ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం లేదు…శివాజీ వివరణ
posted on Dec 27, 2025 @ 3:44PM
ఇటీవల విడుదలైన ‘దండోరా’ సినిమా ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంతో సినీ నటుడు శివాజీ స్పందించారు. నోటీసులు అందుకున్న శివాజీ ఈరోజు ఉదయం మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళా కమిషన్ విచారణ ముగిసిన అనంతరం కార్యాలయం నుండి బయటకు వచ్చిన శివాజీ మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడిన వారి తరఫున మహిళా కమిషన్ ప్రశ్నలు అడిగిందని, వాటికి తాను సమాధానాలు ఇచ్చానని శివాజీ తెలిపారు. ఎవరినీ కించపరచాలని లేదా నొప్పించాలనే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు.
సమాజంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యం లో భావోద్వేగానికి లోనై మాట్లాడిన మాటల్లో తప్పులు దొర్లాయని అంగీకరించిన శివాజీ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసు కుంటున్నట్లు ప్రకటించారు. “భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంతో పవిత్రంగా కొనసాగుతోంది. ఎవరైనా హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవస్థలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. కానీ నేను అనవసరంగా సల హాలు ఇచ్చానని ఇప్పుడు అర్థమైంది.
ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయను” అని చెప్పారు. మహిళా కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, అవసరమైతే మళ్లీ కమిషన్ ముందు హాజరవుతానని శివాజీ తెలిపారు. “కమిషన్ అడిగిన వాటికి మాత్రమే సమాధానం ఇస్తాను. అనవసరమైన ఆరోపణలకు స్పందించను” అని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు.
అయితే తనపై కుట్ర జరుగుతోందని శివాజీ ఆరోపించారు. తనతో కలిసి కెరీర్ ప్రారంభించిన కొందరికి తనపై కోపం ఉందని, తన వ్యాఖ్యల అనంతరం తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొందరు జూమ్ మీటింగులు కూడా పెట్టుకున్నారని తెలిపారు. నాకు చాలా సన్నిహితులుగా భావించిన వారు కూడా ఇలా కుట్ర చేస్తారని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పడం మానుకోవాలని నాకు అర్థమైందని నటుడు శివాజీ వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడినట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారని శివాజీ అన్నారు. నేను ఏం తప్పు చేశానని నాపై ఇంత కోపం? తల్లిదండ్రులు తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పడం సహజం. ఎవరు ఎలా దుస్తులు ధరించాలన్నది వారి వ్యక్తిగత విషయం. దానితో నాకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యా నించారు.
తన సినిమాకి సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే ఇంతటి వివాదం చెలరేగిందని శివాజీ అన్నారు. నేను సినిమాల్లో లేకపోతే వ్యవసాయం చేసుకొని బతుకుతాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని. నాకు నా ఆత్మాభిమానం మాత్రమే ముఖ్యమని స్పష్టం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంపై ఒక వైపు రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండగా... మరోవైపు ప్రతి ఒక్కరు మహిళా కమిషన్ తదుపరి చర్యలపై ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు.