Read more!

కేంద్రంలో మంత్రివర్గ 'విస్తరి '

......సాయి లక్ష్మీ మద్దాల

 

 

 

కేంద్రమంత్రివర్గ విస్తరణ కారణంగా దేశానికి, తద్వారా ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ లేదు. కేవలం 2014 ఎన్నికల దృష్టితోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రయత్నం చేసిందనేది అందరికి తెలిసిన విషయం. కాకపోతే ప్రధాని మన్మోహన్ సింగ్ 77 మంది సైన్యంతో తన కొలువును నింపుకున్నారు. అసలే కుంభకోణాల మాయమై పోయిన కేంద్ర సర్కారుకు తాజా విస్తరణ కారణంగా రాబోయే ఎన్నికలను ఎదుర్కోవచ్చు అనే అభిప్రాయం ఉండవచ్చు. యు. పి. ఎ తొలివిడత పాలన పట్ల పెరిగిన ప్రజావిశ్వాసంతో తమ బాధ్యతను గుర్తెరిగి మరింత సమర్ధవంతమైన మంత్రివర్గకూర్పు ఉంటే ప్రజలకు మరోసారి తమపట్ల విశ్వాసాన్ని కలిగించిన వారయ్యేవారు. అక్కడ ప్రదానికే స్వేఛ్చ లేని విస్తరణ. ఇహ దీనివలన ఎవరు లాభనష్టాల బేరీజు వేసుకోవాలి?


జనం ఆకాంక్షల్ని తీర్చే ధీటైన ప్రభుత్వం ఇదికాదు. అసలు మంత్రివర్గమంటే ఏమిటి? ఐక్య ప్రగతిశీల కూటమి. కాని నేటి పాలక కూటమిలో ఐక్యత ఎక్కడుంది? భయపెడుతున్న ఆహారద్ర వ్యోల్భణం రోజురోజుకి పడిపోతున్న రూపాయి విలువ,గుండెబేజారేత్తిస్తున్న కరెంటు ఖాతా లోటు ...... ఇంకా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి ఆమడ దూరంలో భారత ప్రగతి ఆగిపోయింది. ఒకనాదు ఆర్ధిక శాస్త్ర వేత్తగా ఈ దేశాన్ని ప్రగతి పధంలో నడిపించిన వ్యక్తి పాలనలో నేడు దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభానికి కారణం ఎవరు? ఆయన నోరుమెదపలేని మెతకవైఖరి కాదా? మరి ఈఆర్ధికసంక్షోభం గురించి ఆలోచించే ప్రయత్నం అంటే వారి దృష్టిలో అసలు ఉందా? నిర్ణయ రాహిత్యం,పారదర్సకత లేని నిధులవ్యయమ్ వెరసి పారిశ్రామికరంగం కుప్పకూలుతున్న వైనం.

              

సత్వరాభివ్రుద్ధిని గాలికి వదిలేసి లక్షల కోట్లకుంభకోణాలలో మన్మోహన్ ప్రభుత్వం కూరుకుపోయి ఉంది. నాలుగేళ్ళలో రైల్వే శాఖకు ఆరుగురు,మిగతా వివిధ శాఖలకు ముగ్గురేసి,నలుగురేసి మంత్రుల చొప్పున మారిపోయిన ఏలుబడిలో ఇప్పుడు కొత్తగా పరచిన మంత్రి వర్గ విస్తరి ఎవరి కడుపు నింపటానికి? అవినీతి నిర్నయరాహిత్యం ఇవి రెండు ప్రభుత్వాన్ని తద్వారా ప్రజలను పట్టిపీడిస్తున్న అంశాలు. వాటినుండి ఈ తొమ్మిదేళ్ళలో ఈ దేశ ప్రజలను రక్షించే ప్రయత్నం ఏలినవారు ఎన్నడూ చెయ్యలేదు. మాటికిముందు మంత్రి వర్గ విస్తరణ పేరుతో ఆయా ఖాళీలను భర్తీ చేసుకుంటూ సదరు మంత్రులను సంతుష్ట పరుస్తున్నారు తప్పించి.