బడుగులపై బిజెపీ జీఎస్టీ బండ!
posted on Jul 18, 2022 @ 3:34PM
జీతం జీవులు పాలకుల దృష్టిలో మనుషులు కారు ఓట్లు మాత్రమే.. అంటాడు ఒక కథలో ఒక ప్రభుత్వోద్యోగి. ఇది నిత్య సత్యం. ఓట్లు వేయడానికి కాస్తంత బలంగా వుండాలంటే తినాలి కదా అని తినడానికి పప్పు, ఉప్పు, నూనె తెచ్చుకోవడమే తప్ప అవి మనల్ని మింగేస్తున్నాయన్నది మెల్లగా ప్రభుత్వాలే చల్లగా ప్రక టనలతో చెబుతూన్నాయి.
తరాలు మారినా మారని అక్షర సత్యం ఇది . బొత్తిగా మింగుడుకి ఇష్టపడని నిజం. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కూడా అదే పని చేసింది. మీ జీవితాలకు మాది భరోసా అంటూనే జీఎస్టీ స్లాబు ల్లో తీవ్ర మార్పులు చేపట్టింది. దీంతో జున్ను, బెల్లం, పాలు, మజ్జిగ, గోధుమలు, ఆటా ధరలు పెరుగు తాయి. ఇక దుకాణం వాడు వాడి బీడీ, రిక్షా, ఆటో ఖర్చూ కలిసి మరో వంద వేసుకుంటాడు.
ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆటా వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చేశాయి. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ, ఆటా, పప్పులు, బియ్యం, బెల్లం, గోధుమలు, బజ్రా, జొన్నలు వంటి వాటిపై కూడా 5 శాతం జీ ఎస్టీ అమలు చేయనున్నారు.
ఆసుపత్రిలోని రూ. 5000 గదులపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీ ఎస్టీ విధించనుంది. దేశంలో అన్ని ప్రాం తాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల కంటే ప్రయివేటు ఆస్పత్రులే మేటి సాంకేతికతతో ఆకట్టుకుంటు న్నాయి. అక్కడ గదులు కనీసం రూ.5000 ఉంటాయి. ఏదో ఒక జబ్బుతో అక్కడ చేరితే ఆస్పత్రి వర్గాలు కనీసం వారం రోజులు వుంచి బికారిని చేసే పంపుతాయి. ఈ పరిస్థితుల్లో ఇపుడు ఈ జీఎస్టీ పేర మరో రకం దాడి అసలు బతకడమే కనాకష్టం అయ్యే పరిస్థితిని తీసుకువస్తుంది. ఆస్పత్రులంటే భయోత్పా తానికి పురి కొల్పుతుంది ప్రభుత్వ నిర్ణయం.
అందువల్ల ఆస్పత్రుల్లో జిఎస్టీ బాదుడు వద్దని అభ్యర్ధనలు మొదలయ్యాయి. రూ. 1000 హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ, బ్లేడ్లు, పేపర్ కత్తెరలు, పెన్సిల్ షార్పనర్లు, స్పూన్లపై 18 శాతం జీఎస్టీని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇటీవల చండిగడ్ లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమా వేశంలో ఆమోదం పొందిన తదుపరి.. నేటి నుంచి నూతన వడ్డింపులు అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ పేరుతో సామాన్యులకు అవసరమైన, అందుబాటులో వున్న తినుబండారాలు, వస్తువులన్నింటినీ వారికి దూరం చేయడానికే కంకణం కట్టుకున్నట్టుగా వుంది. ప్రభుత్వాలు ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటా మని ప్రచారం చేసుకుంటూనే మరోవంక ఈ విధంగా జీఎస్టీ పేరుతో బాదడం ఎంతవరకూ సమంజసం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.