సంపద తగ్గినా ఆసియా ధనికురాలు యాంగ్!
posted on Jul 29, 2022 @ 10:26AM
కాలం కలిసిరాకుంటే ఆస్తులు కరిగిపోవచ్చు, షేర్ మార్కెట్లో ఢమాల్ మని కూలవచ్చు. ఎంత కోటీశ్వరు డయినా తన షేర్ విలువలు పెరుగుతున్నాయా, లేదా అనే దానిమీదే దృష్టిపెట్టి తెల్లవార్లూ అదే ఆలోచ నలో ఉంటాడు. కానీ ఊహించని ఆర్ధిక పరిణామాలు కూలదోసేస్తాయి. యాంగ్ హూయాన్ కు అదే జరి గింది. యాంగ్ ఆసియాలోనే అత్యంత ధనికురాలు. ఊహించనివిధంగా ఆమె సంపద 24 బిలియన్ల నుంచి 11 మిలియన్లకు ఈ ఏడాది పడిపోయింది.
కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ అధిపతి అయిన 41 ఏళ్ల యాంగ్ ఎంతో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తోంది. వాస్తవానికి ఆమె సంపదంతా తండ్రి యాంగ్ గ్యూకియాంగ్ నుంచి వారసత్వంగా వచ్చినదే. ఆయనకు ఫోషాన్ అనే పెద్ద కంపెనీ ఉండేది. కాగా కంట్రీ గార్డెన్ స్టాక్ ఈ ఏడాది సగానికి పైగా పడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
కంట్రీగార్డన్ నిర్వహణంతా చూసుకుంటున్న యాంగ్ హ్యాయాన్ ఫోషాన్ నగరంలో 2016 జూన్ 16న జరిగిన ప్రముఖుల సదస్సులో పాల్గొన్నారు. సంపదలో సగం పోగొట్టుకున్నప్పటికీ, యాంగ్ ఆసియాలో కెల్లా అత్యంత ధనికురాలిగా నిలవడం విశేషం. నికర ఆదాయం విషయంలో చైనాలో తనతో సమానం గా ఉన్న ఇతర పారిశ్రామికవేత్తల వ్యాపారలతో పోలిస్తే పెద్దగా తేడా లేకండా పోయింది. యాంగ్ సంపద విష యంలో ఫాన్ హోంగ్వీన్ కంటే వంద మిలియన్ డాలర్లే అధికంగా కలిగి ఉంది. ఫాన్ చైనాలో కెల్లా ప్రముఖంగా చెప్పుకునే పెట్రోకెమికల్ ఫైబర్ ఉత్పాదన సంస్థ చైర్మన్.
ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో చైనాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంక్షోభం తలెత్తడంతో విల్లాలు, గృహాలకు ముందుగానే కొంత సొమ్ము చెల్లించిన దారులు వేలాదిమంది మిగతా సొమ్ము చెల్లించడానికి నిరాకరించారు. నిర్మాణంలోనే నిలిచిపోతుండంతో వారు చివరి ఇన్‌స్టాల్మెంట్లుకూడా చెల్లించమని ఎదురుతిరిగారు. ఇలాంటి సమస్యనే కంట్రీగార్డెన్ కూడా ఎదుర్కొన్నది.