రోజూ నవ్వి తీరాల్సిందే.. జపాన్‌లో కొత్త చట్టం!

జపాన్‌లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రజలు రోజుకు ఒక్కసారైనా నవ్వితీరాల్సిందే. జపాన్‌లోని యమగట ప్రాంతానికి చెందిన స్థానిక ప్రభుత్వం ఈ చట్టం చేసి, ఆర్టినెన్స్ జారీ చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రోజుకు ఒక్కసారి నవ్వడం మాత్రమే కాకుండా, నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని జీవోలో పేర్కొంది.  అయితే, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. నవ్వాలంటూ చట్టం ఏంటయ్యా బాబూ అని ప్రతిపక్షాలవాళ్ళు అంటుంటే, ఇదేమీ జరిమానాలు విధించే చట్టం కాదు కాబట్టి లైట్‌గా తీసుకుని నవ్వుకోండి అని అధికారపక్షం అంటోంది.