ప్రత్యేక హోదా తెచ్చేది ఎవరు? డొక్క చీలుస్తాం
posted on Aug 22, 2015 @ 3:25PM
ఏపీకీ ప్రత్యేక హోదా వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఓ పక్క ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా?.. ఈనెల 25న జరగబోయే చంద్రబాబు, మోడీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రత్యేక హోదా విషయంపై ఎం నిర్ణయం తీసుకుంటారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో ప్రత్యేక హోదా అంశంపై వివాదాస్పద ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. గుంటూరు జిల్లా శంకర్‌విలాస్ సెంటర్, అరన్నల్ పేట ఓవర్‌బ్రిడ్జ్‌లపై "ప్రత్యేక హోదా తెచ్చేది ఎవరు? ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే డొక్క చీలుస్తాం, టాప్ లేచిపోద్ది, రంగు పడుద్దంటూ" కౌన్‌బనేగా కరోడ్‌పతి పేరుతోఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు ఈ ఫ్లేక్సీలు పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై పలు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.