Senaga Vadalu

 

 

 

శెనగలతో వడలు

 

 

కావాల్సిన పదార్థాలు:

* 1కప్పు          - మొలకలు వచ్చిన శెనగలు
* 1 /4కప్పు      - మైదా పిండి
* 1 /4కప్పు      - ఉల్లి పాయ తరుగు
* 1 స్పూను      - పచ్చి మిరపకాయ ముక్కలు
* 1 స్పూను      - అల్లం తరుగు
* 1టీ స్పూను కారం పొడి
* 1 స్పూను కొత్తిమీర ఆకులు
* 1 స్పూను పుదీనా ఆకులు
* 4కరివేపాకు రెబ్బలు
* ఉప్పు తగినంత
* నూనె తగినంత

 

తయారు చేయు విధానము:

* ముందుగా  మొలకలు వచ్చిన   శెనగలు తీసుకుని  కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి.

* ఈ మిశ్రమానికి కొత్తిమీర, పుదీనా ఆకులు, కరివేపాకు రెబ్బలు, ఉప్పు , కారం వేసి కలపాలి.

* ఇప్పుడు, బాండీ లో నూనె వేసి సన్నటి సెగ మీద ఉంచాలి.  నూనె మరిగాక,  పప్పు రుబ్బిన మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు గా  చేతికి   తీసుకుని  వడలు గా  వేసుకోవాలి.

* ఈ వడలు వేడి వేడి గా స్నాక్స్ గా  వడ్డిస్తే చాలా రుచిగా ఉండటమే గాక మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉంటాయి.

 

--bhavana