాకు- నాలుగైదు రెబ్బలు,

మ్యాంగో పౌడర్ - 1/2 టీ స్పూన్,

జీడిపప్పు- 10 పాలల్లో నానబెట్టినవి,

కుంకుమపువ్వు - 1/2 టీ స్పూన్,

ధనియాల పొడి 1 1/2 టీ స్పూన్.

పెరుగు - ఒక కప్పు,

జీలకర్ర - హాఫ్ టీ స్పూన్.

తయారీ విధానం:

పాలల్లో నానబెట్టిన జీడిపప్పు, కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి.

తర్వాత బెండకాయలను కడిగి ముక్కలుగా కట్ చేసి ఉప్పు పట్టించాలి.

ఇప్పుడు నూనె వేడి చేసి అందులో బెండకాయ ముక్కలను ఫ్రై చేయాలి.

అదే పాన్ లో పైన చెప్పుకున్న పోపు దినుసులు అన్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, అల్లం వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి.

తర్వాత అందులో పసుపు, కారం, మామిడికాయ పొడి వెల్లుల్లి పేస్టు వేయాలి.

తర్వాత గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కలపాలి.

అందులో జీడిపప్పు కొబ్బరి పేస్టు పెరుగు వేసి బాగా కలపాలి.

తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను నీళ్లు పోసి ఉడికించుకోవాలి.