జగన్ కు పూచీకత్తు ఇచ్చిన అవినాశ్ రెడ్డి
posted on Sep 24, 2013 @ 2:46PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ కోసం న్యాయవాదులు రెండు పూచీకత్తులను సిబిఐ కోర్ట్ కి అందజేశారు. జగన్‌కు ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డి, యశ్వంత్ రెడ్డిలు పూచీకత్తులు ఇచ్చారు. సీబీఐ కోర్టు పూచీకత్తులను పరిశీలించిన తర్వాత జైలుకు రిలీజ్ ఉత్తర్వులను పంపించనుంది.
ఈ రోజు జగన్ విడుదల సంధర్బంగా జైలు వద్దకు వైకాపా కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు జైలు వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముళ్లకంచెలు, బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 16 నెలల అనంతరం చంచల్‌గూడ జైలు నుండి విడుదలవుతున్న నేపథ్యంలో ఆయనను భారీ ర్యాలీతో పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకు వెళ్లాలని నేతలు భావిస్తున్నారు.