కాళ్ళమీద పడొద్దు.. చంద్రబాబు రిక్వెస్ట్!
posted on Jul 13, 2024 @ 12:03PM
కాళ్ళకు నమస్కారాలు పెట్టే సంస్కృతిని మానాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ సూచన చేశారు. ‘‘ఎవరైనా నా కాళ్ళకు దణ్ణం పెడితే, వారి కాళ్ళకు నేను దణ్ణం పెడతా. ఈరోజు నుంచి నా కాళ్ళకు నమస్కారం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నాను. తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్ళకి నమస్కారం పెట్టాలి తప్ప, నాయకులకు కాదు. నాయకుల కాళ్ళకి నమస్కారాలు పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. నాయకుల కాళ్ళకు ప్రజలు, పార్టీ శ్రేణులు దణ్ణం పెట్టే సంస్కృతిని ఇకనైనా ఆపాలి’’ అని చంద్రబాబు అన్నారు.