జైలు నుంచి వైఎస్ జగన్ విడుదల

        వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు.16 నెల‌లుగా చంచ‌ల్‌గూడ జైళులో ఉంటున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఎట్టకేల‌కు బెయిల్ రావడంతో బయటకి వచ్చారు. జగన్ కు సోమవారమే సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే పూచీకత్తులు సమర్పించడానికి సమయం లేకపోవడంతో, మంగళవారం ఉదయం జగన్ లాయర్లు ఆ పని పూర్తి చేశారు. జగన్‌కు ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డి, యశ్వంత్ రెడ్డిలు పూచీకత్తులు ఇచ్చారు. జగన్ వ్యక్తిగత పూచీకత్తు తీసుకున్న కోర్టు జైలు నుండి విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వు కాపీలను జగన్ లాయర్లు చంచల్ గూడ అధికారులకు సమర్పించడంతో మధ్యాహ్నం జగన్ జైలు నుండి బయటకు వచ్చారు. ప‌ట్టువ‌ద‌లని విక్ర‌మార్కుడిలా తొమ్మిది సార్లు బెయిల్ కోసం కోర్టు మెట్టెక్కిన జ‌గ‌న్ చివ‌ర‌కు అనుకున్నది సాదించాడు.

జగన్ తో కిరణ్ కుమార్ రెడ్డికి చెక్ ?

  జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరు అవడంతో రాష్ట్ర రాజకీయాలలో పెద్ద సంచలనం కలిగిస్తోంది. అతని విడుదలతో రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయనే అంశంపై చాలా లోతుగా విశ్లేషణ జరుగుతోంది. వైకాపా కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా ఎన్నికల పొత్తులకు సిద్దపడినందునే నేడు అతనికి బెయిలుకు మంజూరయిందని వాదనలు వినిపిస్తున్నాయి.   ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విడుదలతో కేవలం తెదేపా మాత్రమే చాలా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నపటికీ, కాంగ్రెస్ నేతలలో కూడా చాలా కలవరం ఉంది. ముఖ్యంగా అధిష్టానం నిర్ణయాన్నిసవాలు చేస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలపై జగన్ విడుదల ప్రభావం ఉంటుందా లేదా?అనే ప్రశ్న తలెత్తుతోంది.   “సమయం చూసి అందరూ ఒకేసారి రాజీనామాలు చేద్దామని” ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు చెప్పినట్లు అమలాపురం యంపీ హర్షకుమార్ ఈ రోజు మరో మారు స్పష్టం చేసారు. అంటే శాసనసభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన రోజునే ముఖ్యమంత్రి ఆయన అనుచరులు ఒక తీవ్ర నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావించవచ్చును.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానం జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపబోతోందనే సంగతిని ముందుగా గ్రహించినందునే రాష్ట్రవిభజన అంశాన్నిఅడ్డుపెట్టుకొని పార్టీని వీడిపోతామని సవాలు విసురుతున్నారా? లేక నిజంగానే విభజనను వ్యతిరేఖిస్తూ ఆవిధంగా వ్యవహరిస్తున్నారా? అనే సంగతి వారి తదుపరి ప్రతిక్రియలను బట్టి తేలిపోతుంది.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే జగన్ బాబును రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడమే తమ ఏకైక లక్ష్యమని విజయమ్మతో సహా వైకాపా నేతలందరూ చాలా స్పష్టంగా చెపుతున్నారు. ఇంతకాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకవెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తనను కాదని ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని చంకనెత్తుకోదలిస్తే, మరి ఆయన అధిష్టానం పట్ల అదే విదేయత కనబరుస్తారా లేక మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో కలిసి వేరే కుంపటి పెట్టుకొని కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీస్తారా? అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయాన్ని సవాలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఉపేక్షిస్తుందా లేక కేంద్రంలో అధికారం చేజిక్కించుకొనేందుకు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపి, పార్టీకి అత్యంత విధేయుడు, విశ్వసనీయుడయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పక్కనపెడుతుందా?వంటి అనేక ధర్మ సందేహాలకు సమాధానాలు ఎన్నికల ప్రకటన వెలువడక ముందే తేలిపోవచ్చును.

జగన్ కు పూచీకత్తు ఇచ్చిన అవినాశ్ రెడ్డి

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ కోసం న్యాయవాదులు రెండు పూచీకత్తులను సిబిఐ కోర్ట్ కి అందజేశారు. జగన్‌కు ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డి, యశ్వంత్ రెడ్డిలు పూచీకత్తులు ఇచ్చారు. సీబీఐ కోర్టు పూచీకత్తులను పరిశీలించిన తర్వాత జైలుకు రిలీజ్ ఉత్తర్వులను పంపించనుంది.   ఈ రోజు జగన్ విడుదల సంధర్బంగా జైలు వద్దకు వైకాపా కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు జైలు వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముళ్లకంచెలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 16 నెలల అనంతరం చంచల్‌గూడ జైలు నుండి విడుదలవుతున్న నేపథ్యంలో ఆయనను భారీ ర్యాలీతో పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకు వెళ్లాలని నేతలు భావిస్తున్నారు.

జగన్ బెయిల్ పై సిబిఐ హడావుడి: రేవంత్

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేసులో దొంగ, పోలీస్ ఒకటయ్యారని ఆయన ఆరోపించారు. బెయిల్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.     ఇదే కేసులో నిందుతుడిగా వున్న నిమ్మగడ్డ ప్రసాద్ కు సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన బెయిల్ ఇవ్వలేదని..అలాంటిది భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈకేసులో 10 చార్జిషీట్లలో 1200 కోట్ల అక్రమాలు జరిగాయని సీబీఐ చెప్పింది. జగన్ బెయిల్‌ను సీబీఐ ఎందుకు అడ్డుకోలేదన్నారు. నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కార్మెల్ ఏషియాలో క్విడ్‌ప్రోకో లేదని ఎలా చెబుతారన్నారు.

ముఖ్యమంత్రి తుది వరకు చేసే పోరు దేని కోసం

  అమలాపురం యంపీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమను రాజీనామాలకు తొందర పడవద్దని, సమయం రాగానే అందరూ కలిసి ఒకేసారి రాజీనామాలు చేసి పదవుల నుండి తప్పుకొందామని చెప్పారని తెలిపారు. అంటే నేటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన అంశంపై పావులు కదిపేందుకు సిద్దంగానే ఉన్నారని అర్ధం అవుతోంది.   కాంగ్రెస్ అధిష్టానం ఇంత ఖరాఖండిగా రాష్ట్ర విభజనపై వెనకడుగువేసే ప్రసక్తే లేదని చెప్పిన తరువాత కూడా ముఖ్యమంత్రి విభజనను అడ్డుకొనేందుకు తుదివరకు పోరాడాలని భావించడం చూస్తే, ఆయనకీ వేరే ఇతర కారణాలు, ఆలోచనలు కూడా ఉండి ఉండవచ్చును. ఆయన పదవిలో కొనసాగుతూ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి హోదాలో సీమాంద్రాకు కొత్తగా మేలు చేసిన దాఖలాలు కూడా ఏమీ లేవు. అదేవిధంగా రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ఆయన కొత్తగా చేసిన ప్రయత్నం కూడా ఏమీ లేదు.   ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో రాజీనామా చేయడం వలన ప్రజలపై దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చుననే ఆలోచనతోనే, బహుశః ఆయన సరయిన సమయం కోసం వేచి చూస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. శాసనసభలోతెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన తరువాత దానిపై మీడియా సాక్షిగా వీరోచితంగా వాదనలు చేసి, బిల్లుని వ్యతిరేఖిస్తూ రాజీనామాలు చేసి పదవుల నుండి తప్పుకొన్నట్లయితే అది ప్రజలపై మరింత ప్రభావం చూపుతుందని ఆయన ఆలోచన కావచ్చును. తద్వారా ఆయన సీమాంధ్ర ప్రజలలో తన రేటింగ్ మరింత పెంచుకోవడానికే తప్ప వేరే ఏ ప్రయోజనమూ కనబడటం లేదు.   ఏమయినప్పటికీ, తెలంగాణా ఏర్పాటు తధ్యమని మాత్రం స్పష్టం అవుతోంది. అందువలన ఇంత వరకు సమైక్యాంధ్ర కోసం ‘తుదివరకు పోరాడిన’ ఈ కాంగ్రెస్ నేతలందరూ ఇక హైదరాబాద్, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగాలు వగైరాల పంపకాలపై పోరాడుతామని ప్రజలకి చెప్పబోతున్నారు.

కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలలో మలుపు

      సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. కొందరు ఎంపీలు రాజీనామాకు సిద్దపడితే మరికొందరు వెనక్కి తగ్గారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు ఉదయం 11 గంటలకు స్పీకర్ మీరాకుమార్ అపాయింట్‌మెంట్ లభించింది. ఎంపీలు లగడపాటి, ఉండవల్లి, సాయిప్రతాప్, ఎస్పీవైరెడ్డి, రాయపాటి, అనంత, హర్షకుమార్, మాగుంట స్పీకర్‌ను కలవనున్నారు. సమైక్యాంధ్ర కోసం తమ రాజీనామాలు ఆమోదింపజేయాలని స్పీకర్‌ను ఎంపీలు కోరనున్నారు.     ఇప్పుడు అందులో కొందరు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజులు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామి రెడ్డిలు రాజీనామాలకే మొగ్గు చూపుతున్నారు. హర్ష కుమార్, సాయి ప్రతాప్, ఎస్పీవై రెడ్డిలు రాజీనామాలపై తర్జన భర్జన పడుతున్నారట.     మరోవైపు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ మంగళవారం ఉదయం పాట్నాకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలను ఈనెల 28 లేదా 30న రావాలని స్పీకర్ సూచించారు.  

జగన్ బెయిల్ తో సీమాంద్రలో సంబరాలు

      వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు మంజూరు కావడంతో పెద్దఎత్తున సంబరాలు మొదలయ్యాయి. కడపలో పార్టీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుంటూ భారీగా బాణసంచా కాల్చారు. కోటిరెడ్డి సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించి టపాసులు పేల్చారు. కలెక్టరేట్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో వేడుకలతోపాటు రంగులు చల్లుకున్నారు. మండల కేంద్రాల్లో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.     కర్నూలు జిల్లా కేంద్రంలో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచారు. డప్పులు మోగిస్తూ ర్యాలీగా వెళ్లి ఎస్‌వీ కాంప్లెక్స్‌వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతపురం జిల్లాలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి జగన్‌కు జేజేలు కొడుతూ ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున బాణసంచా పేల్చి, రంగులు చల్లుకుంటూ ర్యాలీలు నిర్వహించారు.   తిరుపతిలో వైఎస్ విగ్రహంవద్ద సంబరాలతోపాటు రంగులు చల్లుకున్నారు. పలమనేరులో జాతీయ రహదారిపై బహిరంగ సభ, పీలేరులోనూ క్రాస్‌రోడ్డుపై సంబరాల వల్ల వాహనాల రాకపోకలకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలో పలుచోట్ల కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల్లో రంగులు చల్లుకుంటూ 'జై జగన్' నినాదాలు చేశారు. విజయవాడలో గుణదల మేరీ మాత గుడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.  

జగన్ బెయిల్ వెనుక 'హస్తం'

      ప్రస్థుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో జ‌గ‌న్‌కు బెయిల్ రావడం ప్రాదాన్యం సంత‌రించుకుంది. అయితే జ‌గ‌న్‌కు బెయిల్ రావ‌డం వెనుక కాంగ్రెస్ 'హ‌స్తం' ఉంది అన్న ఆరోప‌ణ కూడా ఉంది. తెలంగాణ ప్రక‌ట‌న నేప‌ధ్యంలో సీమాంద్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప‌రిస్థితి ఏర్పాండింది ఈ నేప‌ధ్యంలో సీమాంద్ర రాజీనామాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌తో పోత్తు పెట్టుకుంటే అక్కడ మంచి ఫ‌లితాలు రాబ‌ట్టవ‌చ్చని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో పాటు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌తో తెలంగాణ ప్రాంతంలో కూడా వీలైన‌న్ని ఎక్కువ స్ధానాలు గెలుచుకోని మ‌రోసారి యుపిఏ ప్రభుత్వాని ఏర్పాటు చేసేదిశ‌గా కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతుంది. సిబిఐ ఎంక్వయిరీలో వేగం త‌గ్గడం, దాదాపు ఎనిమిది కేసుల్లో క్విడ్‌ప్రోకో జ‌రిగిన‌ట్టుగా ఆదారాలు లేవ‌ని సిబిఐ కోర్టుకు తెల‌ప‌టం లాంటి ప‌రిణామాలలో జ‌గ‌న్ బెయిల్‌కు మార్గం సుగ‌మం అయింది. ప్రస్తుతం కాంగ్రెస్, వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌ల మ‌ద్య కుదిరిన ఒప్పందాల‌ను ఇరు పార్టీలు అంగీక‌రించ‌క‌పోయినా , ఎల‌క్షన్స్ స‌మ‌యానికి స‌మీక‌ర‌ణాలు అలాగే మారే అవ‌కాశం ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.  

వైకాపా సమైక్య రాజకీయాలు

  తెలంగాణా వదులుకొని వైయ్యస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమైక్యాంద్ర ఉద్యమాలు సీమాంద్రాలో రాజకీయంగా పూర్తి పట్టు సాధించేందుకేనన్నది బహిరంగ రహస్యమే. అసలు రాష్ట్రం రెండుగా విడిపోతుందని ఆ పార్టీ బలంగా నమ్మినందునే తను బలహీనంగా ఉన్నతెలంగాణాను వదులుకొని, బలంగా ఉన్న సీమాంధ్రకి వచ్చేసింది. ఒకవేళ వైకాపా నిజంగానే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఉంటుందని లేదా తన ఉద్యమాల ద్వారా విభజన ప్రక్రియను ఆపగాలననే ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉండి ఉంటే తెలంగాణాను ఎట్టి పరిస్థితుల్లో వదులుకొనేదికాదు. కానీ వదులుకొని వచ్చిందంటే రాష్ట్ర విభజన అనివార్యమని ఆ పార్టీ మనస్పూర్తిగా నమ్ముతున్నట్లు అర్ధం అవుతోంది. అయినా కూడా నేటికీ ఆపార్టీ సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడం ఆపలేదు. అంటే విభజన ఖాయమని నమ్ముతూనే ప్రజలతో గొంతు కలిపి సమైక్య రాగం ఆలపిస్తూ వారి మనసులు గెలుచుకొని రానున్న ఎన్నికలలో దానిని ఓట్ల రూపంలోకి మార్చుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.   షర్మిల, విజయమ్మలతో సహా ఆ పార్టీలో నేతలందరూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తమ ఏకైక ధ్యేయమని చాలా విస్పష్టంగానే చెపుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైకాపా నిజంగా కోరుకొంటున్నట్లయితే, తెలంగాణాలో పార్టీని మూసుకొని వచ్చేదే కాదు. కానీ ఆ పార్టీ కూడా తము అధికారంలోకి రావాలంటే విభజన అనివార్యమని నమ్ముతున్నదునే తెలంగాణాను వదులుకొని సీమాంధ్రలో సమైక్య రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది.   ఈ సంగతి ఏపీఎన్జీవోలు కూడా గ్రహించకపోలేదు. అదే విషయం వారు తమ సభలలో తెలియజేసి రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వైకాపా తన సమైక్య ఉద్యమాల నుండి వెనకడుగు వేయలేదు. ఈరోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకాగానే, ఇంతకాలం తన తల్లి, చెల్లి నడిపిస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలను చేతిలోకి తీసుకొని తన దయిన శైలిలో దూసుకుపోవడం ఖాయం.      

ఆదార్‌ తప్పసిసరి కాదు

  కేవలం ఆదార్‌ లేని కారణంగా భారతదేశం ప్రజలకు నిత్యావసారాలను నిరాకరించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్ధానం వ్యాఖ్యనించింది. ఆదార్ కార్డు పొందాల వద్దా అనేది వ్యక్తి ఇష్టా ఇష్టాలను బట్టి ఉంటుందని దాన్ని తప్పనిసరి నిబందన చేయద్దని స్పష్టం చేసింది. అంతే కాకుండా అక్రమంగా వలస వచ్చి ఈ దేశంలో ఉంటున్న వారికి ఆదార్‌ కార్డులు అందకుండా జాగ్రత్త పడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. జీతాలు, పిఎఫ్‌లు, వివాహ దృవీకరణ, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ లాంటి వాటికి ఆదార్‌ను తప్పనిసరి చేయటం పై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆదాక అమలు పౌరుల ప్రాదమిక హక్కులను హరించేదిగా ఉండరాదని స్పష్టం చేసింది. ఆదార్‌ తీసుకోవడం వ్యక్తిగత అభిప్రాయం అని కేవలం ఆదార్‌ లేని కారణం వ్యక్తి గుర్తింపు కార్డులు జారీ చేయకుండ ఉండరాదని ప్రభుత్వానికి తెలిపింది.అయితే ఈ విషయం పై వాదనలు వినిపించిన ప్రభుత్వం, ఆదార్‌ తప్పనిసరి కాదని, స్వచ్చందమేనని కోర్టుకు తెలిపింది. ఎటువంటి గుర్తింపు కార్డు లేని అణగారిన వర్గాల కోసమే ఆదార్‌ను అమలు చేస్తున్నామని తెలిపింది.

నేడు సీమాంద్రలో రహదారుల దిగ్బందం

  50 రోజులు దాటినా ఇంకా సీమాంద్రలో ఉద్యమాల హోరు తగ్గకపోగా మరింత ఉదృతం అవుతున్నాయి. ఈ నెల 16న ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు నాయకులు. అందులో భాగంగానే మంగళవారం సీమాంద్ర లో రహాదారుల దిగ్బందించి, బంద్‌ పాటిస్తున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలనుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను అడ్డకోవటం ద్వారా సమస్య, ఉద్యమ తీవ్రతలు కేంద్రానికి తెలియజేయాలని భావిస్తున్నారు. ఈ రహదారుల దిగ్బందం తిరుమల వెళ్లే భక్తులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కార్యక్రమంలో అన్ని జేఎసిల నాయకులతో పాటు ప్రజలు కూడా స్వచ్చందంగా పాల్గొనాలని సమైక్య రాష్ట్రపరిరక్షణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు.

షిండే మళ్లీ మాట మార్చాడు

  తెలంగాణ నోట్‌ విషయంలో షిండే మరోసారి మాట మార్చాడు. గతంలో నోట్‌ రెడీ అయింది అని తానే స్వయంగా అన్న షిండే ఇప్పుడు రెడీ కాలేదు అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన నోట్‌ తయారికి ఇంకా సమయం పడుతుంది అని, ఆ నోట్‌ను కేభినెట్‌ ముందుకు తీసుకొచ్చేప్పుడు మీకు తప్పకుండా చెపుతామని అన్నారు. రక్షణ మంత్రి ఆంటోని అస్వస్ధత మూలంగా నొట్‌ తయారి ఆలస్యం అవుతుందని, ఆయన కోలుకోగానే నోట్‌ రెడీ చేసి కేభినెట్‌ ముందుకు తీసుకురానున్నారు. దీంతో మంగళవారం జరగబోయే భేటిలో ఇక తెలంగాణ నోట్‌ విషయంలో ఎలాంటి చర్చ జరగదని తేలిపోయింది. ఆంటోని కమిటీ సిఫార్సులు అందిన తరువాత నోట్‌కు తుది రూపునిస్తారని షిండే తెలిపారు. కేభినేట్‌ భేటి తరువాత ప్రదాని అమెరికా పర్యటన ఉన్నందున ఆయన తిరిగి వచ్చాకే నోట్‌ పై తదుపరి కార్యచరణ కొనసాగనుంది. అక్టోబర్‌ తొలి వారంలో జరగభోయే భేటి సమయానికి నోట్‌ రెడీ చేస్తామని హోం శాఖ వర్గాలు చేపుతున్నా ప్రస్థుతం రాష్ట్రం ఉన్న పరిస్ధితుల్లో అసలు కేంద్ర ముందడుగు వేసే ఆలోచనలో ఉందా అనేది కూడా సందేహమే.

జగన్ బెయిల్ పై మంచు లక్ష్మీ కామెంట్

      వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడంపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మి తనదైన రీతిలో స్పందించారు. జగన్ కు బెయిల్ రావడాన్ని ఆమె గొప్ప విజయంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.   వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది. రెండు లక్షల రూపాయల సెక్యూరిటీ బాండ్ ను, ఇద్దరు పూచీకత్తును ఇవ్వలని కోరింది. అలాగే హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని, షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే కేసు విచారణలో సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదని కోర్ట్ ఆదేశించింది. జగన్ కు బెయిల్ రావడంతో ఇక పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అలాగే ఆడిటర్ విజయసాయి రెడ్డిలకు కూడా బెయిల్ రావడానికి మార్గం సుగమమం అయినట్లు భావించవచ్చు.

కుదిరిన డీల్, జ‌గ‌న్‌కు బెయిల్‌

  16 నెల‌లుగా చంచ‌ల్‌గూడ జైళులో ఉంటున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఎట్టకేల‌కు బెయిల్ మంజూరు అయింది. ప‌ట్టువ‌ద‌లని విక్ర‌మార్కుడిలా తొమ్మిది సార్లు బెయిల్ కోసం కోర్టు మెట్టెక్కిన జ‌గ‌న్ చివ‌ర‌కు అనుకున్నది సాదించాడు. అయితే చాలా రోజులుగా కేసు విష‌యంలో ఎంతో బలంగా ఉన్న సిబిఐ గ‌త కొద్ది రోజులుగా దూకుడు తగ్గించింది. ఆక‌వాల‌నే జ‌గ‌న్‌కు బెయిల్ వ‌చ్చే విధంగా చేసింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ప్రస్థుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో జ‌గ‌న్‌కు బెయిల్ రావడం ప్రాదాన్యం సంత‌రించుకుంది. అయితే జ‌గ‌న్‌కు బెయిల్ రావ‌డం వెనుక కాంగ్రెస్ హ‌స్తం ఉంది అన్న ఆరోప‌ణ కూడా ఉంది. తెలంగాణ ప్రక‌ట‌న నేప‌ధ్యంలో సీమాంద్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప‌రిస్థితి ఏర్పాండింది ఈ నేప‌ధ్యంలో సీమాంద్ర రాజీనామాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌తో పెత్తు పెట్టుకుంటే అక్కడ మంచి ఫ‌లితాలు రాబ‌ట్టవ‌చ్చని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో పాటు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌తో తెలంగాణ ప్రాంతంలో కూడా వీలైన‌న్ని ఎక్కువ స్ధానాలు గెలుచుకోని మ‌రోసారి యుపిఏ ప్రభుత్వాని ఏర్పాటు చేసేదిశ‌గా కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతుంది. సిబిఐ ఎంక్వయిరీలో వేగం త‌గ్గడం, దాదాపు ఎనిమిది కేసుల్లో క్విడ్‌ప్రోకో జ‌రిగిన‌ట్టుగా ఆదారాలు లేవ‌ని సిబిఐ కోర్టుకు తెల‌ప‌టం లాంటి ప‌రిణామాలలో జ‌గ‌న్ బెయిల్‌కు మార్గం సుగ‌మం అయింది. ప్రస్తుతం కాంగ్రెస్, వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌ల మ‌ద్య కుదిరిన ఒప్పందాల‌ను ఇరు పార్టీలు అంగీక‌రించ‌క‌పోయినా , ఎల‌క్షన్స్ స‌మ‌యానికి స‌మీక‌ర‌ణాలు అలాగే మారే అవ‌కాశం ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

వైఎస్ జగన్ బెయిల్ కు షరతులు

  గత 16 నెలలుగా అక్రమాస్తుల కేసులో చంచల్ గూడా జైలులో నిర్భంధించబడ్డ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు సీబీఐ కోర్టు షరతుల కూడిన బెయిలు మంజూరు చేసింది. అతనిని హైదరాబాద్ విడిచి బయటకి వెళ్లరాదని, అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉన్నసాక్షులెవరితో మాట్లాడటం కానీ, వారిని ప్రబావితం చేయడం గానీ చేయరాదని ఆదేశించింది. ఒకవేళ అతను షరతులను ఉల్లంఘించినట్లయితే వెంటనే బెయిలు రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. రూ. 2లక్షల చొప్పున ఇద్దరు వ్యక్తులు రెండు పూచీకత్తులను కోర్టుకు సమర్పించవలసి ఉంటుంది. ఈ రోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి బెయిలు వస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నఅతని లాయర్లు బెయిలు కోసం కోర్టుకి సమర్పించవలసిన అన్ని కాగితాలను ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచారు. అయితే చంచల్ గూడా జైలు కార్యాలయ సమయం ఐదు గంటలకే పూర్తవడంతో, రేపు ఉదయం 10-11గంటల మధ్య జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యే అవకాశం ఉంది.

వైఎస్ జగన్ కు బెయిల్

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 484 రోజులుగా వైఎస్ జగన్ హైదరాబాద్ చంచల్ గూడ జైలులో వున్నారు. మధ్యాహ్నం నుండే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తదితరులు కోర్టుకి చేరుకొని తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వైకాపా కార్యకర్తలు, నేతలు కూడా చాలామంది తరలివచ్చారు.     జగన్ కి బెయిల్ లభించడంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశం వుంది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిందని ఆగ్రహంతో ఉన్న అనేకమంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి వైకాపాలోకి దూకవచ్చును. అదేవిధంగా సమైక్యాంధ్ర పధం నోట నుండి ఉచ్చరించని చంద్రబాబుపై కూడా కినిసిన తెలుగు తమ్ముళ్ళు కూడా వైకాపాలోకి దూకే అవకాశం ఉంది.

మరి కొద్ది సేపటిలో జగన్ బెయిలుపై కోర్టు తీర్పు

  నాంపల్లి సీబీఐ కోర్టు మరి కొద్ది సేపటిలో జగన్మోహన్ రెడ్డి బెయిలుపై తన నిర్ణయం ప్రకటించబోతోంది. ఈసారి జగన్మోహన్ రెడ్డికి బెయిలు రావడం ఖాయమని అతని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దృడంగా నమ్ముతున్నారు. అందుకే అతని లాయర్లు బెయిలు కోసం సమర్పించవలసిన పత్రాలను అన్నీ సిద్దం చేసుకొని కోర్టు తీర్పు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం నుండే జగన్మోహన్ రెడ్డి భార్య భారతి తదితరులు కోర్టుకి చేరుకొని తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా వైకాపా కార్యకర్తలు, నేతలు కూడా చాలామంది తరలివచ్చారు. కోర్టు తన తీర్పును సాయంత్రం 4.30-5.00గంటల మధ్య వెలువరించి అవకాశం ఉంది.   జగన్మోహన్ రెడ్డి విడుదల అయితే, అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చవచ్చును. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిందని ఆగ్రహంతో ఉన్న అనేకమంది సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి వైకాపాలోకి దూకవచ్చును. అదేవిధంగా సమైక్యాంధ్ర పధం నోట నుండి ఉచ్చరించని చంద్రబాబుపై కూడా కినిసిన తెలుగు తమ్ముళ్ళు కూడా వైకాపాలోకి దూకే అవకాశం ఉంది. అయితే, రానున్న ఈనికలలో గెలవడం చాలా అవసరం గనుక జగన్మోహన్ రెడ్డి వారిలో కేవలం గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఈయవచ్చును.   ఇక అతనికి బెయిలు దొరుకుతుందా లేదా అనే విషయంపై ప్రజలే కాక, అన్ని రాజకీయ పార్టీలు చాల ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. మరి కొద్ది సేపటిలో ఏ సంగతి తెలిసిపోతుంది.

రాజీనామాల అవసరం లేదు: జేసీ

      రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసేందుకు సీమాంధ్ర నేతలంతా సిద్దంగా వున్నారని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే ప్రస్తుతం రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో బిల్లును శాసనసభలో తీర్మానాన్ని ఓడించాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వం పడిపోయే స్థితి లేనందువల్ల ఎంపీలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, ఎంపీలు రాజీనామా చేసిన తమపై ఒత్తిడి రాదని అన్నారు.     ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినందువల్లనే రాజీనామాలపై వెనక్కి తగ్గినట్లు రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. అందరం కలిసి త్వరలో నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రితో మళ్లీ రాజీనామాల అంశంపై మాట్లాడుతామని ఆయన చెప్పారు.

ఎన్ఐసీ నుంచి చంద్రబాబు నాయుడు వాకౌట్

      దేశంలో భద్రతాచర్యలపై ఇవాళ ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్షం జరిగింది. ఈ సమావేశాన్ని హాజరైన చంద్రబాబు వాకౌట్ చేశారు. సమావేశంలో తెలుగువారికి అవమానం జరిగిందని, అందుకే నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశామని చంద్రబాబు ఆవేదనగా పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవద్దని కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం అడ్డుకున్నారని అన్నారు.     అస్సాం రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఎన్ఐసీలో అవకాశం కల్పించారని అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రంలో ఎలా పోరాటం చేయాలో తెలుసునని, అలాగే ఢిల్లీలో కూడా పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.