నేను బానిసను కాదు.. పవన్ కళ్యాణ్
posted on Aug 24, 2015 @ 12:03PM
జనసేన అధినత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ఏపీ రాజధాని పర్యటన చేసిన సంగతి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణనను వ్యతిరేకిస్తూ ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగసభలో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రానికి రాజధాని అవసరం.. అదే విధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి దానికి భూసేకరణ తప్ప మరో మార్గం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రా అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషిచేస్తున్నారని.. హైటెక్ సిటీతోపాటు ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబుకు ఈ విషయం తెలియదని తాను అనుకోవడం లేదని అన్నారు.
గతంలో రాజధానికి కావలసిన భూసేకరణ నేపథ్యంలో రైతులు గొడవలు ఆందోళనలు చేశారని అప్పుడే వారిని పరామర్శించానని.. వారికి సంబంధించిన సమస్యలను గురించి అప్పుడే చంద్రబాబుకు ‘సార్ చూడండి’ అంటూ ట్విటర్లో మెసేజ్ పోస్టు చేశాను అని తెలిపారు. అప్పుడు కూడా మంత్రులు దానిని సూచనగా తీసుకోకుండా నాపై కామెంట్లు చేశారని అన్నారు. ఇప్పుడు కూడా భూసేకరణ వ్యవహారంలో టీడీపీ నేతలకు పవన్ కళ్యాణ్ కు మధ్య మాటలు యుద్దాలు జరిగిన నేపథ్యంలో తాను కేవలం టీడీపీకి మిత్రుడనేనని.. అంతేకాని బానిసను కాదని ఘాటుగానే సమాధానమిచ్చారు. న్యాయంగా వ్యవహరించకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రారని హెచ్చరించారు. నేను ఇక్కడికి వచ్చింది గొడవపడటానికి కాదు రైతుల సమస్యలు తెలుకొని వాటి గురించి తెలియజేయడానికి వచ్చానని.. కానీ గొడవల వల్ల వారి సమస్యలు తీరతాయయంటే గొడవలకు కూడా సిద్ధమేనని తేల్చి చెప్పారు.