విజయసాయి తండ్రి హంతకుడు.. రఘురామ సంచలన ఆరోపణ

రఘురామకృష్ణం రాజు.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం రచ్చబండ అంటూ టెలివిజన్లలో దర్శనమిచే లోక్ సభ సభ్యుడు. సొంత పార్టీ నుంచే వేధింపులు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణం రాజు వైసీపీపై, ఆ పార్టీ నేతలపై విమర్శలెన్ని చేసినా.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి, రఘురామకృష్ణం రాజు మధ్య ట్వీట్ వార్ మాత్రం ఏపీ వ్యాప్తంగా ఎప్పుడూ హాట్ టాపికే. రఘురామకృష్ణం రాజుపై విజయ సాయి ట్వీట్లలో ఉపయోగించే భాష అభ్యంతరకరం. ఒక్కో సారి రఘురామ కృష్ణం రాజు కూడా ఆ భాషను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ వెంటనే నాలుక కరుచుకుని నా సంస్కారం అది కాదు. రెచ్చగొట్టడం వల్లే ఆ భాష ఉపయోగించానంటూ వివరణలూ ఇచ్చుకుంటారు. అదలా ఉంచితే.. తాజాగా రఘురామకృష్ణం రాజు విజయసాయి తండ్రి హంతకుడంటూ రివీల్ చేసి సంచలనం సృష్టించారు. విజయసాయి తండ్రి 1945లో హత్య చేశారని వెల్లడించారు. అది కూడా ఎవరినో కాదు సొంత అన్ననే అని వెల్లడించారు. విజయసాయి తండ్రి సుందరరామిరెడ్డి ఆ హత్య చేసిన సమయంలో మైనర్ అనీ అందుకే ఆయన జైల్లో చదువుకున్నారనీ రఘురామ వెల్లడించారు. విజయసాయి తండ్రి సుందరరామిరెడ్డి తన సొంత అన్నను మరో సోదరుడితో కలిసి చేసిన హత్య లో ఉరి శిక్ష పడిందని వెల్లడించారు.   సొంత కుటుంబసభ్యుడినే  హత్య చేసిన తండ్రి క్రిమినెల్ మెంటాలిటీయే విజయసాయిది కూడా అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తాను బయటపెట్టినవన్నీ వాస్తవాలేననీ. ఒక వేళ నేను అవాస్తవాలు చెబితే వాస్తవం ఏమిటో బయటపెట్టి  విజయసాయిరెడ్డి తనపై డిఫమేషన్ కేసు పెట్టొచ్చని రఘురామ సవాల్ చేశారు. 

ఇక క‌రెన్సీ నోట్ల బాగోగులూ చూసుకోవాలి!

ప్ర‌జ‌ల్ని ఎలాంటి క‌ష్ట‌న‌ష్టాల‌కు గురిచేయ‌కుండా వుండేది మంచి పాల‌న‌. మాటి మాటికి ఏదో ఒక కొత్త నిబంధ‌న‌ల‌తో వేధించేది అస‌లు ప్ర‌భుత్వ‌మ‌నిపించుకోదు. న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వంలోని బిజెపి ప్ర‌భుత్వం నోట్ల మార్పిడి నిర్ణ‌యంతో గ‌తంలో సామాన్య జ‌నాన్ని గ‌తంలో ఎంతో ఇబ్బంది పెట్టింది. ఇపుడు కొత్త‌గా మ‌రో ఇబ్బంది పెట్టే మార్గాన్ని ఎంచుకుంది. మ‌నిషి ఆరోగ్యంగా వున్న‌దీ లేనిదీ ఫిట్నెస్ టెస్ట్ పెట్ట‌డం పోలీసు, ఆర్మీ వుద్యోగాల్లో మామూలే. క‌రెన్సీ నోట్లు ఫిట్నెస్ త‌నిఖీ చేసే యంత్రాల‌ను రంగంలోకి దింపాల‌ని యోచిస్తున్నారు ప్ర‌ధాని. బ్యాంకుల్లో, పెద్ద పెద్ద మాల్స్‌లో నోట్ల‌ను లెక్కించే మిష‌న్లే ఇప్ప‌టివ‌ర‌కూ చూశాం. ఇక నుంచి మ‌నం జేబులోంచి ఇచ్చే ప‌ది, ఇర‌వై, యాభై, వంద నోట్లు కాస్త‌ కూడా న‌ల‌క్కుండా, మ‌ట్టి ప‌ట్ట‌కుండా వుండాలిట‌! చిన్న‌పాటి చిరుగు వున్నా ప‌నికిరాద‌ట‌. అలాంటి నోట్ల‌ను ప‌నికిరాని నోట్లుగా ప‌రిగ‌ణిస్తార‌ట‌. దేనిక‌యినా ఒక అంతూ పొంతూ వుండాలి.  అదేమాలోచ‌న‌? క‌రెన్సీ నోట్లు త‌యార‌యి వ‌చ్చిన కొత్త‌ల్లోనే త‌ళ‌త‌ళ‌లాడేది, గ‌ట్టిగా క‌నిపించేది. జ‌నాల వాడ‌కంలో వాటి రూపు రేఖ‌ల్లో కాస్తంత మార్పువ‌స్తుంది. స‌హ‌జం. కానీ అలా జ‌ర‌గడానికి వీల్లేద‌ని  ఏకంగా కేంద్ర‌మే చెబితే ఇక మామూలు చిన్న‌పాటి వుద్యోగి, ప‌నివాళ్లు ఎలా వాటిని కాపాడుకుంటారు? నోటు రంగు పోయినట్లయితే అది పనికిరాని నోటు. చిరిగిన నోటుపై ఏదైనా రకమైన టేప్ అతికించి ఉంటే ఆ నోట్లు పనికిరావు. నోట్ల రంగు పోయి లేదా తేలికగా మారినట్లయితే అవి అన్ ఫిట్ కేటగిరీలో చేర్చుతారు. ఫిట్ నోట్ అనేది వాస్తవమైన తగినంత శుభ్రంగా ఉండే నోటు. రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. నోటు భౌతిక స్థితిని బట్టి రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? లేదంటే ఆ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేస్తుంది. ఇలాంటి నోట్లని గుర్తించడానికి కొత్తగా మెషీన్లని తయారుచేస్తోంది. రీసైక్లింగ్‌కు అనువుగా ఉన్న నోట్లను మాత్రమే వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది. లేదంటే రీ సైక్లింగ్‌ చేయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. అస‌లే ఆటోవాళ్లు, బ‌స్సులో కండెక్ట‌ర్లూ కాస్తంత బాగా న‌లిగినా, చిన్న‌పాటి చిరుగు క‌నిపించినా ఏదో పెద్ద నేరం చేసిన‌ట్టు చూసి వాటిని తిర‌స్క‌రిస్తున్నారు. స‌రిప‌డా చిల్ల‌రా లేక‌, అటువంటి నోట్ల‌తో బ‌స్సో, ఆటో ఎక్కిన‌వారంతా స‌ద‌రు డ్రైవ‌ర్‌చేతిలో వినిపంచి వినిపించ‌ని స్వ‌రంలో తిట్ల‌నీ తింటున్నారు. మొత్తానికి రోజులు ఇలా గ‌డుస్తున్నాయి. ఇపుడు హ‌ఠాత్తుగా న‌లిగిన నోట్ల సంగ‌తి సీరియ‌స్‌గా తీసుకోమ‌ని ఆర్బీఐకి కేంద్రం సూచించ‌డం దారుణం. ఫిట్నెస్ లేని నోట్లు రీసైక్లింగ్‌కీ ప‌నికిరావ‌ట‌! దేశంలో మొత్తం న‌లిగిపోయిన నోట్ల‌ను తిరిగి బ్యాంకుల‌కు అప్ప‌గించ‌మ‌ని ఆదేశిస్తే మ‌ళ్లీ అంద‌రూ బ్యాంకుల ముందు వ‌రుస‌గా నిల‌బ‌డి మ‌ళ్లీ రోజుల త‌ర‌బ‌డి అవ‌స్థ‌లు ప‌డాల్సిందే. ప్ర‌భుత్వం పాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాల అమ‌లు కంటే ఇలా ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్టే అంశాలు, మార్గాన్వేష‌ణ‌లోనే బాగా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తోంది. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌న‌మేమిటి?  ప్ర‌తీ నోటు కొంత‌కాలం త‌ర్వాత న‌లిగిపోతుంది, ఇస్త్రీ చొక్కాలా స్టిఫ్‌గా, కొత్త సిగెరెట్ ప్యాక్లా త‌ళ‌త‌ళ‌లాడ‌దు.  ఇంత‌కంటే పేద బ‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు వారి సేవ‌ల‌కు త‌గిన ప‌లితం ద‌క్కుతోందా, వారిని నిజంగా ఆదుకునేంద‌కు ఎలాంటి ప‌థ కాలు స‌క్ర‌మంగా అమ‌లు చేయాల‌న్న ఆలోచ‌న‌చేస్తే మంచిది. నోట్లు బాగుండాలి, రోడ్లు బాగుండాలి వంటి నినాదాలు, ప్ర‌చారాల కంటే వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అమ‌లు అయ్యేట్టు త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టి పెట్ట‌డం ఎంతో మంచిది, అవ‌స‌రం. ప్ర‌జ‌ల్ని కేవ‌లం ఓట‌ర్లుగానే భావించ‌డం త‌గ్గించుకోవాలి. నోట్ల మీద వున్న శ్ర‌ద్ధ మ‌నుషుల బాగోగుల మీదా వుండాలి.

చంద్ర బాబు దార్శ‌నిక‌త‌కు .. కోటాను కోట్ల చక్షువులు

దూర‌దృష్టితో ఆలోచించేవారిని వినాలి, ప‌ట్టించుకోవాలి, గౌరవించుకోవాలి. ఎందుకంటే వారి కార్యాచరణ తక్షణ   లబ్ధి కోసం, ఎన్నికల ప్రయోజనాల కోసం పరిమితం కాదు. భవిష్యత్ వెలుగుల కోసం, భావి తరాల బాగు  కోసం కూడా. వారి ప్రణాళికలు కేవలం తమ పార్టీ అధికారంలో ఉండాలనో లేదా ఈ రోజు అందరి మెప్పూ పొందితే చాలనో కాదు.. తరతరాలు సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలనీ, భవిష్యత్ తరాలు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అనుభవించాలని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దార్శనికత సరిగ్గా ఆ కోవలోకి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఏర్పాటు చేసిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కానీ, తెలుగు విద్యార్థుల చదువులకు గట్టి పునాది కోసం తీసుకు వచ్చిన విద్యా సంస్కరణలు కానీ అప్పడే కాదు, ఇప్పుడూ తెలుగు పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేశాయి. వేస్తూనే ఉన్నాయి. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన నిర్మించ తలపెట్టిన అమరావతి గురించి విపక్షం అప్పట్లో ఎన్నో ఎన్నెన్నో విమర్శలు గుప్పించి ఉండవచ్చు. కానీ అమరావతి నిర్మాణ ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోనే గొప్ప రాజధానులలో ఒకటిగా నిలిపేంత అద్భుత ప్రణాళిక అని అప్పట్లోనే మేథావులు వేనోళ్ల ప్రశంసించారు. ప్రధాని మోడీ సైతం అమరావతి శంకుస్థాపనకు వచ్చి అదే ఆకాంక్షించారు. అధికారంలో వుండ‌గా గొప్ప వ్యూహ‌ర‌చ‌న‌తో ఎంద‌రో మేధావుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి మ‌రీ రాజ‌ధాని రూపురేఖ‌లు ఎలా ఉండాలో నిర్ణయించారు చంద్రబాబునాయుడు.  అంత‌ర్జాతీయంగా పేరున్న నార్మ‌న్ పోస్ట‌ర్ సంస్థ‌తో రాజధాని అమరావతిని డిజైన్ చేయించారు.  ఆ సంస్థ డిజైన్ ను గ్రాఫిక్స్‌లో అంద‌రికీ అర్ధ‌మయ్యే లా ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌జా ప్ర‌తినిధులంద‌రికీ అమరావతి ఎంత గొప్పగా ఆవిష్కృతం కానుందో తెలియాలన్న ఆకాంక్ష ఆయ‌న‌ది. కానీ కొందరి తెలివి త‌క్కువ‌త‌నం, మూర్ఖ‌త్వం   అలాంటి ఆలోచ‌న‌ల్ని ముందుకు సాగ‌నీయ‌లేదు. స‌రిగ్గా వైసీపీ  వ‌ల్ల జ‌రిగింది ఇదే.  గ్రాఫిక్ ల‌ని, గిమ్మిక్కుల‌ని, ప్ర‌జ‌ల‌కు సినిమా చూపించి మోసం చేస్తున్నార‌ని నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడారు. అమ‌రావ‌తి అసెంబ్లీ నిర్మాణాన్ని ఇడ్లీ పాత్ర‌తో పోల్చి వైసీపీ త‌మ అజ్ణానాన్నీ, బుద్ధిహీన‌త‌ను నిస్సిగ్గుగా బయట పెట్టుకుంది.2019 ఎన్నికలలో ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన  జ‌గ‌న్ ఆంధ్రుల ఖ్యాతిని మహోన్నత స్థాయికి తీసుకువెళ్లే రాజధాని అమరావతిని, దాని పురోగతిని నిర్వీర్యం చేశారు.  అమ‌రావ‌తిలో పూర్తిస్థాయి రాజ‌ధాని అనవసరం అని చాటడంతో పాటు మూడు రాజ‌ధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో సమాన అభివృద్ధి అంటూ మూడుముక్కలాటకు తెరతీశారు.  అమరావతిని నిర్వీర్యం అయితే చేశారు కానీ మూడు రాజధానుల విషయంలో కానీ ఒక్క కాయితం కదపలేకపోయారు, ఒక్క రాయీ వేయలేకపోయారు.  రాజ‌ధానికి సంబంధించిన ప్ర‌తీ అంశంలోనూ తెలుగుదేశంపై విరుచుకుప‌డ‌టం త‌ప్ప వాస్త‌వానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకించి చేసింది, చేస్తున్న‌ది ఏమీ లేదు.  పాల‌నా వికేంద్రీక‌ర‌ణ ఆలోచ‌న జ‌గ‌న్ సృష్టించిన స‌రికొత్త సిద్ధాంత‌మేమీ కాదు. పూర్వం నుంచీ అంద‌రికీ తెలిసిందే, మ‌న‌ దేశంలో ఎప్పటి నుంచో అమలులో ఉన్నదే. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆ కోవలోదే. అంతే కానీ.. రాజధానిని ముక్కలు చేసి పాలనా వికేంద్రీకరణ అనే వితండాన్ని తెరమీదకు తెచ్చిన జగన్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ఈ మూడేళ్లలో ముందుకు వేయలేదు. దార్శినికత కాదు కదా..కనీస చూపుకూడా లేని పాలనా విధానమే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నా చలించలేదు. అన్నీ గ్రాఫిక్స్‌లోనే చూపుతారా నిర్మాణం చేపట్టరా అని చంద్ర‌బాబును ఎద్దేవా చేసిన  జగన్  తన సొంత నియోజకవర్గం పులివెందులలో కనీసం బస్టాండ్ కూడా నిర్మించలేక గ్రాఫిక్స్ మీదే ఆధారపడుతున్నారు.  జిల్లాకో మెడిక‌ల్ కాలేజీ అంటూ గ్రాఫిక్స్ లో నే సినిమా చూపారు తప్ప ఆ దిశగా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక జగనన్న కాలనీలు అంటూ ఆయన చేసుకున్న ప్రచారం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినానివ్వదు అన్నట్లుగా తయారైంది జగన్ పాలన. చంద్రబాబు గొప్ప విజన్ తో తలపెట్టిన అమరావతిని నిర్వీర్యం చేసి.. రాష్ట్రాన్ని రాజధాని లేని దిక్కు మాలిన రాష్ట్రంగా మార్చారు. నాడు శ్మసానం అన్న అమరావతే ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రానికి కల్పతరులా ఆదుకుంటోంది. నాడు జగన్ గ్రాపిక్స్ అని ఎద్దేవా చేసిన నిర్మాణాలే ఇప్పుడు కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంటున్నాయి. ఇటీవలే ఒక్కో టవర్ ఏడాదికి వంద కోట్ల లీజుకు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నాడు గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన టవర్లనే ఇప్పుడు లీజుకు ఇవ్వడానికి నిర్ణయించడం ద్వారా తాను నాడు చేసిన విమర్శలు, వ్యాఖ్యలూ అన్ని రాజకీయ లబ్ధి, అధికార దాహంతోనేనని జగన్ అంగీకరించినట్లైంది.   అయితే గతంలో చంద్రబాబు ఏపీ అసెంబ్లీని డిజైన్ చేయించిన నార్మన్ పోస్టర్ సంస్థ తాజాగా దుబాయ్‌లో ఐసీడీసీ బ్రూక్‌ ఫీల్డ్స్ అనే ఓ చిన్న సైజ్ నగరాన్నే నిర్మించింది. ఎమ్ఇఎన్ఎ (మీనా) అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాలోనే అతి భారీ, అత్యంత పొడవైన నిర్మాణాల వాణిజ్య సముదాయం. ఈ నిర్మాణాలను చూసి ప్రతి ఒక్కరు అశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు.. మీనా అంటే ఏమిటీ.. ఎక్కడ ఉందని.. దీని నిర్మించింది ఎవరు అనే నెటిజన్లు సైతం గుగూల్‌ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. మీనా .. ఇది మొత్తం  19 దేశాల సమూహం  ప్రపంచంలోనే 65 శాతం ఇంధనం, 45 శాతం సహజ వాయువు ఈ దేశాల్లోనే దొరుకుతోంది. అటువంటి దేశాలకు శస్త్ర సాంకేతికతను ఈ నార్మాన్ పోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది. అటువంటి ప్రముఖ సంస్థ.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసెంబ్లీ నిర్మాణాన్ని డిజైన్ చేసి ఇచ్చింది. దీనిని బట్టే అర్థమవుతోంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజనరీ ఏమిటో.. అద్భుత రాజధాని కోసం ఆయన పడిన తాపత్రేయం, తపన, కష్టం  కళ్లకు కడుతుంది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి.. జీరోతో ఆరంభమైన ఆంధ్రప్రదేశ్ ను అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలి. అమరావతి ఆదాయం రాష్ట్రానికే కాదు దేశానికీ ఉపయోగపడాలి అన్నది చంద్రబాబు విజన్.   రెవెన్యూ లోటుతో ఆవిర్భవించిన రాష్ట్రాన్ని ఒక వైపు రాజధాని నిర్మాణం కోసం, మరో వైపు పోలవరం కోసం పెద్ద మొత్తంలో నిధులు వ్యయం చేస్తూనే రాబడి పెరిగే ప్రణాళికలతో దాదాపు అన్ని రంగాలలోనూ రాష్ట్రాన్ని పురోగమన దిశలో నడిపిన చంద్రబాబు విజన్ ను గుర్తించడంలో విఫలమయ్యామని ఇప్పుడు  తెలుగు ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు  నార్మన్ పోస్టర్ నిర్మాణ సంస్థ చైర్మన్‌తో నాడు చంద్రబాబు అమరావతి డిజైన్ గురించి చర్చిస్తున్న ఫొటోలను చూస్తూ ఆయన దార్శనికతకు అబ్బుర పడుతోంది. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.  చంద్రబాబు విజన్ ను ఎగతాళి చేసి.. ఒకే ఒక్క చాన్స్ అంటూ అధికారంలోనికి వచ్చిన జగన్ ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఒకే ఒక్క చాన్స్ అని కోరిన ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతికి చేరుకుంటి. మూడేళ్లుగా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటూ మొండి వైఖరితో ముందుకు సాగుతున్న జగన్ అభివృద్ధికి నోచని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను అగ్ర స్థానంలో నిలబెట్టారు. జగన్ పై జనం విశ్వాసం కోల్పోయారు. జనం చూపు ఇప్పుడు తెలుగుదేశంపైనే, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మళ్లీ ప్రగతి మార్గంలో నడుస్తుందన్న నమ్మకమే కనిపిస్తోంది.  రాష్ట్ర అభివృద్శిని కోరుకుంటున్న వారంతా   చంద్ర‌బాబు తిరిగి రావాల‌ని, ఆయ‌న దార్శ‌నిక‌త‌లో ముంద‌డుగు వేయాల‌న్న ఆకాంక్షతో ఉన్నారనడంలో సందేహం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన విజనరీని దగ్గరుండి చూసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ చంద్రబాబు అభిమానులుగా మారిపోయారు. అలిపిరి ఘటనలో గాయపడిన బాబును పరామర్శించేందుకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రొటోకాల్ ను సైతం పక్కన పెట్టి ఆసుపత్రికి వచ్చిన ఘటన చంద్రబాబు విజన్ కు ఆయన ఇచ్చిన గౌరవంగా చెప్పుకోవచ్చు. అలాగే బిల్ గేట్స్ పలు సందర్భాలలో చంద్రబాబు విజన్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు. దావోస్ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు వెళ్లిన సందర్భంగా బిల్ గేట్స్ ఆయనను కలిసేందుకు చేసిన ప్రయత్నమే చంద్రబాబుకు ఐటీ దిగ్జజం ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

కేసీఆర్ ముందస్తు వ్యూహాలకు మోడీ ముకుతాడు!

రాజకీయ దురంధరుడిగా, ప్రత్యర్థులకు అంతు చిక్కని వ్యూహాలతో దూసుకుపోయే నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి గుర్తింపు ఉంది. నిత్యం రాజకీయ జిత్తులు, రణతంత్రపు ఎత్తులతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉండే కేసీఆర్ కు ఇటీవలి కాలంలో అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వ్యూహాలు వికటిస్తున్నాయి. ఎత్తులు పారడం లేదు. తాడనుకున్నది కూడా పామై బుస కొడుతోంది. ఏ ముహూర్తంలో అయితే జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించారో అప్పటి నుంచీ ఆయనకు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. తాను ఒకటి తలిస్తే మరొటి జరుగుతోంది.  ఆయన ముందస్తు వ్యూహాలకు కూడా అదే పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తున్నది. తెరాసకు మొదటి నుంచీ కూడా ముందస్తు ఎన్నికలు కలిసి వచ్చాయి. ఇప్పటి వరకూ కలిసి వస్తూనే ఉన్నాయి. 2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పూర్తిగా ఐదేళ్లూ అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండో సారి అధికార పగ్గాలను అందుకున్నారు. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. 2023 వరకూ అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ఆరు నెలలు ముందుగానే ముందస్తుకు వెళ్లి రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేయాలన్న వ్యూహంతో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఆయన అనుకున్న విధంగా చేయాలంటే  సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో అసెంబ్లీని రద్దు చేయాలి. అలా జరిగితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.   కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలు అచ్చొచ్చాయన్న సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన గురించి బాగా తెలిసిన వారు కేసీఆర్ ముందస్తు యోచనలోనే ఉన్నారని ఎలాంటి సందేహం లేకుండా చెప్పేస్తారు. ఇప్పుడు ఆయన అడుగులు కూడా ముందస్తు వైపే ఉన్నాయని పరిశీలకులు సైతం అంటున్నారు. అయితే ఆయన ముందస్తు వ్యూహాలకు కేంద్రం ముకు తాడు వేసే  యోచనలో ఉంది. కేసీఆర్ కనుక ముందస్తు ఎన్నికలకు వెళితే.. కేంద్రం ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర విభజన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే కేంద్రం ఆ దిశగా సంకేతాలు కూడా ఇచ్చింది. అదెలాగంటే..గత ఎనిమిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ,  తెలంగాణ రాష్ట్రాలు   అసెంబ్లీ సీట్లను పెంచాలని కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ  నియోజకవర్గాల సంఖ్యను 153 పెంచే ప్రక్రియను కేంద్రం ఆరంభించింది. ఇప్పటికే నియోజకవర్గాల సంఖ్య పెంపునకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా  నివేదిక అందితే.. వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ  విషయంపై తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత వరకూ స్పందన లేదు. అది వేరే సంగతి.. కానీ   తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభనజపై గత ఏడాది ఆగస్టులో లోక్ సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం 2031 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని సమాధానమిచ్చింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకర్గాల పునర్విభజనపై వస్తున్న సమాచారంలో నిజమెంత అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   ఇక్కడే కేంద్రం తన వ్యూహ చతురతను ప్రదర్శించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వేళ ముందస్తు ఎన్నికలకే సై అంటూ అసెంబ్లీని రద్దు చేస్తే.. అప్పుడు కేంద్రం తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తుంది. ఆఘమేఘాల మీద ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటు ఆమోదం పొందుతుంది. అప్పుడు నిర్ణీత గడువు కంటే ఆరు నెలల ముందే తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తుంది. ఎందుకంటే అప్పటికే కేసీఆర్ అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కనుక.    ఇప్పటికే కేంద్రం ఆ దిశగా సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారా? ఆ ధైర్యం చేస్తారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   

అలీతో సరదాగా జగన్..!

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీస్తారో.. ఎప్పుడు ఎవరిని దూరం నెట్టేస్తారో ఎవరికీ ఎప్పటికీ అర్ధం కాదు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో అప్పటి దాకా మంత్రివర్గంలో నోరెట్టుకు విపక్షాల మీద పడిపోయి.. అధినేత మన్ననలు పొంది ఆయనకు సన్నిహితులుగా మెలిగిన వారంతా మాజీలైపోయి.. ఎక్కడా కనిపించక, వినిపించక కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు పార్టీ విపక్షంలో ఉన్న సమయం నుంచీ అంతా తానై చక్రం తిప్పిన విజయసాయి పరిస్థితీ అంతే ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా ఆయన పరిధిని పరిమితం చేసేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున విజయసాయి మాజీ మంత్రుల్లా ఎవరికీ పట్టకుండా మిగిలిపోకుండా తప్పించుకున్నారు. సరే ఇప్పుడు ఆయన పరిధిని జగన్ ఒకింత పెంచారు అది వేరే సంగతి. విషయమేమిటంటే.. జగన్ ఎవరిని ఎందుకు దగ్గరకు తీస్తారో.. ఎవరిని ఎందుకు దూరంపెట్టేస్తారో అంటే సమాధానం చెప్పేవారు వైసీపీలోనే లేరన్నది మాత్రం వాస్తవం. అసలు జగన్ కైనా అందుకు లాజికల్ కారణాలు తెలుసా అంటే అదో మిలియన్ డాలర్ల ప్రశ్నే.  తాను జైల్లో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకుని మోసిన సొంత తల్లి విజయమ్మ, సోదరి షర్మిలల పరిస్ధితి ఇప్పుడు ఏమిటి?  అలాగే  2019 ఎన్నికలకు ముందు  వైసీపీలో  చేరిన ఆయన, కొద్ది కాలం పాటు ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. అ ఎన్నికలలో  పార్టీ గెలుపు కోసం,చాలాచాలా కష్ట పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని వేనోళ్ళ పొగుడుతూ, ఉరూరా తిరిగారు. పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. పనిలో పనిగా,  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్’ గా విమర్శలు గుప్పించారు. నోరుంది ఎందుకంటే, రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించే అందుకే  అన్నట్లు విరుచుకు పడ్డారు. సరే అధికారంలోకి వచ్చిన తరువాత పృధ్వీ కష్టానికి తగిన ఫలితం అనే విధంగా  జగన్ ఆయనకు ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. కారణాలేమైతేనేం అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.  ఆ తరువాత వైసీపీలో ఆయనను పట్టించుకున్న నాథుడే లేడు. ఇక తాజాగా అలీ పరిస్థితి కూడా కొంచం అటూ ఇటూగా ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ పరిస్థితే ఎదురయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. సినిమా థియేటర్ల టికెట్ల రేట్ల తగ్గింపు అంశంపై చర్చించేందుకు టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖ నటులు  తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన సందర్భంగా అలీని జగన్ ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. అలీతో పాటు పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు అది మరో సంగతి. వారితో భేటీ అనంతరం జగన్ అలీని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు.  త్వరలో పిలుపు వస్తుంది సిద్ధంగా ఉండమని జగన్ అలీకి చెప్పారు. దీంతో అలికి వైసీపీలో కీలక పదవి ఖాయమనీ, కనీసం రాజ్యసభ సభ్యత్వం అయినా కట్టబెడతారనీ ఓ టాక్ అటు ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయ వర్గాలలోనూ జోరుగా సాగింది. ఈ ఊహాగాన సభలకు ఊతమా అన్నట్లు  ఇది జరిగిన కొద్ది రోజులకే అలీ కుటుంబ సమేతంగా   తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు.   ఆ భేటీ తరువాత అలీ మీడియాతో తనకు ఏదో పదవి ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. జగన్ కు తనకు ఎప్పుడు ఏం ఇవ్వాలో తెలుసునని మర్మగర్భంగా చెప్పారు. అయితే ఇది జరిగి కూడా అర్ద సంవత్సరం గడిచిపోయింది. అలీకి దక్కింది ఏమీ లేదు. ఎదురు చూపులు తప్ప. ఇప్పడు పరిస్థితి ఎలా మారిందంటే సర్కార్ ఏర్పడి మూడేళ్లు పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ దృష్టి అంతా తదుపరి అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. గడువుకు ముందే ఎర్లీ ఎలక్షన్లకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అలీకి పార్టీ పదవి ఇచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమేనని వైసీపీ వర్గాలే అంటున్నాయి. అంటున్నారు. గత ఎన్నికలకు ముందు ఇండస్ట్రీలో తనకు ఎంతో సన్నిహితుడిగా ఉన్న పవన్ కల్యాణ్ ను కాదని మరీ అలీ వైసీపీ గూటికి చేరారు. ఆ తరువాత ఆ విషయంలో పవన్ ఒకింత బాధను వ్యక్తం చేశారు కూడా. మన వాళ్లు అనుకున్న వారూ, మన సహాయం పొందిన వారూ కూడా స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడటంపై పవన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి అలీ చాలా షార్ప్ గా రియాక్ట్ అయ్యారు. పవన్ కల్యాణ్ గారూ మీ నుంచి నేనేం సహాయం పొందానండీ, సినిమా చాన్స్ లేమైనా ఇప్పించారా అంటూ వ్యంగ్య బాణాలు వదిలారు. అది అప్పటి సంగతి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత అలీ పరిస్థితి ఏమిటి... ఇదిగో అదిగో అని ఊరించడమే తప్ప... నాడు ఎన్నికల సమయంలో రాజమండ్రి లేదా గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి అవకాశం అడిగితే... ఎమ్మెల్యేగా కాదు అంత కంటే పెద్ద పదవి అంటూ ఊరించడం తప్ప ఈ మూడేళ్లలో అలీకి జగన్ చేసిందేమీ లేదు. రాజ్యసభ టికెట్లో,  నామినేటేడ్ పోస్టో ఇచ్చే ఉద్దేశమే నిజంగా జగన్ కు ఉంటే అలీకి ఇన్నేళ్లు ఇలా కళ్లు కాయలు కాసేలా ఏదురు చూడాల్సిన  అవసరం ఉండేది కాదు.  సినిమాల్లో అందరినీ నవ్వించే కమేడియన్ అలీని జగన్ ఊరించి ఊరించి ఊసూరు మనిపించారని సామాజిక మాధ్యమంలో నెటిజన్లు జోకులేస్తున్నారు.  ఇప్పటికే నిరాశలో కూరుకుపోయిన అలీ వైసీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  పార్టీ కోసం కష్టపడిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి కనీసం మూన్నాళ్ల ముచ్చటగానైనా ఏదో పదవి దొరికింది.. కానీ కెరీన్ ను, ఇండస్ట్రీలో సన్నిహితులతో సంబంధాలనూ ఫణంగా పెట్టి మరీ జగన్ వెంట నడిచిన అలీకి అది కూడా దొరకలేదన్న సానుభూతి  సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతోంది. 

బిజెపి 2024 వ్యూహం .. షిండేకి ప‌ట్టాభిషేకం!

కొన్ని అంద‌రికీ తెలిసే జ‌రుగుతాయి. మ‌రికొన్ని జ‌రిగిన త‌ర్వాతే తెలుస్తాయి. కొన్నింటికి వ్యూహ ర‌చ‌న చాలా రోజుల క్రిత‌మే జ‌రుగుతుంది. జ‌రిగిన త‌ర్వాత అంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డ‌తారు.  మ‌హారాష్ట్ర సంక్షోభానికి తెర‌ప‌డ‌టం, శివ‌సేన నాయ‌కుడు షిండే ముఖ్య‌మంత్రి కావ‌డం మూడ‌వ కోవ‌లోకే వ‌స్తుంది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ముందు ఫ‌డ్న‌వీస్‌ను అనుకుని ఆన‌క షిండేను ప్ర‌క‌టించ‌డం, ఫ‌డ్న‌వీస్‌ని  ఉప ముఖ్య మంత్రిని చేయ‌డం చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. చివ‌రి నిమిషంలో ఈ మార్పు వ్య‌వ‌హారం అంతా వాస్తవానికి  బిజెపీ వ్యూహ‌మే. 2024 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులుచేర్పులు చేసింద‌నే అభిప్రాయాలు అంత‌టా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మొద‌ట ఫ‌డ్న‌వీస్ బ‌య‌ట‌నుంచే మ‌ద్ద‌తునిస్తాన‌ని అన్నారు. కానీ ఆయ‌న్ను ఉప‌ముఖ్య‌మంత్రిగా వుం డేందుకు అంగీక‌రించేలా చేయ‌డానికి ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి ఛీఫ్ న‌డ్డా రంగం లోకి దిగాల్సి వ‌చ్చింది. స‌రే పార్టీ పెద్ద‌లంతా చెబుతున్నారు గ‌నుక ఫ‌డ్నీవీస్ స‌రే అన‌కా త‌ప్ప‌లేదు. గ‌తంలో ముఖ్య‌మంత్రిగా చేసి ఇపుడు ఉప ముఖ్య‌మంత్రిగా చేయ‌డానికీ అంగీక‌రించిన రాజ‌కీయ నాయ కుల‌లో ఫ‌డ్న‌వీస్ నాలుగ‌వ స్థానంలో వున్నారు. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిందేమంటే, ఈ విధంగా ప‌ద వుల్లో మార్పులు చేర్పులు చేయ‌డం ద్వారా శివ‌సేన‌ను చీల్చిన‌ట్టే అయింది. అంతేకాదు ఎన్‌సిసి అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌కు మ‌హారాష్ట్ర‌లోనే పెను స‌వాల్ విసిరిన‌ట్టు అయింది. ప‌వార్ ప‌శ్చిమ మ‌హారాష్ట్ర స‌తారాకు చెందిన నాయ‌కులు. అక్క‌డి నుంచి వ‌చ్చిన యువ నాయ‌కుడు షిండే! మ‌హారాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంక్‌ను మాధ‌వ్ అని తొలినాళ్ల‌లో పిలిచేవారు. మాధ‌వ్ అంటే మాధ‌వుడు కాదు. మాలి, ధ‌న‌గీర్‌, వంజారా క‌మ్యూనిటీలు. అయితే మోదీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత ఓబిసీ, అర్బ‌న్ ఓట‌ర్ల‌కు బిజెపి ప్ర‌చారాలు, పిలుపులు బాగా ఆక‌ట్టుకున్నాయి. బిజెపి ప‌ట్ల మొగ్గు చూపారు. ఇక ఇపుడు ఏకంగా మ‌రాఠా రాజ‌కీయ నాయ‌కుడినే ముఖ్య‌మంత్రిని చేయ‌డం ద్వారా బిజెపి వారి దృష్టిలో మ‌హో న్నతంగా ఎదిగింది. ఇది త‌ప్ప‌కుండా వారికి 2024 ఎన్నిక‌ల్లో 32 శాతం మ‌రాఠా ఓట్లు ప‌డ‌డానికి ఎంత యినా ఉప‌క‌రిస్తుంది.  షిండేను ముఖ్య‌మంత్రి చేయ‌డంలో ఉద్ధ‌వ్ థాక్రే వ‌ర్గానికి బిజెపి చిన్న‌పాటి హెచ్చ‌రిక చేసిన‌ట్ట‌యింది. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ అయిన‌ప్ప‌టికీ మ‌హారాష్ట్రంలో ముఖ్య‌మంత్రి ప‌ద‌విని త‌మ పార్టీవారికి కాకుండా హిందూత్వ ర‌క్ష‌ణ ఆలోచ‌న‌తోనే శివ‌సేన‌కు చెందిన షిండేకు క‌ట్ట‌బెట్టామ‌ని చెప్పుకుంటోంది. అందువ‌ల్ల పెద్ద వ్యూహ‌మే షిండేను మంత్రించింది!  2019  ముంబ‌యి  న‌గ‌ర మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కూడా బిజెపి ఎన్నిక‌ల్లో పోటీ చేయ కుండా శివ‌సేన‌కే ఆ పద‌వి ద‌క్కించుకునేందుకు వీలు క‌ల్పించింది. బిజెపి కుటుంబ‌పాల‌న‌ను తిర‌స్క రిస్తుంది. థాక్రే కుటుంబం మ‌హారాష్ట్ర‌ను ఏల‌డానికి  బిజెపీ వ‌ర్గీయుల‌కు స‌సెమీరా న‌చ్చ‌లేదు. అందుకే చిన్న స్థాయినుంచి  శివ‌సేన‌లో చెప్పుకోద‌గ్గ నాయ‌కునిగా నిలిచి ఏకంగా థాక్రేకు ఝ‌ల‌క్ ఇవ్వ‌గ‌లిగిన షిండేను ముఖ్య‌మంత్రిని చేయ‌డంలో బిజెపి ఆలోచ‌న అన‌న్య సామాన్యం. ఇదంగా 2024 ఎన్నిక‌ల్లో స‌త్తా చాటడానికి ముంద‌స్తుగా పావుల‌ను క‌దుపుతూ  విప‌క్షాల‌కు నిద్ర లేకుండా చేయాల‌న్న వ్యూహ‌ర‌చనేై!

ప్రధాని మోడీతో తమిళిసై భేటీ.. కారణమదేనా?

పెళ్లికి వ‌చ్చిన‌వారంతా స‌ర‌దాగానే గ‌డిపి వెళిపోతారు. మంచిమాట‌లు, మంచి అభిప్రాయాల‌తో మంచి జ్ఞాప‌కాల‌నూ వెంట తీసికెళ‌తారు. నిన్న మొన్న‌టి బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చి కేసీఆర్ ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి ఇచ్చిన ఆర్ధిక స‌హ‌కారం గురించి ఎంతో  చెప్పారు. టిఆర్ ఎస్ ప్రభుత్వానికి కేంద్రం సాయం చేయ‌డం లేద‌న్న‌ది శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని  ఆయ‌న మాట‌ల్లోనే ప్ర‌ధాని తెలంగాణా ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేశారు. అంతవ‌ర‌కూ బాగానే వుంది. కానీ వెళుతూ ఓ క్ష‌ణం    గ‌వర్న ర్‌తో మోడీ భేటీయే   గులాబి దండులో ఆందోళ‌న నింపింది. పోతూ పోతూఈ  పెద్దాయ‌న గవర్నర్ తో ఏం మాట్లాడి వుంటారు, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తమ ప్రభుత్వంపై,  ముఖ్యమంత్రిపై ఏం ఫిర్యాదులు చేసి ఉంటారు అన్న  చ‌ర్చ‌లు ఆరంభ‌మ‌య్యాయి.  అస‌లే ఇటివ‌ల కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ఏది ప‌డినా భ‌గ్గుమ‌ంటున్న‌ది. మ‌రి ప్ర‌ధాని ఏకంగా ఆమెతో చర్చకు సమయం కేటాయించారంటే ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే అంశమే ఆమె నుంచి ఆయనకు చేరి ఉంటుందని గులాబి దళం ఆందోళన పడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ పరేడ్ గ్రౌండ్స్ లో సభ అనంతరం రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్కడే బస చేశారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ రాజ్ భవన్ లో ఆయనతో గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. ఇరువురూ దాదాపు 40 నిముషాల సేపు భేటీ అయ్యారు. ఇది పూర్తిగా ముఖాముఖీ భేటీ. అధికారులు కానీ, పార్టీ నేతలు కానీ లేరు. ఇక్కడే వారిరువురి మధ్యా భేటీలో చర్చకు వచ్చిన అంశాలేమిటన్నదానిపై రాజకీయ వర్గాలలో మరీ ముఖ్యంగా గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వారిరువురి భేటీలో పూర్తిగా తెలంగాణ అంశాలే చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా కేసీఆర్ పాలన, రాష్ట్రంలో శాంతి భద్రతలు, కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై కొన్ని నివేదకలను మోడీకి అందించినట్లు చెబుతున్నారు. దీంతో వీరురువురి మధ్యా జరిగిన చర్చలపై తెరాసలో ఉత్కంఠ పీక్స్ కు వెళ్లింది. ఇటీవలి కాలంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ బాగా పెరిగిన నేపథ్యంలో మోడీతో భేటీలో గవర్నర్ తమిళసై కేసీఆర్  సర్కార్ పై మోడీకి ఫిర్యాదు చేయడమే కాకుండా.. కీలక అంశాలపై నివేదికలు కూడా సమర్పించి ఉంటారన్న భావన అయితే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది.   మామూలుగా అయితే  ప్రధాని, గవర్నర్ భేటీకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఉండదు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై- మోడీ భేటీ మాత్రం ఎనలేని రాజకీయ ప్రధాన్యత  సంతరించుకుంది. అందుకు కారణం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితే కాకుండా.. గవర్నర్- ప్రభుత్వం మధ్య ఉన్న రిఫ్ట్ కూడా ఒక కారణం. గతంలో తమిళిసై ఢిల్లీ వెళ్లి మరీ కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ప్రధాని, హెంమంత్రికి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. గవర్నర్ పర్యటనలలో మంత్రులు, అధికారులూ ప్రొటోకాల్ పాటించకపోవడం దగ్గర నుంచి.. అడిగిన సమాచారం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదన్న వరకూ తమిళసై కేంద్రానికి నివేదించారు. ఇక ప్రస్తుతం కేంద్రం, తెరాస సర్కార్ మధ్య రాజకీయం వేడెక్కిన తరుణంలో తమిళిసైతో మోడీ భేటీకి ప్రాధాన్యత పెరిగింది.  జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన కేసీఆర్ ఇటీవలి  ప్రయత్నాలు విఫలమైనా   జాతీయ ప్రత్యామ్నాయ ప్రణాళిక ఆలోచనలతో మోడీపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో.. మోడీ ప్రత్యేకంగా గవర్నర్ తమిళపైతో  40 నిముషాల పాటు ముఖాముఖి చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళసై చెప్పిన అంశాలు, అందించిన నివేదికలను ఆయన కూలంకషంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా తమిళిసైతో మోడీ భేటీలో ఆమె కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి అవసరమై సమాచారాన్ని అందించి ఉంటారని రాజకీయవర్గాలలో చర్చ సాగుతోంది.

మహా ‘పరీక్షలో షిండే విజయం.. మధ్యంతర ఎన్నికలపై పవార్ జోస్యం

నాటకీయ పరిణామాల నడుమ జూన్ 30న మహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన, శివసేన తిరుగుబాటు నాయకుడు, ఏక్నాథ్ షిండే ఈ రోజు ( సోమవారం) రాష్ట్ర శాసన సభలో సభలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. 164 మంది ఎమ్మెల్యేలు షిండే’కు మద్దతుగా నిలిచారు. మ్యాజిక్ ఫిగర్ (144) కంటే  20 ఎక్కువ ఓట్లు సాధించారు. ఆయన బలపరీక్షలో గెలుపొందినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. దీంతో షిండే తిరుగుబాటుతో  మొదలైన మహా సంక్షోభం షిండే విజయంతో, ముగింపు కొచ్చింది. మరోవైపు, శివసేన చీఫ్ విప్గా సునీల్ ప్రభును తొలగించి.. భరత్ గోగావలేను నియమించిన నేపథ్యంలో ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ జూలై 11 న విచారణకు వస్తుంది. అయితే, కోర్టు తీర్పు ఎటు వచ్చినా, షిండే సర్కార్’ కు తక్షణ ముప్పు వచ్చే ప్రమాదం లేదని, న్యాయ కోవిదులు పేర్కొంటున్నారు.  కాగా, ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ బలపరీక్ష ప్రక్రియను మొదలుపెట్టారు. సభ్యులు నిలబడి ఉండగా తలలు లెక్కించే విధానంలో విశ్వాస పరీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి  షిండే అనుకూలంగా 164 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మరో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. షిండే  వర్గంలోకి చేరారు.  అయితే షిండే ప్రభుత్వం  అట్టేకాలం ఉండదని, ఎన్సీపీ అధినేత సరద పవార్ జోస్యం చెప్పారు. మహా అయితే ఆరు నెలలు, కాదంటే ఇంకా ముందుగానే షిండే సర్కార్ ‘కూలి పోతుందని, పవార్  జోస్యం చెప్పారు. "మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోవచ్చు, అందుకే మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి. షిండేకు మద్దతు ఇస్తున్న నేతలు ఎవరూ సంతోషంగా లేరు. మంత్రివర్గ విస్తరణ సమయంలో మనస్పర్థలు వస్తాయి. అప్పుడు కచ్చితంగా షిండే ప్రభుత్వం పతనమవుతుంది. ఆ తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ మా దగ్గరికే వస్తారు" అని పవార్‌ తెలిపారు. కేవలం ఆరు నెలలే సమయం ఉందని, ఎన్సీపీ శాసనసభ్యులు తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం గడపాలని ఆయన సూచించారు. అలాగే, శివసేన ఠాక్రే, వర్గం ఎంపీ సంజయ్ రౌత్ కూడా షిండే సర్కార్ ‘ కు మద్దతు ఇస్తున్న  శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అసలైన శివసేన నేతలు కాదని, అలా అని వారు చెప్పుకోలేరని అన్నారు. శివసేన గుర్తు పై గెలిచిన షిండే వర్గం ఎమ్మెల్యేలు, రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పడు తిరుగుబాటు చేయడం  ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మేము కోర్టులోనే తేల్చుకుంటాం, అని అన్నారు. అయితే రేపు ఏమి జరుగుతుంది, నేది పక్కన పెడితే, ఇప్పటికైతే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బల పరీక్షలో నెగ్గారు.  జో జీతేగా ఓయి సికిందర్’

తండ్రికి ర‌మ్ ఇచ్చి చివ‌రి ఆనందాన్ని పంచుకున్న ఆన్‌

పొలానికి వెళ్లే రైతుకి కూతురు ముద్దిచ్చి పంపింది. హెడ్‌మాస్టర్‌కి ఆయ‌న మ‌న‌వ‌డు ముద్దిచ్చే బ‌డికి పంపేడు. మ‌ర‌ణానికి మ‌రింత ద‌గ్గ‌ర్లో వున్న తండ్రికి ర‌మ్ ఇచ్చి ఆనంద‌ప‌రిచింది పెన్నెలోప్‌ ఆన్‌!  చిన్న ప్ప‌టి నుంచి బిస్కెట్లూ, చాక్లెట్లు ఇచ్చి బ‌డికి పంపిన తండ్రి పెదాల మీద చివ‌రి చిర్న‌వ్వు  కోసం ఆన్ త‌న‌కు బొత్తిగా ఇష్టంలేని రమ్ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.  కొన్ని అంతే.. ఇష్టంగా అయిష్ట‌మైన ప‌ని చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది. ఆన్ తండ్రి చ‌క్క‌గా రోజూ తాగేవాడు. ఆయ నకు బండ్‌బెర్గ్ ర‌మ్ అంటే మ‌హా పిచ్చి. ఆన్ కి తండ్రి తాగ‌డం పెద్ద‌గా న‌చ్చేది కాదు.  ఆయ‌నకు  శ్వాస సంబంధ ఇబ్బందిని ఇంట్లో వారు గ‌మ‌నించి ఆస్ప‌త్రికి తీసికెళ్లారు.  పెన్నెలోప్  తండ్రికి  క్రానిక్ అబ్స్ట్ర క్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఈ పరిస్థితి శ్వాసను ప్రభా వితం చేస్తుంది. చాలాకాలం నుంచి ఈ జ‌బ్బుతో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు.  చాలారోజులు ఆస్ప‌త్రిలోనే వుండాల్సి వ‌చ్చింది. జ‌బ్బు ముదిరి ప్రాణాపాయ స్థితికి వ‌చ్చింది.  ఆన్ తండ్రిని కోల్పోయే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. డాక్ట‌ర్లు  ఆ సంగ‌తి ఆమెకు చెప్ప‌క త‌ప్ప‌లేదు. ఆమె బాధ‌ప‌డింది ..లోలోప‌ల‌.  తండ్రితో వున్న అనుబంధంతో  ఆయ‌న ప‌డ‌క ద‌గ్గ‌ర ఏడ‌వ‌లేదు. చుట్టూ అంతా ఆనందంగా ప్ర‌శాంతంగానే వుండాల‌నుకుంది. నిత్యం జోక్స్ వేస్తూ స‌ర‌దా వాతావ‌ర‌ణాన్నే క‌ల్పించింది.  చివ‌ర్రోజు.. ఆన్  ఆస్ప‌త్రిలో తండ్రి ద‌గ్గ‌ర‌కి మందులు తీసికెళ్లింది. ఆయ‌న న‌వ్వాడు. ద‌గ్గ‌రికి పిలిచి అబ్బే ఇవి కాదు నాకు బాగా ఇష్ట‌మైన నా మందు కావాల‌ని కోరాడు. ఆన్‌కి ఈసారి కోపం రాలేదు, విసుక్కోలేదు.. గ‌ట్టిగా న‌వ్వింది. ప‌రుగున వెళ్లి ఆయ‌న అమితంగా ఇష్ట‌ప‌డి తాగే బండ్‌బ‌ర్గ్ ర‌మ్ చిన్న బాటిల్ తెచ్చింది. దాన్ని డాక్ట‌ర్ల అనుమ‌తితో  సిరంజ్ ద్వారా ఎక్కించింది. ఆయ‌న‌కు ఎంత స‌ర‌దానో.. రోజూ తిట్టే కూతురు స్వ‌యంగా త‌న‌కు ఆ మ‌త్తెక్కించేందుకు డాక్ట‌ర్‌కి సాయ‌ప‌డుతోంద‌ని. కొద్ది గంట‌ల త‌ర్వాత ఆన్ తండ్రి ప్ర‌శాంతంగా వెళిపోయారు.  ఆన్ మాత్రం ఆకాశంలోకి చూస్తూ ఈ లోకం లో నాతో చివ‌రి క్ష‌ణాలు ఆనందంగా గ‌డ‌ప‌డానికి ఆయ‌న చివ‌రి కోరిక తీర్చ‌డంలో వుండే ఆనందం ఆమె మ‌న‌సు నిండా నిండిపోయింది. ఆమెకు జీవితాంతం ఇది గొప్ప జ్ఞాప‌కంగా వుంటుంది ఇక‌!

ప్రజాకాంక్షలను విస్మరించడంలో కాషాయ దళం.. గులాబి దండు.. దొందూ దొందే..

 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్బంగా రెండు రోజుల పాటు ఇటు బీజేపీ, అటు తెరాస హైదరాబాద్ వేదికగా రాజకీయ సర్కర్ చేశాయి. ప్రజలతో సంబంధం లేని విన్యాసాలెన్నో చేశాయి. ప్లెక్సీల యుద్ధం నుంచీ కేంద్రం సహాయం వరకూ ఇరు పార్టీలూ పరస్పర విమర్శలలో పోటీ పడ్డాయి.  కాషాయ దళం మొత్తం రావడం చుస్తే  గులాబి కోటని ఆక్రమించుకోవడానికి రాజు తన బలం తో సైన్యం తో వచ్చి తన బలం ఏమిటో చూపించి  నట్టు వుంది. ఆదివారం  హైదరాబాద్ లో  జరిగిన భారతియ జనతా పార్టీ విజయ సంకల్పసభ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడి మాటలమయజాలం తో అందర్నీమాయలో పడేసారు .మిణుగురు పురుగులు రాత్రి ఎగురుతూ  సూర్యుడిని కమ్మేసాం  అని ఆనంద పడతాయి, కానీ వాటికీ తెలియనిది ఏమిటంటే అవి సుర్యుని ముందు నిలబడలేవని అన్నటు సాగింది మోడీ ప్రసంగం, ఎవర్ని విమర్శించకుండా కేవలం  కేంద్ర ప్రభుత్వం చేస్తున్న,చేసిన,చేయబోయే  అభివృద్ధిపైనే మాట్లాడి తన మార్కు చతురత చూపించారు. తనపై ఎ న్ని విమర్శలు చేసినా ప్రధాని స్పందించకుండా తన దృష్టిలో కేసీఆర్ స్థాయి ఏమిలో చెప్పకనే చెప్పారు.   ఆదివారం  జరిగిన సభ మొత్తం లో కూడా ఎ క్కడా కేసీఆర్ గురించిగాని, గులాబి పార్టీ గురించి గాని   మాట్లాడకుండా,విమర్శలు చేయకుండా   తన ప్రసంగాన్ని ముగించారు.  సబ్ కా సాత్,సబ్ క వికాస్ నినాదం తో తెలంగాణా అభివృధి చేస్తాం అన్నారు. ఎనిమిదేళ్ల  పాలనలో అందరి సంక్షే మం కోసం కృషి చేస్తున్నాం,అభివృధి దేశం నలుమూలలా అందాలని చూస్తున్నాం.తెలంగాణాని అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ అన్ని  విధాలా కృషి చేస్తోందన్నారు. డైనమిక్ తెలంగాణ అభివృద్ధికిక సదా కేంద్రం చేయూత ఉందని, ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, నీటి పారుదల ప్రాజెక్టులలో కేంద్రం సహాయం, సహకారం ఉందని స్పష్టం చేశారు.  హైదరాబాద్ మహానగరం లో 1500 కోట్లతో 6  లేన్ల రహదార్లు  నాలుగు నిర్మిస్తున్నామని మోడీ చెప్పారు.  అలాగే ట్రాఫిక్ ఇబ్బందిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 350 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ నిర్మింనుందన్నారు.  .తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని ,అలా ఐతే నే వేగంగ అభివృధి జరుగుతుందని చెప్పారు. ఐతే  ఎంతసేపు ఏం చేస్తామో చెప్పారు. ఇంత వరకూ బానే ఉంది కానీ,   ప్రస్తుతం దేశం లో వున్న పరిస్థితులపై ఆయన మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల పెరుగుదల, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేదల నడ్డి విరిగేలా  ఇందనం దరలు,గ్యాస్ సిలండర్, నిత్యావసర వస్తువల ధరల  బాదుడుపై మోడీ పన్నెత్తి మాట్లాడలేదు. దీనిపై గులాబి శ్రేణులే కాకుండా సామాన్య జనం కూడా విమర్శిస్తున్నారు.  ఇదిలా ఉంచితే.. మోడీ ప్రసంగం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంప పెట్టుగా ఉందని, తనను తాను అతిగా ఊహించుకుని ఆకాసంలో విహరిస్తున్న కేసీఆర్ ను నేల మీదకు దింపి వాస్తవాన్ని ఎరుకపరిచిందని కాషాయదళం సంబర పడుతోంది. ఏకంగా ప్రధానికే ప్రసంగ అజెండా నిర్దేశించానంటూ తన భుజాలు తానే చరుచుకుని విర్రవీగిన సీఎం.. ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయాన్ని, సహకారాన్ని అంగీకరించక తప్పని పరిస్థితుల్లో పడ్డారని కాషాయ శ్రేణులు అంటున్నాయి. మరో వైపు మోడీ ప్రసంగం పలాయన వారి సంధి మంత్రంగా ఉందని గులాబి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. కే సీ ఆర్ ప్రశ్నలకి సమధానం చెప్పలేక పోవడం వల్లే.. కాదు కాదు కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేనందువల్లే ఆయన తన ప్రసంగంలో వాటి గురించి ప్రస్తావించలేదని  గులాబి శ్రేణులు అంటున్నాయి.  దేశం లో తెలంగాణా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా  ఉంది కనుకనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను వేదిక చేసుకున్న కమల నాథుుల రాష్ట్రంలో శాంతి భద్రతలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నాయి.  దేశ  ప్రధాని మోడీ కాదు మోళీ అని తెరాస శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.  మొత్తం మీద బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో  బీజేపీ ఆడంబరం, టీఆర్ఎస్ దూకుడు రెండూ కూడా  కూడా ప్రజాకాంక్షలను ప్రతిబింబించడంలో విఫలమయ్యాయి. మొత్తం వ్యవహారాన్నంతా ఆధిపత్య ప్రదర్శనా పోరుగా మార్చేశాయి. సందట్లో సడేమియాలా కాంగ్రెస్ ఈ మొత్తం వివాదానికి దూరంగా మౌనంగా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు అనివార్యం అనుకుంటున్న పరిస్థితుల్లో తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతుండటం జనం బీజేపీ, తెరాసలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.   

మొబైల్ లేకుండా వుండ‌లేమా?

పూర్వం ఫోన్ వుంటే మ‌హాగొప్ప‌. తెలిసిన‌వారెవ‌రికైనా ఫోన్ కాల్ వ‌స్తే ఆ యింటికి ప‌రిగెట్టాలి.  కొన్నాళ్ల‌కు  దాదాపు ప్ర‌తీ ఇంట్లో పోన్ వ‌చ్చేసింది. కాల‌క్ర‌మంలో మొబైల్ ఫోన్ వ‌చ్చి అంద‌రికీ ఆత్మీయం అయి కూర్చుంది. చేతిలో మొబైల్ వుంటే లోక‌మంతా అర‌చేతిలో వున్న‌ట్టే అంటూ యాడ్స్ తో యువ‌త‌ను  విప రీతంగా ఆక‌ట్టుకోవ‌డంలో మొబైల్ కంపెనీలు లాభార్జ‌న బాట‌లో వున్నాయి. ఇపుడు రోజుకో కొత్త ర‌కం  ఐ ఫోన్‌లు చూస్తున్నాం. ఆట‌లు, పాట‌లు, సినిమాలు, సీరియ‌ళ్లు ఒక‌టేమిటి అంతా దానితోనే సాగిపోతోంది.   ఇహ ఇప్పుడు లోక‌మంతా ఐఫోన్ మ‌యం. అది క్షణం లేకుండా బ‌త‌క‌డ‌మే క‌ష్ట‌త‌ర‌మ‌యింది. యువ‌త దానికి దాసోహం అంటున్నారు. కానీ మొబైల్‌ను క‌నుగొన్న మార్టిన్ కూప‌ర్ మాత్రం మొబైల్‌ను ఎంత త‌క్కువ వాడితే జీవితంలో అంత ఆనందం పొంద‌వ‌చ్చ‌నే అంటున్నారు.  ప్ర‌స్తుతం 93 ఏళ్ల మార్టిన్ 1973లో మోటోరోలా డైనా టిఎసి 8000 ఎక్స్ అనే వైర్‌లెస్ సెల్యూల‌ర్ డివైజ్‌ను క‌నుగొన్నారు. త‌ర్వాత కాల‌క్ర‌మంలో అదే మొబైల్ ఫోన్‌, ప్ర‌స్తుతం ఐ ఫోన్ గా అనేక పేర్ల‌తో, అనేక కంపె నీలో త‌యారుచేస్తున్నాయి. చూడ్డానికి చేతిలో ఇమిడిపోయేంత బుజ్జి ఫోన్‌. కానీ అందులో లోకంలో ఏది కావాల న్నా సినిమాలు, వెబ్‌సీరీస్‌లు, షోలో, ఆట‌పాట‌లు.. అన్నీ చూడ‌గ‌ల్గుతున్నాం.  ప్ర‌స్తుతం చేతిలో మొబైల్ లేకుండా ఒక్క ప‌నీ కావ‌డం లేద‌న్న‌ది ఎంతో నిజం. కానీ దానితో వుండే సౌక‌ర్యం బాగానే వుండ వ‌చ్చు గాని దాని వ‌ల్ల జీవితంలో కొంత ఆనందాన్ని కూడా కోల్పోతున్నామ‌ని మార్టిన్ కూప‌ర్ అంటు న్నా రు. నిజానికి ఆయ‌న క‌నుగొన్న స‌మ‌యంలో ఇంత‌టి విప‌రీతాన్ని ఆయ‌న వూహించి వుండ‌క పోవ‌చ్చు.  టెన్త్ క్లాస్ విద్యార్ధి కూడా ఐఫోన్ వాడ‌కం గ‌మ‌నిస్తున్నాం. అంత ఖ‌రీద‌యిన ఫోన్‌తో  విద్యార్ధులు కాలం వృధా చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు అంద‌రి నుంచి విన‌వ‌స్తున్నాయి. సాంకేతిక అభ‌వృద్ధితో లాభ‌న‌ష్టాలు బేరీజు వేయ‌డం మొబైల్ రాక‌తో మ‌రీ ఎక్కువ‌యింది. కాలంతో పాటు ముంద‌డుగు వేయాలంటే ఇలాంటి ప‌రిక‌రాల‌ను అందుకోవాల్సిందేన‌ని యువ‌త అభిప్రాయం. కానీ ఇంటి ప‌నులు, ఆఫీసు ప‌నులు, ఇతర త్రా ముఖ్య‌మ‌యిన ప‌నుల‌న్నీ మొబైల్ రాక‌తో వెన‌క‌డిపోయాయనే విమ‌ర్శా వుంది. రోజులో అత్యధిక స‌మయం మొబైల్‌తోనే గ‌డుస్తున్న‌ది. ఈ ర‌క‌మైన విప‌రీత వాడ‌కం క్ర‌మేపీ పిల్ల‌ల్లో ముఖ్యంగా విద్యార్ధుల్లో  చ‌దువు మీద ఆస‌క్తి త‌గ్గుతోంద‌ని, స‌హ‌జ జ్ఞాప‌క‌శ‌క్తి దెబ్బ‌తింటోంద‌ని విద్యావేత్త‌ల అభిప్రాయం.  మొబైల్ వాడ‌కం త‌గ్గించుకుంటే జీవితం సుఖంగా వుంటుంద‌ని అంటారు మొబైల్ సృష్టిక‌ర్త  93 ఏళ్ల మార్టిన్ కూప‌ర్‌. ఆయ‌న మాట‌ను కాస్తంత ప‌ట్టించుకుందామా?  నెల‌లో దాదాపు 140 గంట‌లు మొబైల్‌తోనే జ‌నం గ‌డిపేస్తున్నార‌ని ఒక అంత‌ర్జాతీయ నివేదిక వెల్ల‌డించింది.  ఇక నుంచి మొబైల్  ఆచీ తూచీ వాడ టం అల‌వ‌ర్చుకుందాం. మొబైల్‌ను కేవ‌లం ఒక  ప‌రిక‌రంగానే చూడాలి, దాన్ని మూడో చేయిగా భావించి, దాని మీదే స‌మ‌స్తం ఆధార‌ప‌డి వుంద‌నే భావ‌న‌కు లోన‌యి జీవితంలో ప్ర‌శాంత‌త‌ను కొంత కోల్పోతున్నా మన్న మాట‌ల్ని నిజం చేయ‌వ‌ద్దు.  మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసి  కొంత స‌మ‌యం వీల‌యినంత స‌మ‌యం  గ‌డ‌ప‌డానికి మ‌ళ్లీ ప్ర‌య‌త్నించండి   అని మార్టిన్ అంటున్నారు.

వైసీపీలో రగులుతున్న కులం కుంపట్లు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సజ్జల రామ కృష్ణా రెడ్డి, ఇంకో కీలక  పదవిలో ఇంకొక రెడ్డి .. ఇలా పార్టీలో , ప్రభుత్వంలో అంతటా, ఆ రెండు అక్షరాలదే హవా... ఈమాటలు అన్నది, అంటున్నదీ ఎవరో కాదు, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో క్రియాశీలంగా మెలుగుతూ, పార్టీ గెలుపు కోసం శక్తీ వంచన లేకుండా, అహర్నిశలు శ్రమించిన అన్య ‘కుల’ కార్యకర్తలు నాయకులు. ఇందులో ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు. ఓసీ లున్నారు. బీసీలు, మైనారిటీలున్నారు. అందరిలోనూ అసంతృప్తి వుంది. అయినా, ముఖ్యమంత్రి  జగన్ రెడీ మాత్రం, అదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పడు, అన్య సామాజిక వర్గాల నాయకులు, కార్యకర్తలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.  ఈ మధ్యనే, వైసీపీ పార్టీకి అనుబంధ సంఘాల ప్రకటించారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విభాగాలకు మాత్రం ఆయా వర్గాలకు ఇచ్చారు. ఇతర సంఘాలు అన్నింటినీ ఆ ‘రెండు’ అక్షరాల సామాజిక వర్గానికే కట్ట బెట్టారు. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను ప్రకటించారు. అందులో అత్యధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారనే ఆరోపణలు పార్టీలో బలగా వినిపిస్తున్నాయి. కాగా, అనుబంధ సంఘాల బాధ్యులుగా  నియమితులైన వారిలో ...  ‘బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నాగిరెడ్డి, పూనూరు గౌతంరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కల్పలతా రెడ్డి, మేడపాటి వెంకట్ రెడ్డి, సునీల్ పోశింరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి ఇలా, అందరి పేరు ఆ రెండు అక్షరాలతోనే ముగుస్తుంది. ఇందులో ఐటీ, సోషల్ మీడియా, పార్టీ ఆఫీస్, యూత్ వింగ్, రైతు విభాగం ఇలా అన్నీ ఉన్నాయి. అయితే ఎందుకనో ఏమో కానీ, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, బీసీ, ఎస్టీ, ఎస్టీల సంఘాలకు  మాత్రం ఆయా సామజిక వర్గాలకే  బాధ్యతలు ఇచ్చారు.  ఇలా ఒకే ఒక్క సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం పై  విమర్శలు వస్తున్నా, పార్టీ మాత్రం, అవేమీ పట్టించుకోవడంలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలానే కాదు, ఓసీలకు జగన్ రెడ్డి మొండి చేయి చుపారని, అయన దృష్టిలో ఒక్క రెడ్లు వినా, ఓసీలు, ఇతర సామాజిక వర్గాలు కనిపించవు అనే విమర్శలు వినవస్తున్నాయి.అయితే, ఇప్పడు ఇతర సామాజిక వర్గాలు వైసీపెలో తమకు జరుగతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాయి. మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. సామజిక న్యాయం పేరిట, పొరుగు రాష్ట్రానికి చెందిన బీసీ సంఘం నాయకుడు ఆర్ . కృష్ణయ్యకు ఏకంగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన జగన్ రెడ్డి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న బీసీలు, ఇతర సమాజిక వర్గాలను మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, తిరుబాటు తప్పదని, పార్టీ  నేతలు హెచ్చరిస్తున్నారు.

కేసీఆర్ కోన్ కిస్కా.. బండి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. మోడీ ప్రసంగించిన ఆ సభకు జనసమీకరణలో రాష్ట్ర బీజేపీ విజయవంతమైంది. ప్రధాని మోడీ కూడా సభకు హాజరైన జనసందోహాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. సభా నిర్వహణ భేష్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను భుజం తట్టి మరీ అభినందించారు. అదీ సభా వేదికపైనే. ఇది బండికి అనుకోని కానుక. అగ్రనేత, అందునా ప్రధాని మోడీ నుంచి భుజం తట్టి అభినందన అందుకోవడంతో ఆయన ఆనందం పట్టలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. సరే అదంతా అయిపోయింది. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం వద్ద మోడీకి వీడ్కోలు పలికిన తరువాత బండి తనను తాను మరచిపోయి ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. కోన్ కిస్కా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభ విజయవంతమైన ఆనందం ఆయనలో పట్టలేనంతగా ఉండొచ్చు తప్పు లేదు. ఆ ఆనందాన్ని పార్టీ సహచరులతో పంచుకోవచ్చు. మరింత ఉత్సాహంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయవచ్చు. కానీ బండి ఆ ఆప్షన్లు ఎంచుకోలేదు. ముఖ్యమంత్రిపై పరుష వ్యాఖ్యలతో రెచ్చి పోయారు. సీఎం కేసీఆర్ ఎవరు కోన్ కిస్కా.. ప్రధాని మోడీ ఆయనకు సమాధానం చెప్పడమేమిటి, మోడీ చెప్పాల్సిందేదో తెలంగాణ ప్రజానీకానికే చెప్పారంటూ వ్యాఖ్యానించారు. మోడీ ప్రసంగం తరువాత కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ ఇంత కాలం ఊదరగొట్టిన కేసీఆరే తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా ఇంత కాలం కేంద్రం నిధులతో షోకు చేసిన కేసీఆర్ బండారం మోడీ ప్రసంగంతో బట్టబయలైందని విమర్శించారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎంత ఘాటుగానైనా ఉండొచ్చు కానీ బాధ్యతాయుతమైన నేత ఎవరూ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయరు. ఇష్టారీతిన చేసే వ్యాఖ్యల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కోన్ కిస్కా అని బండి చులకన చేయడం పట్ల బీజేపీ శ్రేణుల్లోనే అభ్యంతరం వ్యక్తం అవుతోంది. 

కుక్క మెరిగిందన్న కోపంతో ఏం చేశాడంటే..?

అత్తమీద కోపం దుత్త మీద చూపించాడన్నది సామెత. కానీ ఢిల్లీకి చెందిన ధరమ్ వీర్ దహియా కుక్క మీద కోపం ఆ కుక్క యజమానుల మీద చూపించాడు. అలాగని కుక్కనూ వదిలేయలేదు. దానిమీదా దాడి చేసి తన కోపం తీర్చుకున్నాడు. మనిషిలోని పశుత్వానికి పరాకాష్టగా నిలిచే ఈ సంఘటనకు ఢిల్లీ వేదిక అయ్యింది. ఢిల్లీలోని పశ్చిమ విహార్ లో నివసించే ధరమ్ వీర్ దహియా ఉదయాన్నే వాకింగ్ కు వెళుతుంటే.. పొరుగింటి వారి కుక్క అతడిని చూసి మొరిగింది. కుక్క నన్ను చూసి మెరగడమేమిటి? నేనేమైనా దొంగ అనుకుంటోందా? అని కోపం వచ్చింది. కోపగించుకుని ఊరుకోకుండా ఆ కుక్క తోక పట్టుకుని ఈడ్చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ కుక్క అతడిని కరిచింది. దీంతో కోపంతో ఊగిపోయిన ధరమ్ వీర్ దహియా రాడ్ తీసుకుని దానిపై దాడి చేయబోయాడు. వద్దంటూ అడ్డు వచ్చిన ఆ కుక్క యజమానిపై రాడ్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడితో ఊరుకోకుండా అడ్డొచ్చిన మరో వ్యక్తినీ, ఆ ఇంట్లోని మహిళనూ కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఇప్పుడు పోలీసు స్టేషన్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఎందుకంటే అతడు చేసిన దాడి మొత్తం అక్కడి సీసీ కెమేరాలో రికార్డైంది. కుక్క యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా మూగజీవాలపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.  

డామిట్ ..కథ అడ్డం తిరిగింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ కు గత కొంత కాలంగా దెబ్బ మీద దెబ్బ వరసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన వచ్చింది మొదలు, ప్రతి అడుగులో అవరోధాలు,అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను కలుపుకుని, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల జాతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు. జాతీయ పార్టీ, జాతీయ ప్రత్యామ్నియ ప్రణాళిక ఆలోచనలు ఎక్కడవేసిన గొంగళి  అక్కడే అన్నట్లు ఫార్మ్ హౌస్  గడప దాట లేదు. మరోవంక  వరితో మొదలైన కేంద్రం పై యుద్ధం ఆశించిన ఫలితం సాధించలేక పోయింది.  ఇక ఇప్పడు తాజాగా, రాష్ట్ర రాజధాని, భాగ్యనగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం జరిగిన మరు క్షణం నుంచి, కేసీఆర్, కేటీఆర్ బీజేపీని  బద్నాం చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతూ వచ్చారు. అయితే చివరాఖరుకు, కథ అడ్డం తిరిగింది. బీజేపీని, ప్రధాని మోడీని బద్నాం చేసేందుకు, ఫ్లెక్సీల యుద్ధం చేసినా, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రతిపక్షాల ఉమ్మడి అభ్బ్యర్ది యశ్వంత్ సిన్హా తీసుకొచ్చి హడావిడి చేసినా, అదే అదనుగా ప్రధాని మోడీ పై  ‘’సేల్స్ మ్యాన్’ వంటి విమర్శలు చేసినా, జాతీయ, అంతర్జాతీయ విషయాలు అన్నింటినీ కలబోసి ప్రశ్నలు సంధించినా, చివరకు, వృధా ప్రయాసే మిగిలిందని, తెరాస నేతలే ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం ఇస్తారని ఆశించారు. ఆయనకు ఆయనే, ముందుగానే మోడీ, తనను టార్గెట్  చేస్తారని ప్రకటించుకున్నారు. అయితే, కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా, ఏర్పాటు చసిన విజయ సంకల్ప సభలో,ప్రధాని మోడీ 30 నిముషాలకు పైగా చేసిన ప్రసంగంలో కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అసలు కేసేఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళలో ఏమి చేసిందో, ముందు ముందు ఏమి చేస్తుందో, నేరుగా ప్రజలకే చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా అని తేల్చేశారు. దీంతో కేసేఆర్ కు మోడీనుంచి తిట్లదండకం  ఆశించిన తెరాస నేతలకు మరో మారు ఆశాభంగం ఎదురైంది. ముఖ్యమత్రి కేసీఆర్  ప్రశ్నలకు సమధానం చెప్పక పోగా అసలు, ఆయన ప్రస్తావనే చేయక పోవడం, ప్రధాని మోడి, ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ను  పూచిక పుల్లకంటే హీనంగా పక్కన పెట్టడం, అవమానంగా భావిస్తున్నారు. సరే, అంత మాత్రం చేత, తెరాస ఇక  చేతులు ముడుచుకుని కుర్చుంటుందని  కాదు.  కానీ, కేంద్రంపై యుద్ధం పేరుతో బీజేపీని టార్గెట్ చేసే విషయంలో ఆచి తూచి అడుగులు వేయక తప్పదని, ఎదంటే అది అనేస్తే కుదరదని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే విధంగా  తెరాస ఎన్నికల వ్యూహాన్ని సవరించుకోవలసి ఉంటుదని అంటున్నారు.  అదలా ఉంటే విజయసంకల్ప సభ  ఎవరూ ఉహించని విధంగా సక్సెస్ అయింది. నిజానికి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం బహిరంగ సభ ఏర్పాటు ప్రతిపాదన చేసినప్పుడు, పార్టీ జాతీయ నాయకత్వం తటపటాయించింది, సక్సెస్ కాకపోతే, అభాసు పాలవుతామని, ఒకటికి పదిసార్లు అలోచించి, సమాలోచనలు జరిపి చివరకు ఓకే చెప్పింది. అయినా, వ్యూహాత్మకంగా, ఉభయతారకంగా, రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు, కేంద్ర మంత్రులు, వివిదః రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర కీలక నేతలను ఇంచార్జిలుగా నియమించి, మూడు నాలుగు రోజుల ముందునుంచి జనసంపర్క యాత్రలు నిర్వహించింది. ఆ విధంగా సభ సక్సెస్ కావడమే కాకుండా, రాష్ట్రం’ పై బీజేపీ ఫోకస్ ఎంత బలంగా  వుందో, జతేఅయ్ స్థాయిలో  బీజేపీ శక్తీ సామర్ధ్యాలు ఏమిటో  చెప్పకనే చెప్పినట్లయింది.అంతే కాదు, కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి ప్రసంగించిన మోడీ, ఇది వన్ టైం ఎఫైర్ కాదు, ఈ దండ యాత్ర ఇలా కొనసాగుతూనే ఉండాలని సూచించారు. సో.. ఇలాంటి యాత్రలు, దండయాత్రలు ఇలా కొనసాగుతూనే  ఉంటాయి, అనే సంకేతం అయితే వచ్చింది.  ఓవరాల్’’గా చూస్తే, బీజేపీ, తెరాసల మధ్య సాగుతున్న వ్యూహాత్మక యుద్దంలో ప్రస్తుతానికి అయితే బీజేపీ పై చేయి సాధించింది. అయితే, ఇక్కడితో కథ ముగిసినట్లు కాదని, వ్యూహాలు మార్చుకునేందుకు తెరాసకు ఇంకా సమయం ఉందని, పరిశీలకులు అంటున్నారు. అయితే, కేంద్రంపై యుద్ధం విషయంలో ఇప్పటికే చాలా దూరం వెళ్ళిన కేసీఆర్, వెనకడుగు వేస్తారా,  అంటే రాజకీయ పరిశీలకులు మాత్రం అనుమానమే అంటున్నారు.

బీజేపీ, జనసేన కటీఫేనా..? మోడీ సభకు పవన్ దూరం అందుకేనా?

బీజేపీ. జనసేనల మధ్య దూరం పెరిగిందా? ప్రధాని మోడీ భీమవరం పర్యటనకు, ఆయన పాల్గొనే భారీ బహిరంగ సభకు జనసేనాని పవన్ కల్యాణ్ కు అందుకే ఆహ్వానం అందలేదా? అన్న ప్రశ్నలకు రాజకీయ పండితులు ఔననే సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి కిప్పుడు ఆ రెండు పార్టీలూ కూడా తమ మధ్య మైత్రి చెడిందని బహిరంగంగా ప్రకటించకపోయినా.. జనసేన, బీజేపీల మధ్య సంబంధాలు బెడిసాయనడంలో ఎటువంటి సందేహం లేదని వారు నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తున్నా..జనసేనాని పవన్ కల్యాణ్ ఆ ఛాయలకు కూడా వెళ్లకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా వారు చూపుతున్నారు. తాను భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లలేకపోవడానికి బిజీ షెడ్యూల్ కారణమని పవన్ కల్యాణ్ చెబుతున్నా.. ఇరు పార్టీల మధ్యా సఖ్యత ఉండి ఉంటే షెడ్యూల్ మార్చుకునైనా పవన్ కల్యాణ్ హాజరై ఉండేవారని వారు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అల్లూరి విగ్రహావిష్కరణకు పవన్ హాజరౌతారనీ, మోడీతో వేదిక పంచుకుంటారనీ మొదటి నుంచీ జనసేన వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ, జనసేనల మధ్య జరిగిన మాటల యుద్ధంతో ఇరు పార్టీల మధ్యా సఖ్యత చెడింది. ఆ తరువాతే పవన్ కల్యాణ్ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు. పొత్తుల సంగతి ఎత్తకుండా తన పని తాను సుకుపోతున్నారు. మళ్లీ గతంలోలా ఓట్ల కోసం పుట్టిన పార్టీ జనసేన కాదనే పల్లవి అందుకున్నారు. ఇక మోడీతో వేదిక పంచుకోలేకపోవడానికి కారణాలు చెబుతన్నా.. ఆజాదీ కా అమృతోత్సవల్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ గొప్ప కార్యక్రమం అంటూ వీడియో విడుదల చేసినా.. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం కచ్చితంగా బీజేపీ జనసేనల మధ్య చెడిన సంబంధాలనే ఎత్తి చూపుతున్నాయని సామాన్య ప్రజలు సైతం భావిస్తున్నారు. అయితే రాజకీయంగా అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే.. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికీ, ఆ తరువాత జరిగే మోడీ బహిరంగ సభకూ తెలుగుదేశం పార్టీ తరఫున  ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయడు, మంతెన శివరామరాజు మాజరు కానున్నారు.   ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారిక షెడ్యూల్ లో వీరిరువురి పేర్లూ ఉన్నాయి. అయితే జనసేన నేతల ప్రస్తావనే లేదు.  మరో వైపు ఇటీవల సినిమా టికెట్ల వ్యవహారంలో జగన్ తో భేటీ అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు హాజరౌతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని ఆహ్వానించి... రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఇంకా చెప్పాలంటే.. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ కు ఆహ్మానం పంపకపోవడాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నారు.   ఇక కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నా.. అంతా రాష్ట్ర ప్రభుత్వ ఇష్టారాజ్యంగానే ఆహ్వినితుల జాబితాను రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రొటోకాల్ ప్రకారం తన సొంత నియోజకవర్గానికి వస్తున్న మోడీకి ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. కానీ ప్రధాని పర్యటనకు హాజరయ్యే వారి జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఆయన పేరు జాబితాలో లేకపోవడానికి ఆయన రాక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం జగన్ కు ఇష్టం లేకపోవడమే కారణమన్నది జగద్వితితమే. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబితే అది మాత్రమే చేసిందనడానికి ప్రొటోకాల్ ను సైతం పక్కన పెట్టేయడమే నిదర్శనమని విమర్శలు వినవస్తున్నాయి.

వ‌చ్చారు.. త‌ప్పులో కాలేసారు!

అంతా త‌ర‌లివ‌చ్చారు. యుద్ధానికి సిద్ధ‌ప‌డేందుకు శిబిరాల్లో సేద‌దీరారు. ఆన‌క విప‌క్షాల‌వారిని, కొలువు దీరిన ప్రాంతీయుల‌ను త‌మ ఆధిప‌త్య స‌త్తాను త్వ‌ర‌లో మ‌రింత చ‌విచూపిస్తామ‌ని చిన్న‌పాటి హెచ్చ‌రి క‌లు చేసి వెళ్లారు. ఇంతే జ‌రిగింది బిజెపి కార్య‌వ‌ర్గ స‌మావేశం హ‌డావుడి మొత్తం.  తెలంగాణాలో పాగా వేయ‌డానికి అనేక మార్గాలు, ఆలోచ‌న‌లు చేసిన బిజెపి కేంద్ర నాయ‌కులు తెలంగాణా రాజ‌ధాని హైద‌రాబాద్‌లోనే త‌మ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించి ఇక్క‌డే అస‌లు సంగ‌తి తేల్చుకుందామ‌ని భావించారు. ప్ర‌చారం నుంచి స‌మావేశం జ‌రిగినంత వ‌ర‌కూ బిజెపి వ‌ర్గీయులు నానా హ‌డావుడీ చేసేరు. ప్ర‌ధాని మోదీ, పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అమిత్ షా త‌దిత‌రులు, బిజెపి పాలిత రాష్ట్రా ల ముఖ్య‌మంత్రుల‌తో స‌హా హైద‌రాబాద్‌లో మ‌కాం వేసి ఇక్క‌డి టిఆర్ ఎస్ శ్రేణుల‌కు వెన్నులో వొణుకు పుట్టేలా చేద్దామ‌నుకున్నారు. అయితే టిఆర్ ఎస్ ప్ర‌చారంలోనే ఎదురుదాడికి దిగి వారిని ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న పెద్ద సంకేత‌మే ఇచ్చింది.  బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ సైతం తెలంగాణాకు ఎంతో చేశామ‌ని, ఎంతో ఇచ్చా మ‌ని గొంతు చించుకున్నారు. కానీ అవ‌న్నీ అవాస్త‌వాలేన‌న్న‌ది వారికి తెలిసేలా టిఆర్ ఎస్ నాయ‌కులు టీ వీ చర్చ‌ల్లో ఘాటుగా విమ‌ర్శించారు. ప్ర‌ధాని మాట్లాడుతున్నంతసేపూ, ఈయన ప్ర‌ధానేనా, ఇంత అబద్ధా ల కోరేమిటా అని నోరెళ్ల‌బ‌డుతున్నారు. తెలంగాణాలో టిఆర్ ఎస్ చెప్పుకుంటూన్న అభివృద్ధి  అంతా త‌మ ఆర్ధిక మ‌ద్ద‌తుతోనే సాధ్య‌ప‌డింద‌ని అది టిఆర్ ఎస్ నేత‌ల‌కు చెప్పుకోవ‌డానికి ఇబ్బందిగా  మారిం ద‌నే విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము న‌గరాభివృద్ధికి, ముఖ్యంగా రోడ్లు, ఫ్లైఓవ‌ర్ల నిర్మాణానికి వేల కోట్లు ఇచ్చామ‌ని మైకులు బ‌ద్ద‌ల‌య్యేలా అరిచి మ‌రీ చెప్పారు.  కానీ ప్ర‌ధాని చెప్పినంత మాత్రాన  అది నిజ‌మై పోతుందా అన్న ప్ర‌శ్న టిఆర్ ఎస్ శ్రేణులు సంధిస్తున్నారు.  ప్ర‌ధాని మోదీ, కేంద్ర నాయ‌కులు ఎవ‌ర‌యి నా స‌రే తెలంగాణా గురించి చెప్పిన‌వ‌న్నీ అవాస్త‌వాలేన‌ని  తెలంగాణా ప్ర‌భుత్వం మండిప‌డుతోంది.  ఎవ‌రు ఎవ‌రిని ప్ర‌శ్నిస్తున్నారు, ఎవ‌ర్ని హెచ్చ‌రిస్తున్నార‌న్న‌ది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. తెలంగాణావా దులు కేంద్రం నిస్సిగ్గుగా అబ‌ద్ధాలాడ‌టం ప‌ట్ల ఆశ్చ‌ర్య‌ప‌డుతోంది. ఏ ప్రాజెక్టుకీ, రోడ్డు ప‌నుల‌కీ కేంద్రం వీస‌మెత్త సాయం చేయ‌లేదు, ఇవ్వాల్సిన‌వాటి సంగ‌తి దేవుడెరుగు అంటున్నారు. కేవ‌లం పెద్ద నోరు వేసుకుని అమాంతం ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో మైకుల్లో మాట్లాడ‌గానే అన్నీ అంద‌రూ న‌మ్మ‌రు.  ప్ర‌ధాని స్థాయి మ‌నిషి మ‌రీ ఇంత అనాలోచితంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏ పాటి న్యాయ‌మ‌న్న‌ది టి ఆర్ ఎస్ వ‌ర్గీయుల ప్ర‌శ్న‌. వాస్త‌వానికి తెలంగాణాకు సంబంధించి రావాల్సిన ఆర్దిక మ‌ద్ద‌తు గురించి అడిగినవి  నిర్ల‌క్ష్యం చేసి త‌మ‌కు తోచిన అంకెల‌తో తోచిన విధంగా ప్ర‌చారం చేసుకోవ‌డంలో బిజెపివారీ మాన‌సిక బ‌ల‌హీన‌తే బ‌య‌ట‌ప‌డుతోంది.  మొత్తానికి బిజెపి యావ‌త్ సైన్యం వ‌చ్చి చేసిన త‌ప్పుడు ప్ర‌చారాలు, ఊక‌దంపు ప్ర‌సంగాల వ‌ల్ల తెలంగా ణాకు, టిఆర్ ఎస్‌కు వ‌చ్చే న‌ష్టం శూన్యం.  ప్ర‌తిగా బిజెపీ వ‌ర్గాలే న‌ష్ట‌పోయే అవ‌కాశాలున్నాయి. తెలం గాణా ఏర్పాట‌యిన‌ప్ప‌టి నుంచి కేంద్రం పెద్ద‌గా స‌హ‌క‌రించిందేమీ లేద‌ని, ఇపుడు మ‌రింత రాజ‌కీయ వైఫల్యాన్ని బిజెపీ స్వ‌యంగా ఇంత దూరం వ‌చ్చి తెలంగాణాలో బ‌య‌ట‌ప‌డ‌టం ప‌ట్ల అంతా న‌వ్వుకుం టున్నారు. తెలంగాణాకు చెంద కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ త‌దిత‌ర బిజెపీ హేమాహేమీలు  మోదీని, అమిత్ షాను, ఇత‌ర కాషాయ హేమాహేమీల‌తో  వ‌చ్చి రెండు రోజ‌ల్లో ప్ర‌జ‌ల్ని ముఖ్యంగా ఓట‌ర్లను త‌మ జండా నీడ‌లోకీ తెచ్చేసుకోవాల‌న్న ఆతృత విజ‌య‌వంతం అయితే కాలేదు. ఢిల్లీలో పెట్టుకుని త‌మ పార్టీ వారు భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాలు నిర్ణ‌యించుకుంటే అయిపోయేదానికి ఇక్క‌డికి వ‌చ్చి ఇక్కడ శిబిరాలు వేసు కుని, ఇక్క‌డ తిండి తిన‌గానే తెలంగాణా వాదులు అయిపోతారా ?  ఇలాంటి ట్రిక్కులు, జిమ్మిక్కులు  తెలంగాణా ప్ర‌జ‌లు అంత‌గా ప‌ట్టించుకోరు. బిజెపీ ఆట‌పాట‌లు, హ‌డావుడీ అంతా బీహార్‌, పంజాబ్‌, రాజ స్థాన్ ల‌లో చెల్లుతుందేమోగాని తెలంగాణా వాదులను క‌దిలించ‌లేదు.  బిజెపి పాలిత రాష్ట్రాల‌తో పోలుస్తూ తెలంగాణా కూడా త‌మ నీడ‌లోకి తెచ్చేసుకోవ‌డానికి ఇంక ఆట్టే కాలం ప‌ట్ట‌దు, రెడీగా వుండ‌డ‌ని ఎవ‌రికి హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు?  తెలంగాణా పోరు, రాష్ట్రావ‌త‌ర‌ణ వెనుక అనేక శ‌తాబ్దాల వెత‌లు వున్నాయి. ఈ ప్ర‌జ‌లు ఇత‌ర రాష్ట్రాల్లో వ‌లె అంత త్వ‌ర‌గా కాషాయం వారి జాతీయ భావ‌న, అతి దేశ భ‌క్తి  ఓవ‌రాక్ష‌న్‌ల‌కు ప‌డ‌రు. టిఆర్ ఎస్ ప్ర‌స్తుతం బిజెపి దృష్టిలో త‌క్కువ స్థాయిలో క‌న ప‌డుతోందేమోగాని టిఆర్ ఎస్‌కి రాష్ట్రంలో ప్ర‌జ‌ల్లో ఏమాత్రం గౌర‌వం, న‌మ్మ‌కం స‌డ‌ల‌లేదు.  క‌ట్ట‌గ‌ట్టుకుని వ‌చ్చాం, భ‌య‌పెట్టి పోయామ‌ని బిజెపి వ‌ర్గాలు అనుకుంటే త‌ప్ప‌కుండా త‌ప్పులో కాలేసిన‌ట్టే!

భీమవరం సభలో రాజుగారికి చోటు లేదు!

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో సోమవారం జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని  మోడీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగే సభలో స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజుకు చోటు లేదని తేలిపోయింది. ఈ సభలో వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లు ఖరారయ్యాయి. వారిలో  రఘురామకృష్ణం రాజు పేరు లేదు. ప్రధాని సభలో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీకి అవకాశం ఉండాలి. అయితే అందుకు భిన్నంగా సభలో ప్రధానితో పాటు వేదికపై కూర్చునే ప్రముఖుల పేర్లలో రఘురామకృష్ణం రాజు పేరు లేదు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్న సంగతి విదితమే. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ అనంతరం పెదఅమీరంలో   బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ సభలో ప్రధాని మోదీ తో పాటు  వేదికపై మరో  11 మంది పేర్లు ఖరారు చేశారు. గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు, అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ, వసుధ ఫౌండేషన్ ప్రతినిధులు, మంతెన వెంకట రామరాజు, పేరిచర్ల రాజు వేదికపై కూర్చోనున్నారు. సభ కోసం దాదాపు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ గేర్

తెరాస పార్టీకి ఇప్పుడు సొంత గడ్డ తెలంగాణలోనే ఎదురుగాలి వీస్తున్నదా అన్న ప్రశ్నకు పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం ఇవ్వాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు, ఆ తరువాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట రాష్ట్రంలో విపక్షాలను ఖాళీ చేయడానికి అనుసరించిన వ్యూహమే ఇప్పుడు బూమరాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నదంటున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన నేతలు ఒక్కరొక్కరుగా తిరిగి సొంతగూటికి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఒక మేయర్ ఏకంగా అధికార టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారంటే అధికార పార్టీకి ఇది నిజంగా ఎదురు దెబ్బే. మేయర్ ఒటరిగా కాక ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరుందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వారిని పార్టీలోనే కొనసాగేలా చేయడానికి సాక్షాత్తూ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత రంగంలోనికి దిగి శతధా ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు.   బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఇప్పటికే  తన రాజీనామా లేఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపారు. బడంగ్ పేట్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం విజయవంతం చేశానని పేర్కొన్న  పారిజాత నరసింహారెడ్డి.. ఆ సేవలకు గుర్తింపు లేకపోగా  టీఆర్ఎస్ లో తనకు, తన వర్గం వారికి అడుగడుగునా అవమానాలూ, పరాభవాలే ఎదురౌతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక   తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.  కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగ సొంత గూటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సీనియర్ నేతల నుంచి అడ్డంకులు ఎదురౌతున్నా, వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్ ను వీడి తెరాస గూటికి చేరిన మాజీలతో టచ్ లోకి  వెళ్లి వారిని సొంత గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయనీ అందుకే నాటి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ నిర్మాణంలోని లోపాల కారణంగానే కాంగ్రెస్ మాజీలు సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ను వీడి వెళ్లిన వారిని వెనక్కు రప్పించే విషయంలో రేవంత్ కృషిని తక్కువ చేసి చూపడం సాధ్యం కాదని కాంగ్రెస్ శ్రేణులే అంటున్నారు. టీఆర్ఎస్ చీఫ్ గా గతంలో ఎవరూ చేయని విధంగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ మాజీలను ఒప్పించి తిరిగి పార్టీలోనికి తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అవుతుండటంతో అధిష్థానం కూడా ఆయనను రాష్ట్రంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వినా ఎవరికీ కూడా కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్ర వ్యవహారాలలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదనీ, ఇన్నాళ్లకు మళ్లీ అటువంటి స్వేచ్ఛ రేవంత్ కు ఇచ్చారనీ పరిశీలకులు కూడా ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే ముందు ముందు  టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు సైతం హోం కమింగ్ అంటూ కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్య పోవలసిన పని లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.