ఆమెని... జెట్ ఎయిర్ వేస్ తమ విమానం ఎక్కనీయలేదట!
posted on Aug 26, 2016 @ 11:34AM
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై జనంలో , మేధావుల్లో, మీడియాలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆమె మానవ వనరుల శాఖా మంత్రి అయినప్పుడు చాలా మంది తన విద్యార్హతల గురించి కామెంట్స్ చేశారు. అందుకు తగ్గట్టే ఆమె కూడా రోజుకో వివాదంలో ఇరుక్కున్నారు. తన తప్పు వున్నా లేకున్నా గొడవలతో బాగా ఫేమస్ అయ్యారు. రోహిత్ వేముల ఆత్మహత్య మొదలు జేఎన్ యూలో జాతి వ్యతిరేక కార్యక్రమాల దాకా స్మృతి నేతృత్వంలో నానా రచ్చ జరిగింది! చివరకు, ఇరానీ ఇప్పుడు జౌళి శాఖలో సెటిలయ్యారు...
స్మృతి ఇరానీ ఇప్పుడంటే బీజేపి టాప్ లీడర్స్ లో ఒకరు. మోదీ ఫేవరెట్ బ్యాచీలో వన్నాఫ్ ది మెంబర్. కాని, అసలు ఆమె ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా? టీవీ సీరియల్ నటిగా స్మృతి ఫేమస్ కావటం , తరువాత రాజకీయాల్లోకి రావటం వగైరా వగైరా అంతా మనకు తెలుసు. కాని, తెలియంది ఏంటంటే ఆమె ఒకప్పుడు సాదాసీదా మిడిల్ క్లాస్ అమ్మాయి. ఇండియాలో చాలా మంది లాగే రకరకాల ఉద్యోగాల కోసం ట్రై చేసింది!
స్మృతి ఇరానీ ఒకప్పుడు జెట్ ఎయిర్ వేస్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. కాని, వాళ్లు ఆమె పర్సనాలిటి బాగా లేదని రిజెక్ట్ చేశారు! సహజంగానే విమానయాన రంగంలో అందం, లుక్స్ వంటి వాటికి ప్రాధాన్యతకి ఇస్తారు కాబట్టి ఆమెని వద్దనుకుని వుంటారు! కాని, జెట్ ఎయిర్ వేస్ వాళ్లకి ఆనాడు తెలియంది ఏంటంటే, కొన్నేళ్ల తరువాత అదే స్మృతీ తమ ఉద్యోగికి అవార్డ్ ఇస్తూ కేంద్ర మంత్రిగా ఎదురవుతుందని!
ఒకప్పుడు జెట్ ఎయిర్ వేస్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించీ రిజెక్ట్ అయిన స్మృతి తరువాత మెక్ డొనాల్డ్ సంస్థలో పని చేసింది. తరువాత మోడల్, టీవీ యాక్ట్రస్, పొలిటీషన్ అయ్యారు! ప్రస్తుతం కేంద్ర మంత్రిగా వున్న ఆమె ఓ కార్యక్రమంలో బహుమతులు అందజేస్తూ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని సన్మానిస్తూ తన ఫ్లాష్ బ్యాక్ విప్పి చెప్పారు!
స్మృతి ఇరానీ స్మృతి లోంచి బయటకొచ్చిన జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగ ప్రయత్నం కథనం... ఎంతైనా ఇన్ స్పిరేషనలే! ఒకప్పుడు తనని ఉద్యోగంలోకి తీసుకోని కంపెనీ ఉద్యోగికే కేంద్ర మంత్రిగా సన్మానం చేయటం... గొప్ప విజయమనే చెప్పాలి! ఎవరి అభిప్రాయం ఎలా వున్నా స్మృతీ విజయ ప్రస్థానాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే!