సీతక్క పొరపాటు ప్రభావితం చేస్తుందా?
posted on Jul 18, 2022 @ 3:49PM
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. ఓటింగ్‌లో భాగంగా తప్పిదం చేశారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత జరిగిన రాష్ట్రపతి ఎన్నిక ఇదే మొదటిది కావడం, ఓటింగ్‌లో అప శృతి దేనికి దారితీస్తుందా అని కాంగ్రెస్ వర్గాలు ఆందోళలో పడ్డాయి. ప్రతిపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాల్సిన సీతక్క పొరపాటున ఎన్‌డిఏ బలపరిచిన ద్రౌపది ముర్ముకు ఓటువేశారు. ఇది నిజంగానే సాంకేతిక తప్పిదంలా జరిగిపోయిందనే అంటున్నారు. అంటే ఓటింగ్ విధానంలోని సాంకే తికత ఆమెను కాస్తంత కంగారుపెట్టిందనే అనుకోవాలి. ఎందుకంటే ఆమె ఆ తర్వాత మీడియాతో పొర పాటు పడినట్టే చెప్పారు.
అంతే కాదు.. తాను పొరపాటున ఒకరికి వేయాల్సిన తొలి ప్రాధాన్యతా ఓటు మరొకరికి వేశాననీ, తన బ్యాలెట్ క్యాన్సిల్ చేసి మరొకటి ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని కోరారు కూడా. అయితే ఆయన నిరాకరించడంతో చేసేది లేక తొలి ప్రాధాన్యతా ఓటు ముర్ముకు వేసిన బ్యాలెట్ పేపర్ నే ఓటు బాక్సులో వేశారు. ప్రతిపక్షాలన్నీ యశ్వంత్ సింగ్ వంటి రాజకీయానుభవం మెండుగా వున్న వ్యక్తిని రాష్ట్రపతి గా చూడాలని ఎంతో ఆశిస్తున్నారు. బిజెపీ స్వార్ధ ప్రయోజనాలకు ముర్మును రాష్ఠ్రపతి అభ్యర్ధిగా ప్రకటించి దేశమంతా భారీ ప్రచారం చేశారు. ఆమె కేవలం వెనుకబడిన తరగతులకు చెందిన మహిళగానే కాకుండా జార్ఖండ్ గవ ర్నర్ గాను, బిజెపి సీనియర్ల అభిమానిగాను విజయావకాశాలున్నాయనే ప్రచారం వుంది. కానీ యశ్వంత్ కే అవకాశాలు మెండుగా వున్నాయన్నది విపక్షాలు అంచనాలు బాగా ప్రచారంలో వున్నాయి.
2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో ఇపుడు రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేకంగా ఓటు విలువ నిర్ధారించవలసి వచ్చింది. దీని ప్రకారం తెలంగాణా నుంచి ఎన్నికయిన 119 ఎమ్మెల్యేల ఓటు విలువ 15,708 అని అంచనా. కాగా ఏపీ నుంచి ఎన్నికయిన 175 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825 వుంది. ఎంపీల విషయానికి వస్తే, తెలంగాణా నుంచి 17 లోక్‌సభ, 7 రాజ్యసభ మంది సభ్యులు న్నారు. అంటే మొత్తం ఓటు విలువ 16,992 . ఆంధ్రాకు సంబంధించి 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ సభ్యుల విలువ 25,488.