గిన్నిస్ రికార్డులకెక్కిన బెజవాడ దసరా కార్నివాల్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయవాడ దసరా ఉత్సవ్ అద్భుత విజయం సాధించింది. మైఃసూరు దరసా ఉత్సవాలను తలదన్నెలా బెజవాడ దసరా ఉత్సవ్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన  విజయవాడ దసరా కార్నివాల్-2025 గిన్నిస్ బుక్ ఆఫ్  వరల్డ్ రికార్వ్స్ లో స్థానం లభించింది.  విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం (అక్టోబర్ 2)  నిర్వహించిన విజయవాడ దసరా కార్నివాల్ లో అత్యధిక సంఖ్యలో డప్పు కళాకారులు ఒకే చోట ప్రదర్శన ఇచ్చారు. దీనితో ఈ కార్నివాల్ కు గిన్నిస్ బుక్ లో స్థానం లభించింది.   మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన ఈ భారీ కార్నివాల్ ర్యాలీలో వేలాది   మంది కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించి సభికులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ అద్భుత ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కింది. దీనిని అధికారికంగా ధృవీకరించిన  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగాచంద్రబాబు మాట్లాడుతూ,  ఈ రికార్డు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక ఔన్నత్యానికి, , ప్రభుత్వ ఆశయాలకు సాక్ష్యంగా అభివర్ణించారు. 

యాచించడం కాదు.. శాసించే స్థాయికి చేరాలి.. చంద్రబాబు

విజయదశమి రోజు సంకల్పించిన ప్రతి పనీ విజయవంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో విజయదశమి రోజు (అక్టోబర్ 2)  ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   వేదిక వద్ద ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీకి విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన  స్టాళ్లను సీఎం పరిశీలించారు.  ఖాదీ ఉద్యమంలో...స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్న వారి ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు.  ఖాదీసంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాట్నంపై చంద్రబాబు నూలు వడికారు.  అనంతరం ప్రసంగించిన చంద్రబాబు  ప్రపంచాన్ని యాచించే స్థాయిని దాటిపోయిందని...ఇకపై శాసించే స్థాయికి భారత్ చేరుకోవాలని  అన్నారు.  ఖాదీసంత స్వదేశీ   ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా తయారవుతుందన్నారు.  ఇప్పటి వరకూ విదేశీ వస్తువులు, విదేశీ టెక్నాలజీనే వాడుతూ వచ్చామనీ,  ఇప్పుడు ప్రధాని మోదీ టెక్నాలజీ రంగంలోనూ స్వదేశీకి పిలుపునిచ్చారన్నారు.  కోవిడ్ సమయంలో భారత్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లే వివిధ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడాయన్నారు. 2038 నాటికి భారత్ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరిస్తుందనీ, ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుతుందని చెప్పారు.  2047 నాటికి అగ్రస్థానంలోకి ఇండియా చేరుతుందన్నారు.   శాటిలైట్ లను ఇతర దేశాల నుంచి ప్రయోగించే పరిస్థితి నుంచి ప్రైవేటు వ్యక్తులు కూడా   ఉపగ్రహాలను తయారు చేసి లాంచ్ చేసే పరిస్థితికి వచ్చేశామన్నారు. దేశ జనాభాయే మనకు అతి పెద్ద ఆస్తి అన్న చంద్రబాబు  మన ఉత్పత్తులు మనమే వినియోగించుకుంటే డిమాండ్ పెరిగి ఆర్ధిక లావాదేవీలు పెరుగుతాయన్నారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొబ్బరి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ఇలా వేర్వేరు నాణ్యమైన ఉత్పత్తులు తయారు అవుతున్నాయి. వీటిని మనమే ప్రమోట్ చేసుకోవాలి. వీటి వినియోగం పెరిగితే.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవటంతోపాటు.. మన ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందన్నారు.  

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో తిరమల భక్త జన సంద్రంగా మారింది. గురువారం (అక్టోబర్ 2) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలా తోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (అక్టోబర్ 1) శ్రీవారిని మొత్తం 72 వేల 247 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 738 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది.  

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త

  తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసింది.  ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా -  జగిత్యాల రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా - నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( తెలిపారు. గత రెండేళ్లలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించేందుకు రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్‌ను మంజూరు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.  దేశవ్యాప్తంగా పీఎం శ్రీ స్కూల్స్ కోసం ఎక్కువ కేటాయింపులు అందుకున్న రాష్ట్రం తెలంగాణనే కావడం విశేషమన్నారు. మరోవైపు ఏపీకి కూడ కేంద్ర ప్రభుత్వం నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది.  శ్రీకాకుళం జిల్లా మంగసముద్రం (చిత్తూరు), బైరుగానిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి)లో వీటిని ఏర్పాటు చేయనుంది.  దీంతో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదలు తెలిపారు.   

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

  రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో విజయదశమికి ప్రత్యేక స్థానం ఉందని, చెెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగ విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు. తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని ప్రజలందరికీ సుఖసుంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆ దుర్గమాతను ప్రార్ధించినట్లు పేర్కొన్నారు.  శమీ పూజ చేయడం, అలాయ్ బలాయ్, పాలపిట్ట దర్శనం తెలంగాణకు ప్రత్యేకమని సీఎం పేర్కొన్నారు.  మరోవైపు దసరా వేడుకలను పురస్కరించుకొని సీఎం రేవంత్ స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లికు వెళ్లనున్నారు. ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ బాపూఘాట్‌లో మహాత్మ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. తర్వాత సర్వమత ప్రార్ధనల్లో పాల్గొంటారు.   

బాలిక మిస్సింగ్....ఇంటి పైన మృతదేహం

    నిన్నటి నుండి కూతురు కనిపిం చకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు...  కూతురు తిరిగి వస్తుందని ఆశపడ్డ తల్లిదండ్రులకు విషాదం ఎదుర య్యింది... పాప మృతదేహాన్ని చూసి రోదిస్తున్నతల్లిదండ్రు లను చూసిన స్థాని కులు సైతం కంట తడి పెట్టుకున్నారు. మాదన్నపేటలో ఓ విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ అజీమ్, షబానా బేగం దంపతులు... వీరికి హుమేయని సమ్మయ్య (07) అనే ఒక్క కూతురు ఉంది.. వీరు కంచన్ బాగ్ లోని ఓవైసీ హాస్పిటల్ వద్ద నివాసం ఉంటున్నారు. అయితే  మాదన్న పేట్ లోని చావనీలో నివాసం ఉంటున్న అమ్మమ్మ ఇంటికి బాలిక తన తల్లి షబానా బేగంతో కలిసి వచ్చింది.  అమ్మమ్మ ఇంటి వద్ద బయట ఆడుకోవడానికి వెళ్లిన బాలిక నిన్నటి నుండి మిస్సింగ్ అయింది. బాలిక కనిపించక పోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు పోలీసులు మిస్సింగ్ అయిన పాప కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా... ఇటు సాయంత్రం సమయంలో ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకర్ లో ఉన్న పాప మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించ సాగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాటర్ ట్యాంక్ లో ఉన్న పాప మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అసలు పాప వాటర్ ట్యాంక్ వద్దకు ఎందుకు వచ్చింది? వాటర్ ట్యాంక్ లో ఎలా పడిపోయింది. పాప ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ లో పడిపోయిందా? లేదా ఎవరైనా చంపేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.  

సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఖరారు

  సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు ముహూర్తం ఖరారైంది.  ఈ నెల 22 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటించనున్నారు. ఏపీకి  పెట్టుబడులే లక్ష్యంగా  దుబాయ్‌, అబుదాబి, యూఏఈలో పర్యటన ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.  సీఎం వెంట మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 14, 15 తేదీల్లో వైజాగ్‌లో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి విదేశీ పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. స్థిరాస్తి, భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌, రవాణా, ఫైనాన్స్‌, సర్వీసెస్‌, ఇన్నోవేషన్స్‌ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించనున్నారని అధికారులు పేర్కొన్నారు.   

మద్యం లారీలో మంటలు...ఎగబడిన స్ధానికులు

  అసలే రేపు దసరా పండుగ.... గాంధీ జయంతి సందర్భంగా మద్యం నిషేధం... ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్న మందు బాబులకు ఓ లక్కీ డ్రా తగిలింది... లిక్కర్ లోడుతో వెళ్తున్న డీసీఎంకు ప్రమాదం జరిగింది.. దీంతో రోడ్డు మీద మద్యం సీసాలు పడడం చూసిన పబ్లిక్ ఏగపడ్డారు. ఇంకేముంది అందిన కాడికల్లా మద్యం సీసాలను ఎత్తు కెళ్లారు... డ్రైవర్ లబోదిబో మొత్తు కున్నా కూడా జనం అవేమీ వినకుండా మందు బాటిల్స్ పట్టుకొని పరుగు లగాయించారు... ఈ ఘటన రామంతపూర్ పరిధిలో చోటుచేసుకుంది.  రామంతపూర్ స్ట్రీట్ నెంబర్ 8 లో రోడ్డుమీద వెళ్తున్న లిక్కర్ డీసీఎంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వచ్చాయి. కరెంటు వైర్లు కిందకి ఉండడంతో డీసీఎం వాటి పై నుండి వెళ్లడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫైర్ ఇంజన్ ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. లిక్కర్ డీసీఎం లో ఉన్న లిక్కర్ బాటిల్స్ కొంత భాగం తగల బడ్డాయి. కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగ లేదు. కానీ ఈ ప్రమాదం జరిగిన సమయంలో డీసీఎం నుండి కొన్ని మద్యం బాటిల్స్ బాక్స్ లు రోడ్డు మీద పడ్డాయి.  మరికొందరైతే లిక్కర్ లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనానికి సాంకేతిక లోపం రావడం వల్ల..డీసీఎం  ఒక్కసారి గా ఆగిపోయిందని.. ఆ సమయంలో డీసీఎం లో ఉన్న లిక్కర్ బాటిల్స్ బాక్సులు కింద పడ్డాయని చెప్తున్నారు... ఏది ఏమైనాప్పటికీ రోడ్డుమీద మద్యం బాటిల్స్ పడడం గమనించిన పబ్లిక్ వెంటనే అక్కడికి చేరుకొని మెల్లిగా చేతికి అందిన కాడికి మద్యం బాటిల్స్ ఎత్తుకొని పారిపోయారు... నడిరోడ్డు మీద ఈ ఘటన జరగడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగం లోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

డింపుల్ హయతిపై కేసు నమోదు...ఎందుకంటే?

  టాలీవుడ్ నటి డింపుల్ హయతి మరొకసారి  తెరమీదకి వచ్చారు.. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే హాయతి ఇప్పుడు పనిమనిషి వ్యవహారంలో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.. డింపుల్ హయతితో పాటు ఆమె భర్త పైన ఇంట్లో పని చేస్తున్న లేడీ ఫిర్యాదు చేసింది ..దీనిపైన ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ..ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్లు ఫిలింనగర్ పోలీసులు తెలిపారు.  గత కొన్న రోజుల నుంచి డింపుల్ హయతి ఇంట్లో ఒడిస్సా కి చెందిన ప్రియాంక పనిచేస్తున్నారు. ఆమె ఇంట్లో ఉన్న కుక్క అరిచిందని చెప్పి డింపుల్ భర్త పనిమనిషి పైన చేయి చేసుకున్నాడు.. ఆ తర్వాత డింపుల్ హయతి కూడా తీవ్ర స్థాయిలో చిత్ర హింసలకు గురిచేసింది.. అక్కడితో వ్యవహారం ముగిసిపోలేదు. అయితే జరుగుతున్న సంఘటనను షూట్ చేసేందుకు పనిమనిషి ప్రయత్నం చేసింది. పనిమనిషి ఫోన్ తీసుకొని కింద పడేశారు ..ఆ తర్వాత ఆమె బట్టలు చింపి షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు ..డింపుల్ దంపతుల నుంచి తప్పించుకొంది. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హయతి నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడిదనినా చెప్పుల విలువ కాదు నీ బతుకు అంటూ అకారణం గా దూషించడంతో పాటు.. దాడి కూడా చేసినట్లుగా పనిమనిషి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు హీరోయిన్ డింపుల్ హయతీ తో పాటు ఆమె భర్త  మీద క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంక బిబర్ అనే యువతి షేక్‌పేటలోని వెస్ట్‌వుడ్ అపార్టు మెంట్స్‌లో ఉంటున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంది. అయితే, డింపుల్, ఆమె భర్త డేవిడ్ తనను దూషిస్తూ, అవమానిస్తూ సరైన ఆహారం ఇవ్వ కుండా హింసుస్తు న్నారని ప్రియాంక తన ఫిర్యాదులో పేర్కొంది. ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని, అందుకు కారణం తానేనంటూ భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని,అంతేకాక తనను నగ్నంగా మార్చి కొట్టేందుకు యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అదేవిధంగా.. జీతం విషయంలోనూ వారు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రియాంక తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయతీ, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  తాను పనిచేసేపటికి డబ్బులు ఇవ్వకుండా తన ఫోటోలు వీడియోలు తీసి ఇబ్బందులకు గురి చేస్తారని పనిమనిషి పోలీసులకు చెప్పింది... మరోవైపు హాయతి ఉంటున్న ఫ్లాట్ ఎదుట ప్రియాంకతో పాటు మరొక పనిమనిషి కలిసి ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి వారిద్దరికీ సర్ది చెప్పి తీసుకువెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు.. పోలీసులు డింపుల్ హయతి మరియు ఆమె భర్తపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు...

యువతకు త్వరలో 9 లక్షల ఉద్యోగాలు : సీఎం చంద్రబాబు

  దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా సామాజిక పింఛన్ల అందిస్తున్నాదని సీఎం చంద్రబాబు అన్నారు.  విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదికలో గ్రామస్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో యూపీ వంటి పెద్ద రాష్ట్రంలో కేవలం రూ.500 మాత్రమే పింఛను ఇస్తున్నారని, కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం నాలుగు వేలు పింఛన్ల  అందిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 13 మందికి పింఛను అందుతోందని, అందులో 59 శాతం మహిళలేనని వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన "సూపర్ సిక్స్" పథకాలను సూపర్ హిట్ చేశామని, అన్ని హామీలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మహిళల కష్టాలు తీర్చేందుకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. "స్త్రీ శక్తి" పథకం కింద ఆగస్టు 15న ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కేవలం 45 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చిందే టీడీపీ ప్రభుత్వమని సీఎం గుర్తుచేశారు. అన్నదాత ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.6,000 జమ చేశామని, త్వరలోనే మరో రూ.14,000 అందిస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని చెబుతూ, ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించామన్నారు.  ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.  ఒకప్పుడు రైతును పట్టించుకునే పరిస్థితి లేదు. ఆహారపు అలవాటలు మారాలని సీఎం తెలిపారు. విజయనగరం జిల్లా పేదరికంలో ఉంది. తగినంత సాగునీరు లేదు. కానీ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

బస్సు డ్రైవర్‌ను చితక్కొట్టిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు

  రంగారెడ్డి జిల్లా మాదన్నపేట్ పరిధిలో నిన్న ఓ వృద్ధురాలిపై కానిస్టేబుల్ కుటుంబం దాడి చేసిన ఘటన మరువక ముందే మరొ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్న తప్పిదంతో పెద్దగా రాద్ధాంతం చేస్తూ కానిస్టేబుల్ కుటుంబం నడిరోడ్డు మీద రచ్చ రచ్చ సృష్టించారు.. దీంతో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉదృత వాతావరణం నెలకొంది... హైదరాబాద్ నుండి నల్గొండ కి వస్తున్న ఆర్టీసీ బస్ క్లాక్ టవర్ సెంటర్ వద్ద TS05FM0405 గల కారును అను కోకుండా తగిలింది.  దీంతో కారులో ప్రయాణిస్తున్న విజిలెన్స్ కానిస్టే బుల్ భార్య మరియు సుపు త్రుడు ఈ విష యాన్ని పెద్దగా రాద్ధాంతం చేస్తూ బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. బస్సు డ్రైవర్ ను చితకబాదుతున్న సమయంలో అక్కడే ఉన్న భవాని మాల వేసుకున్న జర్నలిస్ట్ వృత్తిపరం గా ఆ దృశ్యం మొత్తం వీడియో తీశాడు.. అది గమనించిన కానిస్టేబుల్ భార్య మరియు సుపు త్రుడు ఒక్కసారిగా రెచ్చిపోతూ భవాని మాల వేసుకున్న జర్నలిస్ట్ పై అసభ్యకరంగా బూతులు తిడుతూ రెచ్చిపోయారు.  మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం.... పెద్దపెద్ద పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు.... మమ్ము లను ఏమీ చేయలేరు... నీ దిక్కున్న చోట చెప్పుకో.... అంటూ జర్నలిస్ట్ ని దుర్భా షలాడారు...  అది గమనించిన భవాని భక్తులకు ఆగ్రహం వచ్చింది. వెంటనే భవాని స్వాములు అందరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కుటుంబం పై ఫిర్యాదు చేశారు.  భవాని మాల వేసుకున్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడారని అట్టి విజిలెన్స్ కానిస్టేబుల్ కుటుంబం పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ భవాని స్వాములు డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు కూడా ఫిర్యాదు చేశారు దీంతో టూ టౌన్ ఎస్ఐ సైదులు ఇరుపక్షాల నుండి ఫిర్యాదులు స్వీకరించి.... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

అంగరంగ వైభవంగా.. కన్నుల పండువగా రథోత్సవం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదోరోజైన బుధవారం (అక్టోబర్ 1) ఉదయం శ్రీవారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.  ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సాహంగా రథాన్ని లాగారు.  ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మార్మోగాయి.  తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.   ఈ కార్యక్రమంలో తిరుమ‌ల పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు స‌భ్యులు, జెఈవో వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో మురళి కృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు ఐబొమ్మ సవాల్

  పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు ఐబొమ్మ సవాలు విసిరింది. సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపా యల నష్టాన్ని కలిగించిన ఐబొమ్మ యాజ మాన్యం పోలీసులను బెదిరిస్తూ ప్రకటనలు గుప్పిస్తుంది.. సినిమా ఇండస్ట్రీకి నష్టాన్ని కలిగిస్తున్న ఐబొమ్మ కోసం పనిచేస్తున్న నిర్వాహకులను పట్టుకుని ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తా ఉంటూ పోలీసులు ప్రకటించారు.  గత వారంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఐ బొమ్మ చేసిన ప్రకటన చేరింది.. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ఐబొమ్మకు సంబంధించిన నలుగురు నిర్వాహకులను పట్టుకున్నారు.. ఇందులో ప్రధాన సూతదారుడు విదేశాల్లో ఉన్నాడు.. సర్వర్స్ కూడా విదేశాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ నిర్వాహ కులను ఎలాగైనా పట్టుకొని తీరుతా మంటూ పోలీసులు ప్రకటించారు..  సినిమా, ఓటిటి పైరసీ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇటీవల ధియేటర్ లో రికార్డ్ చేసే వారితో పాటు... సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు.. అయితే పోలీసులుదర్యాప్తు చేస్తున్న క్రమంలో ఐబొమ్మ వెబ్‌ సైట్ పై దృష్టి సారించారు.. ఐ బొమ్మ...ఇప్పుడు తాజాగా ఐపిలు మార్చి పోలీసులను ఏమారుస్తున్నారు. ఐబొమ్మ సర్వర్, నేరగాళ్లను పట్టు కునే సమ యంలో తమను చేతనైతే పట్టుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఐబోమ్మ సవాల్ విసిరింది. ఐ బొమ్మ విసిరిన సవాల్ ను సైబర్ క్రైమ్ పోలీ సులు చాలెంజ్ గా తీసుకుని ఐబొమ్మ సైట్ కోసం పని చేస్తున్న 4గురిని అదుపులోకి తీసు కున్నారు.బీహార్, యూపిలో ప్రధాన ఏజెంట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తిం చారు.ఐ బొమ్మ దేశ వ్యాప్తంగా ఏజెంట్ల ను నియమిం చుకొని పెద్ద ఎత్తున పైరసీలకు పాల్ప డుతున్నారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌,ఓటిటి కంటెంట్ తస్కరిస్తూ నిర్వహకులకు తల నొప్పిగా మారింది... ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ మరోసారి సంచలన ప్రకటన విడుదల చేసింది. తమ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాలనే ప్రయ త్నాలు చేస్తే ఘోర పరిణామాలు తప్ప వని పోలీ సులు, మీడియా, ఓటీటీ సంస్థలు, ఫిల్మ్‌ ఇండస్ట్రీని హెచ్చరించింది. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సంచలనం రేపుతూ వైరల్ అవుతుంది.. అయితే గత రెండు సంవత్సరాల క్రితం ఐ బొమ్మ వెబ్సైట్ పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ఓ ప్రకటన పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది. ఐ బొమ్మ విడుదల చేసిన ప్రకటనలో“మా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నంబర్లు బయట పెడతాం.మా టెలిగ్రామ్‌ గ్రూపులు, సబ్‌స్క్రిప్షన్లు బహిర్గతం చేస్తామంటూ హెచ్చరించింది. 5 కోట్ల మందికి పైగా యూజర్లకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉందని అది కనుక విడుదల చేసై మీడియా, ఓటీటీ , హీరోలకూ షాకింగ్ రివీల్ అవుతుంది.ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము కూడా అక్కడే ఫోకస్ చేస్తాం.ఇండియా మొత్తం మా సపోర్ట్ గా ఉంది.మా సర్వర్లు ఎక్కడు న్నాయో పోలీసు లకు కనబడరు ప్రతి యూజర్ ఫోన్ నంబర్ మా డేటాబేస్‌లో ఉంది.మా మీద నిఘా పెట్టితే ....ఓటీటీలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటపడతాయి.మమ్మల్ని ఆప లేరు… మమ్మల్ని వెతకాలేరు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. పోలీసుల చర్యలతో బిగ్‌ స్టార్‌ల ఇమేజ్‌ ప్రమాదంలో పడుతుంది. మేము ఒక్క దేశానికి పరిమితం కాదు, గ్లోబల్‌ నెట్‌వర్క్‌” అని క్లారిటీ ఇచ్చింది. తద్వారా, ఇండస్ట్రీలో పెద్ద షాక్ రాబోతుం దంటూ ఐబొమ్మ సవాలు విసిరింది. ఐ బొమ్మ విసిరిన సవాళ్లను చాలెంజ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ సెట్ కోసం పనిచేస్తున్న నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. అనంతరం  గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సినిమా పైరసీ పై సినీ ప్రముఖులతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు... ఈ సమావేశంలో ప్రముఖ హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. థియేటర్లో రహస్య చిత్రీకరణ డిజిటల్ హ్యాకింగ్ నిఘా పెట్టాలని నిర్ణయించుకున్నారు... సినిమా ఒరిజినల్ కంటెంట్ ను కాపీ చేస్తున్న వారిపై ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు... వెబ్సైట్లో రెగ్యులర్ ఆడిట్లు, యాక్సిస్ కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.  

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

  దసరా సందర్బంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశం అనంతరం ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం ప్రకటన చేసే అవకాశం ఉంది.   మొత్తం డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి చేరుకుంటుంది. ఈ ఏడాది డీఏ పెంపు ఇది రెండోసారి కావడం విశేషం.  ఇప్పటికే మార్చిలో 2 శాతం పెంచిన ప్రభుత్వం, తాజా పెంపును జూలై 1 నుంచి అమలు చేయనుంది. దీంతో మూడు నెలల బకాయిలు కూడా ఉద్యోగులకు అందనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. సాధారణంగా వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డీఏను సవరిస్తుంది. ద్రవ్యోల్బణం భారాన్ని తగ్గించేందుకు ఇచ్చే ఈ భత్యం తాజా పెంపుతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలిగించనుంది. ఉదాహరణకు, రూ.60,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం డీఏగా రూ.33,000 వస్తే, ఇప్పుడు అది రూ.34,800కి పెరుగుతుంది. ఇకపై వేతన సవరణ కోసం ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా భవిష్యత్తులో జీతాలు, అలవెన్సులపై స్పష్టత రానుంది. 2026 జనవరి 1 నుంచి ఈ సిఫార్సులు అమలులోకి వచ్చిన తర్వాత, ప్రస్తుత డీఏ బేసిక్ పేలో విలీనం చేయబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బ్రహ్మెత్సవాలలో 23.50 లక్షల మందికి అన్నప్రసాదాల పంపిణీ

తిరుమల  ఆకలి అన్న పదమే వినపడని పుణ్యక్షేత్రం. తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం నాణ్యమైన అన్న ప్రసాదాన్ని అందుబాటులో ఉంటుతోంది.  ఇప్పుడు ఆ ఆన్న ప్రసాద కార్యక్రమాన్ని మరింత విస్తరించింది.   తిరుమలలో ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు మొదలైన రోజు నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకూ దాదాపు 23 లక్షల50 వేల మందికి ఎటువంటి కొరతా లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసింది.  గత ఏడాది బ్రహ్మోత్సవాలతో పోలిస్తే ఈ సంవత్సరం 33 శాతం అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసింది. టీటీడీ.  యాత్రికుల రద్దీని అంచనా వేసి, 16 రకాల పదార్థాలతో నాణ్యమైన అన్నప్రసాదాలు పంపిణీ  చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ 1లోని 20,  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టీబీసీ, పీఏసీ - 2, పీఏసీ 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకూ బయటి క్యూలైన్ల వరకు నిత్యం అన్నప్రసాదాలు, పాలు, నీరు, మజ్జిగ, కాఫీ, పాలు నిరంతరాయంగా అందిస్తుంటారు. శ్రీవారి బ్రహ్మెవ్సాల్లో కూడా ఈ నెల 24వ తేదీ నుంచి మంగళవారం వరకు 23,48,337 మంది యాత్రికులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసిన తిరమల తిరుపతి దేవస్థానం కొత్త రికార్డు సృష్టించింది. అన్నప్రసాదాల పంపిణీపై 99 శాతం మంది యాత్రికుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. సాధారణంగా కంటే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనంతో పాటు మలయప్ప స్వామి వారి వాహన సేవలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.  అలా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా ఈ సారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.  గ్యాలరీల్లో యాత్రికులకు సేవలు అందించడానికి టీటీడీ సిబ్బందితో పాటు 3,500 మంది శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు వినియోగించుకుంది.  దాత‌లు అందించిన 23 ర‌కాల కూర‌ గాయ‌ల‌తో ఆహార పదార్థాల తయారీలో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. "బ్రహ్మత్సవాల్లో ఈ 24వ తేదీ నుంచి 29వ తేది వ‌ర‌కు 23,48,337 మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు అందించినట్లు టీటీడీ తెలిపింది. 11,32,160 మంది భ‌క్తుల‌కు పాలు, మజ్జిగ, మంచినీటి బాటిళ్లు అందించినట్లు తెలిపారు. ముఖ్యంగా బ్రహ్మెత్సవాలలో అత్యంత రద్దీగా ఉండే గరుడ వాహన సేవ రోజున తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన టీటీడీ అందుకు ముందస్తు ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉంది. రెండు లక్షల మందంికి సేవలు అందించడానికి ఏర్పాట్లు చేసింది.  విశేష‌మైన గ‌రుడ వాహ‌న సేవ  రోజున నాలుగ మాడ వీధుల్లోని గ్యాల‌రీలతో పాటు హోల్డింగ్ పాయింట్ల వ‌ద్ద  9,28,000 మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేసింది.  

విహారం.. వినోదం.. విషాదం

విహారయాత్ర మహా విషాదంగా మారింది. వెకేషన్ వచ్చిందంటే చాలు యువత స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడానికి విహారయాత్రలకు వెళ్లడం అన్నది సహజం అయితే కొన్ని సార్లు ఆ విహార యాత్రలు విషాదంగా ముగియడం కద్దు. గతంలో కూడా పలుమార్లు విహార యాత్రలు విషాదాంతమైన ఘటనలు ఉన్నాయి. అటువంటిదే తాజాగా నల్లొండ జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కుకట్ పల్లికి చెందిన చాణక్య అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి సాగర్ ఆంజనేయ స్వామి పుష్కర్ ఘాట్ కు వెళ్లాడు. దైవ దర్శనం తరువాత స్నేహితులంతా కలిసి పుష్కర్ ఘాట్ వద్ద ఫొటోలు తీసుకుంటుండగా చాణక్య ప్రమాద వశాత్తూ నదిలో పడిపోయాడు. అతడి రక్షించేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చాణక్య ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు.  దీంతో స్నేహితులు  పోలీసులకు సమా చారాన్ని అందిం చారు. పోలీసులు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం బృందం ఘటన స్థలానికి చేరుకొని చాణక్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో తిరమల భక్త జన సంద్రంగా మారింది. బుధవారం (అక్టోబర్ 1) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 14 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 30) శ్రీవారిని మొత్తం 73 వేల275 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 973 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 77 లక్షల రూపాయలు వచ్చింది. 

క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన సీఎం రేవంత్

ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసి టీమ్ ఇండియాను విజయంలో కీలక పాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ గా నిలిచిన క్రికెటర్   తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం (సెప్టెంబర్ 30) భేటీ అయ్యాడు. హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మను అభినందించి సత్కరించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తిలక్ వర్మ తాను సంతకం చేసిన బ్యాట్ ను సీఎంకు బహూకరించాడు.    ఆసియాకప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుతేజం తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ లు తిలక్ వర్మను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.  మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌‌తో పిచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడనీ, ఒత్తిడిలోనూ అతని ప్రశాంతత, ప్రతిభ స్ఫూర్తిదాయకమనీ చంద్రబాబు ట్వీట్ చేశారు.