ముంపుగ్రామాల ప్రజల మొహాల్లో చంద్ర హాసం!
posted on Jul 29, 2022 @ 11:28AM
ప్రజానాయకులు సమాజశ్రేయస్సు కోసం జన్మిస్తారు. వారికి ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్కడయినా వారి దృష్టి ప్రజాసంక్షేమమే. వారికి రాజకీయాలు, వ్యూహాలు, ద్రోహాల ఆలోచన ఉండదు. ఏ సమయంలో నైనా, పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం వారి సహజ లక్షణం. దానికి పడనివారు అనేక పేర్లు పెట్టవచ్చుగాక. మనసారా ఆదరించే జనం, వీరాభిమానులు ఉన్నంత కాలం కుతంత్రాలు, కుట్రల రాజకీయ నాయకుల దృష్టి ఇలాంటివారి మీద పనిచేయదు. రాజకీయాల్లో కుట్రలవల్ల, రాజకీయ పరిణామాలు మరేదయినా కారణావల్లా పదవికి దూరం కావచ్చు కాని మనసులో మాత్రం ప్రజలే ఉంటారు. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి అరుదయిన నాయకులు నారా చంద్రబాబునాయుడు. అసలు నాయకుడికి పదవితో పనిలేదన్నది చాలా స్పష్టం చేసిన ఘనుడాయన.
రాష్ట్ర పరిస్థితులతో పాటు ప్రకృతి వైపరీత్యాలు మరింతగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల తాకిడికి ఉభయగోదారవరి జిల్లాలు అల్లకల్లోలమయ్యాయి. ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమని రక్షించమని. పరిస్థితులు ఎలా ఉన్నా వారి గోడు విని అమాంతం తన వయసునీ లెక్కజేయక రంగంలోకి దిగిన నాయకుడు చంద్రబాబు. ఆయన పరిస్థితులను లెక్కజేయక ముంపుగ్రామాల్లో బాధి తుల స్థితిగతులను స్వయంగా తెలుసుకోవడానికి ముందడుగు వేశారు. ఇది ప్రజలు నిజంగా ఎంతో హర్షించదగ్గ అంశం.
ముంపు గ్రామాల పర్యటనలో ఎంతో అలసిపోయారు. 72 ఏళ్ల వయసులో తన మనసులో ప్రజలకు మరిం త మేలు చేయాలన్న తపనే కనపరిచారు. ఇది అసలు సిసలు నాయకుల లక్షణం. అందుకే బాధితులు వారి మొర చెప్పుకోను ఆయన్ను కలవడానికి ఉత్సాహపడ్డారు. అందుకు పెద్ద ఉదాహరణే భద్రాచలంలో బాధితులు చంద్రబాబును కలిసి తమ బాధలు చెప్పుకుని ఆయన్నుంచీ ధైర్యాన్ని పొందాలని ఉత్సాహ పడటం. రాత్రి రెండు దాటిన తర్వాత కూడా ఆయన్ను కలవాలని వేచి ఉన్నారు. ఆయన అప్పటికే తిరిగి తిరిగి అలసినప్పటికీ తనకోసం వచ్చినవారికి ధైర్యం చెప్పాలని, బతుకుఆశకు జీవంపోయాలన్న తపనతో వారిని కలిశారు. వారికి ఎంతో ధైర్యం చెప్పారు. ప్రభుత్వాన్ని ముక్కుపిండి అందరికీ కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్ధిక మద్దతు వచ్చేట్టు చూస్తామని హామీనిచ్చారు.
వారి ముఖాల్లో నవ్వు వెల్లివిరిసింది. ధైర్యంగా అంతటి చీకటిలోనూ ఇళ్లు చేరారు. చిత్రం ఏమంటే భద్రా చలం తెలంగాణా ప్రాంతంలోనిదే. కానీ తెలంగాణా ప్రజలు కూడా ఈ విధంగా చంద్ర బాబుకి ఆదరణ చూపడం మరీ గొప్పవిషయం. అయితే ఒకప్పటి సమైక్యాంధ్రలోనిదే గదా. వారికి వారి అప్పటి ముఖ్య మంత్రిగానే బాబు పట్ల వీరాభిమానం ఉంది. దీనికి తోడు వారికి తెలంగాణా ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి ప్రేమ, మద్దతు లభించలేదన్నది అర్ధమవుతుంది. ప్రజలు ప్రజల మనిషినే గుర్తించి ఆదరి స్తారు. తెలుగు ప్రజలకు వారికి కావలసిన నాయకుడు తెలుసు. అందులోనూ ఆంధ్రా వారికి ఎప్పటికీ చంద్రబాబే నాయకుడు. ఆయనకే నీరాజనాలు పలికారు, పలుకుతారు.