కేంద్రం సాంకేతిక ఆలోచన.. విద్యుత్ వాహనాలు
posted on Jul 18, 2022 @ 4:18PM
ఉన్నది వండి వార్చడం రాదుగాని వడియాలు పెడదామన్నదిట వెనకటికి ఓ పెద్దామె. అసలే దేశంలో విద్యుత్ రంగం అధ్వాన్నంగా వుందన్న ఆరోపణలు వెల్లువెత్తుంటే మోదీ సర్కార్ విద్యుత్ వాహనాలకు వీలు కల్పించే పనిలో పడింది. పైగా కాలుష్య నివారణకు ఇదే గొప్ప మార్గమని బిజెపీ సర్కార్ ప్రకటిం చింది. కాలుష్యం పెరిగిపోతోందన్నది దేశంలో ఎవర్నడిగినా చెబుతారు. కానీ కాలుష్య నియంత్ర ణ సంస్థ ల నిర్వాకం గురించి గట్టిగా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్నపాపాన పోలేదు. ఇపుడు హఠాత్తుగా విద్యుత్ వాహనాలకు హైవేలను అనువుగా మార్చడానికి పథక రచన చేస్తున్నారు.
దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర సర్కార్ భారీ ప్రణాళికలు రచిస్తోం ది. టెక్నాలజీని ఉపయోగించి వాహనాలకు మెరుగైన హంగులు అద్దుతోంది. విద్యుత్‌తో నడిచే రైళ్ల మాదిరి గానే ఇక వాహనాలు కూడా నడవనున్నాయి. హైవేల వెంట ఎలక్ట్రిక్ వైర్లను ఏర్పాటు చేసిన వాహనాలు విద్యుత్‌తో నడిచే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది కేంద్రం. విద్యుత్ వాహనాలు ఉత్పత్తిచేస్తున్నవారు వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించి వెనక్కి తీసుకోవడం చూస్తున్నాం. ఇపుడు ప్రత్యేకించి విద్యుత్ లైన్లు వేసి ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. కానీ చీటికీ మాటికీ ఓవర్‌లోడ్, వర్షాల తో విద్యుత్ లైన్లు దెబ్బతినే పరిస్థితి వున్న మన దేశంలో ఈ సాంకేతిక ఆలోచన ఏ మేరకు సఫలమవు తుందన్నది ఆలోచించాలి.
ఇక ఢిల్లీ ముంబై మధ్య ఎలక్ట్రిక్ హైవే నిర్మిం చాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అక్కడ ఓవర్ హెడ్ వైర్ల సాయంతో వాహనాలకు విద్యుత్ సరఫరా చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన విష యం తెలిసిందే. అన్ని జిల్లాలను నాలుగు లేన్ల రహదారితో అనుసంధానించాలని ఆయన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కాలుష్యాన్ని తగ్గించేం దుకు భారీ వాహన యజమానులందరూ ప్రత్యామ్నాయ ఇంధ నాలైన ఇథనాల్, మిథనాల్, గ్రీన్ హైడ్రోజన్ ఈజ్‌లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
ఎలక్ట్రిక్ హైవే అంటే వాహనాలు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఈ విద్యుత్ లైన్లు ఉంటాయి. హైవే పొడవున ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీ బస్సులు, ట్రాలీ ట్రక్కులను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని నిర్మూలించ డంతో పాటు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానం చేయనున్నా రు. రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరుగుతుండటంతో ఆర్‌టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని మంత్రి వెల్లడించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించడమే తమ లక్ష్య మని అన్నారు.