తాగుడు ప్రభుత్వం

 

కొత్త మద్యం విధానంలో పర్మిట్ రూమ్ లకు అనుమతి నిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. దీంతో ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన బార్లు ఇప్పుడు గ్రామాల్లోను దర్శన మివ్వ నున్నాయి. 2లక్షల లైసెన్స్ ఫీజు సంత్సరానికి చెల్లించాలి. ఇప్పటివరుకు లైసెన్సు ఉన్న దుకాణాలు 5,979. ఈ సంత్సరం కొత్తగా లైసెన్సు కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తున్నవి 617. ఇప్పటికే లైసెన్సు ఉన్నవాటికి మరో సంత్సరం పాటు పోడిగిస్తుండగా,లైసెన్సు పొందనివాటిని మరోప్రాంతానికి మార్చి అక్కడ కొత్తగా దుకాణాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మినీ బార్ల సాంప్రదాయం జులై 1నుండి అమలులోకి రానుంది. ఈ లైసెన్సింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 1700కోట్లు.

 

ఓట్ బ్యాంకు రాజకీయాలతో పనికిమాలిన సంక్షేమ పధకాల అమలుకోసం ప్రభుత్వ ఖజానా నింపుకోవటానికి ఇలా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ఏవిధమైన చిత్తశుద్ధి లేదని తెలుస్తోంది. ఈ కొత్త మద్యం విధానం పట్ల ప్రజల నుండి తీవ్ర నిరసనలు వెల్లువెత్తు తున్నాయి. ముఖ్యంగా మహిళలు తమ రక్షణ పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నగదు బదిలీ పధకం ద్వారా ప్రజలను సోమరి పోతులుగా చేసి ఇప్పుడిలా మద్యం దుకాణాలకు సిట్టింగ్ అనుమతులు జారీ చేయటం మూలంగా అసాంఘీక కార్యకలాపాలు చెలరేగిపోవా?మహిళాభ్యున్నతే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మహిళకు పొంచి ఉన్న అభద్రత పట్ల ఏమని సమాధానం చెపుతారు?

 

ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలంటే మద్యం అమ్మకాలను ప్రోత్సహించాలనే ఆలోచన ముఖ్యమంత్రి పరిపాలనా సామర్ధ్యాన్ని సంకించటం లేదా?ఒక పక్క ఉచిత విద్యుత్తు అని మరోపక్క విద్యుత్ కోతలని అటు రైతాంగాన్ని,ఇటు పారిశ్రామిక రంగాన్ని తీవ్ర నష్టాల పాల్జేసి,అన్ని ఉత్పత్తులు గణనీయంగా పడిపోవటానికి ప్రధాన కారణమైన కిరణ్ కుమార్ నిర్ణయ రాహిత్యాన్ని ఏమనాలి?బెల్టు షాపులు నిర్మూలించాల్సిన ముఖ్య మంత్రి ఈనాడు సిట్టింగ్ షాపులకు అనుమతి నిస్తుంటే ఇహ మహిళల భద్రత గాలిలో దీపమే కదా!నేతలు వారి వారి వ్యాపారాలను పెంచుకోవటానికి చేస్తున్న కుట్రలో ప్రజలు బలై పోవలసిందేనా?ఈమాత్రానికి ఇంకా ఎక్సైజ్ శాఖ ఎందుకు?తాగి వాహనాలను నడిపే వారిని అరెస్టులు చెయ్యటమెందుకు?