Read more!

ఇష్టంతో చేస్తే పని కష్టం కాదు!

ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం  ఆలస్యం  అవడంతో  దారిలో  ఒక చీరలు  నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి  సేద తీరుతాడు  వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి  మర్యాదలు  చేసారు.అలసిపోయిన  రాజు ఉదయం లేవడం  కాస్త ఆలస్యం  అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో  వారు ఉన్నారు .

రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు.  అతడి  చేతికి ఒక తాడు  కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా  ఆ వ్యక్తి రాజు అడిగే  ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే  ఇవ్వడం మొదలు పెట్టాడు ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు  బాబు కదిలినప్పుడల్లా  ఈ తాడు లాగితే  బాబు నిదుర పోతాడు  అని చెప్పాడు .

అతనికి దగ్గరలో  ఒక కట్టె కనిపించింది రాజుకి. అదేందుకు  అని అడిగాడు రాజు .బయట నా భార్య ధాన్యాలను  ఎండబెట్టి  వెళ్ళింది పక్షులేవైనా  వస్తే  ఈ కట్టె కు కట్టిన  నల్లగుడ్డ  ఊపితే  అవి వెళ్లిపోతాయి  అని బదులిచ్చాడు  ఆ వ్యక్తి .ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని  ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి ఇంట్లో ఎలుకలు  బెడద  ఎక్కువగా ఉంది. అవి  వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు.

ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు  వ్యక్తులు  కనిపించారు రాజుకి.వాళ్ళు ఎవరు అని అడిగారు ? పని చేస్తున్నది నా చేతులే కదండి  నా నోరు ఏ పని చేయట్లేదు  అందుకు నాకు వచ్చిన  కొన్ని పాటలు  వాళ్లకు నేర్పిస్తాను  వాళ్ళు నేర్చుకుంటారు  అని చెప్పాడు .
రాజు మళ్ళీ సందేహంగా  ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం  ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా  అని అడిగారు అందుకు ఆ వ్యక్తి నేర్చుకుంటున్నది నోటితోనే...  కాళ్ళు ఊరకనే  ఉంటాయి కదండి!  పాట  నేర్చుకుంటూ  వాళ్ళు కుండలు  తయారు  చేయడానికి మట్టిని  తొక్కుతుంటారు  అని బదులిచ్చాడు .

రాజుకి  చాల ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు  చేయగలడా  అని !!

అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది  తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో  ఓ పది పదాలు  రాసిపెట్టి  వెళ్తుంది. అన్ని అయ్యాక  అవి నేర్చుకుంటుంటాను  అని బదులిచ్చాడు .

రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని .

సోమరిగా తిరిగేస్తున్న  వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి  అనే పట్టుదల రావటానికి.

నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే.