వైసిపికి తెలంగాణ సెగ

 

తెలంగాణ అంశం పై పూర్తిగా యు టర్న్‌ తీసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ సెగ తగిలింది.. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి వచ్చిన విజయమ్మను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.

 

అయితే  ఈ సందర్భంగా అక్కడ వైసిపి కార్యకర్తలు తెలంగాణ వాదుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో స్పందించిన పోలీసులు వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పోలీసులు అరెస్ట్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

 

అయితే తన అరెస్ట్‌ పై స్పందించిన విజయమ్మ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కూడా తెలంగాణ లో పర్యటిస్తే అరెస్ట్ చేస్తారా ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని ఆమె మరోసారి స్పష్టం చేశారు. పోలీసులు తమ పర్యటనను అడ్డుకోవడం అనైతికం అన్నారు.