షర్మిల సెటైర్లు వింటే జగన్‌కి హార్టెటాక్ ఖాయం!
posted on Jul 12, 2024 @ 4:42PM
జగన్‌ని పొరపాటుగా చట్టం వదిలేసినా, ధర్మం వదిలేసినా, న్యాయం వదిలేసినా, జైళ్ళు వదిలేసినా, కేసులు వదిలేసినా... నేను మాత్రం వదలను అన్నట్టుగా వుంది జగన్ గారి చెల్లెమ్మ షర్మిలమ్మ పట్టుదల. సమయం, సందర్భం దొరికితే చాలు... జగన్ మీద విరుచుకు పడుతున్నారు. ఒకవేళ సమయం, సందర్భం దొరక్కపోతే, తానే ఆ రెండిటినీ కల్పించుకుని మరీ జగన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. లేటెస్ట్.గా జగన్ అండ్ బ్యాచ్ మీద షర్మిల విసిరిన పంచులు ఇవి....
* వైసీపీ అంటే, యువజన, శ్రామిక, రైతు పార్టీ. అంటే, డాక్టర్ రాజశేఖరరెడ్డికి, ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.
* రాజశేఖరరెడ్డి గారి జయంతి రోజున జగన్ ఏం చేశారు? ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి స్మృతి చిహ్నం దగ్గర కేవలం ఐదు నిమిషాలు మాత్రమే వున్నారు. సొంత తండ్రి జయంతి కార్యక్రమం ఎంత బాగా నిర్వహించాలి? సిద్ధం సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కదా.. వైఎస్సార్ జయంతికి ఏం చేశారు? జగన్ ఏమీ చేయలేదు.. ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమీ చేయలేదు. ఇలాంటి జగన్ వైఎస్సార్ రాజకీయ వారసుడు ఎలా అవుతాడు?
* జగన్ మీద, వైసీపీ మీద కోపంతో కొంతమంది రాజశేఖరరెడ్డి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే, వైసీపీకి, రాజశేఖరరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు.