గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది.. దేశంలోనే మొట్టమొదటి హైస్పీడ్ రైలు
రైల్వే మంత్రి సురేష్ ప్రభు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 'గతిమాన్ ఎక్స్‌ప్రెస్' రైలును ప్రారంభించారు. ఈ హైస్పీడు రైలు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఢిల్లీ, ఆగ్రాల మధ్య నడిచే ఈ రైలు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రా స్టేషన్ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిముషాల్లో చేరుకుంటుంది. అయితే ఈ రైలు ఒక్క శుక్రవారం తప్పా మిగిలిన అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది.
కాగా గతిమాన్ ఎక్స్ప్రెస్ రైలులో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి.