ముద్రగడ బేటీ... పవన్‌ కళ్యాణ్‌తో భేటీ!

కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే. తన తండ్రి పవన్ కళ్యాణ్‌ని అన్యాయంగా విమర్శిస్తున్నారని, తన మద్దతు పవన్ కళ్యాణ్‌కేనని ప్రకటించి క్రాంతి సంచలనం సృష్టించారు. దీంతో ముద్రగడ షాక్‌కి గురయ్యారు. ఇదిలా వుంటే ముద్రగడ కుమార్తె క్రాంతి ఆదివారం నాడు పవన్‌కళ్యాణ్‌తో తునిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా క్రాంతి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ‘‘ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేన పార్టీ మీద నమ్మకంతో వచ్చారు. క్రాంతిని నా సోదరిలా గౌరవిస్తాను. అయితే, క్రాంతి జనసేన పార్టీలో చేరే అంశంపై నేను ముద్రగడతో మాట్లాడి, ఆయన అనుమతి తీసుకుంటాను. పెద్దవాళ్లు ఎన్ని మాటలైనా అంటారు. వాటిని సీరియస్‌గా తీసుకోకూడదు. నేను ముద్రగడను, ఆయన కుమార్తెను కలుపుతాను. ఈసారి ఎన్నికలలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని ఎమ్మెల్యేగా నిలబెట్టి గౌరవిస్తాను’’ అన్నారు. 

ఇక జవహర్‌రెడ్డిని పంపించడం మిగిలింది

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది. ప్రతిపక్ష నాయకులను అధికార పార్టీ వేధించడానికి రాజేంద్రనాథ్ ‌రెడ్డి తనవంతు సహకారం అందిస్తున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ విషయంలో కూడా రాజేంద్రనాథ్ రెడ్డి తన ప్రభావాన్ని చూపే అవకాశం వుందని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎన్నికల కమిషన్ సాగనంపాల్సిన మరో అధికారి చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి. ఈయన రాజేంద్రనాథ్ రెడ్డి కంటే వందరెట్లు డేంజరస్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జవహర్ రెడ్డి కూడా జగన్ రెడ్డికి విధేయుడే. ఇప్పటికే ఆయన విధేయతను అనేక సందర్బాల్లో చూపిస్తూ వస్తున్నారు. పోలింగ్ సందర్భంగా కూడా జవహర్ రెడ్డి తన జగన్ భక్తిని ప్రదర్శించే ప్రమాదం వుంది. అందుకే జవహర్‌రెడ్డిని కూడా విధుల నుంచి తప్పించాల్సిన అవసరం వుంది. ఈ విషయంలో కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం కోసం ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి.

ఏపీ డీజీపీని సాగనంపిన ఎన్నికల కమిషన్

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌కి వీర భక్తుడిగా పేరు తెచ్చుకున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణం ఎన్నికల విధుల నుంచి వైదొలగాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గారికి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ బాధ్యతనూ అప్పగించవద్దని చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి డీజీపీ ఎంపిక కోసం సోమవారం ఉదయం 11 గంటల లోగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను తమకు పంపాలని ఆదేశించింది. పేర్లను పంపడం మాత్రమే కాకుండా ఈ ముగ్గురికి సంబంధించిన ఐదేళ్ళ కాలానికి సంబంధించిన పనితీరు నివేదిక, విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను కూడా పంపించాలని సూచించింది. రాజేంద్రనాథ్ రెడ్డి జగన్‌కి విధేయుడిగా పనిచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ చర్య తీసుకుంది.

పెమ్మ‌సానికి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం.. మెజార్టీలో అగ్ర‌స్థానం ఖాయం

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ నేతల ప్ర‌చారం హోరెత్తుతోంది. రాష్ట్రం న‌లుమూల‌లా అభ్య‌ర్థులు గెలుపుకోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్త‌యితే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌, మేధావి వ‌ర్గ‌మూ ఎక్కువే. అలాంటి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. విజ‌యం ఎప్పుడో ఖాయం కాగా.. ఇప్పుడు పెమ్మసాని మెజారిటీపైనే  రాష్ట్రం వ్యాప్తంగా చ‌ర్చ‌ జరుగుతోంది బుర్రిపాలెం బుల్లోడుగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ముద్ర వేసుకున్న పెమ్మ‌సాని.. త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్తూ ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు పట్టిస్తున్నారు. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా కిలారు రోశ‌య్య బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ.. పెమ్మ‌సాని దూకుడుకు ఫ్యాన్ ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.  విద్యాభ్యాసంలోనూ, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ, యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డంలోనూ, నీతివంత‌మైన పాల‌న అందించే విష‌యంలో.. ఇలా ఏ అంశంలో తీసుకున్నా వైసీపీ అభ్య‌ర్థికి అంద‌నంత ఎత్తులో పెమ్మ‌సాని ఉన్నారన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీ లేదు. అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా, ఫిజిషియన్‌గా  సేవలందించిన పెమ్మసాని.. వ్యాపార రంగంలోనూ అగ్ర‌స్థానాల‌కు చేరుకున్నారు. అమెరికాలో ఉన్న‌ప్ప‌టికీ త‌న సొంత ప్రాంతానికి సేవ చేయాల‌న్న ఉద్దేశంతో  పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి..  పేద ప్రజలకు అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. ముక్కుసూటి త‌నం.. ఎలాంటి స‌మ‌స్య‌నైనా ఓపిగ్గా ప‌రిష్క‌రించే త‌త్వం.. ప్ర‌జ‌ల‌కు నిత్యం అండ‌గా నిలిచే స్వ‌భావం.. ఇలా అన్నివిధాల పెమ్మసానే మాకు స‌రైన నేత‌ అంటూ గుంటూరు పార్ల‌మెంట్ నియోజకవర్గ ప్ర‌జ‌లు ఆయనకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.  పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ , కిలారు రోశ‌య్య‌ల‌ను ప‌లు అంశాల్లో  పోల్చి చూస్తున్న  జనం అన్ని విధాల పెమ్మ‌సానే  బెట‌ర్ ఛాయిస్.. కాదు కాదు బెస్ట్ చాయిస్ అంటూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు.   విద్యార్హ‌తల విష‌యంలో..  కూటమి మ‌ద్ద‌తుతో గుంటూరు పార్ల‌మెంట్‌  నియోజకవర్గ బ‌రిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వైద్యునిగా అత్యున్నత స్థానం సాధించారు. 1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జ‌న్మించిన పెమ్మ‌సాని.. డాక్టర్ కావాలనే కలతో 1993-94లో ఎంబీబీఎస్‌ ఎంట్రన్స్‌లో 27వ  ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో మెడిసిన్ పూర్తి  చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవ‌త్స‌రంలో అమెరికాకు వెళ్లిన ఆయన.. పీజీ పూర్తి చేసి అక్కడే ప్రపంచవ్యాప్తంగా పేరున్న‌ జాన్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. ఈ రంగంలో అనేక మంది వైద్య విద్యార్థులకు మెటీరియల్ అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. వ్యాపార రంగంలోనూ రాణించి అమెరికాలో ఒక ఎంటర్ పెన్యూయర్గా ఎదిగారు. మ‌రోవైపు వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య విద్యాభ్యాసం చూస్తే డిగ్రీ బీకాం చదివారు. యువ‌త‌కు విద్యాప‌రంగా ఆయ‌న ఎలాంటి స‌హాయ‌క స‌హ‌కారాలు అందించిన దాఖలాలు లేవు. సేవా కార్య‌క్ర‌మాల్లో..  పెమ్మ‌సాని చంద్రశేఖర్ అమెరికాలోనూ, గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. పెమ్మసాని ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేసి   ఉచిత వైద్య సేవలు అందించ‌డంతోపాటు.. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. వ్యాపార రంగంలోనూ రాణించిన ఆయన తన పుట్టిన గడ్డకోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వ‌చ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్ ను ప్రారంభించారు.  దీనికితోడు పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య  విషయానికి వస్తే ఆయన ఇప్పటి వరకు విద్యా పరంగా చేసిన సేవలు లేవు. వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించిన దాఖలాలు లేవు. ఐదేళ్ల కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు. రాజ‌కీయ రంగంలో..  పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో కొన‌సాగారు.  పెమ్మ‌సానికి చంద్రబాబు అంటే చాలా ఇష్టం. చంద్రబాబు సీఎం హోదాలో అమెరికాలో పర్యటించిన‌ వేళ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాలకు పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది. అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకొని  తెలుగుదేశం బ‌లోపేతానికి చంద్ర‌బాబుతో కలిసి పని చేయడం ప్రారంభించారు.  2014లోనే తెలుగుదేశం నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు.  కానీ, 2014, 2019లో అవ‌కాశం ద‌క్క‌లేదు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకోవడంతో చంద్రబాబు మరో ఆలోచన లేకుండా ఆ స్థానంలో పెమ్మసానికి టికెట్ ఇచ్చారు.   దీంతో గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెమ్మ‌సాని తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.  కిలారు రోశ‌య్య విష‌యానికి వ‌స్తే.. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్యకు ఆ స్థానంలోనే  మ‌రోసారి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాక‌రించింది. గుంటూరు ఎంపీ అభ్య‌ర్థులుగా వైసీపీ అధిష్టానం ఇద్ద‌రిని బ‌రిలోకి దింపినా వారు పెమ్మ‌సానికి స‌రితూగ‌లేమ‌ని చేతులెత్తేశారు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో  మరో గత్యంతరం లేక సీఎం జ‌గ‌న్ గుంటూరు పార్ల‌మెంట్ బరిలో  రోశ‌య్య‌ను బ‌రిలోకి దింపారు. ప్రజా సమస్యలపై ఎవరి అవగాహనలో ..  పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచీ గుంటూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి గడపకూ వెళుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, లాయర్లు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, టీచర్లు, కార్మిక, కర్షక సంఘాల నాయకులతో సమావేశమవుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాననే భరోసా ఇస్తున్నారు. పేద వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ జీవన ప్రమాణాలను తెలుసుకుంటూ.. వారికి ఆర్థికాభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించారు. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి సమస్యపైనా చర్చిస్తూ పరిష్కార మార్గాలు చెబుతూ పెమ్మ‌సాని గుంటూరు పార్ల‌మెంట్  నియోజకవర్గ ప‌రిధిలోని ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు. అంతేకాదు.. అనేక సేవా కార్యక్రమాల‌ను నిర్వ‌హిస్తూ శెభాష్ పెమ్మ‌సాని అనిపించుకుంటున్నారు.   వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య గుంటూరు ప్రాంతంలో జన్మించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ప్రజల వద్దకు పెద్ద‌గా వెళ్లింది లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్ని గడపలు ఉన్నాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ప్రజా సమస్యల గురించి అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు.  రోశ‌య్యదీ రాజ‌కీయ నేప‌థ్య కుటుంబమే  అయినా.. ఆయన త‌న రాజకీయ జీవితంలోనూ సొంత నిర్ణ‌యాలు తీసుకున్న దాఖ‌లాలు లేవు. త‌న సామ‌ర్థ్యంతో రాజ‌కీయంగా ఎద‌గ‌లేదు. ఐదేళ్ల కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించిన పాపాన పోలేదు. ఏపీ రాజ‌ధాని విష‌యంలో..  పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ రాజధాని అమరావతిని అణువణువూ అధ్యయనం చేశారు. రాజధాని ప్రాంతంలో ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూ.. కూట‌మి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామ‌ని, ప్రపంచ పటంలో రాజధాని అమరావతిని నిలిపేందుకు పక్కా ప్రణాళికతో కృషి చేస్తామ‌ని గుంటూరు పార్ల‌మెంట్ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు.  వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా ప్రస్తావించడం  లేదు. ఐదేళ్లలో అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తుంటే ఎమ్మెల్యేగా ఉండి అడ్డుచెప్ప‌లేక పోయారు. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను ప్ర‌భుత్వం వేధిస్తుంటే అడ్డుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో అడుగు కూడా పెట్టలేదు. మూడు రాజధానులు అంటున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడుగుల‌కు మ‌డుగులొ త్త‌డం త‌ప్పితే.. అమ‌రావ‌తి రాజ‌ధాని గురించి రోశ‌య్య ప‌ట్టించుకున్నదే లేదు. యువ‌త‌కు ఆద‌ర్శం..  పెమ్మసాని చంద్రశేఖర్ వైద్య వృత్తిలో, వ్యాపార రంగంలో రాణించి ప్రపంచమే తన వైపు తిరిగి చూసేలా విజయాలు అందుకున్నారు. పేద ప్ర‌జ‌ల‌కు ,క‌ష్టాల్లో ఉన్న‌వారికి అండ‌గా నిలుస్తూ త‌న ట్ర‌స్ట్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ నేటి యువతకు మార్గదర్శకంగా నిలిచారు. అంతేకాదు.. యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ను రూపొందించారు.  వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య తన వ్యాపారాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డార ఆరోపణలు మెండుగా ఉన్నాయి. పదవిని అడ్డు పెట్టుకుని ప్రజా సందపను దోచుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క విష‌యంలోనూ రోశ‌య్య యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచేలా ప‌నులు చేయ‌లేదు.  అనేక అంశాల్లో పెమ్మ‌సాని చంద్ర‌శ‌ఖ‌ర్‌, కిలారి రోశ‌య్య‌ను గ‌మ‌నిస్తున్న‌ గుంటూరు పార్ల‌మెంట్  నియోజకవర్గ ప్ర‌జలు  పెమ్మ‌సానికి జై కొడుతున్నారు. భారీ మెజార్టీతో పెమ్మ‌సానికి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ పెమ్మ‌సాని మెజార్టీపైనే చ‌ర్చ‌ చేస్తున్నాయి. దీంతో, రాష్ట్ర రాజ‌కీయాల్లో పెమ్మ‌సానికే  అత్య‌ధిక మెజార్టీ అవ‌డం ఖాయ‌మ‌ని  విశ్లేష‌కులు గట్టిగా చెబుతున్నారు. 

పాస్‌బుక్ మీద ఫొటో... రైతుల ఓట్లు మటాష్!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో కారణాలు వున్నప్పటికీ, చాలా ముఖ్య కారణంగా చెప్పుకోవాల్సిన విషయం... రైతుల భూమి హక్కు పత్రం అయిన పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో ప్రచురించుకోవడం. తమ పూర్వికులు వారసత్వంగా ఇచ్చిన భూమి, తాము కష్టపడి సంపాదించుకున్న భూమి హక్కు పత్రాల పుస్తకం మీద జగన్ ఫొటో వుండటాన్ని రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వున్నారు. అయితే బాహాటంగా వ్యతిరేకిస్తే వేధించి ఉసురు తీస్తారన్న భయంతో ఇంతవరకు ఎవరూ కిక్కురుమని కూడా అనలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా రైతులకు తమ పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. తమ పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో పోవాలంటే, జగన్‌ని గద్దెదించడం మినహా మరో మార్గం లేదని రైతులు నిర్ణయించుకున్నారు. ఎక్కడోదాకా ఎందుకూ, జగన్ నియోజకవర్గంలోని పులివెందులలోనే వైసీపీ కార్యకర్త అయిన ఓ రైతు సాక్షాత్తూ భారతి ముందే ఈ విషయంలో నిరసన వ్యక్తం చేశాడంటే ఈ అంశం మీద రైతుల్లో ఎంత వ్యతిరేకత వుందో అర్థం చేసుకోవచ్చు. అలా జగన్ ప్రభుత్వం కూలిపోగానే ఇలా పాస్ బుక్‌లో జగన్ ముఖాన్ని చించేయడానికి రైతులు సిద్ధంగా వున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో వుండటం వల్ల రైతుల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని వైసీపీ నాయకులకు బాగా అర్థమైంది. రైతుల ఆస్తి మీద కూడా తన ఫొటోను ముద్రించుకోవాలనే దురాశకు రైతులు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని తెలుసుకున్న నాయకులు ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

తెలంగాణా పోలీసులు అమిత్ షా ను అరెస్టు చేస్తారా? రేవంత్ దూకుడు..

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కేసు నమోదైంది.  కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేశారు. అస‌లు కేసు ఏమిటంటే, ఇటీవ‌ల హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత మాట్లాడే వేళలో.. కొంతమంది చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారని.. దీంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఒక చిన్నారి చేతిలో ఉన్న ప్లకార్డులో కమలంపువ్వు గుర్తు ఉందని.. ఇద్దరు చిన్నారుల చేతుల్లో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉంది.  ఇలా ప్రచారం చేయటం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అమత్ షా ఉల్లంఘించినట్లుగా ఈమొయిల్ ద్వారా కాంగ్రెస్  నేత‌లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని బీజేపీ పట్టించుకోలేదని.. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు.  చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు.  అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా యమాన్ సింగ్.. ఏ2గా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. ఏ3గా అమిత్ షా.. ఏ4గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై డీప్ ఫేక్ వీడియో కేసు వెంటాడుతున్న‌ వేళ, అంతే స్థాయిలో అమిత్ షా మీద మరో కేసును సిద్ధం చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షా మీద కేసు పెట్టేంత ధైర్యం చేయ‌డం దేశ రాజ‌కీయాల్లోనే ఉత్కంఠ‌గా మారింది.   సి.ఎం. రేవంత్‌రెడ్డి దూకుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురి మీద కేసు నమోదు కావటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఈ కేసును ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు సి.ఎం. రేవంత్‌ను అరెస్ట్ చేస్తారా? లేక తెలంగాణా పోలీసులు అమిత్‌షాను అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ‌త నెల‌కొంది.

ఇవండీ అసలు సిసలు ‘నవరత్నాలు’!

పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో జనాన్ని మాయలో పడేశారు. ఈ ఐదేళ్ళ పరిపాలనలో ఆయన చెప్పిన నవరత్నాల అమలు ఎలా వున్నా, ఆయన అమలు చేసిన అసలు సిసలు నవరత్నాలు వేరే వున్నాయి. అవేమిటో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తెలియజేశారు. 1. ఇసుక మాఫియా: గతంలో తక్కువ ధరకు, కొన్ని సందర్భాల్లో ఉచితంగా కూడా లభించే ఇసుకను బంగారం చేసేశారు. ఇసుక చుట్టూ రాష్ట్రవ్యాప్తంగా మాఫియాని క్రియేట్ చేశారు. సామాన్యులు ఇసుక కొనుక్కోలేని పరిస్థితి తెచ్చారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులకు ఇసుక భూములు వుంటాయి. వారి భూమిలోని ఇసుక వారి సొంత ఇంటి నిర్మాణానికి కూడా వాడుకోలేని పరిస్థితి తెచ్చారు. ఇష్టారాజ్యంగా ఇసుకను అమ్ముకున్నారు. అదేమిటని ప్రశ్నించిన వారిని అడ్డు తొలగించుకుని, ఆ ఇసుకలోనే పూడ్చేశారు. 2. జే బ్రాండ్ మద్యం: జగన్ ప్రభుత్వం పంపిణీ చేసిన దాన్ని ఆల్కహాల్ అనడం కంటే హాలాహలం అనడం బెటర్. దేశమంతటా అమ్మే బ్రాండ్స్.ని పక్కన పెట్టి తన సొంత మనుషులు క్రియేట్ చేసిన వింత బ్రాండ్స్.ని జనం గొంతులో పోశారు. మద్యం రేట్లను మూడింతలు పెంచేశారు. రేటు పెంచితే పెంచారు.. నాణ్యమైన మద్యం అయినా అమ్మారా? కాలకూట విషాన్ని అమ్మారు. జే బ్రాండ్ మద్యం పేరుకే మద్యం అని.. అందులో ప్రాణాలు తీసే కెమికల్స్ తప్ప ఆల్కహాల్ లేదని లాబ్ రిపోర్టు కూడా ప్రూవ్ చేశాయి. సంపూర్ణ మద్యనిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి, కల్తీ మద్యం ద్వారా లక్షల కోట్లు దండుకున్నారు. 3. భూ మాఫియా: ఏదైనా స్థలం మీద వైసీపీ నాయకుల కన్ను పడిందంటే సొంతం చేసుకోవడం ఖాయమంతే. మొదట ఏ వివాదమూ లేని స్థలాన్ని వివాదంలోకి లాగుతారు. ఆ తర్వాత రాయలసీమ బ్యాచ్‌ని రంగంలోకి దించుతారు. వీళ్ళు చెప్పిన ధరకు ఇచ్చేసి అసలు ఓనర్ బతుకుజీవుడా అని పారిపోయేలా చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు లెక్కపెట్టడానికి వీల్లేనని చేశారు. 4. మైనింగ్ మాఫియా: వైసీపీ నాయకుల మైన్స్.లో మాత్రమే ఏమాత్రం ఇబ్బంది లేకుండా తవ్వకాలు జరుగుతాయి. వైసీపీ నాయకుల డిమాండ్స్ తీర్చని, ప్రతిపక్ష నాయకులకు చెందిన మైనింగ్ యజమానులను ముప్పుతిప్పలు పెట్టి వాళ్ళ మైన్స్ మూసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక సొంత మైనింగ్ అయితే అనుమతి తీసుకునేది గోరంత... తవ్వుకునేది కొండంత.. అడ్డు చెబితే ఏమవుతుందో తెలుసు కదా.. 5. హత్యా రాజకీయాలు: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ళలో ఎన్నో వందల మంది తెలుగుదేశం కార్యకర్తలను వైసీపీ నాయకులు పొట్టన పెట్టుకున్నారు.  6. ప్రజల ఆస్తుల కబ్జా: రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకుల అరాచకాలే. ప్రజల ఆస్తులను కబ్జా చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలు. 7. ఎర్రచందనం, గంజాయి: మూడు రాజధానుల సంగతేమోగానీ, ఆంధ్రప్రదేశ్‌ని గంజాయి రాజధానిని చేసిన ఘనత జగన్‌కే దక్కుతుంది. చాలామంది వైసీపీ నాయకులు గంజాయి వ్యాపారులుగా మారారు. ఇక ఎర్రచందనం  విషయానికి వస్తే, గతంలో ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేవారు.. ఇప్పుడు అలాంటి అరెస్టులేవీ లేవు.. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోయిందని కాదు.. ఎర్రచందనం స్మగ్లర్లు అస్మదీయులు కాబట్టి.. 8. దాడులు, అక్రమకేసులు: తమ మాట వినకపోతే దాడులు.. తమను వ్యతిరేకిస్తే అక్రమ కేసులు.. అనధికారికంగా, అధికారికంగా ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. చివరికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మీద కూడా అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారు.  9. శవ రాజకీయాలు: జగన్ పరిపాలనలో ఎన్ని హత్యలు జరిగాయో చెప్పడానికి నోట మాట కూడా రాదు.. హత్యలు చేసి శవాలను డోర్ డెలివరీ చేయడంలో వైసీపీ నాయకులు స్పెషలిస్టులుగా మారారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా దాన్ని ప్రతిపక్షం అకౌంట్లో వేసి శవాల మీద మరమరాలు ఏరుకునే పని జగన్ ఆశీస్సులతో వైసీపీ నాయకులు చేశారు.

జగన్ మానసిక స్థితి మీద అనుమానం: షర్మిల

తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె శనివారం నాడు జగన్‌కి ఒక అద్దాన్ని బహుమతిగా పంపారు. ఆ అద్దంతో జగన్‌కి తానే కనిపిస్తాడో, లేక చంద్రబాబు కనిపిస్తాడో చూసుకోవాలని సూచించారు. మీకు ఎందుకు చంద్రబాబు పిచ్చి ఇంతలా పట్టిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తన సోదరుడిని ఉద్దేశించి అన్నారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో మేం న్యాయం కోసం పోరాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈరోజు వరకు చెప్పకుండా చంద్రబాబుతో మేం చేతులు కలిపామని చెబుతున్నారేంటని ఆమె నిలదీశారు. వివేకాని గొడ్డలితో నరికి హత్య చేస్తే సాక్షి ఛానల్లో హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు పేరు జపం ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు వివేకా హత్యమీద సీబీఐ ఎంక్వయిరీ డిమాండ్ చేసిన మీరు, మీరు సీఎం అయిన తర్వాత సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు వద్దన్నారో్ సమాధానం చెప్పాలి అన్నారు. ఆధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా చూస్తూ వున్నాడని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు కదా.. దానికి సమాధానం చెప్పండి అని షర్మిల అన్నారు. ‘‘మీకు చంద్రబాబు పిచ్చి పట్టిందేమోనని నాకు అనుమానంగా వుంది. అందుకే ఈ అద్దం మీకు పంపిస్తున్నాను. ఇందులో మీకు మీరే కనిపిస్తున్నారో, చంద్రబాబు కనిపిస్తున్నారో చూసుకోండి’’ అని షర్మిల అన్నారు. 

మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి!!

ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి. అవును.. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే ఈ రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ముందుగానే రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితంలో ఆ రెండు రోజులు చాలా ముఖ్యమైనవి. అందులో ఒకటి మే 13 ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగే రోజు. మరోరోజు జూన్ 4 ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడయ్యే రోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీలో మే 13 అనే గొప్ప తేదీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయిదేళ్ళుగా తమను పట్టి పీడిస్తున్న కరోనా కంటే డేంజరస్ అయిన జగన్ అనే మహమ్మారిని ఓటు అనే వ్యాక్సిన్‌తో వదిలించుకునే అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు. ఎప్పుడెప్పుడు మే 13 వస్తుందా.. ఎప్పుడెప్పుడు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి గతంలో తాము చేసిన పొరపాటును సరిదిద్దుకుందామా అని ఆత్రుతపడుతున్నారు. తాము ఓటు హక్కు వినియోగించుకుని పీడ విరగడ చేసుకునే రోజును నరక చతుర్దశిగా, ఎన్నికల ఫలితాలు విడుదలై, జగన్ ప్రభుత్వ పీడ విడగడయ్యే జూన్ 4వ తేదీని దీపావళిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించడం సమంజసమే కదా!

ప్రపంచ వింత: పూజారుల ఆశీస్సులు తీసుకున్న అసద్!

ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూ పూజారుల ఆశీస్సులు తీసుకున్నారు. పూజారి చేత మెడలో దండ వేయించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూసారాంబాగ్‌లో శనివారం నాడు అసదుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడే వున్న ఒక హనుమాన్ గుడి దగ్గరకి వెళ్ళిన మజ్లిస్ కార్యకర్తలు తమ నాయకుడిని ఆశీర్వదించాలని అక్కడే వున్న పూజారిని కోరారు. పూజారి అసదుద్దీన్‌ని ఆశీర్వదించి, మెడలో దండ వేసి, శాలువా కప్పారు. సాధారణంగా హిందూ నాయకులు చర్చికి వెళ్తారు, మసీదులకు, దర్గాలకు టోపీ పెట్టుకుంటారు. కానీ ముస్లిం నాయకులు హిందూ సంప్రదాయాలను కొద్దిసేపైనా పాటించింది చాలా తక్కువ. అది కూడా కరడుగట్టిన ముస్లిం నాయకుడు అసదుద్దీన్ హనుమాన్ గుడి పూజారి చేత ఆశీస్సులు తీసుకోవడం నిజంగా వెరైటీనే.  అసదుద్దీన్ ఇటీవల వేరే ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ముగ్గురు పూజారులు కూడా పాల్గొన్నారట. ఈసారి ఎన్నికలలో బీజేపీ తరఫున మాధవీలత హెదరాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచారు. హిందూ ఓట్లు ఆమెకే పడతాయి. ముస్లిం మహిళల ఓట్లను కూడా ఆకర్షించే విధంగా ఆమె ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏనాడూ ఇప్పుడున్న స్థాయిలో అసదుద్దీన్ ప్రచారం చేసిన దాఖలాలు లేవని, మాధవీలతకు భయపడే ప్రచారం జోరు పెంచారని, హిందూ పూజారుల చేత ఆశీస్సులు తీసుకుంటున్నారని బీజేపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం తిప్పల్లో భాగంగా అసదుద్దీన్ తాను ప్రచారం చేస్తున్న సమయంలో తెలుగు పాటలను కూడా వినిపిస్తున్నారు. హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి అసద్ చేస్తున్న మరో ప్రయత్నమిదని పరిశీలకులు అంటున్నారు.

ప్రియాంక గాంధీ పోటీ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం అదేనా?

కాంగ్రెస్​ పార్టీపై, బీజేపీ చేసే ప్రధాన ఆరోపణ.. వారసత్వ రాజకీయం. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే.. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ.. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు. అందుకే ఆమె ఈ లోక్‌స‌భ ఎన్నికల్లో పోటీ చేయ‌డం లేదు. బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ఆమె విముఖత చూపారట‌. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తో పాటు బీజేపీ నేతలంతా, కాంగ్రెస్‌ ను వారసత్వ పార్టీ అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.  ఇప్పటికే సోనియా కుటుంబం నుంచి ఆమెతో పాటు ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ఎంపీలుగా ఉన్నారు. సోనియాగాంధీ 1998 నుంచి రాహుల్‌ గాంధీ 2004 నుంచి ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎంపీలుగా కొనసాగుతుండటంతో,  ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తే బీజేపీ విమర్శలకు బలం చేకూర్చినట్టవుతుందని భావించే ప్రియాంక పోటీకి దూరంగా వున్నారు.  అమేథి, రాయబరేలిల్లో ఎక్కడో చోట నుంచి పోటీ చేయాలన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రతిపాదనను ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. బీజేపీ వారసత్వ రాజకీయాల విమర్శలకు భయపడే ప్రియాంక పోటీకి దూరంగా వున్నారు.  గ‌త కొంత కాలంగా రాయ్ బరేలిలో ప్రియాంక పోటీ చేస్తారంటూ తెగ ప్ర‌చారం జ‌రిగింది.  ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లోని అమేథి, రాయ్ బరేలి లోక్ సభ స్థానాలు మొదటి నుంచి గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్నాయి.  గత లోక్ సభ ఎన్నికల్లో అమేథి నుంచి ఎంపీగా పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే రాహుల్ గాంధీ అమేథి నుంచి ఓడిపోయినప్పటికీ కేరళ రాష్ట్రం వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం జరిగే లోక్ సభ ఎన్నికల్లో  వయనాడ్ తో పాటు, రాయ్ బరేలి నుంచి రాహుల్‌ పోటీ చేస్తున్నారు.  రాయబరేలిలో 2004 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్‌ గాంధీ  పోటీ చేస్తున్నారు. అయితే అమేథిలో ఓటమి భయం వెంటాడటం వల్లే రాహుల్‌ గాంధీ అక్కడి నుంచి పారిపోయి రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.   ఈ ఎన్నికల్లో పోటీ చేసి కేవ‌లం ఒక‌ నియోజకవర్గానికే పరిమితం కావడం కంటే దేశవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ  బలోపేతానికి కృషి చేయాలని ప్రియాంక గాంధీ భావిస్తున్నారు.  మోదీ వేవ్​తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్​కు స్టార్ క్యాంపెనీయ‌ర్ గా ప్రియాంక గాంధీ ప్ర‌చారం చేస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

17 మంది హత్య... 700 ఏళ్ళ జైలు శిక్ష!

అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తాను పనిచేసే ఆస్పత్రిలోని రోగులకు ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి 17 మందిని హత్య చేసినందుకు ప్రెస్డీకి కోర్టు ఈ శిక్ష విధించింది. 2020-2023 మధ్యకాలంలో అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రాంతంలో ఈ నర్సు వివిధ ఆస్పత్రుల్లో పనిచేసింది. ఈ సమయంలో తాను పనిచేసే ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు ఈమె ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఇంజక్ట్ చేసేది. ఈమె అలా మొత్తం 22 మందికి చేసింది. దాని వల్ల 17 మంది మరణించారు. ఇన్సులిన్ ఎక్కువగా ఇవ్వడం వల్ల హైపోగ్లైసీమియాకి దారి తీస్తుంది. దానివల్ల గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. గుండె పోటు వస్తుంది. ఈ హత్యలు చేసినట్టు నిందితురాలు ఒప్పుకుంది. ఎక్కువ ఇన్సులిన్ ఇచ్చి ఇద్దరిని హత్య చేసినట్టుగా ఈమె మీద గతంలో కేసు నమోదైంది. అయితే పోలీసుల విచారణలో ఈమె చంపింది ఇద్దర్ని కాదు పదిహేడు మందిని అని తేలింది. ప్రెస్డీ రోగులతో, వారి బంధువులతో చాలా దురుసుగా ప్రవర్తించేదని, ఆమె తన తల్లికి ఫోన్లో మెసేజ్‌లు పెడుతూ, తన చుట్టూ వున్న పేషెంట్లు తనకు ఎంతమాత్రం నచ్చడం లేదని, వాళ్ళందర్నీ చంపేయాలని అనిపిస్తోందని పేర్కొనేదని పోలీసులు తెలిపారు. ఆమె మానసికంగా బాగానే వుందని, ఉద్దేశపూర్వకంగా ఈ హత్యాకాండ చేసిందని పోలీసులు వెల్లడించారు. 

డ్ర‌గ్స్ రాజ‌ధానిగా ఏపీ! గంజాయిపై పెమ్మసాని గర్జన

పుస్తకాలతో కుస్తీ పడాల్సిన యువత జీవితాలు మత్తులో సుస్తీ అవుతున్నాయి. ఉన్నతంగా ఎదగాల్సిన జీవితాలు, గంజాయి కూపంలో కూరుకుపోతున్నాయి. బిడ్డలపై తల్లిదండ్రుల ఆకాంక్షలు, గుప్పుమనే గంజాయికి నిప్పులా కాలిపోతున్నాయి. బతుకు మార్గం తెలుసుకోవాల్సిన జీవితాలు, గంజాయికి మత్తుకు అర్థంతంగా ముగిసిపోతున్నాయి. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయారు గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని. గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు.  గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమ‌ర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.  బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ ను సీబీఐ ప‌ట్టుకుంది. ఈ డ్ర‌గ్స్‌ కేసు వైసీపీ చుట్టూ తిరుగుతోంది. గ‌తంలో ముంద్రా పోర్టులో ప‌ట్టుబ‌డిన హెరాయిన్ మూలాలు, వివిధ రాష్ట్రాల‌లో ప‌ట్టుప‌డుతున్న గంజాయి స‌ర‌ఫ‌రా మూలాలు అన్నీ ఏపీ వైపే వేలెత్తి చూపుతున్నాయి. గ‌తంలో ప‌ట్టుబ‌డిన హెరాయిన్ సరుకు మీద ఉన్న ఆషి ట్రేడింగ్ కంపెనీ విజయవాడ అడ్ర‌స్‌లో న‌మోదైంది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా దొరికిన హెరాయిన్ విజయవాడ అడ్రస్ తో ఉండడంతో, ఆ సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చింది కావడంతో, ఇక జీఎస్టీ నెంబర్ కూడా దానికి ఉన్న నేపథ్యంలో ఏపీకి చెందిన అధికార పార్టీ నేత‌ల హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపించాయి.  అలాగే బెంగుళూరులో పట్టుబడిన సింథటిక్ డ్రగ్స్ మూలాలు ఏపీలో ఉన్నాయని క‌ర్ణాట‌క పోలీసులు తేల్చారు.   యువ‌త‌ను టార్గెట్ గా చేసుకుని గంజాయి ముఠాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెచ్చిపోతున్నాయి. మైన‌ర్లు కొంద‌రు త‌మ‌కు తెలియ‌కుండానే ఈ రొంపిలోకి దిగుతున్నారు.  అందుకే గంజాయి, కొకైన్ లాంటి మ‌త్తు ప‌దార్థాల ర‌వాణా  సులువుగా సాగిపోతోంది. వీరి వెనుక రాజ‌కీయ నాయకుల అండ‌దండ‌లు ఉన్నాయంటారు పెమ్మ‌సాని. ఏపీకి దిగుమతి అవుతున్న నిషేధిత డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింద‌ని పెమ్మ‌సాని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హెరాయిన్ కేసులో కానీ, విశాఖ భారీ డ్ర‌గ్స్ కేసులోకానీ కింగ్‌పిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా తేల‌లేదు. ఏపీలో మ‌ద్యాన్ని ఇష్టం వ‌చ్చిన ధ‌ర‌ల‌కు అమ్ముకుంటున్నారు. 60 రూపాయ‌లు ఉన్న చీప్ లిక్క‌ర్‌ను రూ.200ల‌కు విక్ర‌యిస్తున్నారు. రాజ‌ధాని లేదు కానీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ పేరుతో మ‌ద్యం బ్రాండ్ల‌ను జ‌గ‌న్ అమ్ముతున్నారని పెమ్మ‌సాని మండిప‌డ్డారు. గత దశాబ్దకాలంగా భారతదేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా పెరిగింద‌ని పెమ్మ‌సాని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దాంతోపాటే వినియోగమూ విప‌రీతంగానే పెరిగింది. ఏదో ఒక మూలనుంచి మన దేశానికి మాదకద్రవ్యాలు చేరుతూనే ఉన్నాయి. డ్రగ్స్ కు బానిసలవుతున్నవారిలో యువతదే సింహభాగం.  ప్రపంచంలోనే ఓపియం (నల్లమందు)ను అధికంగా సాగు చేసే మయన్మార్, ఆప్ఘనిస్తాన్ దేశాలకు సమీపంలో ఉండటం కూడా భారత్ కు శాపంగా పరిణమించింది. ఆప్ఘన్ లో సాగయ్యే ఓపియంను పాకిస్తాన్ హెరాయిన్ గా మార్చి ఇండియాలోకి అక్రమంగా రవాణా చేస్తోంది. మయన్మార్ లోని షా, కచిన్ రాష్ట్రాలలో తయారయ్యే హెరాయిన్, మెథాంఫెటమైన్ డ్రగ్స్ ను భారత్ లోకి అక్రమంగా రవాణా చేసేందుకు స్థానిక తిరుగుబాటు ముఠాలను చైనా ప్రోత్సహిస్తోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అంచనాల ప్రకారం భారతదేశానికి అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ లో 70 శాతం అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతం ద్వారా చేరుతున్నాయి.  త‌న‌ను గెలిపించి పార్ల‌మెంట్‌కు పంపిస్తే, ఈ డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిని దేశం నుంచి త‌రిమేయ‌డానికి పార్ల‌మెంట్‌లో పోరాడ‌తాన‌ని పెమ్మ‌సాని గ్యారెంటీ ఇస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

వివాహేతర సంబంధాన్ని నేరం అనలేం: కోర్టు

స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం అనలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వివాహేతర సంబంధాన్ని నేరం అనలేమని చెప్పింది. వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధం వుండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమం మాత్రమేనని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.  కోర్టు ఈ వ్యాఖ్యలను ఒక కేసు విషయంతో తీర్పు ఇస్తూ చేసింది. ఒక మహిళ కొంతకాలంగా ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. అయితే ఆ వ్యక్తి తనకు పెళ్ళి అయిన విషయం దాచి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ కోర్టు మెట్లు ఎక్కింది. అతనితో శారీరక సంబంధాన్ని ఇష్టపూర్వకంగానే కొనసాగించి, అతనికి ముందే పెళ్ళయింది కాబట్టి తనను నమ్మించి మోసం చేశాడని అనడంలో అర్థం లేదని జస్టిస్ అమిత్ మహాజన్ స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి లొంగదీసుకున్నాడని చెప్పినప్పటికీ దీన్ని నేరంగా పరిగణించలేమని అన్నారు. 

బీఆర్ఎస్ ఎన్నికల ఎత్తుగడ... హైదరాబాద్ యూటీ బూచి?

హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి  కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరి కొన్నాళ్లు కొనసాగించాలని  తెలుగుదేశంనాయకుడు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు  తాజాగా ఆరోపించారు.ఇవి తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలని తెలంగాణను కాపాడుకోవాలంటో లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఓట్లేయాలని పిలుపునచ్చారు. తెలంగాణ అస్థిత్వం కోసం ఢిల్లీలో కొట్లాడాలంటే తగిన ఎంపీ స్థానాలు అవసరమని కేటీఆర్,హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.   జూన్ 1వతేదీతో 10ఏళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో బీఆర్ఎస్ వినా ఎవరూ ఉమ్మడి రాజధాని గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. అధికారానికి దూరమైన బీఆర్ఎస్ కు, ఈ నెలలో జరిగే ఎన్నికలలో ఓటమి భయంతో వణికి పోతున్న జగన్ పార్టీకీ మాత్రమే ఉమ్మడి రాజధాని గుర్తుకు వచ్చింది. వాస్తవానికి ఏపీలో జగన్ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఈ ఐదేళ్లలో  హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విషయమే ఆయనక గుర్తులేదు. ఇప్పుడు ఎన్నికల ముంగిట ఓటమి భయం వెంటాడుతుంటే.. ఆయన ఉమ్మడి రాజధానిని వదిలేసి వచ్చి చంద్రబాబు తప్పు చేశారంటూ విమర్శలు ఎత్తుకున్నారు. వాస్తవానికి  చంద్రబాబు హయాం లోనే ఏపీకి సంబంధించిన కార్యాలయాలన్నీ దాదాపుగా ఏపీకి తరలి వచ్చాయి. మిగిలిన కార్యాలయాలు కూడా జగన్ అధికారం చేపట్టిన తరువాత ఏపీకి తరలివచ్చాయి.  జూన్ 1వ తేదీ తరువాత హైదరాబాద్ కేంద్రం చేతిలోకి వెళుతుందన్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లు తెలంగాణలో ఎన్నికల హీట్ పెంచాలనీ, ఐటీ బూచిని చూపి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందాలనీ చూస్తున్నారు.   బీజేపీ నుంచి హైదరాబాద్ యూటీ అన్న ప్రతిపాదన ఏదీ రాకుండానే బీఆర్ఎస్ కీలక నేతలు ఎందుకు ఆ అంశాన్ని లేవనెత్తారన్నది బహిరంగ రహస్యమే. తెలంగాణ సెంటిమెంట్ ఒక్కటే తమను లోక్ సభ ఎన్నికలలో జీరో స్థానాల పరాభవం నుంచి గట్టెక్కగలదని బీఆర్ఎస్ భావిస్తుండటమే యూటీ బూచిన ఎన్నికల అంశంగా మార్చాలని బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు కారణం.   తెలంగాణ ఉద్యమం సమయంలో, రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ యూటీ ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. అప్పట్లో ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రజలు ,నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదన అప్పట్లోనే అటకెక్కింది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ యూటీ ప్రతిపాదనకు అప్పట్లో కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.  ఆ తరువాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను నిర్ణయించినా, దానిని ఎవరూ కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఉత్తరాది,దక్షిణాది అంశాలు   తెరపైకి వచ్చిన నేపథ్యంలో కొంత కాలం కిందట హైదరాబాద్ ను ఢిల్లీ తరువాత దేశానికి రెండవ రాజధానిగా మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది. శీతాకాలపార్లమెంటు సమావేశాలు  దక్షిణాదిలో హైదరాబాద్ లో జరపాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే.  రాజ్యాంగంలో కూడా  రెండవ రాజధాని ప్రస్తావన ఉందని కొందరు చెబుతున్నారు కూడా. మొత్తం మీద తెలంగాణలో కనీస స్థానాలను దక్కించుకుని పరువు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ రాష్ట్రాల మధ్య సెంటిమెంటు మంటలు రగల్చడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. అయితే సెంటిమెంట్ రగిల్చేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలైతే ఇసుమంతైనా కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా బీజేపీ మద్దతు పొందాలన్న తహతహ బీఆర్ఎస్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందుకే కేసీఆర్ బీజేపీకి గెలుపు అవకాశాలున్న ఐదు నియోజకవర్గాల గురించి పట్టించుకోవడం లేదనీ, తన ప్రచారంలో కేవలం 12 స్థానాల్లో విజయం అనే అంటున్నారని చెబు తున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో  పెను మార్పులు అంటూ కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారీ ఒప్పందానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలలో జీరో కాకూడదని బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కపపడానికీ, తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికీ కూడా వెనుకాడటం లేదని అంటున్నారు. 

జనం చెవిలో రేవంత్ రెడ్డి పూలు!

రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు పెట్టిన పూలే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెడుతున్నారు. ఎందుకంటే, ఆ పూలు పెట్టక తప్పని పరిస్థితి. విభజన చట్టం ప్రకారం పోలవరం పరిసరాల్లోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యాయి. 2014లో ఈ విలీనం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రక్రియకు మద్దతు పలికారు. అది జరగక తప్పని అంశం అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ మాట మార్చారు. ఆంధ్రాలో కలసిన గ్రామాలను తిరిగి తెలంగాణకు తెస్తాం అని చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చి పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ అండ్ కంపెనీ విలీన గ్రామాలు అనే పాయింట్‌ని పట్టుకుని మొన్నటి వరకూ వేలాడింది. ఇప్పుడు అదే పాయింట్‌ని పట్టుకుని రేవంత్ రెడ్డి వేలాడ్డం ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రీసెంట్‌గా విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఈ హామీ చేశారు. ఏపీలో విలీనం అయిన గ్రామాలను వెనక్కి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావాల్సిన 1. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, 2. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, 3. హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), 4. హైదరాబాద్-విజయవాడ రహదారి వెంటే వేగవంతమైన రైల్వే ప్రాజెక్టు, 6. మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు... ఇవన్నీ సాధిస్తామని రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సినవి ఇవ్వాల్సిందే అని అడగడంలో న్యాయం వుంది. కాకపోతే అదే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే కదా... తెలంగాణలోని గ్రామాలను ఆంధ్ర్రపదేశ్‌లో కలిపింది. మాకు రావలసినవి అడుగుతాం.. ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వం అనే సిద్ధాంతం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. పైగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే.  కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే జనాన్ని మభ్యపెట్టడానికి గ్రామాలను తిరిగి తెచ్చే హామీ ఇస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవాలని అనుకుంటే ఆయన ఇష్టం. ఎవరు కాదంటారు?

అసదుద్దీన్ కు ఓటమి భయం... తెలుగు పాటలతో హిందూ ఓటర్లకు గాలం

40 ఏళ్లుగా హైద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్న మజ్లిస్ పార్టీకి ఈ లోకసభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ( సాలార్) తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ  వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. హైదరాబాద్ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు హిందువులవి.  ముస్లింల  పార్టీగా ముద్ర పడ్డ మజ్లిస్ గెలుపొందుతూ వస్తోంది.  కానీ ఈ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా  మారింది. బిజెపి తరపున మాధవిలత పోటీ చేయడమే దీనికి ప్రధాన కారణం. బిజెపిలో ప్రాథమిక సభ్యత్వం తీసుకోకుండానే హైద్రాబాద్ టికెట్ దక్కించుకున్న మాధవిలత సోషల్ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యం పొందారు. సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా లతామా ఫౌండేషన్ ద్వారా ఆమె అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆమె ఎలాంటి సెక్యురిటీ లేకుండానే దూసుకుపోయారు.ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఆమెకు వై కేటగిిరి సెక్యురిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్ బిజెపి అభ్యర్థికి ఇలా సెక్యురిటీ కల్పించడం ఇదే మొదటిసారి.  ముస్లిం గర్బిణీ స్త్రీలకు ఉచితంగా ప్రసవాలు చేయించడం , ఆకలితో అలమటిస్తున్న ముస్లిం కుటుంబాలను గుర్తించి రేషన్ సప్లయ్ చేయడం ఆమె గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. (పస్మందా) (దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నముస్లింలు) నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని 40 ఏళ్ల నుంచి వారి కోసం ఆలోచించడం లేదని మాధవిలత వాదన. మాధవిలత ఏనాడు హైదరాబాద్ టికెట్ అడగలేదు. ఆమె సేవలను గుర్తించి బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. టికెట్ వచ్చిన తర్వాతే ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. టికెట్ వచ్చిన తర్వాత ఆమె జాతీయ మీడియాను ఆకర్షించారు. ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు క్యూ కట్టారు. ఇండియా టీవీ ఎడిటర్ రజత్ శర్మ మాధవిలత చేత ప్రతిష్టాత్మక ‘‘ఆప్ కీ అదాలత్ ’’ కార్యక్రమం  నిర్వహించారు. రజత్ శర్మ ప్రశ్నలకు ఒక మెచ్యురిటీ నేత మాదిరిగా మాధవిలత ఇచ్చే సమాధానాలు యావత్ దేశాన్ని ఆకర్షించింది. ఆ ఇంటర్వ్యూను వీక్షించాలని సాక్షాత్తు ప్రధాని ట్వీట్ చేయడం గమనార్హం. మాధవిలతకు పెరుగుతున్న ఆదరణతో మజ్లిస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నట్టుంది. తెలుగు మీడియకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడని అసదుద్దీన్ ఓవైసీ ఏకంగా తెలుగులో పాటలు రాయించుకుని  హిందూ వోటర్లను ఆకర్షించడానికి బయలు దేరారు. ఈ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టారు. బ్రాహ్మణులతో సమావేశమయ్యారు.  ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ చేత పాటలు పాడించుకునే స్థితికి అసదుద్దీన్ చేరుకోవడం ఓటమి భయమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం వోట్లను కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చీల్చింది. మజ్లిస్ కు కంచుకోటగా ఉన్న యాకుత్ పురా అసెంబ్లీలో కేవలం 800 పై చిలుకు ఓట్లతో మజ్లిస్ గెలుపొందడం  చూస్తే ఆ పార్టీ పరిస్థితి అంచనా వేయవచ్చు. ఇదే సమయంలో మజ్లిస్ పార్టీ నుంచి చీలిపోయిన మజ్లిస్ బచావ తాహ్రీక్(ఎంబిటి) పుంజుకుంది. చాంద్రాయణ గుట్ట మాజీ ఎమ్మెల్యే అమనుల్లా ఖాన్ మజ్లస్ తో విభేధించి ఎంబిటి ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు భారతీయ జనతాపార్టీ కారణమని , చివరకు మజ్లిస్ పార్టీ  ఆ పార్టీకి సపోర్ట్ గా ఉందని ఎంబిటి విస్తృతంగా ప్రచారం చేసింది. బహింగ సభల్లో అమనుల్లాఖాన్ కుమారుడు అమ్జదుల్లాఖాన్ బోరున విలపిస్తూ చేసిన ప్రసంగాలు ముస్లిం వోటర్లను ఆకట్టుకున్నాయి. యాకుత్ పురా, మలక్ పేట, కార్వాన్, గోషామహల్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు చాలా తక్కువశాతం మజ్లిస్ పార్టీకి పడ్డాయి. ఎక్కువ వోట్లు ఇతర పార్టీలకు చీలిపోవడం అసదుద్దీన్ ఓవైసీని ఆలోచనలో పడేసింది. ఈ ఎన్నికల్లో ఆయన ప్రముఖ తెలుగు టీవీ చానల్స్ తో బాటు యూ ట్యూబ్ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. _బదినెపల్లి శ్రీనివాసాచారి    Share                 ||     BACK Or SKIP

జగన్ వై నాట్ 175 ధీమా ఎక్కడ?.. ఓటమి గండం గట్టెక్కేదెలా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు.  కొద్ది నెలల క్రితం వరకూ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు. అంత సీన్ లేదని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా వినలేదు. అప్పటిలో వైసీపీ వర్గాల్లో కూడా జగన్ ధీమా ఏంటి అన్న విస్మయం వ్యక్తమైంది. అయితే ఆ ధీమా మాత్రం పార్టీ మొత్తంలో జగన్ ఒక్కరిలోనే కనిపించింది. మంత్రులూ, నాయకులూ మాత్రం తమకు గడపగడపలో ఎదురైన పరాభవ అనుభవంతో  ఆయన మాట నమ్మకపోయినా.. ఏమో జగన్ ధీమా ఏమిటో? అని గెలుపు ఆశలను నిండా నింపుకున్నారు. అయితే రోజులు గడిచిన కొద్దీ జగన్ లో ఆ ధీమా సన్నగిల్లుతూ వచ్చిందన్నది ఆయన ప్రసంగాలలో, అసహనంలో, ఫ్రస్ట్రేషన్ లో ప్రస్ఫుటంగా కనిపించింది కూడా. తీరా ఎన్నికలు  రోజుల వ్యవధిలోకి వచ్చేసరికి వైనాట్ 175 ధీమా పూర్తిగా పోయింది. ఆ స్థానంలో ఓటమి భయం పట్టుకుంది. సెంటిమెంటు, దౌర్జన్యం, విపక్షాలపై దాడులు ఇవేమీ గెలుపు దారి చూపలే కపోవడంతో ఇక ఆయన తన విశ్వాసాన్ని మార్చుకుని వాస్తును శరణుజొచ్చారు. తాడేపల్లిలోని తన అధికారిక నివాసం, క్యాంప్ ఆఫీసులలో వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టారు. జగన్ పర్యవేక్షణలోనే ఈ పనులు జరుగుతున్నాయని అంటున్నారు.  కూల్చివేతలతో మొదలైన జగన్ పాలన చివరకు వాస్తు దోష నివారణ అంటూ సొంత ప్యాలెస్ లోనే కూల్చివేతల పర్వానికి తెరతీయాల్సి వచ్చింది.     వాస్తు పండితుల సూచనలకు అనుగుణంగా  జగన్ నివాసం  క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్న ఇనుప కంచెలోని కొంత భాగం కూల్చివేత పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి.  ఈ ఇనుప కంచెలను జగన్ అధికారంలోకి రాగానే  ఒక్క పురుగు కూడా  ఆ కంచెను దాటి లోనికి ప్రవేశంచే అవకాశం లేనంత పటిష్టంగా నిర్మించారు.  ఇప్పడు వాస్తుదోషమంటూ ఆ ఇనుప కంచెలోని కొంత భాగాన్ని కూల్చివేస్తున్నారు. స్వతహాగా క్రైస్తవుడైన జగన్ కు ఇటువంటి నమ్మకాలు లేవు. తిరుమలలో తనకు వెంకన్న దేముడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేషన్ పై సంతకం పెట్టడానికే నిరాకరించిన జగన్ ఇప్పుడు వాస్తు పేరుతో తన ప్యాలెస్ లోనే మార్పులు చేయడానికి వెనుకాడలేదు.  మొత్తమ్మీద ఓటమి భయం జగన్ ను ఎంతగా వెంటాడుతోందో  ప్యాలెస్ లో వాస్తుదోష నివారణ పేరుతో చేపట్టిన కూల్చివేతలే చెబుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  

నేషనల్ మీడియా ముందు చేతులెత్తేసిన జగన్!

ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే. ఈ విషయం ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సాక్షాత్తూ జగన్ ముఖం చూస్తే చాలు. ఆయన ముఖంలో ఓటమి కళ అరచేతి మందంలో కనిపిస్తోంది. జగన్ మాటల్లో ఈ వాస్తవం డీటీఎస్‌లో వినిపిస్తోంది. ఈ విషయంలో ఇంకా ఎవరికైనా డౌట్స్ వుంటే, శుక్రవారం నాడు నేషనల్ మీడియా టైమ్స్ నౌలో సీనియర్ లేడీ జర్నలిస్టు నవికా కుమార్‌కి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూడవచ్చు. ఈ ఇంటర్వ్యూలో జగన్ ఆద్యంతం ఏడుపు ముఖంలో, ఓటమి కన్ఫమ్ అయిపోయిన ఎక్స్.ప్రెషన్‌తో కనిపించారు.  ఇంటర్వ్యూలో జర్నలిస్టు నివకా కుమార్ ఒక్కో ప్రశ్న సంధిస్తుంటే జగన్ తెల్లముఖం వేసుకుని, సమాధానాలు చెప్పడానికి నానా తంటాలూ పడ్డారు. ఒక సందర్భంలో జగన్ ఆమె ప్రశ్నకు సమాధానంగా- ‘‘మీరు నా స్థానంలో వుంటే అర్థమవుతుంది’’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. దానికి నవికా కుమార్ చురుగ్గా స్పందిస్తూ, ‘‘దేవుడి దయవల్ల నేను మీ స్థానంలో లేను’’ అన్నారు. దాంతో షాకైపోవడం జగన్ వంతు అయింది. జగన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనను జైల్లో వేయడం దగ్గర నుంచి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి తనకు వ్యతిరేకంగా పని చేస్తూ వుండటం వరకు... తాను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ చంద్రబాబే కారణం అని చెబుతుంటే నవికా కుమార్ జగన్‌ని ఇదేంట్రా బాబూ అన్నట్టు చూస్తూ, మీరు ప్రతీదానికీ చంద్రబాబే కారణం అంటున్నారు అని వెటకారంగా అన్నారు. దానికి మన జగన్ సార్ ఒక వెర్రి నవ్వుతో ప్రతిస్పందించారు. రాహుల్ గాంధీ గురించి జగన్‌ని నవికా కుమార్ ప్రశ్నించినప్పుడు జగన్ దిక్కులు చూస్తూ, వెర్రినవ్వులు నవ్వుతూ వుండటంతో ఆమె ‘‘నవ్వడం కాదు.. సమాధానం చెప్పండి’’ అన్నారు. జగన్ ఓ సందర్భంలో నేషనల్ పాలిటిక్స్ గురించి తనకు అంతగా అవగాహన లేదు అన్నారు. అప్పుడు నవికా కుమార్ జగన్‌ని శుద్ధ మొద్దుని చూసినట్టు చూసి, ‘‘ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వున్న మీరు నేషనల్ పాలిటిక్స్ గురించి పట్టనట్టు వుండటం కరెక్టుగా లేదు’’ అంటూ కామెంట్ చేశారు. అయినా మనసార్ ఒక వయ్యారపు నవ్వు విసిరారు. ఇంటర్వ్యూ ప్రారంభంలోనే ఈ ఎన్నికలలో మీకు ఎన్ని సీట్లు వస్తాయి అని నవికా కుమార్ అడిగితే, జగన్ జీవం లేని నవ్వు నవ్వుతూ ‘స్వీప్ చేస్తాం’ అన్నారు. నవీ కుమార్ మరోసారి రెట్టించి అడిగితే, ‘స్వీప్ చేస్తాం’ అని మరోసారి అన్నారు. ఆ ‘స్వీప్’ గెలుపు స్వీప్‌లా అనిపించలేదు.. చీపురు పట్టుకుని చేసే స్వీప్‌లా అనిపించింది. జగన్ మాటమాటకీ, షర్మిల నా కుటుంబం పరువు తీస్తోంది అని అన్నప్పుడు, అది మీ కుటుంబం మాత్రమే కాదు.. షర్మిల కుటుంబం కూడా అని నవికా కుమార్ చురక వేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఆయన వారసత్వం కావచ్చు.. అది మీకు మాత్రమే కాదు.. షర్మిలకు కూడా సమానంగా దక్కుతాయి అని నవికా కుమార్ అన్నప్పుడు జగన్ ముఖం చూడాలి. అబ్బో... ఆ ఎక్స్.ప్రెషన్ ఇవ్వడం ఆయనకి తప్ప మరొకరికి రాదు. మీరు ఐదేళ్ళుగా అధికారంలో వుండి మీ బాబాయి హత్య కేసులో ఎలాంటి పురోగతి ఎందుకు సాధించలేదు అంటే, ఏదేదో సంబంధం లేని సమాధానం చెప్పి దాటవేశారు. మొత్తమ్మీద నవికా కుమార్ అడిగిన ప్రశ్నలకు జగన్ చెప్పిన సమాధానాలు తక్కువ.. సాగదీసింది ఎక్కువ. వెంట వెంటనే సమాధానాలు చెబితే, ఇంకో ప్రశ్న దూసుకొస్తుందన్న భయంతో జగన్ లాగీ లాగీ సమాధానం చెప్పారు. అలా టైమ్ కిల్ చేయగలిగారు. పాపం జగన్‌కి ఇంకో దరిద్రం ఏమిటంటే, ఇంటర్వ్యూ నడిచినంతసేపూ బ్యాక్ గ్రౌండ్లో చంద్రబాబు విజయోత్సాహంతో ప్రచారం చేస్తున్న క్లిప్పింగ్స్, మోడీ ప్రచారం చేస్తున్న దృశ్యాలు, షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న దృశ్యాలు, షర్మిల ప్రచారం చేస్తున్న చూపించారు. జగన్ ప్రచారం చేస్తున్న విజువల్స్ కొద్ది క్షణాలు మాత్రమే చూపించారు.  మొత్తమ్మీద నీర్సంగా, అన్యమనస్కంగా, జిడ్డుకారుతున్న ముఖంతో, జీవం లేని నవ్వుతో, బిత్తర చూపులతో, క్లారిటీ లేని సమాధానాలతో సాగిన ఈ ఇంటర్వ్యూ ఇక జగన్ ఓటమి పక్కా అని కన్ఫమ్ చేసింది.