Read more!

శివుడు నీల కంఠుడవడానికి కారణం ఇదే

“మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగుగానీ, దాన్ని చిలికిన మజ్జిగ గానీ దొరికే అవకాశలు ఉండవు. ఈ కారణంగా, కైలాసంలో ఉండే పరమ శివుడికి, మజ్జిగ తాగే అల వాటు లేకపోవటాన ఆయన నీలకంఠుడయ్యాడు. 

“ పాల సముద్రంలో నివసించే విష్ణుమూర్తికి మజ్జిగ ఎటు తిరిగీ దొరకదు కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు.“స్వర్గంలో ‘సుర’ తప్ప మజ్జిగ దొరకవు కాబట్టి, ఇంద్రుడు బలహీనుడు అయ్యాడు. 
   “మజ్జిగతాగే అలవాటే గనక ఉ౦టే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగం, అగ్నికి కాల్చే గుణం ఇవన్నీ వచ్చేవే కాదు” 
యోగ రత్నాకరం అనే వైద్యగ్ర౦థ౦లో ఈ చమత్కార విశ్లేషణ కనిపిస్తు౦ది. 
మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకు౦డా ఉంటాయనీ, “విషదోషాలు”, “దుర్బలత్వం”, “చర్మరోగాలు”, “క్షయ”, “కొవ్వు”, “అమిత వేడి” తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ దీని భావం. అక్కడ దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టి౦చాడట!
వేసవి కాలాన్ని మనం మజ్జిగతోనే ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించాలి. తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా “లాక్టో బాసిల్లై” అనే “మంచి బాక్టీరియా” మనకు  దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు. 
అందుకని, వయసు పెరుగు తున్నకోద్దీ మజ్జిగ అవసరం పెరుగుతుంది. ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది. అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు.

చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అ౦దుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.