నేను బానిసను కాదు.. పవన్ కళ్యాణ్

  జనసేన అధినత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ఏపీ రాజధాని పర్యటన చేసిన సంగతి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణనను వ్యతిరేకిస్తూ ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగసభలో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రానికి రాజధాని అవసరం.. అదే విధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి దానికి భూసేకరణ తప్ప మరో మార్గం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రా అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషిచేస్తున్నారని.. హైటెక్‌ సిటీతోపాటు ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబుకు ఈ విషయం తెలియదని తాను అనుకోవడం లేదని అన్నారు.  గతంలో రాజధానికి కావలసిన భూసేకరణ నేపథ్యంలో రైతులు గొడవలు ఆందోళనలు చేశారని అప్పుడే వారిని పరామర్శించానని.. వారికి సంబంధించిన సమస్యలను గురించి అప్పుడే చంద్రబాబుకు ‘సార్‌ చూడండి’ అంటూ ట్విటర్లో మెసేజ్‌ పోస్టు చేశాను అని తెలిపారు. అప్పుడు కూడా మంత్రులు దానిని సూచనగా తీసుకోకుండా  నాపై కామెంట్లు చేశారని అన్నారు. ఇప్పుడు కూడా భూసేకరణ వ్యవహారంలో టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కు మధ్య మాటలు  యుద్దాలు జరిగిన నేపథ్యంలో తాను కేవలం టీడీపీకి మిత్రుడనేనని.. అంతేకాని బానిసను కాదని ఘాటుగానే సమాధానమిచ్చారు. న్యాయంగా వ్యవహరించకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రారని హెచ్చరించారు.  నేను ఇక్కడికి వచ్చింది గొడవపడటానికి కాదు రైతుల సమస్యలు తెలుకొని వాటి గురించి తెలియజేయడానికి వచ్చానని.. కానీ గొడవల వల్ల వారి సమస్యలు తీరతాయయంటే గొడవలకు కూడా సిద్ధమేనని తేల్చి చెప్పారు.

భూములు లాక్కోవద్దు.. నేనొచ్చింది గొడవకి కాదు.. పవన్ కళ్యాణ్

  భూసేకరణ వద్దని.. వారి రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదిక ద్వారా చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. కానీ ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పక్కన పెట్టి ఐదు గ్రామాల పరిధిలో భూముల సేకరణకు రైతులకు నోటిఫికేషన్ లు జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తన సినిమా షూటింగ్ ను మధ్యలోనే ఆపేసి వచ్చి మరీ ఆదివారం రాజధాని ప్రాంతమైన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పర్యటించారు. ఏడాదికి మూడు పంటలు పండే రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని ఒకవేళ రైతులు తమ ఇష్ట ప్రకారం భూములు ఇస్తానంటే తీసుకోండి.. అంతేకాని ఇవ్వని వారి దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కోవద్దు..! లాక్కోవద్దు..!! లాక్కోవద్దు!!! అంటూ తేల్చి చెప్పారు. ఒకవేళ అలా చేస్తే రైతుల తరుపున తాను పోరాడతానని.. వారి కోసం ధర్నా చేస్తానని, నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. అంతేకాదు నేను ఇక్కడికి వచ్చింది టీడీపీతోనో ముఖ్యమంత్రితోనో గొడవ పెట్టుకోవడానికి కాదని.. రైతుల సమస్యలను తెలియజేయడానికి వచ్చానని.. దయచేసి భూసేకరణ నోటిఫికేషన్లు ఆపండని.. బలవంతపు భూ సేకరణ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.  

ఎంపీగారు ఇకనైనా ఆపండి

  కొంత మంది రాజకీయ నాయకులు చేసే కొన్ని పనులు వారికి సమస్య కాకపోవచ్చుకాని పక్కన వాళ్లకు మాత్రం సమస్యగానే ఉంటుంది. ఏదో చేయాలని చూస్తే ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ నేత చేసిన ఓవరాక్షన్ వల్ల  ప్రధాని మోడీ సెక్యూరిటీ  గార్డులలో ఇద్దరు గార్డులపై వేటు పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక టీడీపీ ఎంపీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువ అత్యుత్సాహం చూపిస్తున్నట్టు..  ప్రధాని తను ఎక్కువ క్లోజ్ అన్నట్టు.. ఎప్పుడు మీడియాలో కనిపించాలని తెగ ప్రయత్నిస్తున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ఈ టీడీపీ ఎంపీ గారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి అంత్య క్రియల నేపథ్యంలో ప్రధానికి అతి సమీపంలో నడవడానికి ప్రయత్నించారట. అంతేకాదు ప్రధాని మంత్రి చైనా యాత్ర చేసినప్పుడు కూడా ఆపర్యటనలో తను కూడా ఉన్నట్టు తన పేరు కూడా ఉండేలా పేరు రాయించుకున్నారంట దీంతో అందరూ ఆ ఎంపీ గారికి చీవాట్లు పెట్టి పంపారు. దీంతో ప్రధానికి కూడా ఎంపీ గారి వ్యవహారం నచ్చలేదంట. ఇదంతా మన ఎంపీగారు ఎందుకు చేస్తున్నారంటే తనకు ఉన్న OTS ( one time settlement ) బ్యాంకు అఫ్రూవల్ కోసమే అని.. ప్రధాని తనకు బాగా క్లోజ్ అని తెలిసేలా చేస్తే దానిని ఎలాగైనా చేయించుకోవచ్చని చూశారంట కాని ప్రధాని కార్యలయం మాత్రం దానిని రిజెక్ట్ చేసిందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదొక్కటే కాదు  ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక భూమి విషయంలో కూడా ఈ ఎంపీగారు అలాగే వ్యవహరించినట్టు తెలుస్తోంది. వైజాగ్ లో ఉన్న భూమిని అధికారులను మభ్యపెట్టి రెగ్యులైజ్ చేసుకోవడానికి ప్రయత్నించారట. కాని అధికారులు సీఎం ఆ ఫైల్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఎంపీగారి వైఖరిని చూసి అందరూ నవ్వుకుంటున్నారట. అయినా ఇన్ని భంగపాట్లు పడినా కూడా ఈ ఎంపీగారి మాత్రం తను ధోరణిలో తానే ఉన్నారని ఇంకా మారలేదని నవ్వుకుంటున్నారు. అయినా కూడా ముఖ్యమంత్రిగారికి.. పీఎం గారికి దగ్గరగా ఉండే ప్రయత్నాలే చేస్తున్నారంట. అసలే ఇప్పటికే అర్ధికపరంగా సమస్యలతో ఈ ఎంపీగారికి మరి ఆయన చేసే ప్రయత్నాలు ఎంతవరకూ పనిచేస్తాయో చూడాలి.

బెంగుళూరు-నాందేడ్ రైలుకి ప్రమాదం, 6 మంది మృతి

  ఈ రోజు తెల్లవారుజామున అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుండి నాందేడ్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలుని లారీ డ్డీ కొంది. ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న కర్నాటకలోని దేవ్ దుర్గ్ ఎమ్మెల్యే వి. వెంకటేష్ నాయక్, మహమ్మద్ మరో ముగ్గురు మరణించారు. లారీ డ్రైవర్ కూడా మరణించాడు.   అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో మడకశిర రైల్వే గేటు వద్ద సుమారు 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మడకశిర నుండి తాడిపత్రికి గ్రానైట్ తీసుకువెళుతున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో మూసి ఉన్న రైల్వే గేటుని డ్డీ కొని రైల్వే ట్రాక్ పైకి చొచ్చుకు పోయి సరిగ్గా అదే సమయంలో బెంగుళూరు నుండి నాందేడ్ వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలుని డ్డీ కొంది. లారీలో ఉన్న గ్రానైట్ పలకలు హెచ్-1 బోగీలోకి దూసుకుపోయాయి. యస్-1 నుండి యస్-5వరకు బోగీలు పట్టాలు తప్పాయి.   ప్రమాదం సంగతి తెలుసుకోగానే అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకాంతం, పోలీసులు, వైద్య, సహాయ సిబ్బంది అక్కడికి చేరుకొని తక్షణమే సహాయ చర్యలు చేప్పట్టారు. గాయపడినవారిని ధర్మవరం, పెనుగొండ, అనంతపురం ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని బస్సులలో వారివారి గమ్యస్థానాలకి పంపిస్తున్నారు. రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్ నెంబర్లు: పెనుగొండ:08555 220249 ధర్మవరం:08559 222555, అనంతపురం:08554 236444.

చిరంజీవి సీఎం అయితే వేరేలా ఉండేది.. డొక్కా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించారు. చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ చనిపోయిన తరువాత కాంగ్రస్ పార్టీ కె రోశయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం చేసింది. ఆతరువాత రోశయ్య సీఎం పదవి నుండి తప్పుకున్న వెంటనే ఆ బాధ్యతలను చిరంజీవికి అప్పగించాలని తను కోరానని అన్నారు. అప్పుడు దీనిలో భాగంగానే కేంద్రానికి లేఖ కూడా రాశానని.. ముఖ్యంగా కేంద్రం కొత్త సీఎంను నియమిస్తున్న సమయంలో సీఎం పదవిని ఎక్కాలని చూస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గురించి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చి మోసగాడని.. చిరంజీవిని సీఎం చేయాలని కూడా ఆలేఖలో పేర్కొన్నారని తెలిపారు. అప్పుడు కాని చిరంజీవిని సీఎం చేసి వుంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు కానీ.. కాంగ్రెస్ పరిస్థితి కానీ మరోలా ఉండేదని డొక్కా అన్నారు.

చిరంజీవి బర్త్ డే పై వర్మ ట్వీట్లు.. నాకు నచ్చలేదు

  విమర్శలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు రాంగోపాల్ వర్మ. మరి ఇప్పుడు ఈయన ఏ విషయం గురించి మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? అది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు గురించి. ఈ రోజు చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా అటు కుటుంబసభ్యులు.. ఇటు అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటే మరోపక్క రాంగోపాల్ వర్మకు ఇదేం నచ్చలేదట. చిరంజీవి గారికి అప్పుడే 60 ఏళ్లంటే నమ్మలేకపోతున్నాను.. చిరంజీవిని 26 ఏళ్లప్పుడు చూశాను అప్పటినుండి ఇప్పటివరకూ ఆయన అలాగే ఉన్నారని అన్నారు. కానీ ఇప్పుడు చిరంజీవికి 60 ఏళ్లు వచ్చాయని దానిని ఓ పెద్ద పండుగలా చేయడం.. 60 ఏళ్లు వచ్చాయని అందరికి తెలిసేలా చేయడం నచ్చలేదని ట్విట్ చేశారు. అంతేకాదు తన తండ్రి పుట్టిన రోజు వేడుకలను చాలా భారీగా ప్లాన్ చేసిన రాంచరణ్ పై కూడా సైటైర్ వేశారు. రామ్ చరణ్ తేజ గట్టిగా ఒత్తిడి చేసి ఈ వేడుక చేస్తున్నారా అని అన్నారు. పాపం రాంగోపాల్ వర్మకు ఈ మధ్య ఏ మేటర్ దొరకనట్టు లేదు ఆఖరికి చిరంజీవి పుట్టినరోజు మీద పడ్డారు. మరి రాంగోపాల్ వర్మ ట్వీట్లకు ఏలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.  

భూసేకరణ పై పవన్ సీరియస్.. షూటింగ్ ఆపేసి మరీ

పస్తుతానికి ఏపీ భూసేకరణ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతల నుండి  లాక్కోవద్దని చంద్రబాబును ట్విట్టర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ట్వీట్లను పట్టించుకోకుండా శుక్రవారం ఐదు గ్రామాల పరిధిలో భూసేకరణకు రైతులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంపై తన ట్వీట్టర్ అనే ఆయుధంతో మండిపడ్డారు. దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యాఖ్యలను ఉద్దేశించి తన అంతరంగాన్ని పవన్ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. "ఒక పార్టీ దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీకి విధేయత చూపడంలో అర్థం ఉంటుంది.. అంతేకాని పార్టీ విధి విధానాలు దేశ ప్రయాజనాలను దెబ్బతీసేలా ఉన్నప్పుడు అది నేరానికి పాల్పడడంతో సమానమని, రాజకీయాలకు దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం కావాలని రాంజెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలను ఆయన ట్వీట్ చేశారు."   అంతేకాదు ఏపీ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణను అడ్డుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని భూములను  బలవంతంగా లాక్కుంటే సహించబోనని గతంలోనే చెప్పిన నేపథ్యంలో ఈ విషయంపై పోరాడటాని ఆయన తన సినిమా షూటింగ్ కూడా మధ్యలో ఆపేసి హైదరాబాద్ కు చేరుకున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన ఐదు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు పర్యటించాలని చూస్తున్నట్టు.. ఇదే విషయంపై ఆయన తన అనుచరులు, సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు కూడా అదివారం నాడు పవన్ కళ్యాణ్ ను కలిసి భూసేకరణ గురించి.. ఏపీ అవసరాలను గురించి చర్చించనున్నట్టు సమాచారం. మరి ఏమవుతుందో  చూడాలి.

ప్రత్యేక హోదా తెచ్చేది ఎవరు? డొక్క చీలుస్తాం

  ఏపీకీ ప్రత్యేక హోదా వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఓ పక్క ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా?.. ఈనెల 25న జరగబోయే చంద్రబాబు, మోడీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రత్యేక హోదా విషయంపై ఎం నిర్ణయం తీసుకుంటారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో ప్రత్యేక హోదా అంశంపై వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. గుంటూరు జిల్లా శంకర్‌విలాస్ సెంటర్, అరన్నల్ పేట ఓవర్‌బ్రిడ్జ్‌లపై "ప్రత్యేక హోదా తెచ్చేది ఎవరు? ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే డొక్క చీలుస్తాం, టాప్‌ లేచిపోద్ది, రంగు పడుద్దంటూ" కౌన్‌బనేగా కరోడ్‌పతి పేరుతోఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు ఈ ఫ్లేక్సీలు పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై పలు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ.. భూసేకరణ వివరణ

  భూసేకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ట్విట్టర్ లో ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. రైతుల నుండి భూములు తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ చంద్రబాబును కోరారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రేపు పవన్‌కల్యాణ్‌తో భేటీ కానున్నట్టు సమాచారం. భూసేకరణ గురించి.. ఏపీలో ఉన్న సమస్యల గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు వివరించనున్నట్టు తెలుస్తోంది. కాగా రేపు ఉదయం చంద్రబాబు పార్టీ నాయకులతో విజయవాడలో సమావేశమయి భాసేకరణ, కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై చర్చించి అనంతరం సాయంత్రం విజయవాడ నుండి హైదరాబాద్ కు రానున్నారు.

ఏపీ ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం కసరత్తు..

  ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించేందుకు గాను ఈ నెల 25న భేటీకానున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం అప్పుడే స్పష్టత ఇవ్వకపోవచ్చుననే ఊహాగానాలు రేగుతున్నాయి కానీ ప్రత్యేక  ప్యాకేజీపైన మాత్రం కేంద్రం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కేంద్రం కసరత్తు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడానికి  ‘ప్రాథమిక’ ప్యాకేజీని కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ ప్యాకేజీ కూడా ఇప్పటికే ప్రధాని కార్యలయానికి చేరినట్టు సమాచారం. అయితే చంద్రబాబు.. మోడీ భేటీ అనంతరం వారు మాట్లాడుకున్నాక మార్పులు చేయడంకంటే ముందుగానే ఏపీకి ఏం కావాలో తెలుసుకుని సమగ్రంగా ప్యాకేజీని తయారు చేయాలని ప్రధాని మోదీ కేబినెట్‌ కార్యదర్శి పి.కె.సిన్హాకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పి.కె.సిన్హా మోదీ ఆదేశాల ప్రకారం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అనిల్‌ సింఘాల్‌ను ఫోన్‌ చేసి ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో  ఏపీ ప్రభుత్వం తయారు చేసిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అనిల్‌ సింఘాల్‌ అందజేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా రాదా?

  ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? ఇప్పుడు అందరికి వచ్చే ప్రశ్న ఈ ఒక్కటే. ఇప్పుటికే ఒకవైపు ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి ఎలాగైనా ప్రత్యేక హోదా తేవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25న ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా ఒక్కటే కాదు ఏపీకి కావలసిన అవసరాలు, ఇబ్బందుల గురించి కూడా చర్చించనున్నారు. అంతేకాదు మోడీ  బీహార్ కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలా కాకుండా ఉత్తర ఖండ్ తరహాలో ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్టుల తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించిన 200 పేజీల ముసాయిదాను కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.   అయితే అందరూ మోడీ చంద్రబాబు ల భేటీ కోస..ఆ భేటీలో ప్రత్యోక హోదా విషయంపై ఏం నిర్ణయం తీసుకుంటారా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రత్యేక హోదా రాదా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు,కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రత్యేకహోదా చాలా సున్నితమైన అంశమని.. చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని మాత్రమే కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దీంతో ప్రత్యేక హోదా రాదనే విషయం అశోక గజపతి రాజు మాటాల్లోనే అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

చిరంజీవి బర్త్ డే స్పెషల్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమని కొన్ని సంవత్సరాలపాటు ఏలి ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎవరి సపోర్టు లేకుండానే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ లో నెం1 స్థానాన్ని కొట్టేశారు. తన సినీ ప్రస్థానంలో మొత్తం 149 సినిమాలు చేయగా ఇప్పుడు అందరూ 150 వ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఈరోజు చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అంతే కాదు తండ్రి పుట్టిన రోజును తనయుడు రాంచరణ్ గ్రాండ్ గానే  ప్లాన్ చేశాడు. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో  గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు టాలీవుడ్ నుండే కాదు బాలీవుడ్ నుండి ప్రముఖ హీరోలుకూడా రానున్నట్టు తెలుస్తోంది.

బీహార్ లిఫ్ట్‌లు చిన్నవి.. అమిత్ షా ఎక్కకపోవడమే మంచిది

  భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్ ఎన్నికల నేపథ్యంలో చర్చించడానికి వెళ్లి లిఫ్ట్ లో 40 నిమిషాలు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ అమిత్ షా పై సెటైర్లు విసిరారు. బీహార్ లిఫ్ట్‌లు చాలా చిన్నవని, అమిత్ షా వంటి లావువాళ్లను అవి మోయలేవని విమర్శించారు. అమిత్ షా లావుగా ఉన్నందునే లిఫ్ట్ ఆగిపోయిందన్నారు. అధిక బరువు ఉన్న వ్యక్తులు లిఫ్ట్ ఎక్కకపోవడమే మంచిదన్నారు. దీనికి బీజేపీ కూడా వెంటనే స్పందించిం ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది.

లిఫ్ట్ లో చిక్కుకుపోయిన అమిత్ షా

  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దాదాపు 40 నిమిషాలు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారంట. బీహార్ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంపై చర్చించడానికి పాట్నా వచ్చిన ఆయన పార్టీ నాయకులతో చర్చించారు. అనంతరం తిరిగి రాత్రి 11.30 గంటలకు అమిత్ షా, ఆయన వ్యక్తిగత కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు భూపీందర్ సింగ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి సాధన్ సింగ్, భద్రతా సిబ్బంది లిఫ్ట్ లో బయలుదేరగా లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే ఆసమయంలో వారి దగ్గర ఉన్న ఫోనులు కూడా పనిచేయలేదు.. లిఫ్ట్ లో ఉన్న ఎమర్జెన్సీ నెంబరుకు పని చేసినా అది కూడా పనిచేలేదు దీంతో వారందరూ దాదాపు 40 నిమిషాలు లిఫ్ట్ లోనే ఉండాల్సి వచ్చిందంట. అయితే తరువాత అమిత్ షా ఆదేశాల మేరకు సీఆర్ పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి లిఫ్ట్ ఇనుప డోర్ లు పగలగొట్టి అమిత్ షాను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారట.

ట్వీట్లు వేస్తే సరిపోదు.. వెళ్లి కాపాడు

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరోసారి పవన్ కళ్యాణ్ కు కొన్ని సూచనలు చేశారు. గతంలో కూడా ఈయన ఒకసారి ఓటుకు నోటు వ్యవహారంపై ప్రశ్నిస్తా అన్నావు కదా ఏం చేస్తున్నావ్ అంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ రాజధానిలో భూముల సేకరణను ఉద్దేశించి వీహెచ్ పవన్ కళ్యాణ్ ను సూచించారు. భూసేకరణ వద్దంటూ ట్వీట్టర్ లో ట్వీట్లు చేస్తూ ఇంట్లో కూర్చుంటే సరికాదు.. అక్కడికి వెళ్లి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఏపీ ప్రభుత్వం అన్యాయంగా రైతుల నుండి భూములను లాక్కుంటుందని.. పవన్ కళ్యాణ్ రాజధాని వెళ్లి ఆపాలని సూచించారు. కాగా రైతుల నుండి పంటలు పండే భూములు తీసుకోవద్దని.. ఉండవల్లి, బేతపూడి, పెనుబాక గ్రామాల్లో ఉన్న భూములను భూసేకరణ నుండి మినహాయించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ ద్వారా చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే.

అనుష్క త్రిషలపై జక్కన్న ప్రశంసలు

  జక్కన్న రాజమౌళి చెక్కిన బాహుబలి సినిమా ఘన విజయం సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. అయితే ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కోసం ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 40 శాతం షూటింగ్ పూర్తయిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో రాజమౌళి ఏం చేస్తున్నారో తెలుసా అన్ని సినిమాల వైపు ఓ లుక్కెస్తున్నట్టున్నారు. ఏ సినిమాలు వున్నాయ్.. ఎవరెవరు ఎలా చేస్తున్నారు అని బాగా పరిశీలిస్తున్నట్టున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు రెండు సినిమాలు బాగా నచ్చాయంట. సైజ్ జీరో సినిమాలో లావుగా, డీగ్లామర్ గా అనుష్క పాత్ర.. అలాగే నాయకి సినిమాలో త్రిష పాత్రలు బాగా నచ్చాయంట. అంతేకాదు ఈ సినిమాలకి సంబంధించి ట్వీట్టర్ లో పోస్టులు కూడా చేశాడు . సైజ్ జీరో సినిమాలో అనుష్క చాలా చక్కగా ఉందని.. ఇంకా నాయకి పాత్రలో అయితే త్రిష ఒక చేత్తో కత్తి.. ఒక చేత్తో పూజా సామాగ్రి పట్టుకొని చాలా బావుందని.. ఈ రెండు సినిమాల పోస్టర్లు చూస్తుంటేనే ఆసక్తి కలుగుతుందని ట్వీట్స్ చేశాడు. మరి జక్కన్నకే  ఈ సినిమాలు అంత బాగా నచ్చాయంటే మరి ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చుతాయో చూడాలి.