Read more!

రెడ్ అలెర్ట్!

రెడ్ అలెర్ట్ అనేది ప్రమాద సూచన. ప్రమాదం ఏ విషయంలో అంటే ఏదైనా కావచ్చు. కానీ అందులో ఉన్న రెడ్ హెడ్లైన్ గా మరి డేంజర్ బెల్స్ మోగిస్తే.

ఇదేదో క్రైమ్ సీన్ కు ఎక్స్ప్లేన్టేషన్ ఇచ్చినట్టు ఉందేంటి అనుకోకండి. ఈ రెడ్ అలర్ట్ అంతా మనలో ఉన్న రెడ్ గురించే. అదే అదే మనలో ఉన్న ఎరుపు అంటే మనిషి శరీరంలో ఉండే రక్తమే. అందరి శరీరాల్లో ఉండే రక్తం రంగు ఎరుపు అయినా కొందరి శరీరంలో రక్తం విషయంలో సమస్యలు బాగా వచ్చేస్తున్నాయ్. చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

మహిళల్లో…….

భారతదేశంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అనిమియా!! శరీరంలో రక్తం తగినంత లేకపోవడం, రక్తకణాల క్షీణత, హిమోగ్లోబిన్ లోపించడం వంటి సమస్యలు మహిళలను భూతాళ్లా వెంటాడుతున్నాయి. ఎన్నిరకాల మందులు వాడినా అవి వాడినన్ని రోజులు బాగుండి తరువాత మళ్ళీ సమస్య మొదటికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత అనే సమస్య మహిళల్లో వేరే సమస్యలను సృష్టిస్తుంది.

మహిళల్లో నెలసరి సమస్యలను అటు ఇటు చేసి మహాసికంగా, శారీరకంగా మహిళలను ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. ఇదంతా ఒక కోణం అయితే మరొక కోణం ఉంటుంది. అదే అత్యవసర సమయాల్లో రక్తం దొరకకపోవడం.

ఎమర్జెన్సీ!!

ఇప్పటి కాలంలో రోడ్ లు, వాహనాల రూపురేఖలు చాలా మారిపోయాయి. ఎక్కడికక్కడ ఆక్సిడెంట్ లు చాలా సాధారణ విషయాలు అన్నట్టు జరిగిపోతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలలో బాధితులు హాస్పిటల్ వెళ్లెవరకు బతకడం వారి అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే హాస్పిటల్ కి వెళ్లిన తరువాత అవసరము అయ్యే  రక్తం అనుకున్న సమయానికి దొరకక ఎన్నో ప్రాణాలు గందరగోళంలో పడిపోతున్నాయి. 

బ్లడ్ డోనర్స్!!

ఈ సమాజంలో బ్లడ్ డోనర్స్ పాత్ర నిజంగా ఎంతో అభినందనీయమైనది. రక్తదాతలు కేవలం రక్తాన్ని దానం చేసినవాళ్ళు మాత్రమే కాదు, ప్రాణాలను దానం చేసినవాళ్ళు, ప్రాణాన్ని నిలబెట్టినవాళ్ళు. కొంతమంది అత్యవసర సమయాల్లో ఎవరైనా ఎమర్జెన్సీ ఉందంటూ కాల్ చేస్తే ఉన్న పనులు వదిలిపెట్టుకుని మరీ హాస్పిటల్స్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైనవాళ్ళు  హాస్పిటల్స్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైనవాళ్ళు  చాలా కొద్దిమంది ఉన్నారు. కనిపించే దేవుళ్ళు అని పిలిచినా వీళ్ల రుణం తీర్చుకోలేము.

బ్లడ్ డోనర్స్ డే!!

రక్తదాతల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అనే ఆలోచన ఎవరికైనా వస్తుందో లేదో తెలియదు కానీ కొందరు ఈరోజు సామాజిక సేవల కింద రక్తాదాన శిబిరాలు నిర్వహించడం, రక్తాన్ని దానం చేయడం చేస్తుంటారు. మరికొందరు రక్తదానం చేసినవారి ఆరోగ్యం కోసం పండ్లు ఇస్తుంటారు. ఎవరెవరి ఆలోచన వాళ్ళది. 

అయితే 1901 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ అనే వ్యక్తి రక్తాన్ని వర్గాలుగా విభజించారు. ఈయన నోబెల్ బహుమతి గ్రహీత కూడా. రక్తాన్ని వర్గాలుగా విభజించడం వల్లనే ఈరోజు ఇంతమంది ప్రమాధాలలో ఉన్నప్పుడు అత్యవసరంగా వర్గాల వారిగా రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. అందుకనే ఈయన పుట్టినరోజు గుర్తుగా రక్తాదాన దినోత్సవాన్ని అదేనండి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ని నివాహిస్తున్నారు. 

కొంచెం ఆలోచించండి!!

రక్తం అనేది కృత్రిమంగా తయారుచేసే ద్రవం కాదు. అది శరీరంలో ఉత్పత్తి అయ్యేది. మహిళల్లో నెలవారీ రక్తం పోతున్నా తిరిగి తీసుకునే ఆహారపదార్థాలు వల్ల ఆ రక్తం భర్తీ అవుతూ ఉంటుంది. కాబట్టి రక్తాన్ని ఇవ్వడంలో సమస్య ఏమీ ఉండదు. కాకపోతే శరీరంలో రక్తం పుష్టిగా ఉన్నవాళ్లు రక్తాన్ని దానం చేస్తే ఎంతో మంచిది. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవాళ్లు రక్తాన్ని దానం చేయచ్చు. తినే ఆహారం వల్ల వృద్ధి చెందే రక్తాన్ని అప్పుడప్పుడు దానం చేయడం వల్ల మరొకరి ప్రాణాన్ని కాపాడటమే కాకుండా కొత్త రక్తం వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి శరీరంలో రక్తం మలినమైందేమో అనే పిచ్చి ఆలోచనలు కూడా ఉండవు.  ఆలోచించండి మరి.

◆వెంకటేష్ పువ్వాడ.