Read more!

మనో వైకల్యం

ఒక రాజ్యం లో ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక కాలు, ఒక కన్ను మాత్రమే వున్నాయి. కానీ ఆ రాజు చాలా తెలివైనవాడు మరియు ధైర్య వంతుడు కాబట్టి ఆ రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకసారి రాజుకు తన  బొమ్మను గీయించాలని  ఎందుకో  ఆలోచన వచ్చింది. అప్పుడా రాజు దేశ విదేశాల నుండి చిత్రకారులను పిలిపించాడు. ఒకరికి మించిన ఒకరు చిత్ర కారులు రాజసభ ముందు హాజరు అయ్యారు. రాజు అందరికి నమస్కరించి వారందరికి తన అందమైన  బొమ్మను గీయాలని కోరాడు దానిని రాజదర్బార్ లో  ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పాడు.

చిత్రకారులందరూ  ఆలోచించడం మొదలు పెట్టారు, రాజు మొదటి నుంచి వికలాంగుడు కదా, అలాంటప్పుడు అతని చిత్రాన్ని అందంగా గీయడం ఎలా ? ఇది సాధ్యం కానే కాదు మరియు చిత్రం అందంగా లేకపోతే రాజుకు కోపం వచ్చి శిక్షిస్తారు అని అలోచించి అక్కడున్న చిత్రకారులు  అందరూ కూడబలుక్కొని రాజు బొమ్మను గీయడానికి  నిరాకరించారు. అంతే కాకుండా రాజు అంగ వైకల్యాన్ని ప్రస్తావిస్తూ పుట్టుకతో రాని అందం బొమ్మలో ఎలా వస్తుంది, కుంటి రాజు గుడ్డి కన్ను అయినా ఈ రాజుకు అందంగా కనబడాలనే కోరిక ఏమిటో, ఇలా చిత్రకారులని పిలిచి ఇబ్బంది పెట్టేకన్నా తనను వైకల్యంతో పుట్టించిన దేవుణ్ణి అడగాల్సింది అంటూ వారిలో వారు గుసగుసలు పోతూ పైకి అచేతనంగా మా వల్ల కాదు ప్రభూ అంటూ పక్కకు తప్పుకున్నారు, కానీ ఆ చిత్రకారుల సమూహంలోని ఒక యువ చిత్రకారుడు మాత్రం తాను రాజు గారి బొమ్మను అత్యంత అద్భుతంగా గీస్తానని,  వెనుక నుండి చేయి పైకెత్తి, రాజా నేను మీ బొమ్మను చాలా  అందంగా గీయగలను మీకు చాలా నచ్చుతుంది అన్నాడు. అది విన్న మిగతా చిత్రకారులు ఈ పిల్లకాకి చిత్రకారునికి రాజు చేతిలో శిక్ష ఖాయం అనుకుని లోలోపల సంతసిస్తూ, పైకి అతన్ని చాటుగా వారిస్తూ ఏమి జరుగునో అని కుతూహలంతో చూస్తున్నారు, అప్పుడు చిత్రకారుడు రాజు ఆదేశాలతో చిత్రాన్ని గీయడంలో నిమగ్నమయ్యాడు . కొంత సేపటి తరువాత ఒక చిత్రాన్ని గీశాడు. రాజు ఆ  చిత్రాన్ని చూసి  చాలా సంతోషపడ్డాడు.

కానీ చిత్రకారులందరూ ఆశ్చర్యపోతూ ఎలా గీశాడా అని ఉత్సుకతతో వారి వేలిని వారి దంతాల క్రింద నొక్కి పెట్టి యువకుడు గీసిన చిత్రాన్ని చూస్తూనే, ఆ యువకుని సమయస్ఫూర్తికి తెలివితేటలకు ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయారు. ఆ చిత్రకారుడు ఆ చిత్రాన్ని  రాజు గుర్రంపై ఒక కాలు పూర్తిగా కనిపించే విధంగా కూర్చున్నాడు, మరియు ఇంకో కాలు గుర్రానికి అవతలి వైపు ఉంది, మరియు రాజుగారి జులపాల జుట్టు గాలికి ఎగురుతూ రాజు కంటిపైన కప్పబడినట్లు  ఉంది! పక్కన చెట్లన్నీ రాజుకు వ్యతిరేక దిశలో గాలికి వంగి పోతున్నట్టు భ్రమించేలా గీశాడు, రాజు అతని తెలివికి చాలా సంతోషించాడు. ఆ చిత్రకారుడు రాజు యొక్క అంగవైకల్యాన్ని ఎంత తెలివిగా ఒక అందమైన చిత్రంగా గీశాడు. అతని అద్భుతమైన పనితీరును రాజు ఎంతగానో మెచ్చుకుని అతనికి చాలా బహుమతులు మరియు ధనాన్ని  ఇచ్చాడు.

కాబట్టి మనం కూడా ఎదుటి వారి  లోపాలను చూడకుండా, వారి యొక్క విశేషతల పైన, వారి మంచితనంపైన  దృష్టి పెట్టాలి. ఈ రోజుల్లో చాలా మంది  ప్రజలు ఎదుటివారి లోపాలను చాలా త్వరగా వెతుకుతారు, మనలో ఎన్ని లోపాలు వున్నా  ఇతరుల లోపాలువెతకడంలో ఎప్పుడూ అత్యంత శ్రద్ధ చూపుతారు. వాళ్ళు ఇలాంటి వారు, అలాంటివారు  అని ప్రచారం చేస్తారు, కానీ వారిలోని గొప్పతనాన్ని మాత్రం పట్టించుకోరు, ప్రతికూల పరిస్థితులలో కూడా మనం సానుకూలంగా ఆలోచించాలి,  మరియు మనకున్న సానుకూల ఆలోచన విధానమే మన సమస్యలన్నింటి నుండి మనల్ని రక్షిస్తుంది..