వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్న ప్రొ. నాగేశ్వర్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, రాజకీయ నాయకులను హైదరాబాద్ నుంచి తరిమేసినప్పటికీ, తెలంగాణ నాయకులకు, మేధావులకు ఆంధ్ర రాజకీయాల మీద ఎక్కడలేని ఆసక్తి. ఆంధ్ర నాయకులు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడరు. కానీ, తెలంగాణ నాయకులు, మేధావులు మాత్రం ఆంధ్ర రాజకీయాల గురించి కామెంట్ చేస్తూ తమ ఆసక్తిని ప్రదర్శిస్తూ వుంటారు. అలాంటి వారిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకరు.  దేశంలో ఎక్కడైనా రైతుల భూమి హక్కు పత్రమైన పట్టాదార్ పాస్ పుస్తకం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో వుంటుందా? ఐదేళ్ళపాటు పాలించే ముఖ్యమంత్రి ఫొటో శాశ్వతంగా వుండే పాస్ బుక్ మీద వుంటుందా? రైతుల సొంత భూమి పాస్ పుస్తకాల మీద ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖ్యమంత్రి ఫొటో వుంటుందా? వుండదు.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మాత్రం ఆ ఖర్మ పట్టింది. తమకు వారసత్వంగా వచ్చిన లేదా తాము శ్రమించి సంపాదించుకున్న భూమి తాలూకు పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫొటో చూసి తరించాల్సి వస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్ర అసంతృప్తితో వున్నారు. రెండ్రోజుల క్రితం సీఎం సతీమణి భారతి పులివెందులలో ప్రచారానికి వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్త కూడా అయిన ఒక రైతు ఆమె ముందు బహిరంగంగానే ఈ విషయం మీద నిరసనను వ్యక్తం చేశారు. అలాంటి పాస్ బుక్ మీద జగన్ ఫొటో వ్యవహారం మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ బాధ్యతా రాహిత్యంగా, కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలాగా వ్యాఖ్యానించారు.  పట్టాదార్ పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫొటో వుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. నా భూమి పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫొటో ఏంటి అంటే కుదరదని అన్నారు. నా బర్త్ సర్టిఫికెట్ మీద ఎమ్మార్వో సంతకం ఏంటని అడుగుతామా.. ఇది కూడా అంతే అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో నాగేశ్వర్ ఎంత వితండవాదన చేశారంటే, మళ్ళీ జగన్ పొరపాటున అధికారంలోకి వస్తే, నాగేశ్వర్‌ని పిలిచి మరీ పదవి ఇచ్చేంత స్థాయిలో వాదించారు. ఎవరి బర్త్, డెత్ సర్టిఫికెట్ మీదో ఎమ్మార్వో సంతకానికి లేని అభ్యంతరం పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటోకి ఎందుకని అన్నారు. విద్యాధికుడు అయిన నాగేశ్వర్ మాట్లాడుతున్న ఈ మాటల్లో ఆయన స్వార్థమేదో తొంగి చూస్తోంది తప్ప మరింకేం కనిపించడం లేదు. సరే, అది నాగేశ్వర్ అభిప్రాయం అని ఊరుకోవచ్చు. కానీ, ఇదే నాగేశ్వర్ కొద్ది రోజుల క్రితం పట్టాదర్ పాసు పుస్తకాల మీద జగన్ ఫొటోలు ముద్రించుకోవడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. మరి ఆయనే ఇప్పుడు తాను చేసిన వాదనకు పరస్పర విరుద్ధంగా వున్న వాదన ఎందుకు చేశారో, ఏ గూడుపుఠాణీ జరిగిందో!

కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో  విడుదల 

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసింది. లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరుతో దీన్ని టీ కాంగ్రెస్ రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. తెలంగాణకు అన్ని రకాలుగా న్యాయం చేసేలా దీన్ని తయారు చేశామని వివరించారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో హామీలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. మేనిఫెస్టోలో హామీలు ఇవే.. – హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు – హైదరాబాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్టు – కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు – ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం – హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు – ఏపీలో కలిపిన 5 గ్రామాలు మళ్లీ తెలంగాణకు తీసుకొస్తాం – పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా – హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం – రామగుండం–మణుగూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం – నాలుగు కొత్త సైనిక్ స్కూళ్లు – కేంద్రీయ విద్యాలయాల రెట్టింపు – నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు – రాష్ట్రానికి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం – ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో వైద్య పరిశోధన సంస్థ – నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ – రాష్ట్రానికి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్ టీ) – తెలంగాణకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ ఈఆర్) ఏర్పాటు – సర్పంచులకు నేరుగా కేంద్రం నిధులు – ప్రతి ఇంటికీ సొంత విద్యుత్ ఉత్పత్తి సంస్థ – హైదరాబాద్ – బెంగళూరు మధ్య ఐటీ, పారిశ్రామిక కారిడార్ – హైదరాబాద్ – నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్ – హైదరాబాద్ – వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ – అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం – సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా

మారుతున్న తుని రాజకీయం..! గెలుపు దిశ‌గా య‌న‌మ‌ల దివ్య‌

తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది.  గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే,  ఇక్క‌డ‌  సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో  లెక్కలు మారిపోయాయి.  నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ  అయితే కొన‌సాగుతోంది. తొలి నుంచి సామాజిక వర్గాలే ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్ది రాజాకు 92,459 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ది కృష్ణుడుకు 68,443 ఓట్లు పోలయ్యాయి.   టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇదే నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి యనమల తునిలో పెద్దదిక్కుగా ఉన్నారు. తుని అంటే యనమలకు కంచుకోట.   2009లో ఓడిపోయారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో రామకృష్ణుడు పోటీ చేయకుండా సోదరుడు వరుసయ్యే కృష్ణుడుని బరిలో దించారు. కృష్ణుడు సైతం ఓడిపోయారు. దీంతో ఈ సారి కృష్ణుడుకు సీటు ఇస్తే మళ్ళీ పార్టీ ఓడిపోతుందనే భ‌యంతో యనమల  తన కుమార్తె దివ్యకు సీటు ఇప్పించుకున్నారు.  దీంతో య‌న‌మ‌ల కుటుంబంలో చిచ్చు ర‌గిలింది. తన సోదరుడు కుమార్తె కోసం తన రాజకీయ భవిష్యత్ ను దెబ్బతీశాడంటూ  కృష్ణుడు వైసీపీలో చేరారు.  2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు టీడీపీ నుంచి పోటీ చేసారు. ఆయన పైన వైసీపీ అభ్యర్దిగా దాడిశెట్టి రాజా గెలిచారు. ప్రస్తుతం రాజా మంత్రిగా ఉన్నారు. మ‌ళ్ళీ ఈ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని రాజా ఆశ ప‌డుతున్నారు.   టీడీపీ నుంచి యనమల కుమార్తె దివ్య పోటీలో ఉన్నారు.  టీడీపీ, జనసేన పొత్తుతో ఈ నియోజకవర్గం పైన టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయితే, మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు.  కాపు, బీసీ వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు  ఓటర్ల ను ప్రభావితం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఈ నియోజకవర్గం పైన స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. సీఎం జగన్ ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు పూర్తిగా పార్టీ అభ్యర్ది దాడిశెట్టి రాజా పైనే వదిలేసారు. దీంతో, తుని నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారింది.  వైసీపీకి రాజకీయ సమాధి కట్టే సమయం వచ్చిందని తుని టీడీపీ అభ్య‌ర్థి యనమల దివ్య ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రావణ కష్టం అవుతుందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారని, అంతా అవినీతి దోపీడితోనే ప రిపాలన సాగుతుందన్నారు.  యనమల కృష్ణుడు ప్ర‌భావం ఏమేర‌కు వుంటుంది? కృష్ణుడికి, రాజాకు మ‌ధ్య ఏం ఒప్పందం కుదిరిందంటూ స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతోంది. చాణ్య‌క్య స్ట్రాట‌జీ టీం తునిలో నిర్వ‌హించిన స‌ర్వేలో 46 శాతం ఓట‌ర్లు టీడీపీకి అనుకూలంగానూ, వైసీపీ కేవ‌లం 41 శాతం ఓట‌ర్లు అనుకూలంగా మాట్లాడారు. అయితే అభ్య‌ర్థుల వారీగా ఓట‌ర్ల అభిప్రాయాల‌ను సేక‌రించిన‌ప్పుడు య‌న‌మ‌ల దివ్య‌కు అనుకూలంగా 54 శాతం, దాడిశెట్టి రాజాకు అనుకూలంగా కేవ‌లం 38 శాతం ఓట‌ర్లు మాత్ర‌మే మాట్లాడారు. జ‌గ‌న్ పాల‌న ఎలా వుంద‌నే ప్ర‌శ్న‌కు తుని ఓట‌ర్లు స్పందిస్తూ బాగానే వుంద‌ని 32 శాతం, అస్స‌లు బాగాలేద‌ని 59 శాతం ఓట‌ర్లు స్పందించారు.

తల తిరుగుతోందా హరీష్‌రావ్?

తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం బిఆర్ఎస్ శవయాత్ర జరుగుతోంది. ఆ శవాన్ని మోస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితర నాయకులు శ్మశానం ముందు శవాన్ని కిందకి దించి దింపుడు కళ్ళం ఆశలతో నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. అలాంటి దింపుడు కళ్ళం ఆశలతో అగ్గిపెట్టె మచ్చా హరీష్ రావు శుక్రవారం ఒక మాట మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గడువు ముగిసినా హైదరాబాద్‌ని ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని చూస్తున్నారట, దీనికోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. చంద్రబాబు ఆటలు సాగకూడదంటే లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ శవానికి ఊపిరి పోయాలట. ఇదీ హరీష్ రావు వెర్షన్.. తెలంగాణ ప్రజలు చాచిపెట్టి కొట్టినా ఈ బిఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదు. ఈ దిక్కుమాలిన పార్టీ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు రేపి అధికారంలోకి రావాలని మొన్నటి ఎన్నికల సందర్భంగా కూడా ప్రయత్నించింది. అయితే ప్రజలు మాత్రం వీరి ఆటలు సాగనివ్వలేదు. అసలు ఆంధ్ర ప్రజలు మరోసారి హైదరాబాద్‌ని రాజధానిగా కోరుకోవడం లేదు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు అయితే పదేళ్ళు అవకాశం వున్నా, అధికారంలోకి వచ్చిన సంవత్సరానికే హైదరాబాద్‌ని వదిలిపెట్టేసి అమరావతికి వెళ్ళిపోయారు. అలాంటి చంద్రబాబు హైదరాబాద్‌ని మరో్సారి ఆంధ్ర రాజధాని చేయాలని చూస్తున్నారని అనడానికి నోరెలా వచ్చిందయ్యా. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరోసారి ఆంధ్ర బూచిని, చంద్రబాబును చూపించి లాభం పొందాలని బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు తల తిరిగినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఆంధ్రలో ఆయన బాధలేవో ఆయన పడుతున్నారుగా.. మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలోగానీ, ఇప్పటి పార్లమెంట్ ఎన్నికలలోగానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదు కదా.. మరి ఇంకా ఎందుకు చంద్రబాబు మీద పడి వీళ్ళు ఏడుస్తున్నారో! ఇక బిఆర్ఎస్ పార్టీ బతికి బట్టకట్టే అవకాశాలు లేవు కాబట్టి, మరోసారి ఆంధ్ర, తెలంగాణ అంటూ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ పింక్ పిశాచాల పని అయిపోయింది. వీళ్ళ అవాకులు, చెవాకులు తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే మంచింది.

ఎట్టకేలకు చిక్కిన చిరుత... ఊపిరి పీల్చుకున్న శంషాబాద్ వాసులు 

ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.  గత నెల 28న ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు వెనకున్న గొల్లపల్లి అటవీ ప్రాంతం నుంచి రక్షణ గోడ దూకి చిరుత విమానాశ్రయం ఆవరణలోకి వచ్చింది. అయితే దూకుతున్న సమయంలో ప్రహరీ గోడకు అమర్చిన విద్యుత్ ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమరాలను పరిశీలించగా అందులో చిరుత కనిపించడం, ఎయిర్ పోర్టు రన్ వేపై తిరుగుతుండటంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుతను బంధించేందుకు ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు కొన్ని మేకలను వాటి వద్ద ఎరగా వేశారు. కానీ చిరుత మాత్రం పలుసార్లు బోన్ల వద్దకు వచ్చినా మేకలను తినేందుకు లోనికి వెళ్లలేదు. చివరకు తినేందుకు ఏమీ దొరక్కపోవడంతో బోనులోని ఎరలను తినేందుకు వచ్చి చిక్కింది.

రాచమల్లుకు ఎదురుగాలి.. ప్రొద్దుటూరులో తెలుగుదేశందే పై చేయి!

కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది.  ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది. వైఎస్ మరణం తరువాత కడప జిల్లా మొత్తం కాంగ్రెస్ ను వీడి  జగన్ కు మద్దతుగా నిలిచింది. 2014 ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలైనా కడప జిల్లా మాత్రం ఆయనకూ, ఆయన పార్టీకే జై కొట్టింది. అయితే 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ జగన్ పునాదులు కదులుతున్న పరిస్థితి గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని ఆ పార్టీ వర్గాలే బాహాటంగా చెబుతున్నాయి.  ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఎనిమిది పదుల వయస్సున్న వరదరాజులు రెడ్డి పోటీలో ఉన్నారు. చంద్రబాబు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని ఎంపిక చేయడంపై అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆయితే ఆయన తనక ఇవే చివరి ఎన్నికలు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలలో సానుకూలతకు కారణమైంది. అన్నిటికీ మించి ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సమీప బంధువు బంగారురెడ్డిల అరాచకాలు, దౌర్జన్యాలతో విసిగిపోయిన స్థానికులు, వ్యాపారులు వరదరాజులురెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం బలం, వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతా అన్నీ కలిసి వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో రాచమల్లు అరాచకత్వం అన్ని వర్గాల ప్రజలలో ఆయన పట్ల అసహనానికీ, అసంతృప్తికీ కారణమైంది. దీంతో  ప్రొద్దుటూరులో తెలుగుదేశం వైపు మొగ్గు కనిపిస్తోంది.  ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలూ, క్యాడర్ తో సమన్వయం కరవైంది. ఆయన పూర్తిగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తనకే ఓటు వేస్తారన్న భావనలో ఉన్నారు. అన్నిటికీ మించి వైఎస్ షర్మిలపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజలలో మరీ ముఖ్యంగా మహిళల్లో ఆయన పట్ల వ్యతిరేకతకు కారణమయ్యాయి. వీటన్నిటికీ అదనంగా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తుండటం రాచమల్లు విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసిందని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ షర్మిల ప్రభావం వైసీపీకి ప్రతికూలంగా మారిందంటున్నారు. ప్రొద్దుటూరు పరిస్థితి కడప జిల్లాలో మారిన రాజకీయ ముఖచిత్రానికి అద్దంపడుతోందని చెబుతున్నారు. ప్రచారం నుంచి ప్రజా స్పందన వరకూ  తెలుగుదేశం కూటమికి సానుకూలత కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో ప్రొద్దుటూరులో రాచమల్లుకు ఎదురీత తప్పదని విశ్లేషిస్తున్నారు.  

దెందులూరులో మరోసారి  వైసిపి గుండాల అరాచకం

దెందులూరు లో టిడిపి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. టిడిపి నాయకులపై  వైసీపీ గుండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఐరెన్ రాడ్లతో ఒక్కసారిగా వైసిపి గుండాలు  దాడి చేశారు. ఎన్నికలకు గడువు సమీపించడంతో వైసీపీ కార్యకర్తలు , నాయకుల్లో సహనం నశించి పోయింది. వారిలో రాక్షసత్వం  ఒక్కసారిగా పెల్లుబికింది. ఈ దాడిలో పలువురు టిడిపి నాయకులు  రక్త సిక్తమయ్యారు.  ఒక  టిడిపి నాయకుడి తల పగల గొట్టారు. అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని  తరలించారు.  వైసిపి దాడికి నిరసనగా విజయరాయి గ్రామంలో రోడ్డుపై చింతమనేని ప్రభాకర్ ధర్నా నిర్వహించారు. ఘటనా స్థలానికి  పోలీసులు  చేరుకుని నిందితులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను  చింతమనేని ప్రభాకర్ పరామర్శించి వైద్య సేవలను మరింత మమ్మురం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. 

ఏపీ బీజేపీ ఫిటింగులు మొదలెట్టిందండోయ్!

2014లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా  చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత బీజేపీకి దక్కింది. పేరుకే మిత్రపక్షం అయినప్పటికీ, ఆగర్భశత్రువు కంటే ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తూ, తిరకాసులు పెడుతూ, నిధులు ఇవ్వకుండా వేధిస్తూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి శాయశక్తులా కృష్టి  చేసిన పార్టీ బీజేపీ.  ఆ పార్టీ తరఫున రాష్ట్రంలో ఆ ఘనకార్యాన్ని నిర్వర్తించిన ఇద్దరు మహానుభావుల్లో ఒకరు సోము వీర్రాజు మరొకరు జి.వి.ఎల్.నరసింహారావు. ప్రశాంతంగా వున్నదాన్ని సర్వనాశనం చేయడం... సర్వనాశనం అయిపోయినదాన్ని పట్టించుకోకుండా పక్కకి తప్పుకోవడం.. ఇదీ బీజేపీ లక్షణం.. ఈ లక్షణాన్నే ఈ ఇద్దరు నేతలూ ప్రదర్శించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాంటిదో, బీజేపీ పరిస్థితి అంతకంటే తక్కువే. అయినా పొత్తు ధర్మాన్ని పాటించిన చంద్రబాబు బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు, ఎమ్మెల్సీ సీట్లు కట్టబెట్టినప్పటికీ, ఆ పార్టీ నాయకులు... ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోగా, బీజేపీ-టీడీపీ బంధం తెగిపోవడానికి తమవంతు కృషి చేశారు. తెలుగుదేశం అధికారంలో వున్నంతకాలం చీటికిమాటికి ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అనేక కామెంట్లు చేసిన బీజేపీ నాయకులు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని జగన్ ప్రభుత్వం మట్టిలో కలిపేస్తుంటే వీళ్ళెవరూ కిక్కురుమనలేదు. జగన్ అరాచకాల మీద ఏనాడూ స్పందించిన దాఖలాలు, పోరాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరోసారి టీడీపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో మళ్ళీ ఈ నాయకులు తెరమీదకి వచ్చారు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ విశ్వరూపం చూపించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే వాళ్ళ నిజస్వరూపం చూపించడం ప్రారంభించారు. ఏపీ బీజేపీలో సుందోపసుందులుగా అభివర్ణించే సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహరావుల్లో ఒకరైన జీవీఎల్ రంగంలోకి దిగారు. తన కామెంట్లతో ప్రశాంతంగా వున్న వాతావరణాన్ని  నాశనం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అసలు బీజేపీకి సంబంధం ఉందని ఎవరు చెప్పారట ఈయన సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇవ్వడానికి? బీజేపీకి సంబంధం లేదు కాబట్టే... టీడీపీ, జనసేనల పేరిట మేనిఫెస్టో విడుదలైంది. మీ పార్టీ అసలే సీన్లోనే లేనప్పుడు మీరెందుకు గిల్లి గొడవపెట్టుకోవాలని అనుకుంటున్నారో అర్థం కాని విషయం. రేపటి రోజున మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే జనం ప్రశ్నించేది చంద్రబాబునో, పవన్ కళ్యాణ్‌నో తప్ప జనం ఎంతమాత్రం పట్టించుకోని జీవీఎల్‌ని కాదు.. కేంద్రంలో ఉంటాడో ఉండడో తెలియని మోడీని కాదు. ఒకవేళ మోడీ కేంద్రంలో వున్నా ఆయన్ని అడగరు.. ఎందుకంటే, ఆ మేనిఫెస్టోకి బీజేపీకి సంబంధం లేదు కాబట్టి. సంబంధం లేకుండా బీజేపీయే చాకచక్యంగా తప్పించుకుంది కాబట్టి. ఇక, జీవీఎల్ నరసింహారావు ఉపయోగించిన మరో అద్భుతమైన కామెంట్, అసహనం వ్యక్తం చేసిన అంశం ఏమిటంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్‌‌ని ఏపీలో కూటమి సరిగా వాడుకోవడం లేదట. అసలు మోడీకి ఇమేజ్ ఎక్కడుందయ్యా వాడుకోవడానికి? మోడీ ఇమేజ్ దేశవ్యాప్తంగా సన్నగిల్లుతున్న విషయం మీకు అర్థం కావడం లేదా? ఇప్పటి వరకు జరిగిన అన్ని విడతల పోలింగ్‌లోనూ బీజేపీకి షాక్ తగిలింది. మరి మోడీ ఇమేజ్ వుంటే ఆ షాకులు ఎందుకు తగులుతాయి. కర్నాటకలో ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూ తర్వాత ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీకి కూడా ఆ మకిలి అంటుకుంది. అది కడుక్కోండి ముందు. ఇక మోడీ ఇమేజ్ విషయం గురించి ఇంకా చెప్పాలంటే, దేశంలో ఎక్కడైనా మోడీ ఇమేజ్ ఉందో లేదోగానీ, ఏపీలో మాత్రం మోడీకి ఏమాత్రం ఇమేజ్ లేదు.. అసలు నిజం చెప్పాలంటే, ఏపీని నాశనం చేసిందే నరేంద్ర మోడీ.. అలా ఆయన నాశనం చేయడానికి ఆయనకు సంపూర్ణ సహకారం అందించింది జీవీఎల్, సోమూ వీర్రాజు లాంటి జనాదరణ లేని నాయకులు. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా 18 శాతం ఓట్లు వస్తాయని జీవీఎల్ నరసింహారావు జోకు వేశారు. ఇంతకు మించిన  ఓవర్ కాన్ఫిడెన్స్ దేశ రాజకీయల్లోనే వుండదు. ఏపీలో మీకు బలుపు లేదు.. వాపులేదు.. ఏపీలో బీజేపీ ఒక అస్థిపంజరం మాత్రమే. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఏపీని నాశనం చేసిందే బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి అస్థిపంజరం లాంటి, ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీతో చంద్రబాబు, జనసేన పొత్తు పెట్టుకుంది మీ పార్టీ ఏదో ఊడబొడుస్తుందని కాదు... గత ఎన్నికల సందర్భంగా చేసిన కుట్రలు, కుతంత్రాలు చేయకుండా వుంటుందనే. అయినా సరే, మీ బుద్ధి, మీ పార్టీ బుద్ధి మారదుగా.. ఎన్నికల సమయంలోనే కుట్రలు ప్రారంభించారు. పేరుకే మీ పార్టీ కూటమిలో వుంది.. మీ పార్టీ గానీ, మీరుగానీ ఏనాడైనా పొత్తు ధర్మాన్ని పాటించారా? జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడితే, మోడీ అర్జెంటుగా స్పందించేసి అయ్యయ్యో అని ట్వీట్ చేశారు. టీడీపీ, జనసేన గులకరాయి ఉదంతం అంతా డ్రామా అని విమర్శిస్తుంటే మీ పార్టీ ఏనాడైనా నోరు మెదిపిందా?  ప్రస్తుతం ఏపీ బీజేపీ తనువు కూటమిలో వుంది.. మనసు మాత్రం జగన్‌తోనే వుంది. ఏపీ బీజేపీ ఇప్పుడు రాజకీయ మానసిక వ్యభిచారం చేస్తోంది.  కూటమి విజయం సాధిస్తే బీజేపీ నాయకులు మావల్లే కూటమి విజయం సాధించిందని బిల్డప్పు ఇస్తారు. జనం ఖర్మకాలి వైసీపీ విజయం సాధిస్తే చడీ చప్పుడు లేకుండా వైసీపీ వైపు వెళ్ళిపోతారు. బీజేపీ నాటకాలు, బీజేపీ నాయకుల చాతుర్యాలు చంద్రబాబుకు తెలియక కాదు.. జగన్ పాలనలో సర్వనాశనం అయిపోయిన ఏపీకి పునర్ వైభవం తేవడానికే బీజేపీతో కలసి నడుస్తున్నారు.. జీవీఎల్ లాంటి నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నా భరిస్తున్నారు. బీజేపీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, వైసీపీ లాంటి శత్రువునైనా ఎదుర్కోవచ్చుగానీ, బీజేపీ లాంటి మిత్రుణ్ణి భరించలేం.

చివరి బంతి వరకూ ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో విజయం.. హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ థ్రిల్లర్

బంతి బంతికీ ఆధిక్యతలు మారిపోతూ, చివరి బంతి వరకూ విజయం అటా ఇటా అని దోబూచులాడుతుంటే.. ఒక మ్యాచ్ లో ఇంత కంటే మజా ఏముంటుంది? అలాంటి మ్యాచ్ ఐపీఎల్ లో భాగంగా గురువారం రాత్రి హైదరాబాద్-  రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అటు ఆటగాళ్లనే కాదు స్టేడియంలో ఆ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షకులతో పాటు టీవీలు, ఫోన్లలో వీక్షిస్తున్న లక్షల మందికి బ్లడ్ ప్రషర్ పెంచేసింది. ఇది కదా మజా అంటే అనుకునేలా చేసింది. వీక్షకులందరినీ  మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిచింది. అది వేరే సంగతి. కానీ ఈ మ్యాచ్ లో నిజమైన విజేత మాత్రం క్రికెట్టే. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఎందుకుంత పాపులర్ గేమ్ అయ్యిందో.. ఇప్పటి దాకా అర్ధం కాని వారెవరైనా ఉంటే, వారీ మ్యాచ్ చూసి ఉంటే అర్దమైపోయి ఉంటుంది. ఏళ్ల తరబడి గుర్తుండిపోయే మ్యాచ్ లా ఇది తప్పకుండా మిగిలిపోతుంది. విజయం కోసంఇరు జట్లు సర్వం ఒడ్డి పోరాడాయి. చివరి ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో  ఆ ఆఖరు మెట్టుపై రాజస్థాన్ తడబడింది. మ్యాచ్ చేజార్చుకుంది. చివరి ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్ రాజస్థాన్ బ్యాటర్ పావెల్ ను ఔట్ చేయడంతో  హైదరాబాద్ జట్లు విజేతగా నిలిచింది. అయితే క్రికెట్ అభిమానుల మనస్సులను మాత్రం హైదరాబాద్ తో పాటు రాజస్థాన్ కూడా గెలుచుకుంది. ఇరు జట్లూ కలిసి క్రికెట్ ను గెలిపించాయి.   ఇక మ్యాచ్ వివరాలలోకి వస్తే  తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 2012 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో నితీశ్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు సాధించాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్  ట్రావిస్‌ హెడ్‌  44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో  58 పరుగులు చేశాడు. చివరిలో క్లాసిన్ మెరుపులు తోడవ్వడంతో  హైదరాబాద్ 201 పరుగులు చేయగలిగింది. 202 పరుగుల విజయ లక్ష్యంతదో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్  అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.  అయితే ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ లోనే  సూపర్‌ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ను, కెప్టెన్‌ సంజూ శాంసన్‌  భువనేశ్వర్‌ కుమార్‌  పెవిలియన్ కు పంపేశాడు.  బట్లర్‌ రెండో బంతికి జాన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌  అయితే,  ఐదో బంతికి శాంసన్‌ క్లీన్ బౌల్డ్‌ అయ్యాడు. ఇద్దరూ డకౌట్ అయ్యారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే సాధించిన రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో  మరో  ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, రెండో డౌన్ లో వచ్చిన పరాగ్ లు జట్టును పోరాటంలో నిలిపారు. వీరిద్దరి దూకుడైన ఆటతో రాజస్థాన్ పది ఓవర్లకు 100 పరుగులు పూర్తి చేసింది. జట్లు స్కోరు 135 పరుగుల వద్ద ఉండగా జైస్వాల్ నటరాజన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత రెండు ఓవర్లకే కమిన్స్ బౌలింగ్ లో పరాగ్ వెనుదిరిగాడు.  దీంతో 16 ఓవర్లకు ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో ఆజట్టు విజయానికి 42 పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం రాజస్థాన్ వైపే ఉందని పించింది.  నటరాజన్‌ వేసిన 18వ ఓవర్‌లో హెట్‌మయర్‌ ఔటయ్యాడు జురెల్‌ ఔటై పెవిలియన్ కు చేరడం,  19వ ఓవర్‌ను కమిన్స్‌ పొదుపుగా వేసి కేవలం 7 పరుగులే ఇవ్వడంతో  విజయం కోసం   చివరి ఓవర్ లో  13 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ చివరి ఓవర్ ను భువనేశ్వర్ వేశాడు.  తొలి బంతికి అశ్విన్‌ సింగిల్‌ రెండో బంతికి పావెల్‌ రెండు  మూడో బంతికి ఫోర్‌ తో తొలి మూడు బంతులకే ఏడు పరుగులు వచ్చాయి. ఆ తరువాతి రెండు బంతులకు నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో చివరి బంతికి రెండు పరుగులు చేస్తే విజయం, ఒక పరుగు చేస్తే టై అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇరు జట్లలోనూ ఉత్కంఠ తారస్థాయికి వెళ్లింది. అయితే చివరి బంతికి భువనేశ్వర్  పావెల్ ను లెగ్ బిఫోర్ గా ఔట్ చేయడంతో రాజస్థాన్ ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది.  

విజయవాడ వెస్ట్ లో సుజనా విజయం సునాయాసం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ నుంచి సుజనా చౌదరి పేరు ప్రకటించగానే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం లేదా జనసేన నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి రంగంలోకి దిగడంతోనే పరిస్థితి ఒక్కసారిగా కూటమికి అనుకూలంగా మారిపోయింది. విజయవాడ వెస్ట్ నుంచి మంత్రి వెల్లంపల్లిని మార్చి వైసీపీ వ్యూహాత్మకంగా ఆసిఫ్ ను రంగంలోకి దింపింది. అయితే అంతకు మంచిన వ్యూహం అన్నట్లుగా కూటమి అభ్యర్థిగా సుజనా రంగంలోకి దిగారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ డీలా పడింది.  నాన్ లోకల్ అంటూ సుజనా చౌదరికి వ్యతిరేక ప్రచారం చేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు ఆదిలోనే విఫలమయ్యాయి.   అందరితోనూ కలిసిపోతూ, అందరినీ కలుపుకుని పోతూ సుజనా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే సుజనా నియోజకవర్గ పరిిలోని ప్రతి డివిజన్ లోనూ ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. దాదాపుగా ప్రతి ఇంటి తలుపూ తట్టారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం విషయంతో తాను ముందుంటానని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానన్న విశ్వాసాన్ని ప్రజలలో కలిగించారు.   దీంతో సుజనా చౌదరి నాన్ లోకల్ అంటూ ముద్ర వేయడానికి వైసీపీ చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది.  స్థానిక సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ రూపొందించి ముందుకు సాగుతానని హామీ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు ప్రొగ్రెస్ రిపోర్టు కూడా ఇస్తానని  చెప్పడం ద్వారా వైసీపీ నోటికి తాళం వేయగలిగారు. తాను స్థినికేతరుడిని కాననీ ప్రజల మనిషినని బలంగా చాటారు.  ఇక  కుల, మతాలకు అతీతంగా ఉంటానని చెప్పడం ద్వారా అన్ని వర్గాలతో మమేకం కాగలిగారు. సుజనాకు వస్తున్న ప్రజాదరణను చూసి  వైసీపీ నుంచి భారీగా నాయకులు బీజేపీలో చేరారంటేనే వైసీపీ ఎంతగా డీలా పడిందో అర్ధం చేసుకోవచ్చు.  మైనారిటీలు కూడా  కూటమికి మద్దతు ప్రకటించి సుజనా వెంట ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటూ పోలింగ్ కు ముందే సుజనా విజయాన్ని ఖరారు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్థానికంగా కూడా విజయవాడ వెస్ట్ లో వార్ వన్ సైడేనన్న టాక్ బలంగా వినిపిస్తోంది.  

తెలంగాణలో నిప్పులు చెరుగుతున్న భానుడు.. మరో నాలుగు రోజులు అంతే!

తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకూ నమోదౌతాయని పేర్కొంది. ముఖ్యంగా కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, పాలమూరు, భూపాలపల్లిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. శని, ఆదివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాదరి, వరంగల్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. కాగా శుక్రవారం ( మే3) రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే మే 4, 5 తేదీలలో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.  ఇవి వినా మిగిలిన అన్ని జిల్లాలకూ రానున్న నాలుగు రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారి చేసింది. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతందనీ,  అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎండలు మండుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలో వాతావరణం వేడిగా ఉంటుందనీ, వడగాడ్పులు వీస్తాయనీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదౌతున్న నేపథ్యంలో ఎండ వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది. మండే ఎండలకు తోడు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 

బిల్లులు చెల్లించని జగన్ సర్కార్.. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!?

జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.  ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు. ఇందుకోసం కొత్త కార్డులను సైతం పంపిణీ చేశారు. ఇందులోనూ జగన్ పొటోల పిచ్చిని మరోసారి చాటుకున్నారు.   ఈ కొత్త కార్డులపై జగన్ ఫోటోలను ముద్రించి మరీ పంచారు.   ఈ కార్డుల పంపిణీ ఈ ఏడాది జనవరి వరకూ సాగింది.  జగన్ మోహన్ రెడ్డిని పేదల పాలిట పెన్నిధిగా, అప్బాధబాంధవుడిగా వైసీపీ నేతలు భజనగీతాలు ఆలపించేశారు కూడా.   అయితే,  రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉంది? ఏ జిల్లాలో ఏ ఆసుపత్రులలో ఈ వైద్య సేవ అమలు చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ కింద ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు? వైద్య పరీక్షలు, వైద్యం, అనంతరం తగిన మందులు కూడా ఆరోగ్యశ్రీలో భాగంగానే అందిస్తారా? మారిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి విధి విధానాలు ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న ఆసుపత్రులకు అందించారా? అనేదానిపై మాత్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. అలాగే అసలు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలను సకాలంలో చెల్లిస్తున్నారా? ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆరోగ్య శ్రీ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు? ఈ పథకాన్ని ఎంత మంది ప్రజలు వినియోగించుకున్నారు? జగన్ హయంలో ఇప్పటి వరకూ చెల్లించిన ఆరోగ్య శ్రీ నిధులెన్ని?  ఇప్పుడు ఎన్ని బకాయిలున్నాయన్నది కూడా జగన్ సర్కార్ రహస్యంగానే ఉంచింది. వాస్తవానికి   జగన్ ప్రభుత్వ హయంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి కోటాను కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు హయం వరకూ కాస్త ఆలస్యంగానైనా ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. పలుమార్పు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రావాల్సిన బకాయిల సంగతెలా ఉన్నా.. ఇకపై తమకు ఆరోగ్యశ్రీనే వద్దంటూ కొన్ని ఆసుపత్రులను ఈ సేవ నుండి బయటకొచ్చేశాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవ తమ ఆసుపత్రికి కావాలంటూ దరఖాస్తుల వెల్లువ రాగా.. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో ఉన్న ఆసుపత్రులే బయటకి వచ్చేశాయి.  ఇక మరికొన్ని ఆసుపత్రులలో అయితే కేవలం వైద్యం మాత్రమే ఆరోగ్య శ్రీలో అందిస్తుండగా.. మిగతా వైద్య పరీక్షలు, మందులు వంటి వాటి కోసం  రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులలో అయితే ఆసుపత్రులలో అన్ని పరీక్షలు చేసే సదుపాయం ఉన్నా.. బకాయిలు రాక ఆరోగ్యశ్రీ పేషేంట్లను బయట ల్యాబులకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు. కేవలం డాక్టర్ల ఫీజులు, ఆసుపత్రి రూమ్ అద్దెలు వంటివి మాత్రమే ఆరోగ్యశ్రీలో అందిస్తున్నారు. వాటికి ఆసుపత్రుల యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టే అవసరం లేకపోవడంతో.. ప్రభుత్వం నుండి బకాయిలు ఎప్పుడొచ్చినా తమకి నష్టం ఉండదన్న ఆలోచనతో ఇలా ఆరోగ్యశ్రీలో కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం ఆసుపత్రులైతే ప్రభుత్వం మారకపోతుందా.. కొత్త ప్రభుత్వంలో అయినా బిల్లులు రాకపోతాయా అని కొనసాగుతున్నారు.     ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. బకాయిలు కొండల్లా పేరుకుపోవడంతో  ఆంధ్రప్రదేశ్ లోని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ మేరకు ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోకు లేఖ రాసింది.   గత ఆరు నెలలుగా ప్రభుత్వం   ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలను ఇక అందించలేమన్నదే ఆ లేఖ సారాశం. ప్రభుత్వం గత ఆరునెలలుగా ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్పత్రులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయనీ, ఇంకెంత మాత్రం ఆరోగ్య శ్రీ పథకం కింద తమ ఆస్పత్రులలో వైద్య సేవలు అందించలేమనీ ఆ అసోసియేషన్ ఆ లేఖలో పేర్కొంది. తక్షణమే పెండింగ్ బిల్లులను చెల్లించనట్లైతే శనివారం (మే4) నుంచి తమ ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆ లేఖలో స్పష్టం చేసింది.    తనను తాను అత్యంత సమర్ధవంతమైన ముఖ్యమంత్రిగా, పేదల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నట్లు ఆత్మస్థుతిలో మునిగి తేలే జగన్ హయాంలో పేదల ఆరోగ్యం ఎంత నిర్లక్ష్యానికి గురైందనడానికి గత ఆరు నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులను నిలిపివేయడమే నిదర్శనం. ఇక ఇప్పుడు ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను ఇక కొనసాగించలేమంటూ చేతులెత్తేశాయి.  

కేదార్ నాథ్ ఆలయ మ్యూజియం నిర్మాణ నిపుణునిగా శివనాగిరెడ్డి

కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది. మ్యూజియంలోని వివిధ విభాగాల్లో ఏర్పాటు చేయబోయే ప్రదర్శితాలను ఎంపిక చేసేందుకు బుధవారం (మే1)  ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని తగు సూచనలు చేశారు.  కేదార్ నాథ్ ఆలయం వెనుక నిర్మిస్తున్న శివ ఉద్యానవనంలో ప్రదర్శించే  శివరూప శిల్పాలపై జరిగిన చర్చలో పాల్గొని, వివిధ రాజవంశాలకు చెందిన చారిత్రక శివుని శిల్పాలను ఎంపిక చేయటంలో స్థపతిగా తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశంలో నిపుణుల కమిటీ సభ్యులు డా.చూడామణి నందగోపాల్, డా. మాన్వి శెఠ్, డా. ప్రీతి త్రివేది, మేఘ్ కళ్యాణ సుందరం, నిఖిల్ వర్మ, స్తపతి ఉమాపతి ఆచార్య, సహాయకులు కాజల్, దుర్గేష్ లు పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.  కేదార్ పరిచయ మ్యూజియంలోని మూడు గ్యాలరీలో మొదటి గ్యాలరీలో తీర్థ స్థలంగా కేదార్నాథ్, రెండో గ్యాలరీలో శివుని కుటుంబం, శివారాధన, మూడో గ్యాలరీలో స్థానిక సాంప్రదాయాలు, సాంస్కృతిక అంశాలు, ఆలయ వెనక నిర్మించిన ప్రాకారంలో లోపలి వైపున శివుని వెయ్యి పేర్లు, శివుని ఆయుధాలు ప్రదర్శించబడతాయని ఆయన చెప్పారు.

బందరులో పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ వీరంగం!

ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని నాటకాల్లో నటనను పండిస్తే, ఇప్పుడు పేర్ని కిట్టు రౌడీయిజంలో నటనను పండిస్తున్నాడు. పేర్ని నాని ఇంతకాలం నియోజకవర్గంలో అరాచకాలు చేశారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకున్న పేర్ని కిట్టు ఆ అరాచకాలను కంటిన్యూ చేస్తున్నాడు. తండ్రి ఎమ్మెల్యే, మంత్రి అయ్యాక, కాస్త ముదిరాక  అరాచకాలు చేస్తే, పేర్ని కిట్టు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడే టాలెంట్ చూపించడం ప్రారంభించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రశాంతంగా వుండే మచిలీపట్నంలో అరాచకాలకు శ్రీకారం చుట్టిందే పేర్ని నాని. ఇప్పుడు పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం పేరుతో అరాచకాలకు అన్నప్రాశన చేసుకుంటున్నాడు. పేర్ని కిట్టు అభ్యర్థిత్వాన్ని వైసీపీ నాయకులలో చాలామంది అంగీకరించడం లేదు. అందుకే వారు పేర్ని కిట్టుతో కలసి ప్రచారం చేయడం ఇష్టం లేక దూరంగా వుంటున్నారు. మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్‌తో స్నేహసంబంధాలు, వ్యాపార అనుబంధాలు కొనసాగిస్తున్న పేర్ని కిట్టు ఇప్పుడు ఆ బ్యాచ్‌నే వెంటేసుకుని మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్‌తో కలసి చేస్తున్నది పేరుకే ప్రచారం. అతని ప్రధాన టార్గెట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులే. ప్రచారం పేరుతో  కూటమి నాయకుల ఇళ్ళ దగ్గరకి వెళ్తున్న పేర్ని కిట్టు తన గంజాయి బ్యాచ్‌తో కూటమి నాయకుల ఇళ్ళముందు మందుగుండు సామగ్రి విసురుతూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అదేమని ప్రశ్నిస్తే కూటమి నాయకులతో గొడవకి దిగుతూ, వారి ఇళ్ళలోకి వెళ్ళి విధ్వంసం సృష్టిస్తున్నారు. మొన్నీమధ్య పోతేపల్లిలో జనసేన కార్యకర్త మీద దాడి చేశారు. నిన్న కోన గ్రామంలో తెలుగుదేశం నాయకుడి మీద దాడి చేశారు. ఈరోజు మచిలీపట్నం ఎనిమిదో డివిజన్లో జనసేన నేత కర్రి మహేష్ ఇంటి మీద మీద గంజాయి బ్యాచ్‌తో దాడి చేయించాడు. గురువారం నాడు మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ వీధిలోకి గంజాయి బ్యాచ్‌తో కలసి ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు కర్రి మహేష్ ఇంటి ముందు బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ మహేష్ ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా కర్రి మహేష్ కుటుంబ సభ్యులు, పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ మధ్య తోపులాట జరిగింది.  తమ ఇంటి ముందు పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ దాడి చేసిందని కర్రి మహేష్ కుటుంబ సభ్యులతో కలసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దాంతో జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాయి. ఆందోళన చేస్తున్న జనసేన, టీడీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ సంఘీభావం పలికారు. కర్రి మహేష్ ఇంటి మీద దాడి చేసిన పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్‌ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.  ఇదిలా వుంటే, అధికారంలోకి రాకముందే పేర్ని కిట్టు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు.. రేపు పొరపాటున అధికారంలోకి వస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా వుంటుందోనని మచిలీపట్నం ఓటర్లు భయపడుతున్నారు.

దేవగౌడ మనవడికి ‘మాస్ రేపిస్ట్’ బిరుదు!

మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్నాటకలోని హసన్ నియోజకవర్గ ఎంపీ, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణను రాహుల్ గాంధీ ‘మాస్ రేపిస్ట్’ అని సంబోధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గురువారం కర్నాటకలోని శివమొగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణను ‘మాస్ రేపిస్ట్’ అని పేర్కొన్న రాహుల్ గాంధీ, ఇలాంటి వ్యక్తి ఓట్లు వేయాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ప్రజ్వల్ రేవణ్ణ నాలుగు వందల మంది మహిళల మీద అఘాయిత్యం చేశాడు. వారి వీడియోలు చిత్రీకరించాడు. ఇది దేశంలోనే అతి పెద్ద అత్యాచార ఘటన.. ప్రధాన మంత్రికి ప్రజ్వల్ రేవణ్ణ ఘనకార్యాల గురించి ముందే తెలుసు. అలాంటి వ్యక్తికి మద్దతుగా మోడీ మాట్లాడారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.

చేవెళ్ల లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందా? బీజేపీ, కాంగ్రెస్‌ బలహీనతలు ఏంటి?

ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్‌వేర్ రంగానికి ఆయువుపట్టు హైటెక్ సిటీ కూడా చేవెళ్ళ పరిధిలోకే వస్తాయి. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి.  చేవెళ్ళలో మూడు పార్టీల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా  మూడు ప్ర‌ధాన పార్టీల బ‌లాబ‌లాలు ఏమిటి? బ‌ల‌హీన‌త‌లు ఏమిటో చూద్దాం.  చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.  బీజేపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిః 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై, బీఆరెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి గెలుపొందారు.  ఓడిపోయిన  విశ్వేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు.  విశ్వేశ్వరెడ్డి గెలుపుకోసం బీజేపీ అనుబంధ సంస్థలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ముందుగానే అభ్యర్ధిగా ప్రకటించడం బీజేపీకి సానుకూలంగా మారింది. గతంలో ఆయన ఎంపీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. ప్రధాని మోదీ పేరునే ప్రధాన ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు.  బీజేపీ శ్రేణులతో పాటు ఆర్ ఎస్ ఎస్‌ అనుబంధ సంస్థలు చాపకింద నీరులా పనిచేస్తున్నాయి. స్థానికంగానే బసచేస్తూ క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తున్నాయి.  మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడితే ఇక్క‌డ బీజేపీ ఈజీగా గెలిచేది. కానీ ఎంఐఎం త‌న అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేదు. కాబ‌ట్టి పోటీ  కాంగ్రెస్ బీఆర్ ఎస్ మ‌ధ్య ముఖాముఖి పోటీ వుంది. బీఆర్ ఎస్ పార్టీకే ఇక్క‌డ క‌లిసి వ‌చ్చే అవకాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాంగ్రెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డిః చేవెళ్ళ సిట్టింగ్ ఎంపి. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.  చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ఎదురీదుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది. టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ నేతలు కూడా తరలివస్తారని కాంగ్రెస్‌ నాయకత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో చేరికలు జరడంగలేదు. దీంతో కాంగ్రెస్‌ ఆశించిన స్థాయిలో బలం పుంజుకోవడంలేదు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించినా తరువాత ఆయన వెనక్కి తగ్గారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మరుసటి రోజే ఆయన వెనక్కి తగ్గి బీఆర్ ఎస్ లో కొనసాగుతానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ నాయకత్వం అభాసుపాలైంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విష‌యంలోనూ ఓట‌ర్ల‌లో అస‌హ‌నం వ్య‌క్తం అవుతుంది. కాబ‌ట్టి కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బీఆర్ ఎస్ అభ్య‌ర్థి వైపే ఓట‌ర్లు మొగ్గు చూపుతున్నారు.   బీ ఆర్ ఎస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ః తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. జరిగిన రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గ‌డ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లోనూ రాజ‌కీయంగా అనుభ‌వం లేని నేత‌ల‌ను రంగంలోకి దింపి గెలిపించుకున్నారు గులాబీబాస్‌. ప్ర‌స్తుత బీఆరెస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ స్థానికుడు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు.  ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశారు. బీసీ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టు వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ జ‌నాభా కూడా 50 శాతానికి మించి వుంది. ఇవ‌న్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే కాసాని గెలిచిన‌ట్లేన‌ని స్థానిక ఓట‌ర్లు  చెప్పుకుంటున్నారు.  ఇక్క‌డ బీఆర్ఎస్‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ వుంది కాబ‌ట్టి ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి బీఆర్ ఎస్ చేవెళ్ళ‌లో హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని గులాబీ శ్రేణుల్లో ధీమా క‌నిపిస్తోంది.  స్థానికుడ‌నైన త‌న‌ను గెలిపించాల‌ని కాసాని కోరుతున్నారు. పైగా బీసీలంతా కాసానికే అండ‌గా వున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బీఆర్‌ఎస్‌ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. బీఆర్‌ఎస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రణాళిక బద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు గెలుపుకోసం బీఆర్ ఎస్‌ అనుబంధ సంస్థలు, బీసీ కుల‌సంఘాలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కాసాని జ్ఞానేశ్వర్‌  అభ్యర్ధి గా వుండ‌టం బీఆర్ ఎస్‌కు సానుకూలంగా మారింది. గతంలో ఆయన జ‌డ్పీ ఛైర్మ‌న్‌గా, ఎమ్మెల్సీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. కేసీఆర్ పాల‌నే  ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు. మరో వైపు  బీఆర్ ఎస్ సోషల్‌ మీడియా వింగ్‌ కూడా తెర వెనుక విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ ఎస్‌ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.   క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తూ కాసాని ప్రచారంలో ముందంజలో ఉన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా పట్టునిలుపుకునేయత్నం చేస్తోంది.  బీసీ కార్డును ప్రయోగిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి రోజు వారీ నియోజకవర్గంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యత సబితారెడ్డి తీసుకున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

మెట్రో అధికారులు సామాన్యులనీ కరుణించాలి!

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. క్రికెట్ ప్రేమికుల సౌకర్యాన్ని దృష్టిలో వుంచుకుని గురువారం రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో వుంటాయని మెట్రో అధికారులు ప్రకటించారు. సాధారణంగా రాత్రి పదిన్నర తర్వాత మెట్రోలు అందుబాటులో వుండవు. క్రికెట్ మ్యాచ్ కారణంగా రాత్రి 12:15కి ఎల్.బి.నగర్లో చివరి మెట్రో ప్రారంభమై, గమ్యస్థానమైన మియాపూర్‌కి 1:10 గంటలకు చేరుకుంటుదని ప్రకటించారు. ఉప్పల్, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మెట్రో ఎక్కడానికి మాత్రమే అనుమతి వుంటుందని, మిగతా స్టేషన్లలో దిగడానికి అనుమతి వుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. అంతా బాగానే వుందిగానీ, క్రికెట్ ప్రేమికుల కోసం లేట్ నైట్ మెట్రో నడుపుతున్న అధికారులు ప్రతిరోజూ సామాన్య ప్రజల కోసం కూడా లేట్ నైట్ మెట్రో నడపితే బాగుంటుంది కదా అనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. నిజానికి హైదరాబాద్ నిద్రపోని నగరాల జాబితాలోకి మెల్లగా ప్రవేశిస్తోంది. రాత్రి పదిన్నరకే మెట్రోని ఆపేయడం వల్ల చాలామంది  ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పన్నెండు గంటల వరకు మెట్రో వుంటే చాలా సౌకర్యవంతంగా వుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం మీద మెట్రోకి విజ్ఞాపలను అందాయి. కానీ ఫలితమే రాలేదు. అందువల్ల క్రికెట్ లవర్స్ మీద కురిపించిన అభిమానాన్ని సాధారణ ప్రయాణికుల మీద కూడా చూపించండి అని పలువురు మెట్రో అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏపీలో ప్రాణం తీసిన పెన్షన్!

భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  మామూలు రోజుల్లో అయితే ఏలాగోలా సర్దుబాటు చేసుకునేవారే, ఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పేలా చేయడం నిజంగా పాపం. ఆ పాపం శాపంలా మారి జగన్ ప్రభుత్వానికే తగలడం ఖాయం. రాయచోటిలో పెన్షన్ కోసం కెనరా బ్యాంకుకు వెళ్ళిన ముద్రగడ సుబ్బన్న అనే 80 సంవత్సరాల వృద్ధుడు బ్యాంక్ ఎదుట నిలబడి వుండగానే కిందపడిపోయి చనిపోయాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది.  వృద్ధుల ఇళ్ళకు వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి సరిపోయేంత ప్రభుత్వ సిబ్బంది వున్నప్పటికీ అలా చేయకుండా అందరూ బ్యాంకులకు వెళ్ళాల్సిందే అనే రూల్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల ముందు అనేకమంది వృద్ధులు మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి బ్యాంకులకు వచ్చిన వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు వచ్చిన వృద్ధులు అందరికీ పెన్షన్ అందుతోందా అంటే అదీ లేదు. చాలామంది వృద్ధుల అకౌంట్లో పెన్షన్ డబ్బు జమ కాలేదు.. వాళ్ళని తర్వాత రమ్మని  చెప్పి పంపేస్తున్నారు. దాంతో వృద్ధులు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. కొందరిని అయితే, మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్‌కి అనుసంధానం కాలేదంటూ పంపేస్తున్నారు. పెన్షన్ తీసుకున్నవారితోపాటు తీసుకోనివారు కూడా తమను ఇంత ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ శాపనార్థాలు పెడుతున్నారు.