రామసేతు వాస్తవం..రామాయణం నిజం!
posted on Jul 16, 2024 @ 12:47PM
హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడు. త్రేతా యుగంలో రాముడు అయోధ్యను పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. రావణుడు అపహరించిన సీతను తీసుకురావడానికి లంక వెళ్లి రావణుని సంహారించి వెనక్కి తీసుకువచ్చాడు శ్రీరాముడు.
అందుకోసం 100యోజనాల దక్షిణసముద్రానికి వానరుల సహాయంతో వారధి కట్టారని రామాయణ కధనం. దాన్నే నేడు రామసేతు అంటున్నారు. 2018లోనే నాసా రామసేతు నిజమని చెప్పింది.ఇప్పుడు మన ఇస్రో శాస్త్రవేత్తలు నాసా సహాయంతో మరింత సమాచారం, మరిన్ని ఫోటోలు సేకరించారు.ఈ ఫోటోలలో 10మీటర్ల మ్యాప్ లో వంతెన పూర్తిగా కనిపిస్తున్నది. సముద్రగర్భం నుంచి 8మీటర్లు ఎత్తులో ఈ రామసేతు ఉందని తేల్చారు. రామసేతు దాదాపు 99.9శాతం సముద్రంలో మునిగిపోయిందన్నారు.
కేవలం కొద్ది భాగం మాత్రమే కనిపిస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రామసేతు తమిళనాడు రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటి నుంచి శ్రీలంక లోని మన్నారు ద్వీపంలోని తలైమన్నారు వరకూ నిర్మించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని బండరాళ్లు, సున్నం రాళ్లతో నిర్మించారని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్ శాట్-2 సహాయంతో మ్యాప్ విడుదల చేసారు. ఈ వంతెన 29కిలోమీటర్లు వరకూ ఉందని పేర్కొన్నారు. క్రీ.శ.9వ శతాబ్దం వరకూ పర్షియన్లు సేతు బందైగా పిలిచేవారు. రామేశ్వరం ఆలయ వర్గాల మేరకు తుఫానులతో ఈ వంతెన ధ్వంసమైందని తెలిసింది. క్రీ.శ.1480 నాటివరకూ వంతెన కనిపించిందని తెలిపారు.