సప్తపది లేని పెళ్లిళ్లు చెల్లవా ? 

హిందూ వివాహ వ్యవస్థ ఆచార వ్యవహారాల్లో విశిష్ట స్థానం ఉంది.  ఈ ఆచార వ్యవహారాల్లో సప్త పది ఆచారం ప్రత్యేకమైనదని చెప్పొచ్చు.  వధువు, వరుడు కలిసి యజ్ఞగుండం చట్టూ తిరిగే సప్తపదితో పాటు, ఇతర ఆచారాలను పూర్తి చేయకపోతే దానిని హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహంగా పరిగణించలేమని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ జంటకు 2017లో వివాహం జరిగింది. అయితే, తన భార్య రెండో వివాహం చేసుకొని వేరే వ్యక్తితో కలిసి ఉంటోందని పేర్కొంటూ జంటలోని వరుడు అదే ఏడాది మేజిస్ర్టేటు కోర్టులో కేసు పెట్టాడు. కోర్టు ఆమెకు సమన్లు పంపించింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అత్తింటివారు తనను వేధిస్తున్నారని, రెండో పెళ్లి చేసుకోలేదని వాదించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు సదరు మహిళ రెండో పెళ్లి జరగలేదని నివేదిక ఇచ్చారు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 7(2) ప్రకారం సప్తపది (సాత్‌ ఫేరీ), ఇతర సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. పరిశీలించిన ధర్మాసనం అన్ని సంప్రదాయాల ప్రకారం జరిగితేనే అది వివాహంగా చెల్లుబాటు అవుతుందని, ఇలాంటివి లేకుండా ఒకవేళ జరిగినా చట్టం దృష్టిలో అది వివాహం కాదని స్పష్టం చేసింది. ఇక ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సంప్రదాయంలో జరిగే ప్రతి క్రతువుకూ ప్రత్యేకత ఉంది. కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర-బెల్లం తలపై పెట్టించి, ఆ తర్వాత మాంగల్యధారణ చేయిస్తారు. ఇది పూర్తయిన తర్వాత వధూవరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్ని ‘సప్తపది’ అంటారు. దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి, పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. అందుకే పెద్దలు వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అంటారు. ఇందులో వేసే ప్రతీ అడుగుకీ ఒక్కో అర్థం ఉంది. పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం...వైవాహిక జీవితంలో ప్రమాణాలు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో చేయించే ప్రతి కార్యక్రమానికి ప్రాధాన్యత ఉంది. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. కొన్ని కుటుంబాల్లో  సప్తపది మాండేటరీ.  పెద్దల సమక్షంలో జరిగే పెళ్లిళ్లు అయితే పర్వాలేదు కాని రిజిస్టర్ మ్యారేజ్ లు చేసుకుంటున్న అనేక  ప్రేమ జంటలు  సప్తపది లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. రిజిస్టర్ మ్యారేజిలు చేసుకున్న వారు సప్తపది లేకుండానే వివాహతంతును పూర్తి చేసుకుంటున్నారు.  1955 నాటి వివాహ చట్టం ప్రకారం.. సప్తపది వేడుకలు, ఆచారాలు జరిగితేనే పెళ్లిగా దాన్ని గుర్తిస్తారని అలహాబాద్ హైకోర్టు వెల్లడించింది. మరి రిజిస్టర్ మ్యారేజ్ లు జరిగినప్పుడు   న్యాయస్థానాలు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.   

ఏపీ హైకోర్టులో బుద్ధా వెంకన్నకు ఊరట

తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్నకు ఏపీ హై కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ బుద్ధ వెంకన్న ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఇటీవల గన్నవరంలో జరిగిన సభలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై బుద్దా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే పేర్ని నాని ఫిర్యాదు మేరకు బుద్ధా వెంకన్నపై అత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బుద్దా వెంకన్న హైకోర్టును ఆశ్రయించారు. బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు   వెంకన్నను అరెస్టు చేయకుండా 41ఏ నోటీసు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.  

రేవంత్ దూకుడు! కేసీఆర్‌ చేతులెత్తేసినట్లేనా

తెలంగాణా ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు..కానీ ప్రధాన పార్టీలు ఎన్నికల హడావిడితో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమైంది. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల‌కు సై అంటే, కాంగ్రెస్ పార్టీ ఏమో అభ్యర్థుల జాబితాను పక్కనెట్టి మిని మేనిఫెస్టో, గ్యారంటీ స్కీములను ప్రకటించి జనాల్లోకి దూసుకెళ్తోంది. ఇక బీజేపీ అయితే.. కేంద్రం నుంచి ప్ర‌ధాన‌మంత్రినే తీసుకొచ్చి వరాల జల్లు కురిపించే యత్నం చేస్తూ వస్తోంది. ఇప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బి‌ఆర్‌ఎస్ ..తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు మాదిరిగా ముందుకెళుతున్నామ‌ని చెబుతున్నారు. అవి కొనసాగాలంటే మళ్ళీ బి‌ఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని ప్ర‌చారం చేసుకుంటున్నారు.  అయితే ఇక్క‌డ ఓ విష‌యం మాట్లాడుకోవాలి.  కేసీయార్ ప్రకటించిన 115 నియోజకవర్గాల్లో కనీసం 35 నియోజకవర్గాల్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. అభ్యర్ధులకు నియోజకవర్గాల్లోని కార్పొరేటర్లకు, ద్వితీయ శ్రేణినేతలకు ఏమాత్రం పడటంలేదు. వీళ్ళమధ్య సయోధ్య కుదర్చాలని చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కవుటవటంలేదు. అలాగే అసంతృప్తితో బీఆర్ఎస్ కు రాజీనామాలు చేస్తున్నారు. దాంతో అసంతృప్తి నేత‌లను బుజ్జగించటం, రాజీనామాలను ఆపటం కేసీయార్ కు పెద్ద సమస్యగా మారిపోయింది.   మ‌రో ప‌క్క‌ కాంగ్రెస్  అభ్యర్ధుల పేర్లు ఖ‌రారు చేసే  విషయంలో ఆచి తూచి కాంగ్రెస్ అడుగులేస్తుంది. అయితే మేనిఫెస్టో విషయంలో కాంగ్రెస్ ముందు ఉంది. అందరికంటే ముందు 6 గ్యారెంటీలు అంటూ మేనిఫెస్టో ప్రకటించేసింది. ఇక ప్రత్యర్ధి బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తూ..పెద్ద ఎత్తున వలసలని ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. రేవంత్‌రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ‘బీఆర్ఎస్ పార్టీని 25 సీట్లు దాటనివ్వమంటున్నారు. తెలంగాణలో 19% అన్ డిసైడెడ్ ఓట్లు  ఉన్నాయి. ఆ ఓట్ల‌న్నీ కాంగ్రెస్ పార్టీకే వస్తాయి,  రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేదు’ అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.  అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే.... పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంటి బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరారు. అలాగే సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర, తెలంగాణా ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్‌ పేపర్ లీకేజీపై పోరాటం, ధరణి రద్దు, తదితర అంశాలపై చేపట్టి కార్యక్రమాలతో పార్టీ యాక్టివిటీ పెరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్ననమ్మకం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో, నాయకత్వంలో ఏర్పడింది. దీంతో మెజార్టీ నియోజక వర్గాలలో కాంగ్రెస్ పార్టీకీ ఆశావాహుల సంఖ్య పెరిగింది. సీనియర్ లీడర్లు మినహా మిగిలినచోట్ల అభ్యర్థిత్వం కోసం నేతలు పోటీపడుతున్నారు.   అభ్యర్దుల ప్రకటనకు ఢిల్లీలో పెద్ద కసరత్తే జరుగుతోంది. టికెట్ల కోసం పెరిగిపోతున్న ఒత్తిళ్ళ నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపిక అంత సులభంకాదని చెప్ప‌వ‌చ్చు.  బి‌జే‌పి విషయానికొస్తే..ఆ పార్టీలో విచిత్ర పరిస్తితులు ఉన్నాయి. అభ్యర్ధుల ఎంపిక ఇంకా జరగడం లేదు. మేనిఫెస్టో అంశంపై చర్చ లేదు. నాయకుల మధ్య సమన్వయం లేదు. అందులో కొందరు నేతలు పార్టీ మారాలని చూస్తున్నారని తెలుస్తోంది. కాకపోతే కేంద్ర పెద్దలు మాత్రం తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అడపాదడపా రాష్ట్రానికి వస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే అభ్యర్ధుల గుర్తింపే పార్టీకి పెద్ద సమస్యగా మారుతోంది.  కేంద్ర మంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బలమైన వ్యతిరేక వర్గం తయారైంది. చాలా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలు లేరు. ఇతర పార్టీల నుండి నేతలను తీసుకొచ్చి టికెట్లు ఇవ్వాలని అనుకుంటే అది సాధ్యం కావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే మహాయితే 35 నియోజకవర్గాలకు మించి గట్టి అభ్యర్థులు లేరు. ఉన్న గట్టి అభ్యర్ధుల్లో కూడా గ్రూపు గొడవలు బాగానే పెరిగిపోయియి.  తెలంగాణాలో ప్ర‌స్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, బీఆరెస్ మధ్య రహస్య అవగాహన కుదిరిందన్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌లంగానే వుంది. బీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అన్నఅభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. నిజామాబాద్ స‌భ‌లో మోదీ రెచ్చిపోయి కేసీఆర్‌ను విమ‌ర్శించినా అంత‌గా ఎఫెక్ట్ క‌నిపించ‌లేదు. ఎందుకంటే మ‌జ్లిస్ పార్టీ బిజెపి పార్టీ తిట్టుకున్న‌ట్లే, అదే త‌ర‌హాలో బిజెపి బిఆర్ ఎస్ గ్రాఫ్ పెంచ‌డానికి మోదీ ప్ర‌య‌త్నించార‌నే చ‌ర్చ అయితే  జ‌రుగుతోంది. మ‌జ్లిస్ పార్టీ బిజెపి గ్రాఫ్ పెంచ‌డానికి ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేస్తుందో అదే త‌ర‌హాలో బి ఆర్ ఎస్ గ్రాఫ్ పెంచ‌డానికే మోదీ రెచ్చిపోయార‌నే చ‌ర్చ తెలంగాణాలో జ‌రుగుతోంది.  కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే  అధికార బీ ఆర్ ఎస్ కాస్తంత డల్ గా కనిపిస్తుంది.  చేతులు ఎత్తేసినట్లుగా ప్రచారం జరుగుతున్నా..  ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. తమ వద్ద సిద్ధం చేసిన ఒక్కో అస్త్రాన్ని బయటకు తీయనున్నట్లుగా తెలుస్తోంది.   ప్ర‌స్తుతం గ్రౌండ్ లెవెల్లో చూస్తే  రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. బి‌ఆర్‌ఎస్ కు, ఈ సారి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇవ్వనుంది. ఇక బి‌జే‌పి 10 శాతం లోపు ఓట్లకు పరిమితమై, అక్క‌డ‌క్క‌డ‌ కొన్ని స్థానాల్లో గెలుపోటములని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ధీటుగా బి‌జే‌పి రావడం కష్టమే.  మొత్తానికైతే తెలంగాణలో ఎన్నికల యుద్ధం అనేది ప్రధానంగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే జరిగేలా క‌నిపిస్తోంది.   ఎన్నిక‌ల నేప‌థ్యంలో చాలా స‌ర్వేలైతే వ‌స్తున్నాయి. కొన్ని స‌ర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, మ‌రి కొన్ని స‌ర్వేల్లో బీ ఆర్ ఎస్‌కు అనుకూలంగా వున్నాయి.  ఇలా ఏ సర్వే చూసుకున్న బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించి అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.  

చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి విజయవాడలోని ఏసీబీ కోర్టు మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన రిమాండ్  గురువారం (అక్టోబర్ 5)తో ముగియనుండగా ఆ రిమాండ్ ను   ఈ నెల 19 వరకు కోర్టు పొడిగించింది. అయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుల విచారణ సందర్భంగా  ఇటు చంద్రబాబు, అటు సీఐడీ తరఫు న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు.   స్కిల్ కేసులో చంద్రబాబుకు విధించిన రిమాండ్ గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దానిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక చంద్రబాబు బెయిలు పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం ఏసీబీ కోర్టు విచారణను శుక్రవారం (అక్టోబర్ 6)కు వాయిదా వేసింది. కాగా చంద్రబాబు తరఫున ఈ కేసులో సుప్రీం కోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున   అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

జగన్ హస్తిన పర్యటన సరే.. మోడీ, షా అప్పాయింట్ మాటేమిటి?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన ఒక రోజు ముందుకు జరిగింది. ముందుగా ప్రకటించినట్లు శుక్రవారం కాకుండా ఒక రోజు ముందే ఆయన హస్తినకు బయలుదేరారు. ఆయన హస్తిన పర్యటన సరే.. అయితే వైసీపీ ప్రచారం చేసుకుంటున్న విధంగా జగన్ కు ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్లు కన్ ఫర్మ్ అయ్యాయా అంటూ  అనుమానమే అంటున్నారు పరిశీలకులు. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా  మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టు జరిగింది. ఆయనను ఏపీ సీఐడీ స్కిల్ కేసులో అరెస్టు చేసింది. ఆ అరెస్టు అక్రమమంటూ రాజకీయాలకు అతీతంగా దేశ వ్యాప్తంగానే కాదు, విదేశాలలో సైతం ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సరే అరెస్టు తరువాత ఆయన క్వాష్ పిటిషన్ ను తొలుత ఏసీబీ కోర్టు, తరువాత హైకోర్టు కొట్టివేశాయి. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ పై సోమవారం వాదనలు జరిగే అవకాశం ఉంది. మరో వైపు మరిన్ని కేసులలో ఆయనను విచారించాలంటూ కోర్టులో పీటీ వారంట్లు దాఖలు చేసింది.అదలా ఉండగా..  జగన్ విదేశీ పర్యటన నుంచి ఇలా వచ్చీ రాగానే హస్తిన  పర్యటనకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లూ చేసేసుకున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్లు తీసుకున్నారనీ, చంద్రబాబు అరెస్టు, స్కిల్ కేసులో ఆయన పాత్ర తదితర అంశాలపై వారికి వివరిస్తారనీ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఏమయ్యిందో కానీ ఆయన హస్తినకు వెళ్లలేదు. అసలా ఊసే ఎత్తలేదు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుపై కేంద్రం పెద్దలు స్పందించనూ లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక  కేంద్రం పెద్దల హస్తం ఉందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. అయితే ఆ విషయంపై తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి విమర్శలూ, వ్యాఖ్యలూ రాలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం బాహాటంగా.. చంద్రబాబు అవినీతి రుజువైంది కనుకనే బీజేపీ పెద్దలు (మోడీ, షా)లు చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించారు. అన్నిటికీ  మించి మరిన్ని అరెస్టులు అంటూ పేర్లు  చెబుతూ హడావుడి చేశారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ  సీఐడీ చీఫ్ నారా లోకేష్ ను సైతం అరెస్టు చేస్తామంటూ మీడియా సమావేశంలోనే ప్రకటించారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రకంపనలు హస్తిననూ కుదిపివేయడంతో కేంద్రం పెద్దలు జగన్ తీరుపై ఒకింత గుర్రుగా ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే జగన్ హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముందుగా శుక్రవారం (అక్టోబర్ 6)హస్తినకు బయలుదేరుతారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఒక రోజు ముందే హడావుడిగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. హస్తినలో ఆయన కార్యక్రమాల షెడ్యూల్ చూస్తే మోడీ, షాలతో భేటీ ఉన్నట్లు కనిపించడం లేదు. సీఎంవో ప్రకటించిన మేరకు జగన్ గురువారం (అక్టోబర్ 5) ఉదయం హస్తినకు బయలు దేరి వెడతారు. ఆ రోజుకు ఆయన ఎవరెవరిని కలుస్తారు, ఆయన కార్యక్రమాలేమిటి అన్నది ఆ ప్రకటనలో లేదు. గురువారం రాత్రి (అక్టోబర్ 5) ఆయన నంబర్ 1 జన్ ఫథ్ నివాసంలో బసచేస్తారని మాత్రమే ఉంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 6) ఉదయం ఆయన విజ్ణాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొని తిరిగి జన్ పథ్ నివాసానికి చేరుకుంటారు.  అంతకు మించి జగన్ హస్తిన పర్యటన గురించి సీఎంవో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఏమీ లేదు. ఒక వేళ నిజంగానే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీలు ఖరారై ఉంటే సీఎంవో కచ్చితంగా ఆ వివరాలను వెల్లడించి ఉండేది. కానీ అలా జరగక పోవడంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో అప్పాయింట్ మెంట్ క న్ ఫర్మ్ అన్నది వైసీపీ ప్రచారార్భాటంలో భాగంగానే భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ కు మోడీ, షా మద్దతు ఉందని చాటుకోవడానికి  వైసీపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగమే జగన్ హస్తిన పర్యటనలో వారితో భేటీ కన్ఫర్మ్ అన్న ప్రాచారం సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ లండన్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే హస్తిన వెళ్లి మోడీ, షాలతో భేటీ కావాలని భావించారు. అయితే ఎంత ప్రయత్నించినా వారి అప్పాయింట్ మెంట్లు దొరకలేదని హస్తిన వర్గాల సమాచారం. చివరాఖరకు ఎట్టకేలకు గురువారం (అక్టోబర్ 5) ఆయన హస్తిన వెళ్లినా హోంశాఖ సమీక్ష ఉండటంతో నే వెడుతున్నారు. హస్తినలో ఉండే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించే అవకాశాలున్నా.. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయన్న నమ్మకం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు వెనుక మోడీ, షాల ఆశీస్సులు, ప్రొత్సాహం ఉన్నాయన్న  అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నందున వాటికి మరింత బలం చేకూర్చేలా జగన్ కు మోడీ, షాలు అప్పాయింట్ మెంట్ ఇచ్చే అవకాశాలు దాదాపు శూన్యం అని అంటున్నారు.  

కేసీఆర్ చీటర్.. ఈటల ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చీటర్ గా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ కేసీఆర్ వెంట నడిచిన ఈటల తరువాత కేసీఆర్ తో విభేదించి..పార్టీ నుంచి బహిష్కృతుడైన సంగతి విదితమే. 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ ( అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ ఈటలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే 2018లో విజయం సాధించి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ తన తొలి కేబినెట్ లో ఈటలకు స్థానం కల్పించలేదు. అప్పటికే కేసీఆర్ విధానాలపై ఈటల తన అసంతృప్తి వ్యక్తం చేశారనీ, అందుకే దూరం పెట్టారనీ అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అనివార్యంగా మంత్రివర్గ విస్తరణలో ఈటలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నా.. ఆ తరువాత ఆరోపణల నెపంతో ఆయన మంత్రిపదవి నుంచీ, పార్టీ నుంచీ కూడా తొలగించారు.  అనంతరం ఈటల శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి సత్తా చాటారు. అదే సమయంలో బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. బండి సంజయ్ తో విభేదాలు వచ్చినా, ఒక దశలో కమలం గూటిలో ఈటల ఉక్కపోతకు గురౌతున్నారు, ఆయన ఏ క్షణంలోనైనా బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారన్న వార్తలు వచ్చినా పార్టీ హైకమాండ్ మాత్రం ఈటలకు మద్దతుగా నిలిచింది. చేరికల కమిటీని ఏర్పాటు చేసి మరీ ఈటలకు ఈ కమిటీ నేతృత్వ బాధ్యతలు అప్పగించింది.  ఆ తరువాత పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా ఒక విధంగా చెప్పాలంటే అత్యంత కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈటల బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల దాడిని తీవ్రం చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను, వాటిని విస్మరించిన తీరును గుర్తు చేస్తూ  విమర్శల దాడి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ ను దొంగ వాగ్దానాలతో జనాలను మోసం చేసిన ఛీటర్ గా అభివర్ణించారు. దళితుడిని సీఎం చేస్తానని చేసిన వాగ్దానం, దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ఇస్తానంటే చేసిన వాగ్దానాలను కేసీఆర్ విస్మరించారనీ, అలాగే దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి అంటూ వాగ్దానం చేసి ఆ తరువాత భూమి లేదంటూ దానినీ అటకెక్కించేశారనీ.. ఇలా పబ్బం గడుపుకోవడం కోసం వాగ్దానాలు చేయడం ఆ తరువాత వాటిని విస్మరించడం ద్వరా ప్రజలను మోసం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చీటర్ నంబర్ వన్ గా మారానని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు.  ప్రధాని మోడీపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించి మర్యాద తెలియని నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్ బాటలోనే ఆయన కేబినెట్ మంత్రులు కూడా వ్యవహరిస్తున్నారని ఈటల అన్నారు. మాట ఇవ్వడం, తరువాత మరచిపోవడం రివాజుగా మార్చుకున్న కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి మారుపేరులా మారితే.. అన్నమాటకు కట్టుబడి విశ్వసనీయతకు మరోపేరుగా మోడీ నిలిచారన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు తహతహలాడారన్న మోడీ మాటలను జనం విశ్వసిస్తున్నారనీ, తాను ఎన్డీయేలో చేరేందుకు సంసిద్ధుడైనందునే మోడీ చెప్పిన మాటను కేసీఆర్ ఇప్పటి వరకూ ఖండిం చలేదని ఈటల పేర్కొన్నారు.తెలంగాణ ఆవిర్భావం తరువాత కుటుంబ సమేతంగా అప్పటి కాంగ్రస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన కేసీఆర్ బీఆర్ఎస్( అప్పటికి టీఆర్ఎస్) ను కాంగ్రస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి తప్పిన విషయం నిజం కాదా అని నిలదీశారు.   

నందమూరి కుటుంబంలో జూనియర్ ఏకాకేనా?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో తెలుగుచలనచిత్ర పరిశ్రమ ప్రముఖుల మౌనంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై తెలుగుదేశం పార్టీలోనే కాకుండా, సామాన్య జనంలో కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత కేఎస్ రామారావు, నటుడు, దర్శకుడు రవిబాబు వంటివారితో పాటు, సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనటుడు, జగన్ అభిమాని విశాల్  కూడా స్పందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిర్ద్వంద్వంగా ఖండించారు. అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడేందుక ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్, ఆ తరువాత చంద్రబాబునాయుడు ఇచ్చిన ప్రోత్సాహమే కారణమనడంలో సందేహం లేదు. అటువంటిది చంద్రబాబునాయుడిని అక్రమంగా ఏపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు, నిర్మాతలూ ఎవరూ పెద్దగా స్పందించలేదు. నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్లుగా మౌనంగా మిగిలిపోయారు. కారణాలేమైనా చిత్ర పరిశ్రమ నుంచి  సరైన స్పందన లేకపోవడంపై మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మిగిలిన వారి విషయం వేరు జూనియర్ ఎన్టీఆర్ విషయం వేరు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖండిచకపోవడం, కనీస స్పందన కూడా కరువవ్వడం ఏ విధంగా చూసినా సమర్థనీయం కాదని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తీరుపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఐడోంట్ కేర్ అంటూ బదలివ్వడాన్ని సమర్ధిస్తున్నారు   రాజకీయ విభేదాలను విస్మరించి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సైతం అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారంటూ మీడియా సమావేశంలో ఘాటు విమర్శలు చేశారనీ, అటువంటిది జూనియర్ ఎన్టీఆర్ కనీసం మాట్లాడకపోవడం ఏ రకంగా చూసినా సమర్ధనీయం కాదనీ అంటున్నారు. అంతే కాకుండా గతంలో కూడా... అంటే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును జగన్ సర్కార్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద మార్చినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందన సముచితంగా లేదనీ, కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్లుగా ఆయన స్పందన ఉందనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   అయినా మాటకు ముందు ఒకసారి మాటకు తరువాత ఒక సారి తాత.. తాత అంటూ ఎన్టీరామారావును స్మరించుకుని భక్తి గౌరవాలను చాటుకునే జూనియర్ ఎన్టీఆర్.. ఆయన పెట్టిన పార్టీ ఇబ్బందులలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి అండగా నిలబడాల్సిన అవసరం లేదా అని నిలదీస్తున్నారు.   తన కట్టె కాలే దాకా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని గతంలో చెప్పిన జూనియర్.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అది ఆయన ఇష్టం.  ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనాలని కూడా ఎవరూ కోరడం లేదు.   అయితే నందమూరి  తారకరామారావు  పేరును చెరిపేసే ప్రయత్నాలు జరుగుతున్నా, పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలన్న కుట్రలు జరుగుతున్నా, నందమూరి కుటుంబ సభ్యులకు అవమానం జరిగినా.. నాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్న జూనియర్ తీరును మాత్రమే తప్పుపడుతున్నారు.  చలన చిత్ర పరిశ్రమను పాదాక్రాంతం చేసుకోవడం కోసం జగన్ సర్కార్ సినీ ఇండస్ట్రీని ఎంతగా ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా జూనియర్ ఒక అగ్ర హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కనీస స్పందనను, వ్యతిరేకతను వ్యక్తం చేయకపోవడాన్ని ఆయన అభిమానులు సైతం తప్పుపడుతున్నారు. అదే విధంగా అసెంబ్లీ సాక్షిగా అధికారిక పార్టీ నేతలు  తన మేనత్త భువనేశ్వరిని  అవమానిస్తే.. ‘అలా మాట్లాడటం తప్పు’ అంటూ ఏదో  మొక్కుబడిగా చిన్న వీడియో బైట్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్న సంగతిని గుర్తు చేస్తూ.. ఇప్పుడు తాత స్థాపించిన పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేస్తే కనీస స్పందన కూడా లేకుండా మౌనంగా ఉండటమేమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఆయన హీరోయిజం కేవలం  సినిమాలకే పరిమితమా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.     ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఏకతాటిపై నిలబడి ఖండిస్తున్నా.. ఆ కుటుంబ సభ్యుడిగా జూ.ఎన్టీఆర్‌ కనీస స్పందన లేకుండా మౌనంగా మిగిలిపోవడాన్ని ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య ‘ఐ డోంట్ కేర్’ అని అనడాన్ని సమర్ధిస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ మౌనాన్ని అధికార వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్నా   జూనియర్ ఎన్టీఆర్ కిమ్మనకుండా ఊరుకోవడాన్ని ఎత్తి చూపుతున్నారు. తరచూ వైసీపీ ఫ్లెక్సీలపై జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు వేస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయాలను జూనియర్ ఖండిచకపోవడాన్ని ఆయన అభిమానులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ సర్కార్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై తన వైఖరి ఏమిటో వెల్లడించాలని ఆయన అభిమానులే కాదు.. సామాన్య జనులు కూడా కోరుతున్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అనుకున్నా.. నందమూరి కుటుంబ సభ్యుడిగానైనా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించి, అందుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం ప్రకటించాలని కోరుతున్నారు.  

దాడి జరిగితే చూద్దాం.. ఫిర్యాదు ఎందుకు చేశారు.. పవన్ కు పోలీసుల నోటీసు

ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. భరోసా ఇవ్వాల్సిన పోలీసులు ఫిర్యాదు దారుడికే నోటీసులు ఇస్తున్నారు. భద్రత కల్పించాల్సిన వారు.. మీకు భద్రత ఎందుకు కల్పించాలో చెప్పండంటూ నిలదీస్తున్నారు. దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ స్పష్టమైన సంకేతాలు చూపి మరీ భద్రత కోరితే.. ఆ ఆధారాలు చాలవు.. ముందు దాడి జరగనివ్వండి తరువాత చూద్దాం అంటున్నారు. ఏపీలో పోలీసులు విపక్షాల విషయంలో వ్యవహరిస్తున్న తీరిది. పోనీ  దాడి జరిగిన తరువాతైనా బాధితులవైపు నిలబడతారా అంటే అదీ లేదు. బాధితులపైనే కేసులు. నిరసన తెలపడంలో దాడులు ఒక భాగమంటూ భాష్యాలు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా లేదు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా పెడనలో తనపై దాడి జరిగే అవకాశాలున్నాయనీ, ఇందుకు సంబంధించి తన వద్ద  విశ్వసనీయ సమాచారముందనీ భద్రత కల్పించాలనీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకోగానే  పోలీసులు చేయాల్సిన పని భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం, దాడులు జరిగే అవకాశాలున్నాయన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేయడం, దాడులు చేస్తారన్న అనుమానం ఉన్న వారిని అదుపులోనికి తీసుకోవడమో, నియంత్రించడమో చేయాలి. కానీ మన పోలీసులు మాత్రం భిన్నంగా ఆలోచించారు. అసలు  మీ మీద దాడి జరుగుతుందని భావించడానికి ఉన్న ఆధారాలేమిటో చూపండి అంటూ పవన్ కల్యాణ్ కు నోటీసులు ఇచ్చారు.  ఇంతకీ పవన్ కల్యాణ్ తన ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. అధికార పార్టీకి చెందిన వారే పెడనలో అసాంఘిక శక్తులతో తనపై దాడి చేయించేందుకు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. దాంతో ఠాట్ అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడడమేమిటని పోలీసులకు చిర్రెత్తుకొచ్చినట్లుంది. అందుకే రివర్స్ లో పవన్ కల్యాణ్ కు ఆధారాలు చూపడం అంటూ నోటీసులు ఇచ్చారు.  అధికార పార్టీ విపక్షాలపై, విపక్ష నేతలపై, కార్యకర్తలపై, వారి కార్యాలయాలపై దాడులు జరపడం కొత్తేమీ కాదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే జోగి రమేష్.. (ఆయన ఇప్పుడు మంత్రి) ఆధ్వర్యంలో జరిగిన దాడి, అంతకు ముందు, ఆ తరువాత  విపక్షాలపై జరిగిన దాడుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన ఫిర్యాదుకు వేరే ఆధారాలు చూపాల్సిన అవసరమే లేదు. పైపెచ్చు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి నేతృత్వం వహించి మంత్రిగా ప్రమోషన్ పొందిన జోగి రమేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పెడన. అటువంటి పెడనలో తనపై దాడి జరిగే అవకాశం ఉందన్న పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేస్తే.. ఆ అవకాశాలపై ఆధారాలివ్వండి అంటూ పోలీసులు పవన్ కల్యాణ్ కు ఎదురు నోటీసులు ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మందికి కాదంటూ జనసేనానికి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా హితవచనాలు చెప్పారు. ముందు దాడి జరగనివ్వండి.. ఆ తరువాత ఫిర్యాదు చేయండి అన్నదే ఆయన హిత వచనాల సారాంశమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏపీ  పోలీసులు అధికార పార్టీకి చెందిన వారి ఫిర్యాదులు తప్ప మరెవరి ఫిర్యాదులూ పట్టించుకోరనీ, అందుకే దాడులు చేసి.. దాడికి గురైన వారిపై వైసీపీ మూకలు ఇస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారనీ అంటున్నారు. అంతే తప్ప.. దాడి జరగకుండా తాము భద్రత కల్పిస్తామన్న భరోసా మాత్రం విపక్షాలకు ఇవ్వడానికి ఏపీ పోలీసులుర రెడీగా లేరు.  దాడి జరుగుతుందనడానికి ఆధారం చూపమంటూ తామిచ్చిన నోటీసుకు పవన్ కల్యాణ్ నుంచి సమాధానం రాలేదని పేర్కొంటూ.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పవన్  కల్యాణ్ కు మళ్లీ  నోటీసులు ఇచ్చారు. సరే చివరకు జరిగిందేమిటంటే.. పెడనలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను  వైసీపీ శ్రేణులు తొలగించారు. ఆ సందర్భంగా జనసేన, వైసీపీల మధ్య ఘర్షణ జరిగింది.   వైసీపీ కౌన్సిలర్‌ను పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. అంగళ్లు, భీమవరం, మాచర్ల ,నందిగామ, కుప్పం సహా పలు ప్రాంతాలలో పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ దాడులకు పాల్పడింది. దాడికి పాల్పడిన వారిని అదుపులోనికి తీసుకుని తరువాత వదిలేయడం, దాడికి గురైన వారిపై మాత్రం హత్యాయత్నం  సహా తీవ్రమైన కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం అన్నది ఏపీ పోలీసులకు రివాజుగా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనలో తారకరత్న భార్య

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై నందమూరి తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి స్పందించారు. నారా చంద్రబాబు నాయుడికి ఆయన కుటుంబానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చే వరకు తమ కుటుంబం పోరాడుతూనే ఉంటుందన్నారు. అలాగే నందమూరి తారకరత్న, అలేఖ్య రెడ్డిల కుమార్తె నిషిక సైతం తనదైన శైలిలో స్పందించారు. తన తాతగారు చంద్రబాబు నాయుడికి లక్షలాది మంది మద్దతు తెలుపుతున్నారని.. అలాగే తాను సైతం తన తాత గారికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తన తండ్రి తారక రత్న తుది శ్వాస విడిచే వరకు తెలుగుదేశంలోనే ఉన్నారని... తెలంగాణలో ఆయన పార్టీ ప్రచారం  నిర్వహించారని ఈ సందర్భంగా నిషిక గుర్తు చేసుకున్నారు.   చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని, ఆయనకు న్యాయం జరగాలంటూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఇటీవల ఆందోళన చేపట్టారు. ఇందులో నందమూరి, నారా ఫ్యామిలీతోపాటు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఆందోళనలో నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలేఖ్య రెడ్డి మాట్లాడుతూ.. తన భర్త నందమూరి తారకరత్న జీవించి ఉంటే.. ఆయన సైతం ఈ దీక్షలో పాల్గొనే వారని అన్నారు.      తారకరత్న కుటుంబాన్ని బాగా ప్రేమించే వారని... అలాగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ , పార్టీ ప్రచారం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారని.. టీడీపీకి ఆయన మద్దతు ఎల్లప్పుడు ఉండేదని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు. తాత ఎన్టీఆర్ గారితోపాటు చంద్రబాబు నాయుడు గారిలో కష్టపడి పని చేసే తత్వాన్ని తారకరత్న బాగా ఇష్టపడేవారని... ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు బాటను తన భర్త తారక రత్న అనుసరించారని.. ఇక తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చివరి నిమిషం వరకు ఆలోచిస్తునే ఉండే వారని.. అలాంటి తారకరత్న మధ్య లేకపోవడం బాధాకరమని ఆలేఖ్య రెడ్డి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.  అలేఖ్య రెడ్డిని నందమూరి తారకరత్న ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే అలేఖ్య రెడ్డి వైయస్ఆర్ సీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు.  2023, జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నందమూరి తారక రత్న తీవ్ర అనారోగ్యానికి గురై కుప్పకూలి పోయారు. దీంతో ఆయన్ని బెంగుళూరులోని నారాయణ హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ చికిత్స పొందుతూ.. తారకరత్న తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో అంటే.. తారక రత్న ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆయన మరణం.. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు విజయసాయిరెడ్డి.. అలేఖ్య కుటుంబానికి అన్ని తానై వ్యవహరించారు. ఆ క్రమంలో తారకరత్న సమీప బంధువులు నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్, నందమూరి బాలకృష్ణలతో విజయసాయిరెడ్డి అత్యంత దగ్గరగా మెలిగిన విషయం విదితమే.  అయితే ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లను టార్గెట్ చేస్తూ.. విజయసాయిరెడ్డి వ్యంగ్య బాణాలు సంధిస్తు ఉండేవారు. కానీ తారకరత్న మరణం తర్వాత.. చంద్రబాబు, లోకేశ్‌ని టార్గెట్ చేయడం దాదాపుగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్‌కు విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు ఓ చర్చ సైతం నాడు హల్ చల్ చేసింది.  ఆ తర్వాత మళ్లీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా నారా చంద్రబాబు, నారా లోకేశ్‌పై నిప్పులు చెరుగుతుండడం ప్రారంభించారు.  ఆ తర్వాత.. అంటే ఇటీవల గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందంటూ.. జగన్ ప్రభుత్వం ఆరోపిస్తూ.. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసింది.   ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ విదేశాల్లో సైతం చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రజలు ఆందోళనలు, ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగానే ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలో అలేఖ్య రెడ్డి, నిషికా పాల్గొన్నారు. అయితే విజయసాయిరెడ్డి సమీప బంధువు అలేఖ్య రెడ్డి.. సైతం చంద్రబాబుకు మద్దతుగా నిలవడంపై ఫ్యాన్ పార్టీలో అప్పుడే గుసగుసలు మొదలైయ్యాయి.

రో(త)జాకీయం!

రాజకీయాన్ని రాజకీయంగా.. రాజకీయంలా చూడాలి. అలా అయితే రాజకీయం.. రాజకీయం అవుతుంది. అంతేకానీ.. ఇంట్లో గుట్టుగా తమ కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటూ.. వాళ్లు బాగుంటే మనం బాగుంటామనుకొనే ఆడవాళ్లను సైతం బయటకు లాగేసి.. వాళ్లు ఇలాంటి వాళ్లు.. వీళ్లు అలాంటి వాళ్లంటూ.. ఇంటికే పరిమితమైన ఆడవారి మానసిక స్థైర్యంపై దెబ్బ కొట్టి మరీ దగుల్బాజీ రాజకీయం చేస్తూ.. ఓ విధమైన సైకో ఆనందం పొందడం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పాలక పక్షానికి అలవాటుగా మారి పోయింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి   రోజాపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఆయన్ని అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల కావడం.. అలాగే ఈ అంశంపై మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణపై విమర్శలు గుప్పిస్తూ.. రోదించారు.  ఈ నేపథ్యంలో గతంలో  రోజా.. బుల్లెతెరపై పలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ  సందర్భంగా  రోజా ఓ చర్చా కార్యక్రమంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌తో మాట్లాడిన అభ్యంతరక వ్యాఖ్యలు, పవన్ కల్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నావ్? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా? అంటూ చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పోడియం చుట్టూ  ప్రతిపక్ష పార్టీ సభ్యులంతా చేరుకున్న సమయంలో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా ఆర్కే రోజు వ్యవహరించిన తీరు.. దీంతో నాటి అసెంబ్లీ స్పీకర్ కొడెల శివ ప్రసాదరావు.. ఆమెపై సస్పెన్షన్ వేటు వేయడం.. అందుకు సంబంధించిన వీడియోలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు.. తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ సాక్షిగా రోజా తెలుగుదేశం మహిళా నాయకురాళ్లు వంగలపూడి అనిత, పీతల సుజాతలపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.  ఏమమ్మా రోజా.. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీ పార్టీలోని మంత్రులు ఎంత మంది ఎన్ని బండ బూతులు మాట్లాడినా.. మీ పార్టీలోని పెద్దలు కానీ.. అగ్రనేతలు కానీ.. పోనీ పార్టీ అధ్యక్షుడు కానీ.. ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు.. అని ఎన్నడైనా అన్నారా? రాజకీయాన్ని రాజకీయంలాగా చూడండి.. రాజకీయంగా ఎదుర్కొండి అంతేకానీ.. ఇంట్లోని మహిళలపై వ్యక్తిగత విమర్శలకు దిగ వద్దంటూ.. ఎవరైనా.. ఎప్పుడైనా చెప్పారా? అలా చెప్పి ఉంటే... ఈ రోజు నీవు ఇలా ప్రెస్‌మీట్ పెట్టి.. కన్నీళ్లు పెట్టుకోవలసిన పరిస్థితి ఉండేది కాదని  నెటిజన్లు పేర్కొంటున్నారు.  ఓ నెటిజన్ అయితే.. అడు చెప్పాడా?... వీడు చెప్పాడా? నీ అమ్మ మోగుడు చెప్పాడా? అంటూ ఓ మంత్రిగారు.. ఏకంగా మీడియా ముందే తొడ కొట్టి మీసం మెలేసి,.. అరిచి పెడబొబ్బలు పెట్టి మరో మంత్రి, ఇక మరో ఆమాత్యుడైతే అయితే.. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి ఆర్చుకు తీర్చుకొని ఛలోక్తులు విసురుతున్నట్లు కలరింగ్ ఇవ్వడం గుర్తులేవా అని నిలదీశాడు.  జగన్ మలి కేబినెట్‌లో చోటు దక్కించుకొన్న నోరున్న మంత్రుల్లో ఒకరు అదీ అసెంబ్లీలోనో.. బహిరంగ సభలో తెలియక.. మైకు కనబడగానే మైకాసురుడిలాగా మారిపోయి.. మాస్ హిస్టిరియాతో ఊగిపోవడం.. అలాగే ఇంకో మంత్రివర్యుడు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందంటే.. ఆ ఒక్కటి అడక్కు అంటూనే.. సంక్రాంతి పండగకు జనంలో కలిసి స్టెప్పులేస్తూ.. ఊగిపోవడమే కాకుండా.. ఆనంద తాండవం అంటే ఇలా ఉంటుందంటూ.. తాను నడిరోడ్డుపై వేసిన చిందులకు కొత్త పేరు పెట్టి మరీ ప్రాచుర్యం పొందడం.. ఇలా జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రుల గురించి చెప్పుకొంటూ పోతే.. ఓ పెద్ద పురాణమే అవుతుందని.. అందులో ఏ మాత్రం సందేహలే లేదని పేర్కొంటున్నారు.  ఇక   రోజా.. తనపై టీడీపీ నేత విమర్శలకు కన్నీటి పర్యంతం కావడంతో ఇంకో నెటిజన్ అయితే తనదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత   రోజా.. అసెంబ్లీకి ఎన్ని సార్లు హాజరయ్యారో ఏమో కానీ.. అలాగే ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఎన్ని సార్లు  పర్యటించారో తెలియదు కానీ... మంత్రిగా తిరుమలలో శ్రీవారిని మాత్రం  రికార్డు స్థాయిలో దర్శించుకొన్నారని..  కామెంట్ చేశాడు.  మరో నెటిజన్ అయితే.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ నుంచి ఫ్యాన్ పార్టీలోకి జంప్ చేసిన తర్వాత.. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైనే కాకుండా ఆయన ఫ్యామిలీపైన చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలను.. ఓ మహిళగా  రోజా ఆ రోజే ఖండించి ఉంటే.. నేడు  ఇలా మీడియా ముందు కన్నీటి రోజాయణం వినించే పరిస్థితి వచ్చి ఉండేది కాదని పేర్కొన్నాడు.  అయినా... ఇంట్లో చిన్న పిల్లవాడు తప్పు మాట్లాడితే.. మూతి మీద ఒకటి కొట్టి.. ఇది తప్పు.. ఇలా మాట్లాడడం తప్పు అని పెద్దవారు చెబితే... ఆ పిల్లవాడు మరోసారి అలా మాట్లాడడానికి జంకుతారని.. ఈ విషయం రోజాకూ తెలుసునని.. కానీ వైసీపీలో రోజా సహా పలువురు ప్రజా ప్రతినిధులు.. బూతుల పంచాంగమే మన పదవి యోగానికి ఆదృష్ట మంత్రమని అనుకొని పఠించారో ఏమో కానీ.. మీడియా ముందు అయినా.. వేదిక మీద అయినా.. ప్రజల ఎదుట అయినా.. మాస్ హిస్టిరియాతో ఊగిపోతూ మాట్లాడడం..  మినహా   మరో పని చేయడంలేదని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటి వరకూ దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో  వైసీపీ ప్రజా ప్రతినిధులు  మా బూతులే మా భవిష్యత్తుఅన్నట్లుగా కదం తొక్కుతున్నారని విమర్శిస్తున్నారు.   జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాని నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా.. అలాగే జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు  రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఎక్సెట్రా ఎక్సెట్రా లు, అలాగే  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశీ, చివరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం లాంటి ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యలు వింటుంటే.. జగన్ ప్రభుత్వం ఇంతగా అపకీర్తిని,అప్రతిష్టను మూట కట్టుకుందంటే.. ఆ పాపం ఎవరిదని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆ పాపంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ది సింహభాగమనీ, ఆ తరువాత పార్టీలోని మంత్రుల నుంచీ కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ ఆ పాపంలో భాగముందని చెబుతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ నామ స్మరణతో చెక్క భజన చేస్తుంటే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రం చేతులు అడ్డం పెట్టుకొని, భుజాలు ఎగరేసుకొంటూ మరి ముసి ముసి నవ్వులు చిందించడం చూస్తుంటే ఈ విషయం ప్రస్ఫుటంగా అర్థమవుతోందని నెటిజన్లు సోదాహరణగా పేర్కొంటున్నారు.

ఏపీలో వైసీపీ అనుబంధ సంస్థగా పోలీసు వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక చట్టం అమలులో ఉందా? ఆ రాష్ట్రంలో న్యాయం అన్న పదానికి మరో అర్ధం ఉందా? సామాన్య ప్రజల నుంచి పరిశీలకుల వరకూ అందరిలోనూ ఇదే సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో భారత రాజ్యాంగం అమలు అమలుకు నోచుకోవడం లేదన్న భావన రాష్ట్ర ప్రజలలో వ్యక్తం అవుతోంది. నిరసన తెలిపే హక్కును అధికారపార్టీ కాలరాసేసిందనీ,  పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుబంధ సంస్థగా పని చేస్తోందనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ విధానాలను వ్యతిరేకించినా, నిరసన గళం వినిపించినా జైళ్లు నోళ్లు తెరుస్తాయి. లాఠీలు వీర విహారం చేస్తాయి. విపక్ష నేతలపైనే కేసులు నమోదౌతాయి. అధికార పార్టీకి చెందిన వారు హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినా కేసు నమోదు చేయడానికి పోలీసులు ముందు వెనుకలాడుతారు. అనివార్యంగా అరెస్టు చేయాల్సి వచ్చినా అరెస్టుకు ముందు, తరువాత కూడా రాచమర్యాదలు చేస్తారు. బెయిలుకు అడ్డు చెప్పరు. దర్యాప్తు ముందుకు కదలదు. అదే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి విషయంలో చిన్న చిన్న ఘర్షణ కేసుల్లో కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారు. ఎప్పుడో రెండు నెలల కిందట జరిగిన ఘర్షణ సంఘటనపై ఇప్పుడు హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అవును మాచర్లలో అగస్టు 30న జరిగిన ఘర్షణ కేసులో ఇప్పుడు ఏకపక్షంగా ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంగళ్లు కేసులో నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అక్షింతలు వేసింది, ఆ కేసులో ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయడానికి నిరాకరించింది. సుప్రీం కోర్టు ఏపీ పోలీసులపై అక్షింతలు వేసిన రోజునే  మాచర్ల పోలీసులు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు బనాయించారు. ఎవరో ఫిర్యాదు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని అరెస్టు చేయడమే ధ్యేయమన్నట్లు అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా   వందల మంది పోలీసులతో తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేస్తారు. పద్ధితి ఉండదు. న్యాయస్థానాలకు సైతం తప్పుడు సమాచారం ఇవ్వడానికి వెనుకాడరు.    రాజకీయకుట్రల్లో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దన్నుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా, రాష్ట్ర పోలీసు శాఖ పరువు మంటగలుస్తున్నా ఖాతరీ లేదు. ఏలిన వారి సేవలో తరిస్తే చాలు అన్నట్లుగా ఏపీ పోలీస్ తీరు ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థతి అధ్వానంగా మారిపోయింది. దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు యథేచ్చగా జరుగుతున్నా నో పోలీస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలిపారంటూ అరవై మందిపై కేసులు పెట్టారు.   పోలీసు యాక్ట్ 30, సెక్షన్ 144 ఆంక్షలు రాష్ట్రంలో నిరవధికంగా అమలు అవుతున్నాయి. ఏపీలో ఎమెర్జెన్సీ పరిస్థితులు కొలువుతీరి ఉన్నాయి.  అధికార పార్టీ నేతల అండతో దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్న వారిపై నో కేస్..విపక్ష నేతలపై రాజకీయ వేధింపుల విషయంలో మాత్రం పోలీసులు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.    ఏపీ పోలీస్ వ్యవస్థ జగన్ పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. జగన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల దురాగతాలు, దారుణాలు జరిగిపోతున్నా అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అసలా విషయమే మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఎందుకు పని చేస్తోంది. ఎవరి తరఫున పని చేస్తోంది అన్న ప్రశ్నలు జనబాహుల్యంలో వినిపిస్తున్నాయి.   అధికార పార్టీ అరాచకాలకు, అన్యాయాలకు, అడ్డగోలు దాడులకు వత్తాసు పలకడానికీ, వారి తరఫున ప్రత్యర్థులపై కేసులు పెట్టడానికే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పరిమితమైందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష నేతలను అడ్డగోలుగా అరెస్టు చేయడానికీ, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై కేసులు బనాయించడానికీ తప్ప పోలీసులు సామాన్యుల రక్షణ కూడా తమ విధినిర్వహణలో భాగమని మరిచిపోయారా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.  అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసినా పోలీసులు ఆయనకు కొమ్ము కాయడానికే ప్రయత్నించడం, తన సోదరిని వేధిస్తున్నాడని నిలదీసిన బాలుడిని హత్య చేసి దహనం చేయడం వంటి సంఘటనలు జరిగిన సందర్భంలో పోలీసులు తీరు బాధితులకు స్వాంతన కలిగించేలా నిందితులను అరెస్టు చేయడం, చర్యలు తీసుకోవడానికి బదులుగా నిందితులకు వత్తాసుగా నిలిచిన సంఘటను నిత్యం జరుగుతున్నాయి.  మహిళలపైఅత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోయాయి. విపక్ష పార్టీ నేతలపై వైసీపీ మూకలు యథేచ్ఛగా దాడులకు పాల్పడినా పోలీసులు మాత్రం అధికార పార్టీకి దన్నుగా నిలిచి బాధితులపైనే కేసులు పెడుతున్న సంఘటనలు కొకొల్లలు. అంగళ్లులో విపక్ష నేతపై వైసీపీ వాళ్లు రాళ్ల దాడి చేస్తే.. కేసులు మాత్రం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై నమోదు చేశారు. ఏ సందర్భంలోనూ కూడా బాధితులకు అండగా పోలీసులు నిలిచిన సందర్భం కనిపించదు. గుంటూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగితే నో పోలీస్. అదే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది రోజుల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోతే.. నో పోలీస్. ఆ చిన్నారి అదృష్టం, తల్లిదండ్రుల అదృష్టం దాదాపు 24 గంటల తరువాత నరసరావు పేట ఉప్పల పాడు వద్ద చిన్నారి ట్రేస్ అయ్యింది. తల్లిదండ్రుల వద్ద కు చేరిందనుకోండి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డూ అదుపూ లేకుండా నేరాలు జరుగుతుంటే పోలీసులు మాత్రం అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. మొత్తంగా ఏపీ పోలీసుల ప్రతిష్ట గంగలో కలిసిపోయినా పోలీసు బాసులకు పట్టడం లేదు. వందల మంది పోలీసులను ప్రభుత్వ పెద్దల, వైసీపీ నేతల ఆదేశాలను అమలు చేయడానికి నియోగించి రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేశారు. జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడానికీ, ఆయన అరెస్టు అనంతరం వెల్లువెత్తిన శాంతియుత ర్యాలీలు, నిరసనలను అణచివేయడానికి మాత్రం వేల సంఖ్యలో పోలీసుల మోహరిస్తారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అరెస్టు చేయడానికి , ఆయన నివాసాన్ని చుట్టుమట్టడానికీ మాత్రం వందల సంఖ్యలో పోలీసులు రెడీగా ఉంటారు. అయితే బాధితుల పక్షాన నిలవడానికీ, వారికి న్యాయం చేయడానినీ, దాడులకు గురయ్యే వారిని రక్షించడానికీ మాత్రం నో  పోలీస్. ఇదీ ఏపీలో రాష్ట్ర పోలీసుల తీరు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బాబును కెలికి జ‌గ‌న్ త‌ప్పు చేశారా? 

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా?  ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వున్నారా?  అందుకే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? అయితే ముంద‌స్తుకు ప్ర‌ధాని గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా?  సోషల్ మీడియాలో బాగానే ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై చ‌ర్చ అయితే జ‌రుగుతోంది.  ప్ర‌స్తుత పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్తేనే.. టీడీపీని నిర్వీర్యం చేసి, తిరిగి అధికారంలోకి రావొచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గుట్టుచప్పుడు కాకుండా మంత్రులు, వైసీపీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారట. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఎంతగానో నమ్మే, ఆరాధించే స్వరూపానంద సరస్వతిని జగన్ కలిశారట‌... అసెంబ్లీ రద్దుకు మంచి ముహూర్తం గురించి చర్చించారని తాడేప‌ల్లిలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.    నిజానికి.. గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే, వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇంత వరకూ రాజధాని లేకుండా ఏపీని ఏకాకి చేయడం, ప్రాజెక్టులు లేకుండా దిక్కుమాలిన రాష్ట్రంగా మార్చడం, పథకాలు పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో.. జ‌గ‌న్ స‌ర్కార్‌పై రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి తమకు భవిష్యత్తే లేకుండా చేశాడని జగన్‌పై ఏపీ జ‌నం తీవ్రంగా మండిపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. దీనికి తోడు.. వాలంటీర్ వ్యవస్థలోని పాపాల గుట్ట కూడా బయటపడటంతో, జగన్ ప్రభుత్వం ఇరుకున పడింది. ఇక నవరత్నాలను ఎలా నిర్వీర్యం చేశారో అందరికీ తెలిసిందేగా! మద్యపానం నిషేధం పేరుతో ఇంకా మద్యం అమ్మకాలు పెంచి పేదలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మద్యం ద్వారా వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తనపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు జగన్ ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసుని తెరమీదకు తీసుకొచ్చి, చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఏపీ ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ టీడీపీపై అవినీతి బురదజల్లి, ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయితే.. అప్పుడు ముందస్తుకు వెళ్లడమే నయమని జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది. టీడీపీని నిర్వీర్యం చేస్తే.. తమకు అనుకూలంగా ఓట్లు పడతాయని, ఫలితంగా మరోసారి అధికారాన్ని చేపట్టవచ్చని జగన్ క‌ల‌లు కంటున్నార‌ని వాస్త‌వ ప‌రిస్థితులు భిన్నంగా వున్నాయ‌ని ప్రముఖ రాజ‌కీయ విశ్లేష‌కులు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగుఒన్ తో అన్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా జ‌గ‌న్‌కు ఘోర‌ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఆయ‌న విశ్లేషించారు. ఏపీలో మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయ‌ని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని ఆయ‌న విశ్లేషించారు.  వివేకా హత్య కేసును పక్కదారి పట్టించి చంద్రబాబు అరెస్టుపైనే రాజకీయం నడిపిస్తున్నారని.. కానీ ఏపీ ప్రజలు వివేకా హత్య కేసును మరిచిపోలేదని ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత సాహసం జగన్ చేయలేరని.. ఒకవేళ వెళ్లినా ఆయనకు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. త‌న అధికారాన్ని అడ్డు పెట్టుకొని టీడీపీ నేత‌ల్ని భ‌య‌పెట్టేలా అరెస్ట్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అందులో భాగంగానే బండారును అరెస్టు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసిన‌ట్లైతే టీడీపీ లో హ‌ల్‌చ‌ల్ చేసిన మంత్రులు ముగ్గురున్నారు.  వారిలో ఒకరు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే,మరొకరు గంటా శ్రీనివాసరావు. వీరి మధ్యలో అంటే 1998 ప్రాంతంలో ఒక్కసారి మంత్రి చేశారు బండారు సత్యనారాయణమూర్తి. ఇలా ఈ ముగ్గురూ త్రిమూర్తులుగా ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ పాలిటిక్స్ ని నడిపిస్తున్నారు. ఇందులో మొదట అరెస్ట్ చేసింది అయ్యన్నపాత్రుడిని. ఆయన మీద దాదాపుగా పదిహేను కేసులు వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అయ్యన్న అరెస్ట్ ని పోలీసులు చూపించినా స్టేషన్ బెయిల్ తో ఆయన బయటకు వచ్చారు.  గడచిన నాలుగున్నరేళ్ళుగా అనేక సందర్భాలలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం పైన‌,  జగన్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాంతో ఆ విధంగా ఆయన మీద పెట్టిన కేసులే ఎక్కువగా ఉన్నాయి.  ఇక ఆయన తరువాత బండారు సత్యనారాయణమూర్తి వంతు వచ్చింది. బండారు మీడియా మీటింగ్స్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా డోస్ ఎపుడూ ఒక స్థాయిలోనే ఉండేది. అలాంటి బండారు ఇటీవల సడెన్ గా మహిళా మంత్రి రోజా మీద  రెచ్చిపోయారు.  దాంతో ఆయన మీద రెండు కేసులు పెట్టి  అరెస్ట్ చేశారు. బెయిల్ మంజూర‌వ్వ‌డంతో ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చారు.  ఇపుడు బండారు తరువాత ఎవరు అరెస్ట్ అవుతారు అన్నది విశాఖ జిల్లాలో చర్చ జ‌రుగుతోంది. త్రిమూర్తులలో ఇద్దరు అయిపోయారు కాబట్టి మూడవ షాట్ మాజీ మంత్రి గంటా కే అని అంటున్నారు. గంటా ఇటీవల కాలంలో ప్రభుత్వం మీద గట్టిగా నోరు చేసుకుంటున్నారు.   ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకొనే  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌దైన స్టైల్‌లో టీడీపీని టార్గెట్ చేస్తున్నార‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. రాజ‌కీయాల్లో భాగంగా ముఖ్య‌మంత్రి దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని  ఆంధ్ర‌ప్ర‌జ‌లు జాగ్ర‌త‌గా గ‌మ‌నిస్తున్నారు.  అధికార పార్టీ చేసే కుట్రలు..... టీడీపీ నేతలకు, ప్రజలకు, కార్యకర్తలకు అర్థమైపోయింది.  చంద్రబాబును జైలుకు పంపి.. టీడీపీని ఏదో చేద్దామనుకుంటున్నారన్న స్పష్టత అందరికీ ఉంది. అన్ని రకాల వ్యవస్థల్నీ మేనేజ్ చేస్తున్నారని అర్థమవుతోంది.  ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఏమాత్రం భ‌య‌ప‌డ‌డం లేదు. భరించాల్సిన నష్టాలను.. కష్టాలను ఇప్పటికే భరించామని, ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదని టీడీపీ క్యాడర్ తెగించి పోరాడుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగు వాళ్లు ఉన్న ప్రతీ దేశంలోనూ నిర‌సనలు జరుగుతూనే వున్నాయి.  అందరూ ఎవరికి వారు మాట్లాడుకుని నిరసనలు చేశారు. ఏపీలో తీవ్రమైన కట్టడి మధ్య ప్రజలు బయటకు వస్తున్నారు. టీడీపీని ముక్క‌లు చేయ‌డానికి  కుట్ర జరుగుతోందని, కాపాడుకోవాలన్న సంకల్పం టీడీపీ క్యాడ‌ర్‌లో స్ప‌ష్టంగా కనిపిస్తోంది. చంద్ర‌బాబుపై నమ్మకం ఎక్క‌డా సడలిపోవడం లేదు. ఎదురొడ్డి నిలబడుతున్నారు. ఒక్క నేత కూడా వెనక్కితగ్గలేదు. దీనికి తోడు స‌ర్వే రిపోర్ట్స్‌  కూడా టీడీపీకి అనుకూలంగా రావ‌డంతో  ఇతర పార్టీల నేతలు టీడీపీలోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీలోని మరికొంత మంది నేతలు కూడా టీడీపీలో చేర‌డానికి ఆస‌క్తి చూపుతున్నార‌ట‌. వైసీపీ నుంచి టికెట్ మ‌ళ్ళీ రాద‌నుకున్న నేత‌లంతా టీడీపీతో ట‌చ్‌లోనే వున్నార‌ట‌.  చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీని ఏదో చేద్దామనుకున్నారు కానీ… గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే  టీడీపీ మరింత బలం పెంచుకుంది. ఇక్క‌డ ఓ విష‌యం మ‌నం గుర్తు చేసుకుంటే, అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ప్ర‌స్తుత సి.ఎం. జగన్ మోహ‌న్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు అప్ప‌ట్లో ఒక్కరు కూడా రోడ్లపైకి రాలేదు. కుటుంబసభ్యులు మాత్రమే రోడ్డుపై ధర్నా చేశారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఊళ్ల కు ఊళ్లు కదులుతున్నాయి. టీడీపీ గ్రాఫ్ కూడా బాగా పెరిగింద‌ని ఇంట‌లిజెన్స్ స‌ర్వేల్లో కూడా వ‌చ్చింద‌ట‌.  ఆ విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే త‌న‌కు అనుకూలంగా ముఖ్య‌మంత్రి స‌ర్వే చేయించుకున్నార‌నే తాడేప‌ల్లిలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  చంద్ర‌బాబు అరెస్టు త‌రువాత జ‌రుగుతున్న ప‌రిణామాల్ని క‌నుక గ‌మ‌నిస్తే,  టీడీపీ, జనసేన మధ్య పూర్తి స్థాయిలో ఫెవికాల్ బంధం ఏర్పడింది.  టీడీపీ, జనసేన క్యాడర్ కలిసిపోయాయి.  రాష్ట్రమంతా కలిసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడా రెండో అభిప్రాయానికి చోటు లేకుండా … జ‌గ‌న్ ప్రభుత్వంపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పవన్ వారాహి యాత్రలో టీడీపీ క్యాడ‌ర్ సందడి చేస్తుంది.   పవన్ కూడా టీడీపీ, జనసేన మధ్య బంధం ఎంత బలంగా ఉందో తేల్చి చెప్పేశారు. చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన వైసీపీ కనీస ప్రయోజనం లభించలేదు. బలంపై స్పష్టమైన అవగాహనతో ఉన్న జనసేనానికి ఏపీ రాజకీయాలపై ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు.  పవన్ రాజకీయంగా రాటుదేలారని జ‌నం కూడా చెప్పుకుంటున్నారు.  మ‌రో వైపు టీడీపీ, జనసేన మధ్య బంధం.. లీడర్లు, క్యాడర్‌ స్థాయిలో  బాగానే కలిసిపోయింది.  జనసేనకు క్యాడర్ ఉంది. ఓట్లు వేసే ఫ్యాన్స్ ఉన్నారు . కానీ బలమైన నేతలు పరిమితంగానే ఉన్నారు. టీడీపీకి లీడర్, క్యాడర్ ఉన్నారు. ప్రణాళికాబద్దంగా వీరు పని చేసుకుంటే.. మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయి. పొత్తులు ఇప్పుడున్న రీతిలో కొనసాగిస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని ఇటీవ‌ల వ‌చ్చిన తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

మోడీ.. జగన్ నూ టార్గెట్ చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం ప్రత్యేక మైనది. ఏపీ ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ రెడ్డి అరాచకాలకు, అడ్డగోలు అప్పులకు కేంద్రం పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారన్న భావన ఏపీలో గట్టిగా వ్యక్తం అవుతోంది. తెలుగు రాష్ట్రాలలో జగన్ సర్కార్ విషయంలో ఒకలా, తెలంగాణ సర్కార్ విషయంలో ఒకలా కేంద్రం వ్యవహరిస్తోందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, పరిమితిని మించి ఏపీకి అప్పులు మంజూరు అవుతుండగా, అవే నిబంధనల సాకుతో  తెలంగాణకు మాత్రం అప్పులు దక్కకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ అడుగడుగునా అడ్డుపడుతున్నది.  వాస్తవానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండూ కూడా మోడీ అడుగులకు మడుగులొత్తుతూనే మనుగడ సాగించాయి. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిందో  అప్పటి నుంచీ కేంద్రంతో బీఆర్ఎస్ బంధం ఉప్పూ నిప్పులా మారింది. అలా మారడానికి కారణమేమిటో ప్రధాని మోడీ నిజామాబాద్ బహిరంగ సభ సాక్షిగా మంగళవారం ( సెప్టెంబర్ 3) వెల్లడించారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ప్రధాని మోడీ కేసీఆర్ హస్తినలో తనతో భేటీ అయిన సందర్భంగా ఏం మాట్లాడారు, ఏం కోరారు అన్నది బయటపెట్టి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కాళ్ల కింద నేల భూకంపం వచ్చినట్లుగా కదిలిపోయేలా చేశారు. ఇంతకీ మోడీ ఏం చెప్పారంటే నాలుగేళ్ల కిందట.. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు బీజేపీ చేతిలో చావుతప్పి కన్ను లొట్టపోయినంత పనైంతరువాత కేసీఆర్ హస్తిన వెళ్లి మోడీతో భేటీ అయ్యారు. ఆ భేటీలో బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్)  ను ఎన్డీయేలో చేర్చాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కేటీఆర్ కు పట్టం కట్టాలని భావిస్తున్నాననీ, అందుకు ఆశీర్వాదం కావాలని మోడీని అడిగారు. అలా అని మోడీ నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పారు. అంతే కాదు.. తాను ఎన్డీయేలో బీఆర్ఎస్ ను చేర్చుకోవడానికి నిరాకరించాననీ వెళ్లడించారు. అంతే కాదు.. ఇదేమీ రాజరికం కాదనీ, ప్రజల ఆశీస్సులుంటేనే పదవులు దక్కుతాయనీ, కేటీఆర్ ప్రజామద్దతుతో ముఖ్యమంత్రి అయితే ఆశీర్వదిస్తాననీ అన్నానని కూడా సెలవిచ్చారు. ఆ తరువాత నుంచే కేసీఆర్ కేంద్రం, మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం ప్రారంభించారనీ, నాలుగో ఫ్రంట్, మూడో ప్రత్యామ్నాయం అంటూ.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ బయలు దేరారని మోడీ మాటలతో తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలు అంటూ విమర్శలు గుప్పించిన కేసీఆర్ ఆ తరువాత తన కుమార్తె కవిత మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొనడంతో సైలంటయ్యారనీ, తన కుమార్తెను మద్యం కుంభకోణం నుంచి బయటపడేయమంటూ అమిత్ షా వద్దకు తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పని చేసిన నరసింహన్ ను రాయబారం పంపారనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. సరైన సమయంలో కీలెరిగి వాతపెట్టిన చందంగా కేసీఆర్ రాజకీయాలన్నీ స్వార్ధం కోసమేనని మోదీ కుండబద్దలు కొట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మోడీ కూడా ఎన్నికల సమయంలోనే ఆరోపణలు చేస్తారనీ, లేకుంటే నాలుగేళ్లుగా గోప్యంగా ఉంచిన విషయాన్ని ఎన్నికల సమయంలోనే ఎందుకు వెల్లడించారనీ ప్రశ్నిస్తున్నారు.  ఇదే విధంగా  ఎన్నికల ముంగిట ఏపీలో జగన్ సర్కార్ బండారాన్ని కూడా మోడీ బయటపెట్టగలరా అని ప్రశ్నిస్తున్నారు.  ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ లభించని విధంగా కోరినప్పుడల్లా ప్రధాని అప్పాయింట్ మెంట్ లభిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే.. సిఎం జగన్ సగటున నెలకొకసారి అయినా మోడీ, షాలతో హస్తినలో భేటీ అవుతుంటారు. ఆ భేటీలలో చర్చకు వచ్చే  అంశాలేమిటన్నది బ్రహ్మ రహస్యం అన్నట్లుగా ఉంటుంది. అధికారిక పర్యటనపై హస్తిన వెళ్లిన సీఎం మొక్కుబడి ప్రెస్ నోట్ విడుదల చేయడం తప్ప.. హస్తినలో కానీ, ఏపీలో కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన దాఖలాలు లేవు.  పైగా కేంద్రం పెద్దలతో జగన్  భేటీలన్నీ ఆయనపై అక్రమాస్తుల కేసు విచారణకు వచ్చినప్పుడు,  సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచినప్పుడు ఉంటాయి. జగన్ హస్తిన వెళ్లి వచ్చిన తరువాత  సీబీఐ దూకుడు ఉండదు, అక్రమాస్తుల కేసుల విచారణ మందగిస్తుంది.   ఇప్పుడు పరిశీలకులు ఆ విషయాలనే సోదహరణగా ప్రస్తావిస్తూ.. జగన్ కు ఈ స్థాయిలో ప్రయోజనం కలిగిస్తున్న మోడీ తనతో భేటీ సందర్భంగా జగన్  ఏం మాట్లాడారు, ఏం కోరారు అన్నది వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇప్పుడు స్కిల్  కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ తన ప్రతిష్టనే కాకుండా తనకు అండదండగా ఉంటూ వస్తున్న మోడీ ప్రతిష్టను కూడా మంటగలిపేశారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికీ ఏపీలో నడుస్తున్న స్కిల్ సెంటర్ల పేరును మార్చేసి అవి కేంద్రం స్పాన్సర్ షిప్ తో నడుస్తున్న కేంద్రాలుగా చూపే ప్రయత్నం చేసి మోడీని కూడా ఇరికించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ తనపై నింద పడకుండా ఉండేదుకైనా సరే జగన్ బండారాన్ని బయటపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే జగన్ ది కక్ష సాధింపు రాజకీయం అయితే మోడీది ఎన్నికల రాజకీయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టడానికి గల కారణాన్ని ఎలాగైతే ఎన్నికల వేళ వెల్లడించారో.. అలాగే జగన్ బండారాన్ని కూడా ఏపీలో ఎన్నికల సమయం మరింత దగ్గరపడిన సమయంలో మోదీ బట్టబయలు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీఎస్పీ... 20 మందితో తొలి జాబితా 

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పలు కసరత్తుల అనంతరం మిగతా స్థానాలకు కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం తెలిసిందే.  బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా... 1. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్- సిర్పూర్,2. మేడి ప్రియదర్శిని- నకిరేకల్,3. పిలుట్ల శ్రీనివాస్- కోదాడ,4.జంగం గోపి- జహీరాబాద్,5 బానోత్ రాంబాబు నాయక్- వైరా,6.ఎన్.రాంచందర్-మానకొండూరు, 7. దాసరి ఉషా- పెద్దపల్లి, 8. నాగమోని చెన్  రాములుముదిరాజ్- వనపర్తి, 9. ప్రద్యుమ్నకుమార్ మహదేవ్ రావు ఏకాంబర్- జుక్కల్,10. ముప్పారపు ప్రకాశం- ఆందోల్,11.చంద్రశేఖర్ ముదిరాజ్- తాండూర్, 12. ఎర్రా కామేశ్- కొత్తగూడెం, 13.నక్కావిజయ్ కుమార్- ధర్మపురి,14. కొత్తపల్లి కుమార్- నాగర్ కర్నూలు,15. వట్టె జానయ్య యాదవ్- సూర్యాపేట,16.డాక్టర్ ముదావత్ వెంకటేశ్ చౌహాన్- దేవరకొండ,17. గడ్డం క్రాంతి కుమార్- వికారాబాద్18. బన్సీలాల్ రాథోడ్- ఖానాపూర్,19. కొంకటి శేఖర్- చొప్పదండి,20.అల్లికవెంకటేశ్వరరావు యాదవ్- పాలేరు

కేసీఆర్ రాజకీయం కుటుంబం కోసమే.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా?

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆయన తహతహలాడారనీ, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నాననీ ఆశీర్వదించాలనీ తనను కోరారనీ మోడీ బహిరంగ సభలో వెల్లడించారు. తెలంగాణ  ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం లోగా ఎప్పుడు అయినా వెలువడే అవకాశం ఉందన్న సమాచరం నేపథ్యంలో  ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నిజామాబాద్ నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో  చేసిన ప్రసంగంతో ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారనే చెప్పాలి.  నెలల ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసేసి ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్ధమైపోయినట్లు కనిపించిన బీఆర్ఎస్ ఆ తరువాత కారణాలేమైతేనేం ఎన్నికల సన్నాహకాలలో బాగా వెనుకబడిపోయింది. చంద్రబాబు అరెస్టు, కాంగ్రెస్ దూకుడు, అభ్యర్థుల జాబితా ప్రకటనతో పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తి ఇలా బీఆర్ఎస్ వెనుకబాటుకు చాలా చాలా కారణాలున్నాయి.  ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకున్నట్లే కనిపించి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తరువాత ఒక్కసారిగా చతికిల బడినట్లు కనిపించింది. దీంతో తెలంగాణలో పార్టీలో జోష్ నింపేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది. అందులో భాగంగానే మూడు రోజుల వ్యవధిలో మోడీ తెలంగాణలో రెండు బహిరంగ సభలలో  ప్రసంగించి పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు ప్రయత్నించారు. అయితే కమలం పార్టీలో  అసమ్మగి భగభగలు చల్లారకపోవడం.. ప్రధాని మోడీ సభకు సైతం పలువురు సీనియర్లు డుమ్మా కొట్టడంతో రెండో సభలో ప్రధాని మోడీ తన ప్రసంగ వ్యూహం మార్చారు. అధికార పార్టీని బినీత్ ది బెల్ట్ కోట్టే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆయన కుమారుడిని సీఎం చేయడం కోసం కేసీఆర్ అన్ని ప్రమాణాలనూ పక్కన పెట్టేయడానికి సిద్ధ పడ్డారనీ, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా చేరేందుకు కూడా వెంపర్లాడారనీ వెల్లడించారు. సహజంగానే మోడీ ప్రసంగం తరువాత బీఆర్ఎస్ లో తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. కేటీఆర్ మోడీ చెప్పినవి అబద్ధాలంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని జుమ్లా పార్టీగా అభివర్ణించారు.  అయితే ప్రధాని మోడీ మాత్రం పక్కా వ్యూహంతోనే నాలుగేళ్ల కిందట కేసీఆర్ తనతో చర్చించిన వివరాలను సరిగ్గా ఎన్నికల వేళ వెల్లడించి బీఆర్ఎస్ గుక్కతిప్పుకోలేకుండా చేశారు.  కేసీఆర్ హస్తిన వెళ్లిన ప్రతి సారి ప్రధాని మోడీని కలిసి తెలంగాణ అభివృద్ధి, ప్రగతి, పురోగతి వినా మరో విషయమే మాట్లాడేవారు కాదంటూ ఇంత కాలం గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్.. మోడీతో కేసీఆర్ విభేదించడానికి కారణం కూడా తెలంగాణకు ఆయన ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నందునే అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు మోడీ కేసీఆర్ రాష్ట్ర ప్రగతి గురించి కాకుండా, తన కుమారుడి ప్రమోషన్ కోసమే హస్తినలో కేంద్ర పెద్దలతో భేటీ అయ్యేవారిని మోడీ స్వయంగా చెప్పడం వారిని కంగుతినిపించింది.  వాస్తవానికి కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించిన క్షణం నుంచీ ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతూ వస్తున్నాయి. కేటీఆర్ కు పదోన్నతికి అడ్డుపడే అవకాశం ఉందన్న భావనతోనే  2018 ఎన్నికలలో విజయం తరువాత కేసీఆర్ తొలి కేబినెట్ లో హరీష్ రావు, ఈటల వంటి వారికి చోటుదక్కలేదు. ఆ తరువాత మారిన పరిస్థితుల కారణంగా వారిరువురికీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పించినప్పటికీ.. వారి ప్రాధాన్యతను గణనీయంగా తగ్గించారు. ఇక ధిక్కార స్వరం వినిపించిన ఈటలను పార్టీ నుంచే సాగనంపారు. ఇప్పుడు తన కుమారుడిని సీఎం చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కావాలంటూ కేసీఆర్ తనను కోరారని మోడీయే స్వయంగా చెప్పడంతో.. కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డారు. మోడీ చెప్పినవన్నీ అబద్ధాలని కేటీఆర్ ప్రకటించినంత మాత్రాన సరిపోదు. మోడీ మాటలు వాస్తవం కాదని కేసీఆర్ స్వయంగా చెప్పాలి. వివరణ ఇవ్వాలి. అయితే ఇంత వరకూ అయితే కేసీఆర్ నుంచి ఎటువంటి ఖండనా, కనీసం స్పందనా రాలేదు.  దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు అవుతారా? అవ్వరా అన్నఉత్కంఠ మొదలైంది. మద్యం కుంభకోణం నుంచి కవితను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్, మోడీపై విమర్శల దాడిని పూర్తిగా తగ్గించేశారన్న అనుమానాలు ఇప్పటికే తెలంగాణ సమాజంలో బలంగా ఉన్నాయి. ఇప్పుడు మోడీ కేసీఆర్ నాలుగేళ్ల కిందటే తనకు దాసోహం అన్నారనీ, తానే ఆయన ఎన్డీయేలో చేరుతానన్న ప్రతిపాదనను తిరస్కరించాననీ చెప్పడంతో కేసీఆర్ జాతీయ ఆకాంక్షలపైనే తెలంగాణ ప్రజలలో  అనుమానాలు మొదలయ్యాయి. కేసీఆర్ మౌనం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది.   ముఖ్యంగా కేటీఆర్ ను  ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నానంటూ కేసీఆర్ తనతో స్వయంగా చెప్పి కుమారుడిని ఆశీర్వదించాలని కోరిట్లు మోడీ వెల్లడించడంతో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆర్ మాత్రమేనని ప్రజల్లో, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే  ఉన్న ప్రరాన్ని మోడీ వ్యాఖ్యలు ధృవీకరించాయి. అయితే అందు కోసం ఎన్‌డీఏ కూటమిలో చేరడానికి కూడా కేసీఆర్ సిద్ధమయ్యారన్న మోడీ మాటలు బీఆర్ఎస్ కు గట్టి షాక్ గానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

భారత్ యాక్షన్ ప్లాన్ తో దారికొస్తున్న కెనడా

ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ బహిరంగ వివాదానికి ఆజ్యం పోసిన కెనడా .. తదనంతర పరిణామాల్లో భారత్ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ లో పనిచేస్తున్న 41 మంది దౌత్య సిబ్బందిని అక్టోబర్ 10లోపు ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరడం తెలిసిందే. ఈ చర్యలను ఊహించని కెనడా, ఇప్పుడు ప్రైవేటు చర్చలను కోరుకుంటున్నట్టు ప్రకటించింది. నిజానికి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ తో ప్రైవేటుగానే చర్చించాల్సిన కెనడా, దీన్ని బహిర్గతం చేసి వివాదానికి కారణమైనట్టు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.  ద్వైపాక్షిక వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ తో ప్రైవేటుగా చర్చలను కెనడా కోరుకుంటున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య రాయబార చానళ్లు తెరుచుకునే ఉన్నాయని, రెండు వైపులా సంప్రదింపులు కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కెనడాకు ఢిల్లీలో ఎంబసీ, చండీగఢ్, బెంగళూరు, ముంబై లో కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 62 మంది వరకు పనిచేస్తున్నారు. వీరి నుంచి 41 మందిని ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది. భారత్ తో వివాదాన్ని కోరుకోవడం లేదని, కలసి బాధ్యతగా పనిచేయాలని అనుకుంటున్నట్టు కెనడా ప్రధాని ట్రూడో సైతం ప్రకటించారు.

అక్బరుద్దీన్ కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ?

మహిళా బిల్లుకు లోకసభలో మద్దత్తు ఇవ్వని మజ్లిస్ పార్టీ పట్ల  ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పార్టీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మజ్లిస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.  పురుషాధిక్య పార్టీగా ముద్రపడిన ఎంఐఎంలోకి త్వరలో ఓ మహిళా నేత ఎంట్రీ ఇవ్వనున్నారట.. ప్రజాసేవలో భాగమయ్యేందుకు లండన్ నుంచి వచ్చేస్తున్నారట. ఆ మహిళ మరెవరో కాదు పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు ఫాతిమా ఓవైసీ.. ప్రస్తుతం బారిష్టర్ చదువు కోసం లండన్ లో ఉన్న ఫాతిమా త్వరలోనే హైదరాబాద్ తిరిగి వస్తుందని అక్బరుద్దీన్ చెప్పారు. వచ్చాక ప్రజాసేవలో పార్టీ తరఫున పాల్గొంటుందని వివరించారు. ఈమేరకు సోమవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి అక్బరుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లండన్ నుంచి తన కూతురు ఫాతిమా తిరిగి వచ్చి ప్రజాసేవలో పాల్గొంటుందని తెలిపారు. పార్టీపై పడిన పురుషాధిక్య ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఎంఐఎం పార్టీ మహిళా నాయకురాలిని రంగంలోకి దించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా పాతబస్తీలో ఎంఐఎంకు మంచి ఓటు బ్యాంకు ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్నిచోట్లా ప్రభావం చూపాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన మహిళా బిల్లును ఎంఐఎం వ్యతిరేకించింది. ఈ నిర్ణయం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపినట్లు ఎంఐఎం నేతలు భావిస్తున్నారు. దీంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే ఫాతిమా ఓవైసీని రాజకీయాల్లో తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తద్వారా ఎంఐఎంలో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామనే సందేశాన్ని జనంలోకి పంపించాలన్నది పార్టీ లక్ష్యమని చెబుతున్నారు. కాగా, పార్టీలోకి ఫాతిమా ఎంట్రీ ఇవ్వగానే ఎమ్మెల్యేగా నిలబెడతారా లేక ఏదైనా నామినేటెడ్ పదవి అప్పగిస్తారా అనే విషయంపై ఎంఐఎం వర్గాల్లో స్పష్టత లేదు.

విద్యార్థులకు భారంగా పెరిగిన యూకే వీసా ధరలు.. నేటి నుంచే అమల్లోకి

పెరిగిన యూకే స్టూడెంట్, విజిటింగ్ వీసాల రుసుము నేటి నుంచి(అక్టోబర్ 4 ) అమల్లోకి వచ్చింది. ఆరు నెలలలోపు విజిటింగ్ వీసా రుసుము గతంలో 100 పౌండ్లు ఉంటే ఇప్పుడు అది 115 పౌండ్లకు పెరిగింది. విద్యార్థి వీసా రుసుము గతంలో 363 పౌండ్లు ఉండగా దానిని 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. భారత కరెన్సీ లెక్కల్లో చూసుకుంటే తాజా పెంపుతో విజిటింగ్ వీసా దరఖాస్తు ఫీజు రూ. 11,835, స్టూడెంట్ వీసా దరఖాస్తు రుసుము రూ. 50,428కి పెరిగింది. పెరిగిన ధరలు భారత విద్యార్థులపై ఆర్థికభారం మోపనున్నాయి. పెరిగిన వీసాల ధరలు అక్టోబరు 4 నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో వర్క్, విజిటింగ్ వీసాల ధరలలో 15 శాతం, ప్రాధాన్య, స్టడీ, స్పాన్సర్‌షిప్ వీసాల ధరల్లో 20 శాతం పెరుగుదల ఉంటుందని తెలిపింది.